సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం


Wed,January 8, 2014 12:43 AM

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైనా చేస్తే కొంతవరకు సహించవచ్చు. వారు అవిద్యావంతులు, అవివేకులని ఊర్కోవచ్చు. కానీ ఒక శాసనసభ్యుడు (శాసనసభ్యులు) అదే పనిచేస్తే ఎలా ఊర్కోగలం? అదీ మరెక్కడో కాదు అమాంతం అసెంబ్లీ హాల్లోనే ఆ పని చేస్తే? ‘తెలంగాణ బిల్లు’ ఎవరో పంపింది కాదు. సాక్షాత్తూ రాష్ట్రపతే, రాజ్యాంగాన్ని తూ.చ. తప్పక పాటించేవాడు కాపాడవల్సినవాడే, రాజ్యాంగం ప్రకారం రాజ్యాధిపతిగా ఎన్నుకోబడినవాడే పంపించింది. అతడు ‘రబ్బర్ స్టాంప్’లాంటివాడు కాడు కదా! దేనిపై పడితే దానిపై ఊరకే సంతకం చేయడానికి? ఆచి, తూచి సంతకం పెట్టవలసినవాడు, పెట్టేవాడు. తాను చేస్తున్నది రాజ్యాంగబద్ధమా కాదా అని బేరీజు వేసికొని, ‘లీగల్ ఎక్స్‌పర్ట్స్’ తో సమాలోచన చేసి అది రాజ్యాంగబద్ధమేనని‘కన్‌ఫర్మ్’ చేసుకున్నాకనే సంతకం చేసేవాడు.

ఆ తదుపరి అది రాజ్యాంగబద్ధమా కాదా అని చెప్పగలిగేది సుప్రీంకోర్టు ఒక్కటే. మరెవ్వరికీ ఆ అధికారం లేదు. దానిని వ్యతిరేకించే వారు చించివేయడం కాదు చేయవలసింది, సుప్రీంకోర్టుకు ‘అప్పీల్’చేసుకోవడం. అలాంటి రాష్ట్రపతి ‘రెఫర్’ చేసిన టీ-బిల్లును చింపివేయడం, అవమానపరచడం రాజ్యాంగాన్ని చించిపారవేసినట్లే, అవమానించినట్లే అవుతుంది. అలాంటి చర్యనుఅలాగే పరిగణించాలి. ఎందుకంటే, ఆ బిల్లు రాజ్యాంగం ప్రకా రం తయారు చేసిన బిల్లు కనుక. మొదట అది అలా జరగలేదని అసెంబ్లీలో చర్చించి తేల్చాలి. అలా చర్చించక పూర్వమే అది రాజ్యాంగ విరుద్ధమైనదని తేల్చడం, దానిని చించివేయడం రాజ్యాంగపరమైన నేరం కాక మరేమవుతుంది? అదీ ఎవరో ‘దారిలోపోయే దానయ్య’ చేస్తే క్షమించవచ్చు. ఏదో పోనీలే తెలిసీ తెలియని వారు చేశారులే అని వదిలేయవచ్చు. కాని సాక్షాత్తూ రాజ్యాంగపరంగా ఎన్నికైనవారు, రాజ్యాంగం పేరట ప్రమాణస్వీకారం చేసినవారు, అదీ సాక్షాత్తూ అసెంబ్లీలోనే చేస్తే దానిని రాజ్యాంగ విరుద్ధమైన నేరంగా పరిగణించాలా మరోవిధంగానా? అలాంటివాళ్లను ‘సస్పెండ్’ లేక ‘ఎక్స్‌పెల్’ చేయాలి కదా? వారిని తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండ ‘డిబార్’ చేయుటకు ఎలక్షన్ కమిషన్‌కు సిఫారస్ చేయాలి కదా? అలాగే అదేపనిగా బిల్లుపై చర్చ కొనసాగనీయని వారిని కూడ. అలాచేయడం ‘రాజద్రో హం’ అని నిన్ననే సుప్రీంకోర్టు జస్టిస్‌గా పదవీ విరమణ చేసిన సుభాష్‌చంవూదాడ్డి గారన్నారు. రాజద్రోహాన్ని చాలా సీరియస్ గా పరిగణించాలి. మునుపటి రోజుల్లో అలాంటి వారిపై చాలా తీవ్రమైన చర్య తీసుకోబడేది. మరి ఏదీ అలాంటి తీవ్రచర్య?

అంతపాటి సీరియస్ విషయాన్ని ఊరకే వదిలేసి, ఏదో ఒక రాజకీయ సమావేశంలో కాస్త ఉద్రేకంగా, ఉద్వేగంగా ‘ముఖ్యమంవూతి గారు హెలికాఫ్టర్‌లో కరీంనగరం వస్తే దానిని తుపాకితో పేల్చేస్తాం’ అని వేలును తుపాకిలాగా తమాషా కోసం ఎక్కుబెట్టి న ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై చట్టపరంగా చర్య తీసుకోవడం హాస్యాస్పదంగాదా? అలాగే శ్రీధర్‌బాబు పోర్ట్ ఫోలియో మార్చడం కూడా చౌకబారు రాజకీయంగా లేదా?
తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి సీమాంధ్ర పరిపాలకులు ‘శాసనాలను’, ‘నియమ నిబంధనలను’ వారివారికి ఒక విధంగా, తెలంగాణవారికి మరోవిధంగా అమలు చేస్తూనే ఉన్నా రు. ఎందరో విద్యార్థులను అలా చేసి చంపేశారు. జైలు పాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అలాంటి నేరాలే తెలంగాణ గడ్డపై, సీమాంవూధ గడ్డపై సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు చేస్తే వారిపట్ల ఎంతో ‘లీనియంట్’ గా చూసీ చూడనట్లున్నారు. ఇంకా ఉంటూనే ఉన్నారు.

పీవీ నరసింహారావు ప్రధానమంవూతిగా ఉన్న రోజుల్లో తరచూ ‘లా విల్ ఇట్స్ ఓన్ కోర్స్’ అని నేరాల గురించి నేరస్తుల గురించి అంటుండేవారు. దాని అర్థం ‘రూల్ ఆఫ్ లా’ అందరికీ ఒక్కటే, ఒకే విధంగా అమలు చేయాలి, చేయబడుతుందని. ఇదేనా మరి ఆ ‘రూల్ ఆఫ్ లా’? ఇదేనా మరి ‘లా’ఒకే విధంగా అమలు చేయడం? ఇంతకన్నా ప్రాంతీయ పక్షపాతం మరొకటుండదు. ఇంతకన్నా దుష్ట పాలన మరొకటుండ దు. ఇంతకన్నా అప్రజాస్వామ్యమైన పరిపాలన మరొకటుండ దు. ప్రభుత్వం ఇలాంటి పక్షపాత వైఖరిని అవలంబించడం వలననే పౌరులలో శాసనాలంటే, నియమ నిబంధనలంటే వాటినిఅమలుచేసే వ్యవస్థలు, వ్యక్తులంటే గౌరవం, భయం, భక్తి తగ్గి విచ్చల విడితనం పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. దాని పర్యవసానంగానే పరిపాలన, పరిపాలన కాకుండా పోతోంది.

పరిపాలకులపైన పౌరులకు ఏమాత్రం విశ్వాసం, సదాభివూపాయం లేకుండా పోతున్నది. ముఖ్యమంవూతితో సహా పరిపాలకులందరికీ పూటకోమాట మాట్లాడడం, మాట్లాడిన వాటినల్లా మాట్లాడ లేదనడం,మాట్లాడినవాటిని పట్టించుకోకపోవడం మామూలై పోయింది. అవి వారిని పరిపాలనపై పట్టుకోల్పోయేట్లు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్‌ను రానురానూ అవి ‘అంధేరా ప్రదేశ్’ క్రిందికి దిగజార్చాయి. ఇంకా దిగజారుస్తూనే ఉన్నాయి.
-డాక్టర్ కొండలరావు వెల్చాల తెలంగాణ కల్చరల్ ఫోరమ్ కన్వీనర్

219

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు