ఆలోచించి ముందడుగు వేద్దాం..!


Sun,September 18, 2016 12:55 AM

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం, దుర్మార్గం, దుష్టత్వమే. అవి సభ్యసమాజం ఖండించవలసినవే. ప్రభుత్వం అలాంటి వాటికి ఒడిగట్టిన వారిని శిక్షించవలసిందే. చరిత్రలో అలాంటి వాటికి పూనుకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ మతస్తులు, ఆ మతస్తులు, ఈ కులస్తులు ఆ కులస్తు లు అని భేదం లేకుండా.చరిత్రలో సభ్య సమాజాలు ఏర్పడటానికి చాలాఏళ్లు పట్టింది, కొన్నిచోట్ల ఇంకా పడుతూనే ఉన్నది. సభ్య సమాజాలన్నవి అక్షరాస్యత ఎంత పెరిగితే, వినయవంతమైన, వికాసవంతమైన, వివేకవంతమైన విద్య ఎంత పెరిగితే అంత పెరుగుతాయి. కానీ అక్షరాస్యత పెరిగినంత మాత్రానా సభ్యత అదే నిష్పత్తిలో పెరుగుతుందని అనుకోకూడదు.

velchala
నాణ్యతలు పెరిగినంతగా విలువలు ఏనాడూ పెరుగవు. మహాకవి టి.ఎస్.ఎలియట్ తన వెస్ట్‌ల్యాం డ్ అనే దీర్ఘకవితలో. విద్య వేరు, చదువు వేరు అని అంటారు మహాకవి విశ్వనాథ సత్యనారాయణ. సభ్యత అన్నది ప్రధానంగా మనిషి నుంచి మానవత్వంగల మానవునిగా మారడానికి చెందింది. It pertains to being becoming civilsed and cultured.చదువడం వేరు తెలియడం వేరు అంటారు విశ్వనాథవారు. ప్రతి చదివినవాడు తెలిసిన వాడు కాడు, కాలేడు. ఎవడికి జ్ఞానం ధ్యానం వల్ల అబ్బుతుందో వాడే నిజమైన విద్యావంతుడవుతాడు. తక్కినవారందరూ విద్యార్థులు మాత్రమే అంటారు. అందుకనే మో విద్యలు పెరిగినంత సభ్యతలు పెరుగవు.

సభ్యత కావాలంటే విద్య నిజమైన విద్య కావాలి. అంటే అది నాణ్యతలతో పాటు విలువలను కూడా పెంచేది కావాలి. విద్య మంచిదా కాదా అన్నది తేల్చడానికి గీటురాయి విలువలతో కూడిన నాణ్యతల పెరుగుదల. విద్య ప్రధానమైన లక్ష్యం పురుషున్ని (స్త్రీని కూడా) పురుషార్థిని చేయడం. పురుషార్థి అన్న పదానికి అలా విస్తృతార్థం, విశేషణార్థం ఉన్నది సంస్కృతంలో, తెలుగులో కాని దురదృష్టవశాత్తు మనం మన విద్యాలయాల్లో నేడు పురుషార్థుల కన్నా ఎక్కువ అనేకానేక విధాలైన అర్థులను ఎక్కువ పెంపొందిస్తున్నాం.
అసలు సమాజం అంటేనే సభ్యత కలదని అర్థం. కానీ మనం దానిని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నాం. సభ్యత ఉన్నదానికి, లేనిదానికి కూడా. సమాజం అనే పదాన్ని లోకులు అను అర్థంలో కూడా వాడుతూ. సభ్యతకు ప్రధానంగా కావలసింది సహనం. సహనమంటే చేతకాక భరించడం కాదు, చేతనై కూడా భరించడం.
ఉదాహరణకు ఈ మధ్య తరచుగా జరుగుతున్న 17వ సెప్టెంబర్‌ను విమోచన రోజు అని అనాలా లేక విలీనం రోజు అని అనాలా అను విషయాన్ని తీసుకుందాం.

దీన్ని విమోచన దినంగా పరిగణిద్దామా లేక విలీన దినంగా పరిగణిద్దామా అనే దానిగురించి సావధానంగా ఆలోచిస్తే విలీన దినంగా పరిగణిస్తేనే మంచిదనిస్తున్నది. ఎందుకంటే విలీనమనే పదానికి ఏ పొలిటికల్, కమ్యూనల్ వాసనలు లేవు. దేశంలో మన రాష్ట్రం లాంటి విలీనమైన చిన్నా, పెద్దా రాష్ర్టాలు చాలా ఉన్నాయి. ఆ రాష్ర్టాలు ఇండియన్ యూనియన్‌లో ఏ నాడైతే విలీనమైనాయో ఆ రోజును విలీన రోజుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుకోవాలి కేం ద్రమే దానిని ఇంటిగ్రేషన్ డేగా ప్రకటించడం, సం యుక్తంగా నిర్వహించడం సమంజసంగా ఉంటుంది. అలాగాక, దానిని విమోచన దినంగా పాటిస్తే దానివల్ల కొంత రాజకీయ లభ్యత లభిస్తే లభించవచ్చు కాని, పాత పెంకలను తవ్వడం వల్ల మనం సభ్యత కోల్పోయిన వారమవుతాం.వేలు, వందల ఏండ్ల క్రితం మన ఈనాటి సమా జం ఇంకా అంతగా సభ్యత గలది కానపుడు ప్రతి దేశ చరిత్రలో చాలాచాలా ఘోరమైనవి, నీచమైనవి జరిగాయి. దాంట్లో ఏ అనుమానమూ లేదు. దానికి జాతి మొత్తం సిగ్గుపడాలి.

ఈ మధ్య ఈ విమోచన, విలీనం, విద్రోహం అనే పదాల గురించిన చర్చల మధ్య ఒకరెవరో నా పక్కన కూర్చున్నతడు నా వైపు తిరిగి నా చెవిలో గుసగుసగా మరి అలాగైతే మొన్నటి ఆంధ్రా తెలంగాణ విభజనను కూడా విమోచనమనే అనాలి గదా, దాన్ని విభజన దినంగా పాటిస్తే, దీన్నికూడా విలీన దినంగా పాటించాలి, దాన్ని విమోచన దినంగా పాటిస్తే దీన్ని కూడా విమోచన దినంగానే పాటించాలి కదా? అన్నాడు. అలాగైతే మనం మూడుసార్లు విమోచనదినాలు జరుపుకోవాల్సి ఉంటుంది. ఒకటి భారతదేశంలో ఒక భాగంగా బ్రిటిష్ వారి నుంచి విముక్తి చెం దినందుకు, మరొకటి హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం పరిపాలన నుంచి విముక్తి చెందినందుకు, ఇంకొకటి ఆంధ్రుల పాలన నుంచి విభజన ద్వారా విముక్తి చెం దినందుకు.

కనుక ఈ విషయంపై ఇలా అనేక చర్చల్లో చెలరేగి న వివిధ భేద, విభేదాల దృష్ట్యా, వాటి గురించి వీరూ వారూ అంటున్న దృష్ట్యా కాస్త ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయడమే మంచిది. ఆ ముందడుగు కేంద్ర ప్రభుత్వమే వేయడం ఇంకా మంచిది. అన్ని విలీనమైన రాష్ర్టాలకు వర్తించే పాలసీగా ఒక పాలసీని రూపొందించి సంయుక్తంగా దాన్ని నిర్వహించడం.

872

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు