గోల్...సెల్ఫ్‌గోల్


Sat,May 26, 2012 12:06 AM

అవినీతికి కొత్త నిర్వచనాలు పరిచయం చేసినవాడు అమాయకత్వం ప్రదర్శిస్తుంటాడు. అధికారమే ఏకైక లక్ష్యంగా రాజకీయాలు మొదలుపెట్టినవాడు విలువలు, విధానాలను గురించి ఉపన్యాసాలు ఇస్తుంటాడు. అనతికాలంలోనే అంతస్తులు మార్చేసినవాడు ఇప్పుడు ప్రజల మనిషినని ప్రచారం చేస్తుంటాడు. స్వయంగా యుద్ధం మొదలు పెట్టినవాడు ఇప్పుడు తొండి జరుగుతోందని వాపోతున్నాడు. వాడెవడూ వీడెవడూ అని ధిక్కారస్వరాన్ని వినిపించినవాడు ఇప్పుడు వాడూ వీడూ కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తుంటాడు. అధికారాన్ని ఆటబొమ్మగా ఉపయోగించుకున్నవాడు ఇప్పుడు అదే ఆటబొమ్మను చూసి భయపడుతుంటాడు. జగన్ రాజశేఖర్‌డ్డికి కొనసాగింపు. రాజశేఖర్‌డ్డి పుణ్యాలకే కాదు, పాపాలకూ ఆయనే వారసుడు. పుణ్యాల సోపానంపై సింహాసనం ఎక్కాలనుకోవడం తప్పు కాదు, మధ్యలో పాపాల పాములూ మింగేయవచ్చు. ఇది జగన్ మోహన్‌డ్డి సృష్టించుకున్న సమస్య. ఆయనే అనుభవించవలసిన సమస్య. ఆయనే పరిష్కరించుకోవలసిన సమస్య. అధికార పీఠాలను సవాలు చేయనంతవరకు మీరు ఎంతకొల్లగొట్టినా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. ఎన్ని గనులు, ఎన్ని వనరులు, ఎన్ని రాష్ట్రా ల్లో ఎంతమంది కార్పొరేట్లు కొల్లగొట్టలేదు. కానీ వాళ్లు సోనియాగాంధీని సవాలు చేయలేదు. కిరణ్‌కుమార్‌డ్డిని ఎదిరించలేదు. ప్రతిపక్షం మనుగడకు ముప్పుగా పరిణమించలేదు. జగన్ తప్పులూ చేశాడు, ఆ వెంటనే అధికారమూ ఆశించాడు. వ్యవస్థలు ఎలా ఊరుకుంటాయి?

ఇదో కొత్త చరిత్ర. అరుదైన సందర్భం. రాష్ట్రంలో తొలిసారి అధికారపక్షం, ప్రతిపక్షం ఒకే గొంతుతో మాట్లాడుతుంటాయి. కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు ఒకే లక్ష్యంతో మాట్లాడుతున్నాయి. కాం గ్రెస్ వ్యతిరేకత ను బాహాటంగా ప్రకటించుకున్న పత్రికలు, చానెళ్లు సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా రాతలుకోతలు చేస్తున్నాయి. ఒకటే తేడా. కిరణ్‌కుమార్‌డ్డి రాజశేఖర్‌డ్డిని పొగడుతూ జగన్‌ను తెగడుతున్నాడు. చంద్రబాబునాయుడు, పత్రికలు, చానెళ్లు రాజశేఖర్‌డ్డి, జగన్ వేర్వేరు కాదని తిట్టిపోస్తున్నాయి. ఒక మిత్రుడు పంపిన ఎస్‌ఎంఎస్ గురిం చి ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుందేమో-‘ఈరోజు ఒక ప్రధాన దిన పత్రిక 6వ పేజీలో జగన్ పేరును 50 సార్లు, 14వ పేజీలో 59 సార్లు, వైఎస్ పేరును 33 సార్లు-మొత్తంగా అన్ని పేజీలలో కలిపి ఇద్దరి పేర్లూ 181 సార్లు రాశారు. ఆ పత్రికల జగన్నామస్మరణకు జోహార్లు’ అని అందులో ఉంది. ఇది అక్కసు తో చేస్తున్నా రా? నీతికోసం చేస్తున్నారా? అక్కసు ఎక్కువయితే నీతి కనిపించదు. ఇది భావసారూప్యత కాదు. లక్ష్య సారూప్యత. ఆపరేషన్ డిమాలిష్ జగన్‌లో భాగం! అక్కసుతో చేసే పని ప్రతికూల ఫలితాలకూ దారితీయవచ్చు, జగన్‌పై మరింత సానుభూతి పెరగనూ వచ్చు. ఇప్పుడు మైసూరాడ్డి, ఆళ్ల నాని, రేపు మరికొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు జగన్ బాట పట్టనూ వచ్చు. జగన్ చట్టం ముందు ఓడిపో యి, రాజకీయంగా గెలవనూ వచ్చు.

లక్ష్యాన్ని కొట్టడానికి ఉండాల్సింది కసి కాదు. గురి. కసితో కొట్టే బాణాలు లక్ష్యా న్ని చేరవు. నిజాయితీలేని యుద్ధం ఫలితాలు సాధించదు. అవినీతి గొంగడిలో కూర్చుని నీతిబోధలు చేస్తే ఎవరూ వినిపించుకోరు. కోర్టు సాక్షిగా మద్యం కుంభకోణం కేస్ డైరీలో నిందితునిగా స్థానం సంపాదించుకున్న మంత్రిని పక్కన కూర్చోబెట్టుకుని, జగన్ అవినీతిని ఉతకాలని చూస్తే లాభం లేదు. సెలెక్టివ్ విక్టిమైజేషన్, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ అధికారంలో ఉన్న నాయకులకు సాధ్యం కావచ్చు. చేతిలో అధికారం ఉంటే దర్యాప్తు అధికారులను అర్ధరాత్రి బదిలీ చేయవచ్చు. ఒక పెద్దగీతను పక్కన గీసి అప్పటికే ఉన్నగీతను చిన్నదిగా చూపించవచ్చు. కానీ కోర్టులకు, ప్రజలకు కష్టం. వాళ్ల సంగతేమిటి? వీళ్ల సంగతేమిటి? అని కోర్టులు, ప్రజలు వెంటపడి అడుగుతాయి. ఒకడిని తీసుకొచ్చి వీడే దోషి అంటే అంగీకరించవు. మిగతావాళ్ల సంగతి తేల్చండి అంటాయి. చివరకు వాళ్ల తీర్పులు వాళ్లకు ఉంటాయి. కిరణ్ బాణాలు పనిచేయకపోవడానికి కారణం అదే

సిబిఐలో, కోర్టుల్లో ఆట మొదలు పెట్టడం వరకే మన పని. ముగించడం మన చేతి లో ఉండదు. ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ తేలుతుందో, ఎక్కడ అంతమవుతుం దో లక్ష్మీనారాయణుడు కూడా చెప్పలేడు. సిబిఐ శిఖరాన్ని చూపిస్తే కోర్టు కొండను తవ్వమంటోంది. సిబిఐ తోకను మాత్రమే చూపించాలనుకోవచ్చు, కోర్టు తలకాయను కూడా చూపించమంటుంది. సిబిఐ సెలెక్టివ్‌గా ఉండాలనుకోవచ్చు, కోర్టు కలెక్టివ్‌గా దోషులను గుర్తించాలనుకుంటుంది. తన మన పర భేదం ఉండదు. అయ్యోపాపం అనడానికి ఏమీ మిగలదు. ఇది ఏసీబీ కాదు డీజీలను, డీఐజీలను మార్చేయడానికి, ఏమార్చేయడానికి. ఇక్కడ లోకల్ టాలెంట్ పనిచేయదు, సిఐతో సిబిఐపైన పిటిషన్ వేయించడానికి, ఆరోపణలు చేయించడానికి.
గోల్ కొట్టడం సంగతి దేవుడెరుగు....కాంగ్రెస్‌వాళ్లు సెల్ఫ్‌గోల్ చేసుకోవడంలో దిట్టలు. ‘అస్టైనంత మాత్రాన దోషి కాదు. ఆయనపై(మంవూతిపై) దోష నిరూపణ జరగలేదు. ఆయన తప్పనిసరిగా నిర్దోషిగా బయటికివస్తారు’ అని మోపిదేవి వెంకటరమణకు మద్దతుగా మంత్రులు సెలవిచ్చారు. ఇదే సూత్రం జగన్‌తో సహా నిందితులందరికీ వర్తిస్తుంది కదా? మంత్రి ఎటువంటి ప్రతిఫలం పొందలేదని చెబుతున్నారు. కానీ వాన్‌పిక్‌కు వ్యతిరేక పోరాటం చేసినవారిపై మోపిదేవి చేసిన ఆరోపణ లు, దాడులు అందరూ మరిచిపోయి ఉండవచ్చు. కానీ నాకైతే గుర్తున్నాయి. వాన్‌పిక్ కోసం సముద్రతీరాన్ని, భూములను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు, స్థానికులు చేస్తున్న ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణపై దుర్మార్గమైన ఆరోపణలు చేశారు మోపిదేవి. వాన్‌పిక్ వ్యతిరేకులు అభివృద్ధి నిరోధకులని తిట్టిపోశారు. అరెస్టులు చేయించారు. అప్పుడం తా ఏ ప్రతిఫలం లేకుండానే, అమాయకంగానే ఆయన ఆ భారమంతా మోశారా?

తోడేళ్లను పట్టుకోవడానికి మేకలను బలి వేస్తారు. పెద్ద చేపను పట్టడానికి చిన్న చేపను ఎరవేస్తారు. మోపిదేవి ఎంత ప్రతిఫలం పొందాడు? ఎంత తీవ్రమైన తప్పు చేశారన్నది ముఖ్యం కాదు. జగన్‌పై చేస్తున్న దర్యాప్తునకు జస్టిఫికేషన్ రావాలంటే, జగన్‌ను బోనులోకి తీసుకు వస్తే జరిగే పరిణామాలను ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి ఒక మోరల్ పొజిషన్ అవసరం. తాము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తున్నామని బిల్డప్ ఇవ్వడం అవసరం. అందుకు ఒక బలిపశువు కావాలి. అతడు బలహీనుడు కావాలి. పెద్దగా ఫాలోయింగ్ లేనివాడు కావాలి. కులసమీకరణల్లో అధికార కులాలకు చెందనివాడు కావాలి. ప్రభుత్వానికి ఇక్కట్లు తేనివాడు కావాలి. ప్రభుత్వంలో ఏకైక మత్స్యకారుడు మోపిదేవి. ప్రాజెక్టులు పొంది ప్రతిఫలం చేకూర్చింది వాన్‌పిక్ ఒక్క డజన్ల కొద్దీ కంపెనీలు ఉన్నా యి. కానీ సిబిఐ వాన్‌పిక్‌నే ముందు గా ముందేసుకుంది.


చంద్రబాబు తిట్టే కొద్దీ జగన్ పెరిగిపోతున్నాడా? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. అగ్ని పరీక్షకు నిలబడి పునీతుడైనవాడు నీతిబోధలు చేస్తే జనం వినిపించుకుంటారు. చేసిన తప్పులు ఒప్పుకున్నవాడినీ క్షమిస్తారు. కానీ అన్ని దర్యాప్తులు, విచారణలను తప్పించుకున్నవాడిని ఎలా నమ్మడం? ఏ పరీక్షకూ నిలబడని మనిషిని ఎలా పరిశుద్ధుడని విశ్వసించడం? చంద్రబాబునాయుడుతో ఇదే సమస్య. చంద్రబాబునాయుడుపై విచారణలన్నీ స్టేలతో ఆగిపోయినవే తప్ప, నిర్దోషిత్వ తీర్పులతో ముగిసినవి కాదు. అందుకే ఆయ న ఎంత గట్టిగా మాట్లాడినా, ఎన్ని వాడి బాణాలు విసిరినా పనిచేయడం లేదు. పైగా ఆయన సేనలు బలహీనపడిపోతున్నాయి.భవిష్యత్తుపై ఆశలు సన్నగిలుతున్నాయి. యో ధులు చెదరిపోతున్నారు. మైసూరాడ్డి బాటవేశారు. ఆ బాటలో ఎంతమంది నడుస్తారో! నిన్నమొన్నటి దాకా జగన్‌పై ఆరోపణలు గుప్పించిన మైసూ రా, ఇప్పుడు జగన్ పంచన ఎలా చేరతారని టీడీపీ వకీళ్లు వాదిస్తున్నారు. 2003లో చంద్రబాబునాయుడుపై ‘బిగ్‌బాస్’ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మైసూరానే. కానీ ఆ తర్వాత కొద్దికాలానికే చంద్రబాబునాయుడు మైసూరాను పచ్చకండువా కప్పి సాదరంగా పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు తప్పయితే, ఇప్పుడూ తప్పే! అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తప్పొప్పులు మారతాయి.


కాయ పండడానికి, రాలడానికి కొంత సమయం పడుతుంది. గుడ్డుపొదిగి పిల్లలు బయటికి రావడానికి సమయం తప్పనిసరి. వ్యక్తి ఒక సమూహంగా ఎదగడానికి, సామాన్యుడు అసామాన్యుడు కావడానికి పరిణతి కావాలి. లక్ష్మీదేవి వరించినంత తేలికగా అధికారం వరించదు. ధనాన్ని అడ్డదారిలో దొడ్డిదారిలో సంపాదించే వీలుండవచ్చు. ప్రజాస్వామ్యం లో అధికారాన్ని అమాంతంగా సంపాదించడం కష్టం. చాలా కష్టపడాలి. కొంచెం ఓపిక పట్టాలి.డబ్బులు ఉన్నంతమావూతాన డైరెక్టు టిక్కెట్లు దొరకవు. కోరిక ఉన్నంత మాత్రాన అనుకున్నంతనే అధికారసౌధాల ద్వారాలు తెరుచుకోవు. జగన్ డైరెక్టు దారి వేసుకోవాలనుకున్నారు. అది ఇన్ని మలుపులు తిప్పుతోంది. ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో తెలియదు.


ఒకటి మాత్రం నిజం! ప్రకృతిలో ఒక లయ, నియమం ఉన్నాయేమో అనిపిస్తుం ది. ఆకాశాన్ని ధిక్కరించినవాడిని ఎప్పుడో ఒకప్పుడు పిడుగులు ముట్టడిస్తాయి. భూమిని చెరబట్టినవాడిని ప్రకృతి దండిస్తూనే ఉంది. తానే శాశ్వతమని విర్రవీగినవాడిని కాలపాశం వాటేసుకుని ఎటో తీసుకెళ్లిపోతుంది. అన్ని కాలాలనూ కబ్జా పెట్టినవాడిని ఏదో ఒక కాలం ధిక్కరించి వెక్కిరిస్తూనే ఉంది. పాపమంటూ చేశాక అది ఎప్పుడో ఒకప్పుడు కాటువేసే తీరుతుంది. మనం వాటికి సాక్షులం!

katta[email protected]

335

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా