రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు


Sat,October 6, 2012 04:19 PM

కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇచ్చిన 4.5 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగరీత్యా చెల్లవని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చారివూతాత్మకమైన తీర్పు చెప్పిం ది. రిజర్వేషన్లు ఇచ్చే వర్గాలకు ఉండవలసిన లక్షణాలు, పారామీట ర్స్ మైనారిటీలకు లేవని ఫుల్ బెంచ్ తీర్పు చెప్పింది. అలాగే మతపరమైన రిజర్వేషన్లు చెల్లవన్నది. ఈ తీర్పుపై ప్రభుత్వం స్టే కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు మైనారిటీ వర్గాల నేతలు ఈ కులాల్లో పేదవారున్నార ని, రిజర్వేషన్లు అవసరమని అంటున్నారు. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ల లక్ష్యాన్ని, రాజ్యాంగస్ఫూర్తిని అర్థం చేసుకోవడం లేదని బీసీలు విమర్శిస్తున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగంలో స్థానం లేదని అంటున్నారు. పైగా మస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్టు, సిక్కులు, జోరాష్ట్రియన్లలను హోల్‌సేల్‌గా కలపడంలో శాస్త్రీయత లేదు. ఈ మతాల్లో ఉన్న కొంత మంది బీదలను కలిపితే అర్థం ఉంటుంది. ప్రతి కులం, మతంలో పేదవారున్నారు. ఇందులో బీసీలు, మైనారిటీలలోనే కాదు, అగ్రకులాలైన బ్రాహ్మణ, రెడ్డి, వైశ్యులు, కాపులలో కూడా తినడానికి తిం డి లేని పేదలున్నారు. వారు రిజర్వేషన్లు అడగడం లేదు. పేదరికాన్ని నిర్మూలించే ఆర్థికపరమైన రాయితీలు, సబ్సిడీ లు, స్వయం ఉపాధి పథకాలు, ఉద్యోగాల భర్తీ తదితర ఆర్థి క ప్యాకేజీలు అడుగుతున్నారు. కాబట్టి రిజర్వేషన్ల లక్ష్యం, స్ఫూర్తిని పాజిటివ్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని బీసీలు వాదిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం రాకీయంగా లబ్ధి పొందడానికి, మైనారిటీల ఓట్లను కొల్లగొట్టడానికి ‘రిజర్వేషన్ల’ను పావుగా వాడుకుంటున్నది. దీనికి ప్రజలు బలైపోతున్నారు. రిజర్వేషన్లు పెట్టడానికి సిద్ధాంత ప్రాతిపదికలు ఉన్నాయి.1) సాంఘిక వివక్ష-సామాజిక అసమానతలను నిర్మూలించడం. 2) విద్యా, ఉద్యోగ, పాలనా రంగాల్లో కనీస ప్రాతినిధ్యంలేని కులాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడం. 3) పేద కులాల వారికి పాలనలో భాగస్వామ్యం కల్పిస్తే ఆ వర్గాల వారి సమస్యలను పట్టించుకుంటారని రిజర్వేషన్లు కల్పించారు.
రిజర్వేషన్ల సిద్ధాంతానికి పునాది సామాజిక వివక్ష, సాంఘిక వెనుకబాటుతనమే కాని ఆర్థిక వెనుకబాటుతనం కాదు. ఈ విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ సిద్ధాంత స్ఫూర్తిని రాజ్యాంగం ప్రకారం నియమించిన రెండు జాతీయ కమిషన్లు మండల్, కాకా కలేల్కర్ కమిషన్లు తమ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నాయి. ఇవే గాక వివిధ రాష్ట్రాల్లో బీసీ కమిషన్లను నియమించారు. ఏ ఒక్క కమిషన్ కూడా ఆర్థిక వెనుకబాటును సిఫార్సు చేయలేదు. మండల్ కమిషన్ కేసుకు ముందు అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు ఉండాలని తీర్పులు చెప్పాయి.

భారతీయ సమాజంలో కులాన్ని, కుల వివక్షను, సాంఘిక అసమానతలను ఆర్థి క కోణంలో చూడరాదు. సామాజిక వివక్ష వేరు, ఆర్థికంగా వెనుకబడి ఉండడం వేరు. బీసీలకు ప్రభుత్వ యంత్రాంగంలో రిజర్వేషన్లు కావాలని కోరడం కేవలం ఆ పదవులు లభించిన వ్యక్తులు అధికారం, హోదా అనుభవించడానికి కాదు. పాలనలోఆయా వర్గాలకు భాగస్వామ్యం కోసమే. ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేదలకు అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్నది. వీటి ద్వారానే ఈ కులాలు అభివృద్ధి చెందలేవు. ఈ కులాల అభివృద్ధి విద్యా, ఉద్యోగ, పాలన, రాజకీయాల్లో ప్రాతిని ధ్యం ద్వారా మాత్రమే సంపూర్ణంగా జరుగుతుంది. అధికారం ద్వారా బీసీల సాంఘిక హోదా పెరుగుతుంది. ప్రస్తుత సామాజిక, ఆర్థిక వ్యవస్థ బలహీన వర్గాలకు వ్యతిరేకంగా రూపొందించబడింది. దీన్ని సంస్కరించాలంటే బీసీలకు చట్టసభల్లో తగిన ప్రాతినిథ్యం లభిస్తేనే అది సాధ్యమవుతుంది. అప్పుడే నిరంతరం ఆర్థిక, సామాజిక వివక్షతో కొట్టుమిట్టాడుతున్న దీనులకు సామాజిక న్యాయం జరుగుతుంది.

బీసీలకు పాలనలో జనాభా ప్రకారం న్యాయమైన వాటా దక్కిననాడే ఈ వర్గా లు సాంఘిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఆకలి, పేదరికం బాధలు తెలిసినవారు, అనుభవించిన వారు అధికారంలోకి వస్తే ఈ బాధలు తీరుతాయి. అంతవరకు సమాజంలో మౌలికమైన మా ర్పు రాదు. ప్రజల సాంఘిక, ఆర్థిక, మౌలిక జీవన విధానంపై సమగ్ర అవగాహ న లేనివారు బడుగు, బలహీన వర్గాల వారి బాధ లు తీర్చలేరు. వారి సమస్యలను అర్థం చేసుకోలేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టి పద్దెనిమిదేళ్లు కావస్తున్నది. అలాగే కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేన్లు పెట్టి ఆరేళ్లు కూడా పూర్తికాలేదు. ఇప్పుడు ఈ వర్గాల రిజర్వేషన్లుకు గండి కొట్టాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బీసీ ఉద్యోగుల శాతం 6.8 శాతమే ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నా యి. 54 శాతం జనాభా గల బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంత తక్కువ శాతం ఉందంటే ఎంత అన్యా యం జరుగుతున్నదో ఇది ఉదాహరణ.
రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 94 సార్లు సవరించారు. కానీ దేశంలోని 65 కోట్ల మంది బీసీల అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభివృద్ధిని కాలరాస్తున్నాయి. ఒకవైపు ఓబీసీ రిజర్వేన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని పోరాటం చేస్తుంటే, కేంద్రం మాత్రం ఉన్న రిజర్వేషన్లకే ఎసరుపెడుతున్నది. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం లేదు. బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా ఉన్న రిజర్వేషన్లకు గండికొట్టి మైనారిటీలకు ఇస్తే సహించేది లేదు. ఎంతటి త్యాగాలకైనా ఓర్చి బీసీ రిజర్వేషన్లను రక్షించుకుంటాం.

-ఆర్ కృష్ణయ్య
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

35

KRISHNAIAH R

Published: Sun,February 15, 2015 12:09 AM

సమగ్ర బీసీ కమిషన్ కావాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముంద

Published: Sat,October 6, 2012 04:19 PM

బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో

Published: Sat,October 6, 2012 04:20 PM

బీసీ రిజర్వేషన్లకు ఎసరు!

రిజర్వేషన్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం సాగదీస్తున్నది. మైనారిటీ సబ్‌కోటాకు రాజ్యంగబద్ధత లేదని, సహజ న్యాయసూవూతాలకు విరుద్ధమని, మత ప్ర

Published: Sat,October 6, 2012 04:20 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలికేకలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె లక్ష కోట్ల బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు

Published: Fri,October 12, 2012 02:27 PM

ప్రభుత్వ తప్పులు, అభ్యర్థుల తిప్పలు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం జీవో నెం 3 జారీ చేసి, వెంటనే రద్దు

Published: Sat,October 6, 2012 04:21 PM

విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య

Published: Sat,October 6, 2012 04:21 PM

ఖాళీలు పెట్టెడు, ఇచ్చేది పిడికెడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది గతం కంటే ఒక అడుగు ముందుకు వేసే సా

Published: Sat,October 6, 2012 04:21 PM

క్రీమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఉద్యోగ నియామకాలలో క్రీమిలేయర్‌కు నిబంధన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాం

Published: Sat,October 6, 2012 04:22 PM

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్

Published: Sat,October 6, 2012 04:22 PM

సమన్యాయం పాటించకపోతే సమరమే!

కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రా

Published: Sat,October 6, 2012 04:22 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు

-ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీస్థాయి కోర్సులు చదివే విద్యార్థుల ప