తెలంగాణ క్లైమాక్స్


Tue,September 18, 2012 05:45 PM

tG1
కోట్లాది మెదళ్లు. అవే ప్రశ్నలు. తెలంగాణ వస్తుందా? కేంద్రం ఇస్తుం దా? కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు? కేంద్రం చర్చలు చేస్తూ ఉంటే ఆంధ్రా నాయకులు ఇంత కాన్ఫిడెంట్‌గా తెలంగాణ రాదని ఎలా చెబుతున్నారు? అసలేం జరుగుతోంది? నిన్న ఉన్నతోద్యోగి గా పదవీ విరమణ చేసిన డ్బ్బై ఏళ్ల పెద్ద మనిషి నమస్తే తెలంగాణ ఆఫీసుదాకా వచ్చి, ‘బాబూ ఈ టెన్షన్ భరించడం కష్టంగా ఉంది. అసలేం జరుగుతుందో చెప్పండి? తెలంగాణ రాదనుకుంటే సెప్టెంబరు 30న మేమేం చేయా లో చెప్పండి? ఒకరిలా మరొకరలా మాట్లాడుతున్నారు. మీరైతే ఏదైనా ధైర్యం చెబుతారని వచ్చాను’ అన్నారు. మరో ఉన్నతాధికారి ఫోను చేసి, ‘తెలంగాణకు గూర్ఖాలాండ్ తరహాలో సాధికార మండలి ఏర్పాటు చేస్తారట. తెలంగాణకు వచ్చే నిధులన్నీ ఆ మండలికి ఇస్తారట. ఆ మండలికి కేసీఆర్‌ను చైర్మన్‌ను చేస్తారట. పొద్దుటి నుంచి ఒకటే ఫోన్లు. ఇది నిజమేనా?’ ప్రశ్నించాడు. మరో జేఏసీ నాయకుడు ఫోను చేసి, ‘అసలు చర్చలు జరుగుతున్నాయా? వాళ్లు పిలిచారా? సారే వెళ్లారా? అక్కడ అసలేమీ జరగడం లేదని కొందరు జర్నలిస్టులు చెబుతున్నారు’ సందేహం వెలిబుచ్చారు. ఇన్ని ప్రశ్నలు, ఇన్ని సందేహాలు తలెత్తడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రంలో తప్పు ను ఒప్పు, ఒప్పును తప్పు చేసే సీమాంధ్ర మీడియా ఒకటి బలంగా ఉంది. తెలంగాణ వ్యతిరేక వాదనలను ఉన్మాదస్థాయిలో ప్రచా రం చేసే శక్తులు ఆ మీడియాల్లో ఉన్నాయి. మానసిక యుద్ధం లో ఆ మీడియా ఇప్పటిదాకా పైచేయి సాధిస్తూ వస్తోంది. తెలంగాణలో ఇప్పటికీ ఆ మీడియా బలంగానే ఉంది. అందుకే షిండే మాట్లాడగానే తెలంగాణ రాదని తేలిపోయిందంటాడు ఒక జర్నలిస్టు. ఒవైసీ మాట్లాడగానే తెలంగాణ రాదని తేలిపోయిందంటాడు మరొక విశ్లేషకుడు. గూర్ఖాలాండ్ తరహాలో అటానమస్ కౌన్సిల్ వస్తోందని రాస్తా డు ఇంకొక విలేఖరి. అలా రాయడంలో వాళ్లకు ఒక లక్ష్యం ఉంది. ఆనందం ఉంది. ఆ చానెళ్లు చూసి, ఆ పత్రికలు చదివి తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురై, బాధపడితే, కలవరపడితే వాళ్ల ఆనందం మరింత పెరుగుతుంది. ‘ఆ పత్రికలు చదవడం మానేసి ఆరు మాసాలైంది. అవి చదివినప్పటి నుంచి అనవసరమైన కోపం, ఆవేశం, బీపీ పెంచుకోవడం... ఎందుకంత బాధపడాలి? మిస్ ఇన్‌ఫర్మేషన్ లేక డిస్‌ఇన్‌ఫర్మేషన్ కంటే నో ఇన్‌ఫర్మేషన్ ఈజ్ హెల్తీ టుమీ. అయినా నేనేమీ మిస్ కావడం లేదు. నమస్తే తెలంగాణ సరిపోతోంది’ అని జేఏసీ నాయకుడొకరు మాటల సందర్భంలో చెప్పారు. తెలంగాణలో చాలా మంది బుద్ధి జీవుల కొత్త మంత్రం ఇది.

ఆందోళనపడుతున్న తెలంగాణవాదులు ఆలోచించాల్సింది ఒక్క మనముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇంతకాలం ఏదయితే జరగడం లేదని అనుకుంటున్నామో ఇప్పుడు అది జరుగుతోంది. అక్కడ కేసీఆర్ తెలంగాణ కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇక్కడ కోదండరామ్ నాయకత్వంలోని జేఏసీతోపాటు తెలంగాణలోని అన్ని ఉద్యమ స్రవంతులు మరోసారి పోరుబాట పడుతున్నాయి. ఒకటి లాబీయింగ్. రెండు ఉద్యమం. రెండూ సమాంతరంగా జరగాలని కోరుకున్నాం. ఇప్పు డు అటువంటి సన్నివేశంలో నిలబడి ఉన్నాం. ఢిల్లీలో చర్చలు జరుగుతున్నమాట వాస్తవం. పిలిచారా వెళ్లారా అన్నది అప్రస్తుతం. ఫలితం ఎలా ఉండబోతుందన్నదే ముఖ్యం. గూర్ఖాలాండ్ కౌన్సిల్ కోసమైతే ఇన్నేళ్ల పోరాటం, ఇన్ని త్యాగాలు అనవసరం. ‘ఇది సీమాంధ్ర నాయకులు, వారి అనుకూల మీడియా కావాలని ప్రచారం చేస్తున్నది. ఆ ప్రయోగాలన్నీ ఎప్పు డో అయిపోయాయి. కేసీఆర్ అటువంటి ప్రతిపాదనలకు ఒప్పుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం తప్ప మరో ప్రతిపాదనకు మేము సిద్ధంగా లేము. పైగా అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అన్నది అసాధ్యమైన విష యం. అందుకు రాజ్యాంగ సవరణ కావాలి. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మద్దతు కావాలి. బిజెపి లేక మరే ఇతర ఎన్‌డిఏ పక్షాలు ఇందుకు ఒప్పుకోవడం లేదు. ఇది కేవలం సీమాంధ్ర మీడియా కైట్ ఫ్లైయింగ్. రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటుకు హాజరైనవారిలో సాధారణ మెజారిటీ సభ్యులు తీర్మానిస్తే చాలు. సాధారణ మెజారిటీతో ఏర్పాటయ్యే అవకాశాన్ని వదులుకుని అంతకంటే కఠినమైన మార్గాన్ని కాంగ్రెస్ ఎందుకు ఎంచుకుంటుంది? తెలంగాణకు అంగీకరించడం తప్ప కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేదు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణ ఇవ్వలేదా....కేసీఆర్ ఇంతకుముందే చెప్పారు... ఇస్తే సంబరం, ఇవ్వకపోతే సమ రం అని. తెలంగాణ వచ్చి తీరుతుంది. ఎవరూ నిరాశపడవలసిన అవసరం లేదు. రాకపోతే సమరానికి అవసరమైన అన్ని సన్నాహాలూ తెలంగాణలో ఇప్పటికే జరుగుతున్నాయి’ అని టీఆస్ నాయకుడొకరు చెప్పారు. తెలంగాణపై షిండేలు, ఒవైసీల మాటలు అంతిమం కాదన్న విషయం అందరూ గుర్తించాలి. అవి వారి వ్యక్తిగత అభివూపాయాలు లేక పార్టీ విధానాలు తప్ప, అంతిమ ఫలితాన్ని సూచించే సంకేతాలు కావని గమనించాలి. ఆంధ్రవూపదేశ్‌లో నక్సలైట్ల సమస్యను విజయవంతంగా రూపుమాపిందని కేంద్ర హోం శాఖ నివేదికల్లో బోలెడంత సమాచారం ఉంది. నక్సల్స్ ఏరివేత విషయం లో కేంద్ర హోంమంవూతులు, ప్రధాని స్వయంగా ఆంధ్రవూపదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అనేక సమీక్షా సమావేశాల్లో ప్రకటించారు. నక్సల్స్ సమస్య సమైక్య రాష్ట్రంలోనే పతాక సన్నివేశానికి చేరి, చల్లారిపోయింది. నక్సల్స్ సమస్య ఆవిర్భావ మూలాలు 1969లో తెలంగాణ ప్రజలపై జరిగిన దాష్టీకంలో ఉన్నాయి. అందువల్ల ఆ పాపం కూడా సీమాంధ్ర సర్కారుదే. ఇక పోతే ఎంఐఎం కూడా ఎప్పుడూ తెలంగాణ ప్రజలతో లేదు. నాడు నిజాం కూడా తెలంగాణ ప్రజలకు దూరంగానే ఆలోచనలు చేశారు. ఇప్పుడు ఒవైసీ కూడా ఆ దూరాన్ని కొనసాగించదలుచుకున్నారు. ఒవైసీ అభివూపాయం తెలంగాణ ముస్లింలందరి అభివూపాయం కాదు.
విచిత్రం ఏమిటంటే, ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ మంత్రు లు, ఎమ్మెల్యేలు ప్రజలు ఆశించిన విధంగా స్పందించడం లేదు.

ఎందుకోగానీ ఎంపీలు కూడా చల్లారిపోయారు. 2000 సంవత్సరంలో చిన్నాడ్డి చేసిన సంతకాల సేకరణ ఉద్యమం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూ రు జానాడ్డి ఇప్పుడు చేస్తున్నారు. రెడ్డొచ్చి మొదలాడినట్టుంది. ఏదోఒకటి చేశామనిపించుకోవడం తప్ప, ఇస్తారా చస్తారా అని కేంద్రాన్ని అడిగే దమ్ము ను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చూపడం లేదు. జానాడ్డి గురించి అర్థం చేసుకోవడానికి ఆయన ఆంతరంగికుల్లో ఒకరైన తూడి దేవేందర్‌డ్డి నల్లగొండ జిల్లాలో వారంరోజుల క్రితం చేసిన ప్రకటన చదవాలి. ‘తదుపరి ముఖ్యమంత్రి జానాడ్డే అవుతారు. జానాడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్రా ప్రాంత నాయకులు కూడామద్దతు ఇస్తున్నారు’ అని ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గస్థాయి సమావేశంలో దేవేందర్‌డ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షను జానాడ్డి కూడా ఎప్పు డూ దాచుకోలేదు. ముఖ్యమంత్రి కావాలనుకోవడంలో కూడా తప్పు పట్టవలసిందేమీ లేదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచనలు చేస్తున్నామన్నది ముఖ్యం. జానాడ్డి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? సమైక్య రాష్ట్రానికా? తెలంగాణ రాష్ట్రానికా? మీకు అర్థమవుతోందా? ముఖ్యమంత్రి కావాలనుకునే వారు ఢిల్లీకి కోపం రాకుండా చూసుకోవాలి కదా? అందుకే జానా నాయకత్వంలో మంత్రుల ఢిల్లీ యాత్రలు అనంతంగా వాయిదా పడుతుంటాయి. ఉత్తుత్త సంతకాల ఉద్యమాలు జీడిపాకంలాగా సాగుతూ ఉంటాయి. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షలకు ఏమాత్రం ప్రాతినిధ్యం వహించని వారు, తెలంగాణ సమస్యల గురించి కొట్లాడే ఆరాటం లేనివారు ముఖ్యమంవూతులయితేనేమి, ప్రధానమంవూతులయితేనేమి? ఒక్క జానాడ్డే కాదు, డి.శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ.....అందరూ అదే బాపతు.

ఇక తెలుగుదేశం ఇప్పటికీ చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. తెలంగాణ ఎజెండాను పక్కనబెట్టి మిగిలిన అన్ని అంశాలను మాట్లాడుతున్నది. ఎస్‌సి డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. చంద్రబాబునాయు డు ఢిల్లీకి వెళ్లి ఈ డిక్లరేషన్‌లపై అన్ని పార్టీల వద్ద పైరవీ కూడా చేసి వచ్చారు. మంచిదే. గొప్ప విషయమే. మరి తెలంగాణ విషయం ఎందుకు మాట్లాడలేదు? దశాబ్దాలుగా కొట్లాడుతున్నది. 1969లో 360 మంది యువకులను సీమాంధ్ర సర్కారు బలిగొన్నది. తిరిగి పన్నెండేళ్లుగా వీధి పోరాటాలకూ సిద్ధపడింది. 900 మంది యువకులు బలిదానాలు చేశారు. వందలాది సమ్మెలు, హర్తాళ్‌లు, సభలు, సమ్మేళనాలు జరిగాయి. తెలంగాణ అంతా ఒక్కటే గళమై ప్రత్యేక రాష్ట్రంకోసం జైకొడుతున్నది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయిందని అందరూ బాధపడుతున్నారు. అయినా చంద్రబాబు ఎందుకు నాన్చుతున్నారు? లేఖ ఎందుకివ్వరు? తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండు చేయరు? తెలంగాణ సమస్య తేల్చండని ఢిల్లీలో అన్ని పక్షాల నాయకులను ఎందుకు కలవరు? ఎందుకంటే తెలంగాణకు సంబంధించినంతవరకు చంద్రబాబు ఎప్పుడూ చంద్రశేఖర్‌రావు కాలేరు. లేఖ విషయంలో ఇదిగో అదిగో అని సాగదీయడంలోనే ఆయన చిత్తశుద్ధి ఎంతో తెలిసిపోతున్నది. ఆయన కేంద్రానికి లేఖ ఇస్తానని రోజుకోసారి ఉద్ఘాటిస్తారు. ఒక చేలాతో పాదయాత్ర తర్వాత ఇస్తామని ప్రకటన చేయిస్తారు. మరో చేలాతో అసెంబ్లీ సమావేశాల తర్వాత లేఖ ఇస్తామ ని చెప్పిస్తారు. తెలంగాణలో నానా అవమానాలు పడుతున్న ఎర్రబెల్లి, కడి యం శ్రీహరి వంటి నాయకులేమో తొందరగా లేఖ ఇప్పిస్తామని అవస్థ లు పడుతుంటారు. చంద్రబాబు పరిస్థితి, తెలుగుదేశం దుస్థితి ఇలా ఉంటే, జర్నలిస్టు మాంత్రికుడొకాయన ఆయనకు మరోసారి దేవతావస్త్రాలు తొడిగించాలని చూస్తున్నారు. కేసీఆర్ జనానికి దూరమయ్యారని, జేఏసీకి దూరమయ్యారని, రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని, ఇక భవిష్యత్తు అంతా చంద్రబాబుదేనని మంత్రాలు చదువుతున్నారు. ఆ జర్నలిస్టు మాంత్రికుడికంటే చంద్రబాబు నయం. తాను చేసిన తప్పులు దిద్దుకోవాలని కనీసం ప్రయత్నిస్తున్నారు. ‘తొమ్మిదేళ్లు ముఖ్యమంవూతిగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నాయకునిగా ఉండి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఒక స్పష్టత ఇవ్వకపోతే ఎలా’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తప్పులు దిద్దుకోవచ్చుగాక కానీ చేసిన పాపం ఎలా పోతుంది? వచ్చిన తెలంగాణను మూడేండ్లు వెనుకకు కొట్టిన ద్రోహుల్లో చంద్రబాబు ఉండకుండాపోతారా? జర్నలిస్టు మాంత్రికుల మంత్రోచ్చారణలు ఆయనను పవివూతున్ని చేస్తాయా?

వైఎస్సార్ కాంగ్రెస్ కూడా చేనేత దీక్షలు చేస్తుంది. ఫీజులకోసం ధర్నాలు చేస్తుంది. కరెంటు కోసం ర్యాలీలు చేస్తుంది. కానీ తెలంగాణ ప్రజల హృద యం గత పదేళ్లుగా దేనికోసం ఆరాటపడుతున్నదో గుర్తించడానికి నిరాకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించడానికి తిరస్కరిస్తున్నది. తెలంగాణ పేరు చెప్పకుండానే తెలంగాణలో రాజకీయాలు చేయగలమని, గెలవగలమని అనుకుంటున్నది. ఇది ఒక్క తెలంగాణలోనే సాధ్యం. మనవి కానివన్నీ మనవి అనుకుని నినాదాలు చేసే స్థాయికి వెళ్లింది తెలంగాణ సమాజం. తెలంగాణ ఆంధ్రీకరణ ఎంతగా జరిగిపోయిందంటే, విశాఖ ఉక్కుకోసం దేవరకొండ ఎమ్మెల్యే తొలి రాజీనామా చేస్తాడు. పొట్టి శ్రీరాములు ఆంధ్రవూపదేశ్ కోసం మరణించాడని నమ్ముతాం. నాకు తెలిసి-పోలవరం ప్రాజెక్టు కట్టకపోతే ఎలా అని అమాయకంగా వాదించిన రోజులూ ఉన్నాయి. శంకరంబాడి సుందరాచారిని గుర్తుపెట్టుకున్నాం, ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి సుబ్బారావును మరచిపోయాం. నన్నయ, తిక్కనలను కీర్తించాం, పాల్కురికి సోమన్నను మరచిపోయాం. టంగుటూరి ప్రకాశం విగ్రహాలు పెట్టుకున్నాం, అమాయకంగా తెలంగాణను ఆంధ్రకు అప్పగించిన బూర్గుల రామకృష్ణారావును చరిత్ర పుటల్లోనే ఉంచేశాం. మనల్ని మనం మరచిపోయేట్టు చేయడమే ఆధిపత్యవాదం స్వభావం. అందుకే ఇవ్వాళ రాజశేఖర్‌డ్డి కొందరికి మనవాడిలాగా కనిపిస్తున్నాడు. చంద్రబాబునాయుడు మహానుభావుడిలాగా కనిపిస్తున్నాడు. ఇటీవల నల్లగొండ ఎమ్మెల్యే ఒకరు ఏదో ఒక సభలో మాట్లాడుతూ, ‘రాజశేఖర్‌డ్డికి నల్లగొండ జిల్లా ఎప్పటికీ రుణపడి ఉంటుంది’ అని సెలవిచ్చారు. మన నేతల బానిసబుద్ధికి తార్కాణం ఇది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో పోతిడ్డిపాడును ఒక నదిలా మళ్లించుకుపోయి కడపను పండించినందుకు, మన ఎస్‌ఎల్‌బీసీనీ ఇప్పటికీ పూర్తిచేయకుండా నల్లగొండను ఎండబెట్టినందుకు రాజశేఖర్‌డ్డికి, చంద్రబాబునాయుడుకు అందరికీ రుణపడే ఉండాలి. తెలంగాణ వచ్చినా ఆంధ్రా నాయకత్వాల నుంచి తెలంగాణ నాయకత్వాలు విముక్తి కానంతవరకు ఇక్కడి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.
[email protected]

325

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా