ఉప ఎన్నికల ఉపదేశం


Sat,June 16, 2012 12:45 AM

పద్దెనిమిది శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఊహించినదానికి భిన్నంగా ఏమీ రాలేదు. అయితే ఇందులో ఎన్నో సందేశాలు, సంభ్రమాలు, ఆశ్చర్యాలు ఉన్నాయి. సునాయాసం అనుకున్న పరకాల ఉప ఎన్నిక గెలుపు చివరివరకు నరాలు తెంపే ఉత్కం కు గురిచేసి, ఊరించి, వేధించి టీఆస్‌ను గెలిపించింది. ఆ గంటలో ఎన్ని ఆక్రోశాలో! ఎన్ని ఉక్రోషాలో! ఎంత నరకయాతనో! ‘సురేఖ గెలిస్తే ఇంకేమైనా ఉందా? టీఆస్‌ను జగన్ అయితేనే నిలువరించగలడని ఆంధ్రా జనం నమ్మేస్తారు. తెలంగాణలో కూడా ఆయన హవా వచ్చేస్తుంది. కాంగ్రె స్, తెలుగుదేశం నేతలు చాలా మంది వైఎస్‌ఆర్‌సిపికి క్యూగడతారు’-ఒక మిత్రుడి భయం. ‘కేసీఆర్ మరికాస్త తిరిగితే పరిస్థితి వేరుగా ఉండేది. విజయమ్మ సభలు, రోడ్‌షోలతో నియోజకవర్గం అంతటా కలెదిరిగితే, ఆయన ఒక్క సభ పెట్టుకుని, అదీ పదినిమిషాలు మాట్లేడేసి వచ్చారు. ఛ అంతా అయిపోయింది’-ఒక సబ్ ఎడిటర్ ఆవేదన. ‘నేను చెబుతూనే ఉన్నా. పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి గీసుకొండ, సంగెం మండలాల్లో అనేక గ్రామాల్లో టీఆస్ ఏజెంట్లు, కార్యకర్తలు పోలింగ్ బూత్‌లవద్ద నుంచి మాయమయ్యారు.

ఏదో జరుగుతోందని అప్పుడే అనుకున్నా’-అక్కడ రిపోర్టింగ్ చేసిన మరో విలేఖరి వ్యాఖ్యానం. ‘టీఆస్‌కు గ్రామాల్లో నిర్మాణం లేదు. నిలబడి ఓట్లేయించే కార్యకర్తలు లేరు. అదే దెబ్బతీసింది’. ‘తెలంగాణవాదులను ఏకోన్ముఖం చేయడంలో టీఆస్ విఫలమైంది. ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు ఆ పార్టీని చాలా మంది కి దూరం చేశాయి’. ‘టీఆస్ అభ్యర్థి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు’ టీవీల్లో ఇంకా ఇలా అనేక వ్యాఖ్యాతల విశ్లేషణ లు వినిపించాయి. ఈ వ్యాఖ్యలు, విశ్లేషణలు, విమర్శలు చేసినవారంతా తెలంగాణవాదులే. పరకాలలో టీఆస్ గెలవాలని ఆశిస్తున్నవారే. టీఆస్ అంటే తెలంగాణవాదం ఓడిపోతుందేమోనన్న ఆందోళన, ఆక్రోశం, బాధతోనే ఇవన్నీ మాట్లాడారు. గెలుపు వార్త వచ్చేలో గా ఈ విమర్శలన్నీ వినవలసి వచ్చింది. గెలుపు వార్త వచ్చిన తర్వాత కూడా ఇవే విమర్శలు కొనసాగాయి. బాధలో మాట్లాడినా, కోపంలో మాట్లాడినా ఈ వ్యాఖ్యలన్నింటిలో వాస్తవం ఉందో లేదో టీఆస్ సమీక్షించుకోవలసిన అవసరం ఉంది.

వాస్తవిక దృక్పథంతో మాట్లాడుకోకపోతే, అనేక తప్పులు జరుగుతాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఒక టీఆస్ నాయకుడు ఫోను చేశాడు. చాలా ఆవేశంగా మాట్లాడాడు. ‘మన పత్రికలో టఫ్ ఫైట్ అని ఎలా పెడతారు? అసలక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా?’ అని ప్రశ్నించారు. అది కూడా మీరే చెప్పండి అంటే, ‘మంచి మెజారిటీతో సులువుగా గెలుస్తాం. మీ విలేఖరులకు అంచనాలే తెలియదు’ అని విసుక్కున్నా రు. అనుమానం వచ్చి, విలేఖరితో మాట్లాడాను, ‘ఐదువేల లోపే గెలుపోటములుంటాయి సార్. మనవాళ్లు వినిపించుకునే పరిస్థితిలో లేరు’ అన్నా డు. ఇవ్వాళ 17వ రౌండు సందర్భంగా అనేక మంది మాట్లాడిన కారణాలనే ఆ విలేఖరి చెప్పాడు. నాకు కూడా నమ్మశక్యం కాలేదు. కానీ విష్‌ఫుల్ థింకింగ్ వేరు, గ్రౌండ్ రిపోర్టింగ్ వేరు. ఒకటి భ్రమ. మరొకటి వాస్తవం.

ఉద్యమకాలంలో జరిగే ఎన్నికలకు, శాంతికాలంలో జరిగే ఎన్నికలకు తేడా ఉంటుంది. ఉద్యమకాలంలో జరిగిన ఎన్నికల్లో టీఆస్ ఆలవోకగా గెలుస్తూ వస్తున్నది. కరీంగనర్ లోక్‌సభ ఎన్నిక ఇందుకు తార్కాణం. శాంతికాలంలో జరిగిన ఎన్నికల్లో టీఆస్ ఎదురీదుతున్నది. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇందుకు ఉదాహరణ. 2009లో మహాకూటమి ఫలించకపోవడానికి కూడా కారణం ఉద్యమవాతావరణం లేకపోవడమే. ఇంతెందుకు 2010లో జరిగిన 12 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో టీఆస్ ఆడుతూపాడుతూ ఘనవిజయం సాధించింది. అప్పుడు కష్టపడలేదని కాదు. కానీ తెలంగాణవాదులంతా ఏకోన్ముఖంగా ఉన్న రోజు లవి. మొన్న ఆరు నియోజకవర్గాల ఎన్నికలు వచ్చేసరికి ఉద్యమ కాక తగ్గిపోయింది. పోరాడి గెలవాల్సి వచ్చింది. పరకాల పూర్తిగా శాంతికాలంలో జరిగిన ఎన్నిక. పైగా పరకాలది ప్రత్యేక పరిస్థితి. పులి జగన్ ఎలాగో ఈ పదకొండేళ్లుగా పరకాలకు కొండా మురళి అలా! ఆయనకు ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టు అటువంటిది.

నియోజకవర్గంలో ఆయనకు ఉన్న నిర్మాణం కూడ టీఆస్ కంటే బలమైనది. ధనబలంలో కూడా ఆయన టీఆస్ అభ్యర్థి కంటే అనేకట్లు శక్తిమంతుడు. సురేఖ, మురళి స్థానికులకు అందుబాటులో ఉంటారని ప్రతీతి. వ్యూహం, పథకం, ఆచరణ అన్నీ తెలిసిన నేత. టీఆస్ మొత్తం ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, తెలంగాణవాదులు, కళాకారులు అందరూ ఊరూవాడా తిరిగినా సురేఖ ఇంత పోటీ ఇచ్చిందంటే కచ్చితంగా మురళి ప్రత్యేకతే. ఇన్ని ప్రత్యేకతలున్న మురళిని ఎదిరించడానికి ఇంకా ఎంత శక్తి కావాలి? ఒక వైపు పార్టీ నిర్మాణ లోపాలు, ఇంకోవైపు బలమైన ప్రత్యర్థి...అయినా టీఆస్ గెలిచిందంటే హరీశ్‌రావు నాయకత్వంలో పార్టీ శ్రమ, తెలంగాణవాదంపై ప్రజల్లో ఉన్నమమకారం ఫలించాయి. ఉద్యమ వాతావరణం ఉండి ఉంటే ఇంత కష్టపడవలసి వచ్చేది కాదు. ఇంత యాతన అవసరమయ్యేదికాదు.ఈ ఎన్నికలు టీఆస్‌కు ఒక హెచ్చరిక చేస్తున్నాయి. శాంతికాలంలో జరిగే ఏఎన్నికలోనయినా టీఆస్ ఇలాగే చెమటోడ్చవలసి వస్తుంది. మిగిలిన పార్టీల మాదిరిగా డబ్బుతో ఎలక్షనీరింగ్ నిర్వహించగలిగే పరిస్థితి టీఆస్‌కు ఇప్పుడు లేదు, ఇకముందు కూడా ఉండే అవకాశం లేదు. తెలంగాణవాదబలంతో, ఉద్యమంతో కలగలసి వచ్చే ఎన్నికలుమాత్రమే ఆ పార్టీకి మేలు చేస్తాయి. ఈలోగా తెలంగాణ రాకపోతే 2014 ఎన్నికలకు మనం ఉద్యమకాలంలో ఉంటామా లేక శాంతికాలంలో ఉంటామా అన్నది తేల్చుకోవలసిన అవసరం ఆ పార్టీపై ఉంది.

తెలంగాణపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోనంతవరకు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సిపిలకు తెలంగాణలో భవిష్యత్తు లేదని పరకాల ఎన్నికలు తేల్చి చెప్పాయి. ఆ పార్టీలు నానాటికీ బలహీనపడుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు 20 నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరుగగా టీఆస్ 10 నుంచి 17 స్థానాలకు పెరగగా, టీడీపీ ఐదు స్థానాలను కోల్పోయిం ది. కాంగ్రెస్ 3 స్థానాలను కోల్పోయింది. బిజెపి రెండు స్థానాలను గెల్చుకోగా ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. కాంగ్రెస్, టీడీపీల ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోయింది. 2009 సాధారణ ఎన్నికల్లో ఈ 20 నియోజకవర్గాల్లో టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం16.5 కాగా 2010 నుంచి 2012 వరకు జరిగిన ఉప ఎన్నికల్లో 11.1 శాతానికి తగ్గిపోయింది. 14 స్థానాల్లో డిపాజి ట్లు కోల్పోయింది. కాంగ్రెస్ పరిస్థితి కూడాఇందుకు భిన్నంగా లేదు. 2009 లో ఈ 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 30.5 శాతం ఓట్లు రాగా, ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతం 20.8 శాతానికి పడిపోయింది. ఐదు స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతయింది. అదే సమయంలో టీఆస్ ఓట్లు ఈ నియోజకవర్గాల్లో 24 శాతం నుంచి 51.5 శాతానికి పెరిగాయి. ఈ పరిస్థితి ని ఉపయోగించుకుని ఉద్యమ ఉధృతిని పెంచడంతోపాటు రాజకీయ శక్తుల పునరేకీకరణకు టీఆస్ చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది.

కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణపై తిరిగి స్పష్టమైన వైఖరి తీసుకోవాలంటే, ఆ పార్టీలకు రాజకీయ అనివార్య పరిస్థితి దాపురించాలి. రాజకీయంగా తమకు చావు తథ్యం అనుకున్నప్పుడే పార్టీలు కచ్చితమైన నిర్ణయాలు చేస్తాయి. ఈ ఎన్నికలు అటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తు ఇంకా చేదుగా ఉంటుందన్న వాస్తవాన్ని టీడీపీ, కాంగ్రెస్‌లు గ్రహించేట్టు చేయాల్సిన బాధ్యత తెలంగాణవాదులపైన, టీఆస్‌పైన ఉంది.

సీమాంవూధలో జరిగిన 17 శాసనసభ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణకు మేలు చేసేవే. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ముఖం చెల్లకుండా చేశాయి ఈ ఎన్నికలు. సమైక్యాంధ్ర అంటే ఆంధ్ర తమ ఉంటుందని నమ్మబలికిన లగడపాటి, కావూరి, రాయపాటి వంటివారు ఇప్పుడు ఏమని సమాధానం చెప్పగలరు? ఆంధ్రలో కాంగ్రెస్ ఓడితే తెలంగాణ ఏర్పడుతుందని బెదిరించినా అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. జగన్‌కు ఓటేయడమంటే రాష్ట్ర విభజనకు ఓటేయడమేనని హెచ్చరించినా అక్కడి ప్రజలు ఖాతరు చేయలేదు. జగన్‌పై కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలను కూడా ప్రజలు విశ్వసించలేదని భావించాలి. ఆశ్చర్యం ఏమంటే, ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సొంత జిల్లాలోని తిరుపతిలో, స్టార్ కాంపెయినర్ చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతిలో జగన్ పార్టీ గెలవడం. కాంగ్రెస్‌కు ఒక్క పరాభవం కాదు. ఒక్క తిరుపతిలోనే కాదు చిరంజీవిని కలుపుకున్న ఫలితం ఎక్కడా దక్కలేదు. ఈ 17 నియోజకవర్గాల్లో 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 41.8 శాతం, పీఆర్‌పికి 21.9 శాతం ఓట్లు వచ్చాయి. అంటే రెండు పార్టీలకూ కలిపి 63.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో ఇదే 17 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల శాతం 22.9 మాత్రమే.
నేతలు కలసిపోవచ్చు.

పార్టీలు విలీనం కావచ్చు. కానీ జనం విలీనం కారన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అతిరథ మహారథులు, కేంద్ర మంత్రులు కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరిగినా, స్టార్ కాంపెయినర్లు ‘ఇది వాళ్ల గడ్డ కాదు, ఆళ్ల గడ్డ’ సవాళ్లు విసిరినా జనం మాత్రం జగన్ వైపే చూశారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే లోకస్ స్టాండీని కోల్పోయారు. విజయమ్మ పరకాలకు వచ్చి తెలంగాణకు వ్యతిరేకంకాదని చెప్పారు. సీమాంవూధకు వెళ్లి సమైక్యాంధ్ర గురించి చెప్పలేదు. తెలంగాణపై లగడపాటి వంటి కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టినా ఆమె నోరుమెదపలేదు.తన కొడుకుకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే చెప్పారు. అయినా సీమాంధ్ర ప్రజలు జగన్‌వైపే చూశారు. ఈసారి కూడా సీమాంధ్ర ప్రజలు తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించలేదు.

నీతి గెలిచిందా? అవినీతి గెలిచిందా? అని ఎవరయి నా నిలదీయవచ్చు. జనం మాత్రం అవేవీ చూడ లేదు. జగన్ గెలుస్తాడా? ఆయనను ఒంటరి చేసి మూకుమ్మడిగా దాడిచేస్తున్న మిగిలిన పార్టీలు గెలుస్తాయా? అని మాత్రమే చూశారు. జగన్‌నే గెలిపించారు. జనం తీర్పు ను తప్పుపట్టే వాళ్లూ ఉంటారు. వారికి శాపనార్థాలు పెట్టే విశ్లేషకులూ ఉంటారు. ఇదే జనం గతంలో కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇదే జనం టీడీపీనీ గెలిపించారు. ఇదే జనం కొందరు పీఆర్‌పీకీ ఓటేశారు. మనకు అర్థం కాని తీర్పులన్నీ తప్పు కాదు. అసపూందుకు ఇలా జరిగిందో ఆలోచించుకోవాలి. జగన్‌పై ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత, ఇన్ని లక్షల టన్నుల న్యూస్ ప్రింట్, ఇన్ని వేల గంటల న్యూస్ అవర్స్ వెచ్చించి ఆయనను దోషిగా నిలబెట్టిన తర్వాత, ఇన్ని పార్టీలు ఆయనపై ఒక్కుమ్మడిగా దాడి చేసిన తర్వాత కూడా జనం ఎందుకు ఆయనను గెలిపించారో లోతుల్లోకి వెళ్లి చూడాలి. అధికారపక్షం, ప్రతిపక్షం, పత్రికలు, చానెళ్లు ఊపిరిసలుపకుండా కుమ్మరించిన అస్త్రాలన్నీ జగన్ గడపను ఎందుకు తాకలేకపోయా యో ఆలోచించుకోవాలి.జనం విశ్వాసాన్ని చూరగొనలేకపోవడం తప్పా? లేక జనం విశ్వసించకపోవడం తప్పా? తప్పు అపనమ్మకాన్ని మూటగట్టుకున్నవారిదా? నమ్మనివారిదా? నిర్ణయించుకోవాలి. జనాన్ని గొర్రెదాటు అని, పిచ్చోళ్లు అని, మోసపోయారని తిట్టినవావ్లూవరూ రాజకీయాల్లో బాగుపడలేదు.

తెలుగుదేశం ఆలోచించవలసింది ఇక్క డే. ఈ ఎన్నికలు త్రిముఖ పోటీలాగా జరుగలేదు. ద్విముఖ పోటీలాగానే జరిగాయి. తెలిసి చేసినా తెలియక చేసినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, లోక్‌సత్తా, సిబిఐ, కొన్ని పత్రికలు, చానెళ్లు ఈఎన్నికలను జగన్ వర్సెస్ ఆల్ కింద మార్చేశాయి. తెలుగుదేశం తన ప్రత్యామ్నాయ పాత్రను, ప్రధాన ప్రతిపక్ష పాత్రను తానే కుదించుకుంది. జగనే శత్రువు, జగనే దయ్యం, జగనే భూతం....మెలకువలో, కలలో, నడకలో, మాటలో జగన్నామస్మరణ వీడలేదు టీడీపీ. ఎనిమిదేళ్ల అధికార కాంగ్రెస్ వైఫల్యాలు, జగన్ అవినీతి పురాణం నుంచి లబ్ధి పొందవలసిన టీడీపీ పూనకం వచ్చినట్టుగా జగన్ చుట్టూనే ప్రచారం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్‌కు ఎలాగూ జగనే శత్రువు. కాంగ్రెస్-టీడీపీలు ఒక్కటై జగన్‌ను టార్గెట్ చేశారన్న భావన జనంలో వచ్చేసింది.జగన్ బయటికి వెళ్లింది కాంగ్రెస్ నుంచి. నష్టపోతే కాంగ్రెస్ భారీగా నష్టపోవాలి. కాంగ్రెస్ ఓట్లు నిలువునా చీలిపోవాలి. కానీ విచివూతంగా టీడీపీ కూడా నష్టపోయింది. టీడీపీ ఓట్లు కూడా జగన్ వైపు వెళ్లాయి. ఉప ఎన్నికలు జరిగిన ఈ 17నియోజకవర్గాల్లో 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీకి 30.3 శాతం ఓట్లు రాగా, ఈ ఉప ఎన్నికల్లో 24.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐదుచోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2009 ఎన్నికల్లో చిరంజీవి పీఆర్పీ పెట్టడం వల్ల నష్టపోయామని చంద్రబాబు చెబుతుంటారు. కానీ చిరంజీవి ఓట్లు కూడా టీడీపీకేమీ రాలేదు. ఉన్న ఓట్లనే కోల్పోయింది. అన్ని పార్టీల ఓట్లనూ చీల్చుకుని జగన్ బలవంతుడయ్యారు. ఆయనకు ఏకంగా 47.7 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్-ండు పార్టీలకు వచ్చినన్ని ఓట్లు ఆయన ఒక్కడికే వచ్చాయి. జగన్ ఈ విజయాలను నిలబెట్టుకుని, నిలకడగా రాజకీయాలు చేస్తే ఈ ఫలితాలు మున్ముందు సరికొత్త రాజకీయ సమీకరణలకు దారితీయడం తథ్యం.

[email protected]

396

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా