ఆ 80 మందే టీఆర్‌ఎస్‌కు ఉంటే...?


Fri,September 21, 2012 11:35 PM

తెలంగాణ బాధ తెలంగాణదే. మన యుద్ధం మనమే చేయాలి. మన ప్రయత్నం మనమే చేయాలి. మనకోసం మరొకరు యుద్ధం చేయర ని ఈ దశాబ్దపు అనుభవాలు తేల్చి చెప్పాయి. చంద్రబాబునాయు డు బాధ బాధ వేరు. ఆయన ప్రాధాన్యాలు వేరు. ఆయన ఎజెండాలు వేరు. ఆయనకు తెలంగాణ అంతిమ ప్రాధాన్యం. అనేక డిక్లరేషన్‌లు ప్రకటిస్తారు. వాటికోసం ఢిల్లీ యాత్రలు చేస్తారు. అన్నిపార్టీల వద్ద పైరవీలు చేస్తారు. కానీ తెలంగాణ డిక్లరేషన్ మాత్రం ప్రకటించరు. వీలైనంతమేరకు తెలంగాణ నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. జయవూపకాశ్ నారాయణ కూడా అంతే. మనసులో ఒకటుంటుంది. పైకి ఒకటి మాట్లాడతారు. శాసనసభలో ఇంకొకటి చెబుతారు. తెలంగాణ ఉద్యమంలోని హేతుబద్ధత, న్యాయబద్ధత కనిపించదు, కానీ తెలంగాణ ఉద్య మం కారణంగా ఐబిఎం తన ఉద్యోగులను బెంగుళూరుకు విమానాల్లో పంపిందని ఒక అబద్ధం చెప్పి తెగ ఆవేదన పడుతుంటారు. కిరణ్‌కుమార్‌డ్డి బాధ వేరు. తెలంగాణ సమస్య ఆయన సమస్య కాదు. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచనగానో, విలీనంగానో నిర్వహించడానికి ఆయన నిరాకరిస్తారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్నాటకల్లో హైదరాబాద్ విమోచనను నిర్వహిస్తున్నారు కదా అంటే, వాళ్లు బావిలో దూకితే మనం దూకాలా అని ప్రశ్నిస్తారు. తెలంగాణ విమోచనోత్సవాలను నిర్వహించడం ఆయనకు బావిలో దూకడంగా కనిపించింది. కిరణ్‌కుమార్‌డ్డి సమైక్యాంవూధకు ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారు. ఆయన తెలంగాణకు కూడా ముఖ్యమంవూతిని అనే విషయమూ తరచూ మరిచిపోతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల బాధ వేరు. వీరి ఆలోచనలు పదవుల చుట్టూ పైరవీల చుట్టూ తిరుగుతాయి. వీరెవరూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించడం లేదు. తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కోరుకున్నది వీరు చేస్తారు. కొందరయితే ఆయన కోరుకున్నదానికంటే ఎక్కువ చేస్తారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలు గట్టి గా నిలబడాల్సిన ఏ సందర్భంలోనూ ఇక్కడి ప్రజల పక్షాన నిలబడ లేదు. ఎందుకంటే ఈ పార్టీలలో టికెట్లిచ్చేవారు, ఎన్నికల నిధులిచ్చేవారు సీమాంధ్ర నాయకత్వాలే. ఆ పార్టీల్లో బతికి బట్టకట్టాలంటే ఆ నేతల కనుసన్నల్లో మసలాల్సిందే. భిన్నంగా, స్వేచ్ఛగా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కలిపి తెలంగాణలో (50+32)82 మంది ఉన్నారు. అంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను శాసనసభలో ప్రతిబింబించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి!

కేవలం 18 మంది టీఆస్ ఎమ్మెల్యేలు ఇవ్వాళ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం కోసం కొట్లాడుతున్నారు. అదే టీఆస్‌కు డ్బ్భై మందో ఎనభై మందో ఎమ్మెల్యేలు ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేదా? తెలంగాణ సమస్యను ఇంతకాలం నాన్చి ఉండేవారా? తెలంగాణ ప్రజలు ఇంత క్షోభను అనుభవించవలసిన అగత్యం ఉండేదా? ఇంత మంది యువకులు బలిదానాలు చేయవలసిన దుస్థితి దాపురించేదా? మనకు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వారిలో అత్యధిక మంది సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతినిధులుగా లేరు. అదే ఎమ్మెల్యేలు తెలంగాణవాదుల చెప్పుచేతల్లో ఉండి ఉంటే శాసనసభ నడిచేదా? సమస్య ఇంత దూరం వచ్చేదా? ఇప్పుడయినా తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయంటే, తెలంగాణ ప్రజల మొక్కవోని దీక్షే కారణం. వరుస ఉప ఎన్నికల్లో తెలంగాణవాదులను గెలిపించడం, కేసీఆర్ రాజకీయ దౌత్యం, ఉద్యమ జ్వాలలు నిరంతరం ఆరకుండా సజీవంగా ఉంచడం, కోదండరామ్ నాయకత్వంలో తెలంగాణ మార్చ్‌కి జరుగుతున్న సన్నాహాలు కేంద్రానికి, నిర్ణయం తీసుకోకతప్పని పరిస్థితిని తెచ్చాయి. అయినా రాష్ట్ర ఏర్పాటుపై తుది నిర్ణయం వచ్చే దాకా కాంగ్రెస్‌ను నమ్మడానికి వీలు లేదు. అటు లగడపాటి, ఇతర సీమాంధ్ర నాయకులు మరోసారి తెలంగాణకు అడ్డుపడడానికి సమీకృతులవుతున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు మాత్రం విచివూతవాదనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ‘అధిష్ఠానం మాతో కాకుండా కేసీఆర్‌తో చర్చలు జరుపడం ఏంటీ?’ ఒక పెద్ద మంత్రి దీర్ఘాలు తీస్తున్నారు. మీరు ఏం చేశారని మీతో చర్చలు జరుపాలి? తెలంగాణ ప్రజలకు మీరు ఎప్పుడు ప్రాతినిధ్యం వహించారని మీతో మాట్లాడాలి? ఈ నిమిషంలోనయినా తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు విచక్షణతో వ్యవహరిస్తే మంచిది. తెలంగాణ విషయంలో ముందుబడి పెద్దరికం వహించండి. తెలంగాణ వస్తే అందరికీ మంచిది. రాకపోతే పోరాటం చేయడానికయినా అందరూ కలిసే కదలాలి.

తెలంగాణలో ఎలాగూ సైంధవులు, శల్యులు, జయచంవూదులకు కొదువ లేదు. వాళ్లు తెలంగాణకోసం కొట్లాడరు. కొట్లాడుతున్నట్టు నటిస్తారు. కొట్లాడేవాళ్ల కాళ్లు కొట్టి కింద పడేయడానికి ప్రయత్నిస్తుంటారు. వారి వెనుక ఏవేవో జెండాలు, ఎజెండాలు పనిచేస్తుంటాయి. కొందరు కిరాయికోటిగాళ్లు అయితే, ఇంకొందరు పరాయి పెత్తనానికి దాసులైనవారు. కేసీఆర్‌పైన, కోదండరామ్‌పైన దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పనిచేస్తుంటారు. పరస్పర సంబంధంలేని ఆరోపణలతో ఊరేగుతుంటారు. వీరిని అంతగా పట్టించుకోనవసరం లేదు కానీ ఉద్యమంపై విషం గక్కుతున్న సీమాంధ్ర మేధావులకు మాత్రం సమాధానం చెప్పి తీరాలి. లగడపాటి రాజగోపాల్, పరకాల ప్రభాకర్ నాజీలను మించిన దురహంకారాన్ని, గోబెల్స్‌ను మించిన దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. వారు చేసే ఆరోపణలు, విమర్శలేవీ కొత్తవి కాదు. కానీ ఏ సందర్భంలోనూ వాటిని ఉపేక్షించడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నక్సలైట్లు పెరుగుతారని, హిందూ ముస్లిం మత ఘర్షణలు చెలరేగుతాయని రాజగోపాల్ పాత అబద్ధాన్నే పదేపదే చెబుతున్నారు. ఈ రాష్ష్రంలో నక్సలైట్ల సమస్య వచ్చిందే 1969 తెలంగాణ ఉద్యమం వైఫల్యం తర్వాత. తెలంగాణ ఉద్యమంపై కాసు బ్రహ్మనందాడ్డి నాయకత్వంలోని సీమాంధ్ర సర్కారు చేసిన దాష్టీకాలు, అరాచకాలతో విసుగుచెందిన చాలామంది తెలంగాణ యువకులు విప్లవోద్యమంవైపు వెళ్లారు. నక్సలైటు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది, వసంత మేఘ ఘర్జనలు శ్రీకాకుళంలో మొదలై రాష్ట్రం నలుమూలలా ప్రతిధ్వనించిందీ, గోదావరిలోయలో రక్తం ఏరులై పారిందీ, నల్లమల ఎర్ర జెండాలను ఎగురవేసిందీ సమైక్యాంధ్ర హయాంలోనే. సమైక్యాంధ్ర నక్సలైటు ఉద్యమాన్ని ఆపగలిగిందా? వేలాది మంది యువకుల బలిదానాన్ని నిలువరించిందా? నక్సలైట్ల సమస్య అనుభవాలు, గాయాలు, గుణపాఠాలు తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఒకవేళ అటువంటి సమస్య వస్తే తెలంగాణ ప్రజలు పరిష్కరించుకోలేరా? దానికి రాజగోపాల్ వంటి కామెడీ పొలిటీషయన్లు అవసరమా? ఇక హిందూ ముస్లింల ఘర్షణల గురించి. హైదరాబాద్‌లో హిందూ ముస్లిం ఘర్షణలు ఎప్పుడయినా జరిగాయీ అంటే అవి కాంగ్రెస్ నాయకుల మధ్య అధికారంకోసమే జరిగాయి. ఒక సారి రాజశేఖర్‌డ్డి, మరొకసారి మరో రెడ్డి హైదరాబాద్‌ను రణస్థలిగా మార్చారు. హైదరాబాద్‌లో హిందూ ముస్లింల మధ్య సీమాంధ్ర నాయకులు పెట్టిన చిచ్చు తప్ప, వాస్తవానికి ఏ వైరుధ్యమూ లేదు. వందల ఏళ్లుగా కలసి జీవిస్తున్న చరిత్ర వారిది. సీమాంధ్ర రాజకీయ రాబందుల జోక్యం లేకపోతే హైదరాబాద్‌లో అంతా సుభిక్షంగా ఉండేది.

పరకాల ప్రభాకర్ పెద్ద మనిషి అనుకున్నాను. ఆయనకు రాజకీయ కన్విక్షన్స్, లోతైన అవగాహన ఉంటాయనుకున్నాను. కానీ ఆయన కూడా నేలబారు మనిషేనని తేలిపోతున్నది. తెలంగాణ ఉద్యమంపై ఆయన ఏమంటున్నాడో చూడండి- ‘తెలంగాణ ఉద్యమం ఒక పీడ. ఒక అప్రజాస్వామిక ఉద్యమం. పాప పంకిలం. హంతక స్వభావం కలిగినది. ఒక హింసాత్మకం. ఏ తర్కానికి నిలబడని ఉద్యమం. అబద్ధాల ఉద్యమం. వైరుధ్య పూరితం....’. ఎన్ని శాపనార్థాలు? ఎన్ని తిట్లు? ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నవాళ్లు మాట్లాడే భాషా ఇది. తెలంగాణ ఉద్యమ చరిత్ర చూసినవారు ఇచ్చే తీర్పులా ఇవి. ఇది అప్రజాస్వామిక ఉద్యమమా? ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ సభ్యునిగా ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండు న్యాయమైనద’ని మ్యానిఫెస్టోలో రాసినప్పుడు నువ్వు ఏం చేశావు ప్రభాకర్? నిజామాబాద్‌లో జరిగిన ప్రజారాజ్యం సభలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని తమరు స్వయంగా ప్రకటించారు కదా ప్రభాకర్! అన్ని పార్టీలు అంగీకరించి, తీరా కేంద్రం నుంచి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించగానే ప్లేటు ఫిరాయించినవారు ప్రజాస్వామికవాదులా ప్రభాకర్! మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కుందా ప్రభాకర్! ఎన్నికల్లో టికెట్టు ఇవ్వలేదని ఎన్నికల యుద్ధంలో ఉండగా ప్రజారాజ్యానికి వెన్నుపోటు పొడిచిన నమ్మకవూదోహివి, తిన్నింటి వాసాలు లెక్కపెట్టినవాడివి నువ్వు తెలంగాణ ఉద్యమానికి నీతులు చెబుతున్నావా ప్రభాకర్! నిజమే! మీరనే మాటలన్నీ సమైక్యవాదులకు వర్తిస్తాయి. మీలాంటివారు తెలంగాణకు పట్టిన పీడ! మందబలంతో, మనీ బలంతో తెలంగాణ ఉద్యమాన్ని కాలరాయాలని చూస్తున్న అప్రజాస్వామిక, దురహంకార శక్తులు మీరు! 900 మంది తెలంగాణ నవయువకుల ప్రాణాలను బలితీసుకున్న నరహంతకులు సమైక్యవాదులు. సమైక్యవాదాన్ని నిలబెట్టడానికి మీరు చేస్తున్న పాపాలు శ్రీవేంక పుష్కరిణిలో మునిగినా పోవు. ప్రభాకర్ మీరు చేసే వాదనల్లో కుతర్కం, వితర్కం తప్ప తర్కం ఎక్కడుంది ప్రభాకర్! ఏ వాదనలు చెప్పి మమ్మల్ని కలసి ఉండమంటావు ప్రభాకర్! మేము వెయ్యి కారణాలు చూపగలం! మీరు ఒక్క కారణం చెప్పలేరు. నిన్నగాక మొన్న మీ ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌లో శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగపవూతాలిస్తే మా వాళ్లు ఆ కాగితాలు పట్టుకుని నంద్యాల వెళితే ఏం జరిగింది ప్రభాకర్! మా వాళ్లను ఎందుకు తరిమేశారు ప్రభాకర్! మీ తర్కం ఎందుకు పనిచేయడం లేదు? వైరుధ్యాలు, అబద్ధాలు సమైక్యవాదుల సొంతం. విలీనం మొదలు మొన్న మేనిఫెస్టోల దాకా సమైక్యవాదం బతుకుతున్నదే అబద్ధాల మీద. కోదండరామ్ వ్యాఖ్యలను తప్పుగా అన్వయించి ఉద్యమంపై విషం చిమ్మవద్దు. ఒకటి మాత్రం నిజం ప్రభాకర్! ప్రజాస్వామిక ఆకాంక్షలు వమ్మయిన చోట, శాంతి మార్గం విఫలమైన చోట విగ్రహాలు ఎగిరిపడతాయి ప్రభాకర్!

[email protected]

396

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన