నైతిక విధ్వంసకాండ


Sat,May 12, 2012 06:21 PM

రాష్ట్రంలో నీతి ఒక పగిలిన అద్దం. విచలిత దృశ్యం. ఒక విభ్రమ. నైతి క విధ్వంసం పరిపూర్ణమైన చోట నీతులు వేయినాల్కలు చాస్తా యి. ఏది నీతి? ఏది అవినీతి? ఏది పత్రికా స్వేచ్ఛ? ఏది అవినీతి దర్యాప్తు? ఒకరికి నీతి అయినది మరొకరికి అవినీతి అవుతుంది. ఒకరికి పత్రికాస్వేచ్ఛ అయినది మరొకిరికి అవినీతి దర్యాప్తు అవుతుంది. ప్రతి సంఘటనా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్నది ప్రయోజనాల సంఘర్షణ. అధికారంకోసం సాగుతున్న యుద్ధం. ఈ సంఘర్షణలో, ఈ యుద్ధంలో పత్రికాస్వేచ్ఛ కూడా ఒక ఆయుధమే. పత్రికలు, చానెళ్లు కూడా సాధనాలే. ఇక ఎవరూ ఇంకా వేషాలు వేయలేరు. విలువల మహోద్ధారకు ల్లా నటించలేరు. పత్తిత్తులమని, పవివూతులమని చెప్పుకోలేరు. సాక్షి దినపవూతిక, చానెల్‌ల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం పత్రికాస్వేచ్ఛపై దాడి అవుతుందా కాదా? కొందరికి దాడి అవుతుంది. ఇంకొందరికి దర్యాప్తు అవుతుంది. ఇలా కనిపించడానికి కారణం- చూసే వారికి వేర్వేరు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. వేర్వేరు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. పత్రికలు, చానె ళ్లు తమ రాజకీయ లక్ష్యాలను ఎప్పుడూ దాచుకోలేదు. ప్రయోజనాలు, లక్ష్యాల దృష్టితోనే చుట్టూ జరిగే పరిణామాలను విశ్లేషిస్తుంటాయి. పత్రికాస్వేచ్ఛ సాపేక్షమైనది. అందిరికీ ఒకేవిధంగా కనిపించదు. అందరికోసం, అన్ని వార్తలు ఇచ్చే నిష్ఠాగరిష్టత కలిగి, ఇష్టమైన పత్రికలు లేవు.

రాజకీయ అభివూపాయాలకు దూరంగా పత్రికను, చానెల్‌ను నిర్వహించాలని చూసే జర్నలిస్టులు కూడా ఇప్పుడు బహకొద్దిమంది. అటువంటి వారు మనుగడ సాగించడం కూడా కష్టంగా ఉంది.ఎక్కడ వెలితి ఉంటే అక్కడ ఒక పత్రిక, ఒక చానెల్ పుట్టుకొస్తున్నది. ఒక విధంగా ఇది మంచి పరిణామమే.పత్రికలు పెట్టినవాళ్లంతా పుట్టుకతో పత్రికాధిపతులు కాదు. జర్నలిస్టులు పెట్టుబడు లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసి పత్రికల్లో చేరరు. ఏదో ఒకటి చేసి, ఎవరో ఒకరిని ఒప్పించి పెట్టుబడులు తీసుకొచ్చి పత్రికలు పెడతారు. పత్రికాధిపతులు పరిశుద్ధులు, యోగులు అయి ఉండాలని అంటే అసలు పత్రికలే రావు.యజమానుల అభివూపాయాలను ప్రతిబింబిస్తూనే మనమూ కొన్ని అభివూపాయాలు చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంటుందన్న నమ్మకంతోనే జర్నలిస్టులంతా పత్రికల్లో చేరతారు. నూటికి నూరు పాళ్లు వారి కాండక్ట్ సర్టిఫికెట్ చూసి కాదు.‘ఒక చిరుద్యోగి రామోజీ ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?’,‘నిన్నమొన్నటిదాకా ఒక మామూలు విలేఖరి...అనతికాలంలోనే పత్రికాధిపతి ఎలా అయ్యారు?’, ‘2004 ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్నామని చెప్పిన రాజశేఖర్‌డ్డి ఆరేడేళ్లలో ఒక బలమైన ఆర్థికశక్తిగా ఎలా ఎదిగారు?’.... ఈ అన్ని ప్రశ్నల్లోనూ ధ్వనించే సందేహం ఒక్కటే. ఇదంతా నీతిమంతంగానే జరిగిందా అన్నదే ఆ సందేహం. ఈ సందేహాలు జర్నలిస్టులకున్నాయి. మామూలు ప్రజానీకానికి ఉన్నాయి. నీతిలో, అవినీతిలో డిగ్రీల తేడా ఉండవచ్చు.అయినా ఆ పత్రికలూ నడవడానికి అవేవీ ప్రతిబంధకాలు కాలేదు. కారాదు.

వార్తలపై, విశ్లేషణలపై గుత్తాధిపత్యం(మోనోపలి) ధ్వంసమై లక్ష భావాలు వర్ధిల్లాలి. అభివూపాయాలను, సమ్మతిని తయారుచేసే, మలిచే అధికారం కొద్ది మంది చేతుల్లో ఉండడం కంటే, ఎంత ఎక్కువ మంది చేతుల్లో ఉంటే అంత మంచిది. ప్రజలకు ఇష్టమైనది కొనుక్కుని చదివే స్వేచ్ఛ ఉంటుం ది. ఇష్టంలేని దానిని తిరస్కరించే అవకాశమూ ఉంటుంది. తమ అభివూపాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వేదికలు అనేకం అందుబాటులో ఉంటాయి. సాక్షిలో వచ్చే వార్తలు, అభివూపాయాలు జగన్‌ను సమర్థించేవే కావచ్చు, కానీ వాటి నీ తెలుసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలి. జగన్ ఆర్థిక నేరాలు వేరు, పత్రిక, చానెల్‌లు వేరు. ఆర్థిక నేరాలపై దర్యాప్తు, విచారణ పూర్తి చేసి, దోష నిరూపణ చేసి ఆయనను జైలులో పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండక్కర లేదు. కానీ పత్రిక,చానెల్‌ల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే మాత్రం అది ముమ్మాటికీ పత్రికాస్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలి. బ్యాంకు ఖాతాలు ఇప్పుడు ఏమాత్రం రహస్యం కాదు. నిరంతరం ఆర్‌బిఐ డేగకన్నుల్లో(స్కానర్)ఉంటాయి. ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్, ఇన్‌కంట్యాక్స్ వంటి విభాగాలకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటాయి. సిబిఐ కూడా ఏ రోజైనా ఆ ఖాతాలను చూ సే అవకాశం ఉంది. ఆ ఖాతాల్లోకి అక్రమంగా వచ్చి చేరిందన్న డబ్బు కూడా ఇప్పుడు వచ్చిందికాదు. ఆ డబ్బు ఎప్పుడో రావడమూ, పోవడమూ జరిగిపోయింది.

అటువంటప్పుడు ఖాతాలను స్తంభింపజేయడం ఏదో ఒక దురుద్దేశాన్ని సూచిస్తున్నదే తప్ప, సదుద్దేశాన్ని తెలియజేయదు. ఒకవేళ ఆ ఖాతాలపై జగన్ పెత్తనాన్ని నిలువరించాలనుకున్నప్పుడు కూడా సత్యం కుంభకోణంలో వ్యవహరించినట్టుగా, ఒక స్వతంత్ర అధికారికి ఆ ఖాతాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని కోర్టు ద్వారా ఉత్తర్వులు పొంది ఉండవచ్చు. అటువంటి ఆలోచనలేవీ చేయకుండా ఖాతాలను స్తంభింపజేయడం, ఆ మరుసటి రోజే ప్రభుత్వం ఆ పత్రికకు ప్రకటన లు ఆపివేయడం..పత్రికా స్వేచ్ఛపై దాడి కాక ఏమవుతుంది?ఇటువంటి దాడి ఈనాడుపై జరిగినా, మరో పత్రికపై జరిగినా ప్రతిఘటించి తీరవలసిందే. ఏ పత్రికకయినా ప్రత్యేక రాజకీయ అభివూపాయాలు ఉండవచ్చు.అయినా అది కూడా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉండాల్సిందే.

పత్రికలు తమ రాజకీయ ఎజెండాలను ఎప్పుడూ దాచుకోలేదు. ఈనా డు ఏనాడూ తన రాజకీయ స్వభావాన్ని దాచుకోలేదు. తెలుగుదేశం పుట్టుక, ఎదుగుదల, పతనాలన్నింటిలోనూ ఆ పత్రిక పాత్ర ఉంది. కాంగ్రెస్ మాత్ర మే ఉన్నకాలంలో ఆ పత్రిక కొన్ని గ్రూపులను వెనుకేసుకొచ్చింది. ఇంకొన్ని గ్రూపులను టార్గెట్ చేసి వారిని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసిం ది. ఈనాడు వెంగళరావును ఎంతగా ప్రేమించిందో, చెన్నాడ్డిని ఎంతగా వెంటాడిందో ఆకాలంలో ఆ పత్రికను తీసి చూస్తే స్పష్టంగానే అర్థమవుతుం ది. ఆ తర్వాత ఎన్‌టిఆర్‌ను తీసుకురావడంలోనూ, ఆయనను పెంచడంలోనూ, కాపాడడంలోనూ ఈనాడు ఏనాడూ రహస్యంగా వ్యవహరించలేదు. ఉపన్యాసాలు రాసివ్వడం మొదలు అభ్యర్థుల ఎంపిక, పత్రికలో అసాధారణ కవరేజీ ఇవ్వడం వరకు తన సర్వశక్తులనూ ఎన్‌టిఆర్‌ను నిలబెట్టడానికి ఒడ్డింది.రామోజీరావు తన కాంగ్రెస్ వ్యతిరేకతను ఎప్పుడూ రహస్యంగా ఉంచుకోలేదు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన స్వయం గా ఈ విషయం పేర్కొన్నారు. అందువల్ల ఆయన ఎవరి అవినీతిని చూస్తా రో, ఎవరి అవినీతిని కన్వీనియంట్‌గా చూసీ చూడనట్టుగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్‌డ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఆయనలోని అవినీతి మచ్చలను చూడడం మొదలు పెట్టారు, తొమ్మిదేళ్లు పరిపాలించిన చంద్రబాబులో మాత్రం ఏనాడూ మచ్చలను కనిపెట్టే ప్రయత్నం చేయలేదు. మహా రాయాల్సివస్తే చంద్రబాబు మంచివాడే, కానీ ఆయన చుట్టూ ఉన్నవారే వెధవలు అని రాసేవారు తప్ప, ఆయనమీద వచ్చిన ఆరోపణలేవీ ఈనాడులో పతాక శీర్షికలు కాలేదు. ఒకటి కాదు వంద పరిణామా లు చెప్పవచ్చు.194లో ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడం అప్రజాస్వామికం అయింది.

ఈనాడు పెద్ద ఉద్యమమే చేసింది.1995లో అదే ఎన్‌టిఆర్‌ను దించితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అయింది. నాదెండ్ల చేసింది నేరమయింది, చంద్రబాబు చేసింది ఉద్ధరణ అయింది. అప్పుడు ఈనాడు ఏమి రాసినా చెల్లింది. చంద్రబాబు అధికారంలోకి రావడం ఈనాడుకు వాంఛనీయ పరిణామం. అది ఆయన ఫిలాసఫీ. రామోజీ పత్రికా స్వేచ్ఛ. ఆయనను ఇష్టపడేవారి పత్రికా స్వేచ్ఛ.

ఈనాడును అనుసరించే ఇతర పత్రికల విషయమూ అంతే. బాబు రావా లి. మిగతా అందరూ పోవాలి. రెండో పత్రికాధిపతి కూడా తన ఆరాటాన్ని పాపం దాచుకోలేదు.‘తెలంగాణలో ఓడిపోయినప్పటికీ తెలుగుదేశం ఈ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంది. 2010 ఉపఎన్నికల్లో(12 నియోజకవర్గాల ఉపఎన్నికల్లో)ఆపార్టీకి ఏడున్నర శాతం ఓట్లు వస్తే ఇప్పుడు(ఆరు నియోజకవర్గాల ఉపఎన్నికల్లో) 12 శాతం పెరిగి 20 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పంచముఖి పోటీలు జరుగుతాయి. 25 శాతం ఓట్లు ఎవరికి వస్తాయో వారినే విజయం వరిస్తుంది. చంద్రబాబు మరో ఐదు శాతం ఓట్లు సాధించగలిగితే అధికారంలోకి రాగలరు.’’ అని తన కాలమ్‌లో బాహాటంగానే పలికారు. అదేరోజు, అదే కాలమ్‌లో ‘‘ఇప్పుడు కోవూరులో జగన్‌కు వచ్చిన ఓట్లు 42 శాతమే. అంటే 60 శాతం మంది ప్రజలు జగన్‌ను వ్యతిరేకిస్తున్నారని అర్థమైంది. ఆరు నెలల్లో ఆ పార్టీ 25 శాతం ఓట్లను కోల్పోయింది’’ అని అదే పత్రికాధిపతి హెచ్చరించారు. 20 శాతం వచ్చినవాడికి అధికారాన్ని రాసివ్వాలని ఆరాటం. 40 శాతం వచ్చినవాడు నాశనమైపోతాడని శాపం. డిపాజిట్లు కోల్పోయినవారు, పంచె లు తడుపుకున్నవారు భవిష్యత్తులో బ్రహ్మాండం బద్దలుకొడతారని ఉవాచ. అన్ని సీట్లూ గెలిచి 45 శాతం ఓట్లు సంపాదించిన తెలంగాణవాదులు భవిష్యత్తు గురించి వణుకుతున్నారని,ఆందోళన చెందుతున్నారని రాతలు, కోత లు! చానెళ్లూ అంతే.తమ ప్రత్యర్థులకు సంబంధించి ‘గోరంతలను కొండంతలు చేయడం, తమకు ఇష్టమైనవారైతే, తమవారైతేవారు చేసిన ‘అవినీతి కొండలను, గోలకొండలను’ దాచడం ఒక నీతిగా చెలామణి అవుతున్నది.

ఏ పత్రికలూ లేనికాలంలో ఆ రెండు పత్రికలదే హవా, ఆ చానెళ్లదే రాజ్యం. వారు రాసిందే వార్త, వారు ప్రసారం చేసిందే విశ్లేషణ. అక్షరాలను రక్షణ కవచాలుగా చేసుకుని ఆ పత్రికలు, చానెళ్లు, ఆ పార్టీ చెలరేగిపోయాయి. దీనిని బద్దలుకొట్టడానికే రాజశేఖర్‌డ్డి సాక్షిని ప్రవేశపెట్టాడు. ఏ పత్రికా స్వేచ్ఛను అడ్డంపెట్టుకుని ఈనాడు, మరికొన్ని పత్రికలు, చానెళ్లు తమ రాజకీయ లక్ష్యాలను బతికిస్తున్నాయో కనిపెట్టి, అదే పత్రికా స్వేచ్ఛను సాధనం గా చేసుకోవాలనుకున్నాడు. అప్పటిదాకా ఈనాడు, ఇతరపత్రికలు, చానెళ్లు తొడుక్కున్న నీతి ముసుగులను తొలగించి నగ్నంగా నిలబెట్టాడు. అదీ నీతి కాదు, ఇదీ నీతికాదు, అసలు ఏదీ నీతికాదు...అన్న ఒక నైతిక విధ్వంసకాండను పూర్తి చేశారు. అధికారం కోసం జరిగే యుద్ధంలో నీతి ఉండదని గెలుపే ముఖ్యమని చంద్రబాబు రుచి చూపిస్తే, రాజశేఖర్‌డ్డి దానిని పరాకాష్ఠకు తీసుకెళ్లారు. ఒకరు మొదలుపెట్టారు, మరొకరు పూర్తి చేశారు. మీడియాపై ఒక కొత్త చూపు మొదలైంది అప్పుడే. ఒక్కరాజకీయాధిపత్యం విషయంలోనే కాదు. తెలంగాణ విషయంలోనూ ఈ పత్రికలు, ఈ నేతలదీ ఇదే తంతు. తెలంగాణవాదాన్ని ఎగతాళి చేయడానికి, కించపర్చడానికి, దెబ్బకొట్టడానికి చేయని ప్రయత్నం లేదు. పైకి వేషాలు వేయవచ్చు. తెలంగాణ మద్దతుదారులుగా నటించవచ్చు. కానీ మోకా వచ్చినప్పుడల్లా తెలంగాణవాదాన్ని దెబ్బకొ ఈ పత్రికలు,చానెళ్లు చేసిన ప్రయత్నాలు అందరికీ అర్థమవుతూనే ఉన్నాయి. తెలంగాణ రాకూడదు. వచ్చినా తెలుగుదేశం పోకూడదు. ఆంధ్రవూపదేశ్ కొనసాగాలి.అందులో బాబుగారే వర్ధిల్లాలి. రాజశేఖర్‌డ్డీ ఇదే పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన చేయని ద్రోహం, తీయని దెబ్బ లేదు. కానీ వ్యక్తులకంటే, రాజకీయాలకంటే వాదం బలమైనది. అందుకే అది అన్ని పరీక్షలకు నిలబడి, కలబడి గెలిచింది.

అక్కడ సీమాంవూధలో జగన్‌మోహన్‌డ్డి సొంత పార్టీ పెట్టి అసలు సమీకరణాలే(ఈక్వేషన్సే) మార్చేశారు. జగన్‌మోహన్‌డ్డి అధికారంకోసం ఆబగా ప్రయత్నించకుండా ఉండి ఉంటే, అధిష్ఠానాన్ని సవాలు చేయకుండా ఉండి ఉంటే, సొంత రాజకీయపార్టీ పెట్టకపోయి ఉంటే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రాణ సంకటంగా మారకుండా ఉండి ఉంటే, ఒక సామాజిక వర్గం రాజకీయ అధికారానికి ముప్పుగా పరిణమించకుండా ఉండిఉంటే ఇవ్వాళ కేవీపీ రామచంవూదరావులాగా హాయిగా, ప్రశాంతంగా,అనేక కార్యక్షికమాలకు అతిథిగా ఉండి ఉండేవారు. అధికారం కోసం అర్రులు చాచకపోతే అవినీతి కి ఆత్మవంటివాడు నిక్షేపంగా పార్లమెంటులో కాలక్షేపం చేసి ఉండవచ్చు. అధికారానికి విధేయుడుగా ఉంటే అవినీతి సూత్రధారులు దేశానికి మంత్రులుగా కూడ కొనసాగవచ్చు. ఎంత అవినీతికి పాల్పడినా వాడు మనవాడయితే చూసీ చూడనట్టు వదిలేయవచ్చు. సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. సజెస్టివ్ ఇంటరాగేషన్. ప్రయోజనాల సంఘర్షణ, అధికారం కోసం జరిగే యుద్ధం ముదిరిపాకాపడుతున్నది. పాపం-ఈ యుద్ధసీనులో కాంగ్రెస్ ఉండదు. ఎందుకంటే వారికి పత్రిక లేదు. భవిష్యత్తు మీద, ప్రయోజనాల మీద పెద్ద గా శ్రద్ధా లేదు. తన్నుకోవడంలోనే వారి కాలమంతా గడచిపోతున్నది. కాంగ్రెస్‌ను చెడగొట్టవలసింది ఏమీ లేదు. దాని అంతం అదే చూసుకుంటున్నది. ఇక మిగిలింది, బలమైన శక్తిగా ముందుకు వస్తున్నది జగన్‌మోహన్‌డ్డి. అందుకే టీడీపీ కానీ, ఆ రెండు పత్రికలు కానీ జగన్‌ను చూసి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. భవిష్యత్తులో తమ ప్రయోజనాలకు, తమ అధికారానికి జగన్ నుంచి ఉన్న ముప్పు, కాంగ్రెస్ నుంచి లేదని వారు భావిస్తున్నారు.

విషాదమేమంటే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఒకేరకంగా మాట్లాడుతున్నాయి. 2009లోనే చిరంజీవి కారణంగా దారుణంగా దెబ్బతిన్నామని, 2014లో కూడా జగన్ వల్ల సీమాంవూధలో,టిఆస్ వల్ల తెలంగాణలో దెబ్బతింటే ఇక ఆ తర్వాత పార్టీని బతికించడం కష్టమని, తమ సామాజికవర్గం ప్రయోజనాలను కాపాడుకోవడం కష్టమని తెలుగుదేశం, ఆరెండు పత్రికలు భావిస్తున్నాయి. అందుకే టీడీపీ,ఆ రెండు పత్రికలు జగన్‌ను, టిఆరెస్‌ను ధ్వంసం చేయడానికి చేయని్ర పయత్నం లేదు. ఒక పార్టీ ని ధ్వంసంచేసే నైతికశక్తిని తెలుగుదేశం ఎప్పుడో కోల్పోయింది. నీతి మంతు లు చెప్పే మాటలకు విలువ వుంటుంది. అవినీతిపరులు మంచి మాటలు చెప్పినా ఎవరూ వినిపించుకోరు. ఏ విలువలకూ కట్టుబడని వారు, ఏ న్యాయపరీక్షలకూ నిలబడనివారు, ఏదర్యాప్తులనూ ముందుకు సాగనివ్వనివారు ఇవ్వాళ ఎంతగోల చేసినా ఎవరు నమ్ముతారు?

[email protected]

326

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా