‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ


Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు. ‘బ్రతుకమ్మ’ తెలంగాణ గ్రామీణ భాషలో ‘బతుకమ్మ’గా మారిందని అనుకోవచ్చు.
ప్రతి బతుకమ్మ పాటను తుదకు ‘ఉయ్యాలో’ అను పదంతో ముగిస్తారు. పాడేవారందరూ ఉయ్యాలలా కిందికీ మీదికీ వంగుతూ లేస్తూ పాడుతారు. జీవితం బతుకమ్మలా రంగుల సువాసనల పూల వలె అందం గా సువాసనగా ఉండాలని వివిధ రంగుల, వివిధ సువాసనల పూలతో బతుకమ్మలను పేరుస్తారు. కూరుస్తారు. ప్రధానంగా ఈ పండుగ పల్లెటూరి వారి పండుగ. పట్నాలలో నివసించే వారు కూడా చాలా వరకు ఎన్నో ఏళ్ల నుంచి పల్లెల నుంచి తరలివచ్చి స్థిరపడ్డవారే, కనుక వారు కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు.

ఈ పండుగ తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన పండుగ. పండు గ తుదిరోజున బతుకమ్మలన్నింటినీ దగ్గరి చెరువులోనో, కుంటలోనో, నదిలోనో ‘సాగనంపు’గా వేయడం ఆనవాయితీ. నదులు చాలా తక్కు వే గాక చాలా ప్రాంతాలకు సమీపంలో ఉండవు కనుక బతుకమ్మల ను చెర్లల్లో, కుంటల్లోనే ఎక్కువగా వేస్తారు .
కాస్త తీవ్రంగా ఆలోచిస్తే ఈ పండుగ సీమాంవూధలో లేక తెలంగాణలోనే ఉండడానికి కారణం సీమాంధ్ర భూములు చాలా వరకు సమతలమైన భూములు. ఎక్కువ నదీ జలాలతో సాగుబాటయ్యే భూములు కావడం, తెలంగాణవి నీటి కొరత గల భూములు కావ డం, వర్షంపై ఆధారపడే భూములు కావడమని అనిపిస్తుంది. అందువల్ల తెలంగాణ వారు ‘బతుకమ్మ’ను దేవతగా సృష్టించుకొని, ఆ దేవతను వారి చెరువులు, కుంటలు సమృద్ధిగా వర్షపాతం ద్వారా నింపమని మొక్కుతూ ఆడుతూ పాడుతూ ప్రార్థిస్తూ తుది రోజున బతుకమ్మలను నీటిలో నివేదనగా అర్పిస్తారేమోనని అనిపిస్తుంది. లేకపోతే నీటిలో వేయడానికి అట్టే అర్థం వేరే కన్పించడం లేదు.

అలాగే ఈ పండుగ అన్ని సంపదలతో పాటు వాన సంపదకు కూడా కూడలి అయిన లక్ష్మీ ,గౌరీదేవిల ద్వారా వానదేవున్ని ప్రార్థించే పండుగ అని అనిపిస్తోం ది. బతుకమ్మను లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా పూజిస్తారు కనుక, అది ప్రత్యేకంగా ఆడవారి పండుగ. అలా బతుకమ్మ పండుగకు తెలంగాణ చెరువు, కుంటల నీటికి ఒక అనుబంధం ఏర్పడిందని అనిపిస్తుంది. అలా తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ వారి బతుకులకు బతుకు దెరువులకు అమ్మ లాంటిదయింది.

ఈ బతుకమ్మ పాటల్లో ప్రేమ, బంధుత్వం, స్నేహం, భక్తి మున్నగు వాటికి చెందిన పంక్తులుంటాయి. వీటి అర్థాలన్నీ.. అందరూ కలిసి కలెగలుపుగా కలిసిమెలసి ఉండాలని, వారి వారి స్నేహాలు, ప్రేమ లు, బాంధవ్యాలు, సంబంధ అనుబంధాలు బాగుండాలని, భక్తికి, ముక్తికి చెందినవిగా ఉంటాయి. సామాజిక సంబంధా లు మెరుగుపరచేవిగా ఉంటాయి. వాటి భావాల్లోకి చొచ్చుకపోయి చూస్తే మనకు తెలుస్తుంది.
అందుకే ఈ పండుగను అంద రూ కలిసి కలుపుగోలుగా జరుపుకుంటారు ఏ కుల మత భేదాలులేకుండా. మరొక విధంగా చూస్తే ఈ పండుగ కూడా దసరాలాగా ‘శక్తి’కి చెందిన పండుగలా అనిపిస్తుంది. ఒకటి పురుష శక్తికి, రెండవది స్త్రీ శక్తికి. అందుకేనేమో ఈ పండుగలు రెండు వరుసగా వస్తాయి స్త్రీలు, పురుషులు ఉమ్మడిగా జరుపుకునే పండుగల్లా.

ఏది పురుషుల విజయమో అది స్త్రీల విజయం. ఏది స్త్రీల విజయమో అది పురుషుల విజయం కూడా. అందుకని ఇరువురూ విజయాలలో భాగస్వాములేనని చాటుటకు కాబోలు ‘దసరా’, ‘బతుకమ్మ’ పండుగలు జంటగా వస్తాయి.
‘బతుకమ్మ’ పండుగ జరుపుకున్నట్లే తెలంగాణలో అన్ని కులాలవారు అన్ని ఆర్థిక స్తోమతల వారూ ‘దసరా’ పండుగ జరుపుకుంటూ ఆడుతారు, పాడుతారు. ఈ రెండు పండుగలు తెలంగాణ పండుగలలోని అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైన పండుగలని చెప్పుకోవచ్చు.

-డాక్టర్ వెలిచాల కొండలరావు
తెలంగాణ కల్చరల్ ఫోరం కన్వీనర్

35

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు