జనహోరు సంద్రమై ఎగిసినపాట


Sat,October 6, 2012 04:09 PM

muvvalu talangana patrika telangana culture telangana politics telangana cinemaసోమన్న ఈ జాతికి పుట్టిన కడగొట్టు బిడ్డడు. అరుంధతి సుతుండు. ఒకవైపు లంద వాసన. ఇంకోవైపు ఎండు తునకల సహవాసం. మరోవైపు 32 కళలను పలికించే డప్పు... నాలుగో తరగతిలోనే చదువు ఆగిపోయింది. ఏడేళ్ళ వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి మరో జీవితంలోకి నడిచి వెళ్ళింది. ఇట్లాంటి దుఃఖ భరిత సమయంలో సోమన్న ఒంటరయ్యాడు..

మానవ చరిత్ర పురులు పురులై తాడుగా మారడానికి పాట అద్భుతమైన పాత్రను నిర్వహించింది. రెండు కాలాల మధ్య సంభాషణకు పాటే సాధనమైంది...చరిత్ర రచనకు పాట బలమైన ఆధారం.. అయినా సాహిత్య చరిత్ర నిర్మాణంలో పాటకు చోటు దక్కలేదు.. పాట అగ్రకుల బ్రాహ్మణులది కాకపోవడమే ఇందుకు కారణమని అర్థమవుతుంది...

భూస్వామ్య సామాజిక సంబంధాలలో క్షీణత వచ్చినా, భూస్వామ్య సంస్కృతి ఇప్పటికీ ప్రబలంగానే కొనసాగుతున్న ప్రాంతాలలో, అంటే వెనుకబడిన ప్రాంతాలలో, మౌఖిక లేదా ఆశు సంప్రదాయం ఇంకా సజీవంగానే ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇది మరీ నిజం. (కె.వి.ఆర్.-ణెయకవులు,పుట-41) ఈ ప్రాంతాలలో శ్రమను మరిచి పోవడానికి, ఉత్సాహంగా పనిచేయడానికి తమకు నచ్చిన కొన్ని మాటలను ఎన్నుకుని రాగయుక్తంగా పాడుకుంటారు. ఈ అజ్ఞా త కవుల పాటను కట్టుతారు, పాడుతారు. తమ కళా నైపుణ్యం ద్వారా ప్రజలను కొన్ని సందర్భాలలో సంతోషపెడతారు. మరికొన్ని సందర్భాలలో ఉద్యమానికి సన్నద్ధులను చేస్తారు. ఇట్లా ప్రతి సందర్భంలో ఆటా, పాటా జనం జీవితంలో అంతర్భాగంగా కొనసాగుతాయి. ఈ చారివూతక, సాహిత్య, సంస్కృతి నేపథ్యం నుంచి ‘జన హోరు సంద్రమై ఎగిసేటి కెరటమై/ త్యాగాల వీణపై రాగాల రాసులై’ కోట్లాది ప్రజల గొంతుగా దూసుకొచ్చిన కవి - గాయకుడే ఏవూరి సోమన్న.

‘తల్లి ఒడిలో పసికూనయై నే ఒదిగివున్నా
పల్లె మాటలనే పాటలుగా అల్లనేర్చుకున్నా
ఆకలయ్యి నే పాలకేడుస్తుంటే
అమ్మ పాడిన జోల పాట విన్నా’
ఏవూరి సోమన్న జీవితం వడ్డించిన విస్తరి కాదని ఈ పాట చదువగానే అర్థమవుతుంది.. ..
సోమన్న ఈ జాతికి పుట్టిన కడగొట్టు బిడ్డడు. అరుంధతి సుతుండు. ఒకవైపు లంద వాసన. ఇంకోవైపు ఎండు తునకల సహవాసం. మరోవైపు 32 కళలను పలికించే డప్పు... నాలుగో తరగతిలోనే చదు వు ఆగిపోయింది. ఏడేళ్ళ వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి మరో జీవితంలోకి నడిచి వెళ్ళింది. ఇట్లాంటి దుఃఖ భరిత సమయంలో సోమన్న ఒంటరయ్యాడు.. అనివార్యంగా పశువుల కాపరిగా మారా డు. బతుకు ఎతలలో కన్నీళ్లను కతికి జీవించాడు. ‘తల్లి ల్యాగను నాకుతుంటే తల్లి ప్రేమ గుర్తుకు వచ్చి ‘గుండె పగిలేటట్లు ఏడ్చాడు. దసర పండుగ దగ్గరికి వస్తే కొత్త బట్టలు కుట్టించే వారి కోసం ఎదురు చూశాడు. వెనక వచ్చే ఆవుల చాటున నడిచొచ్చే ఎద్దుల రూపంలో తండ్రిని చూసుకుని, ఆ జ్ఞాపకాలకు నాలుగు కన్నీళ్ళను రాల్చాడు. మాయదారి ఆవు దూడలు తప్పి పోయిన క్షణాలలో గుబు లు పుట్టిన గుండె ఎంతగా క్షోభించిం దో? తాటి జగ్గల కాలిజోడు దారి తెన్ను తెల్వకుండా ఎన్ని మైళ్ళు నడిచిందో? ఇవి కొన్ని విషాదకర దృశ్యాలు. ఇంతేనా సోమ న్న జీవితం .కాదు, అంతే అయి తే మన ముందు ఇవ్వాల ఇన్ని పాటలు ఊరేవి కావు. ఆవు పాల పొదుగును దూడతో కలిసి ముద్దాడిన మధుర స్మృతులు కూడా సోమ న్న మస్తిష్కంలో దాగి ఉన్నాయి.

ఇట్లాం టి బాల్యంలోని గుర్తులన్నీ అతని పాటల్లో ప్రవహించాయి. సోమన్న పాట వైపు ప్రయాణించడానికి చారివూతక, రాజకీయ కారణాలున్నాయి. ఆయన పుట్టిన ఊరు వెలిశాల మండలం తిరుమలగిరి, జిల్లా నల్లగొండ. ఈ ప్రాంతంలో రజాకార్ వ్యతిరేక పోరాటం అద్భుతంగా నడిచింది. అట్లే వెలిశాలకు ఎటు 15 కిలోమీటర్ల దూరంలో వీరులు పుట్టారు. వారి పోరాటం పుట్టింది. తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన భీం రెడ్డి నర్సింహాడ్డి తర్వాతి కాలంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ప్రత్యామ్నాయ విప్లవ ఆలోచన పరుడిగా తెలుగు నేలకు సుపరిచతమైన మారోజు వీరన్న పుట్టిన గ్రామం కొత్తగూడెం, దొడ్డి కొమురయ్య (కడి చాకలి ఐలమ్మ పుట్టిన (పాలకుర్తి) గ్రామాలు వెలిశాలకు సరిహద్దు గ్రామాలు. ఈ వీరచరిత్ర ప్రభావం కూడా సోమన్న మీద ,అతని పాటల మీద ఉన్నది. స్పష్టంగా చెప్పాలంటే మారోజు వీరన్న ప్రభావం అతని మీద ఎక్కువగా ఉంది. ఒక విధంగా వీరన్న వేలు పట్టి సోమన్నను నడిపించాడు. ఆ నడక ‘అరుణోదయ’లో చేరింది. ఇప్పుడు ‘వెన్నెలమ్మ’లా మన ముందు పిండారబోసింది ఈ జీవితం, చారివూతక, రాజకీయ నేపథ్యం నుంచి తొంగి చూస్తే .. ఏవూరి సోమన్న విభిన్న సామాజిక అంశాల మీద పాటలు రాశాడు. చాలా విస్తృతమైన పరిశీలన ఉన్నట్టు మనకు ఈ పాటలు చదువుతే అర్థమవుతుంది. 1. చదువు ప్రాధాన్యం, 2. వడ్డెర కులం మీద 3. డప్పు వాయిద్యం గురించి, 4. పూలే- అంబేద్కర్ లాంటి మహనీయులపై, 5. వాన మీద, 6.పాట మీద,7. తెలంగాణ ఉద్యమంపై . నల్గొండ జిల్లా చరిత్ర గురించి 9.కొడుకుపై ప్రేమతో 10.లారీ డ్రైవర్ జీవిత చిత్రణ 11. గౌడ కులం బాధల గురించి 12. తాపీ మేస్త్రీ కష్టాలపై 13. అమరుడు సాంబశివుడి స్మృతిలో 14. మూసీ నదిపై భిన్నమైన కోణాలలో సోమన్న రాసిన పాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత గద్దర్ లేని లోటును తెలుగు సమాజంలో సోమన్న తీర్చగలడు. సోమన్న ఆదర్శ నమూనా కలిగిన కవిగా- గాయకుడిగా నిలబడి, బహుజనం పాటగా పల్లవించి సమాజ మార్పులో భాగం కావాలని కోరుకుందాం. సంస్కారవంతమైన భాష, చక్కటి పద సంపద, ప్రకృతి ప్రతీకలతో రాస్తున్న ఈ తరం అద్భుత కవి - గాయకుడిని వెచ్చని పిడికిలితో ఆహ్వానిస్తూ... ‘వెన్నెలమ్మ’ పందిరి కిందికి ప్రయాణిద్దాం.

-డాక్టర్ సి. కాశీం

35

KASIM Dr

Published: Tue,August 9, 2016 01:16 AM

వర్గీకరణతోనే దళితుల ఏకీకరణ

విద్యా-ఉద్యోగాలలో మాలలు అధికంగా ప్రవేశించటంలో వాళ్ల తప్పేం లేదు. మొదట చదువుకున్నారు, మొదట అవకాశాలను అందుకున్నారు. కానీ తమ కింద ఉన్

Published: Mon,January 27, 2014 12:38 AM

విప్లవ సాహిత్యంలో వస్తురూప వైవిధ్యం

నలభై రెండు ఏళ్లుగా విరసం విప్లవ రాజకీయాలను ప్రచారం చేయడానికి పనిచేస్తూనే ఉన్నది. నిషేధాలకు, నిర్బంధాలకు గురైనా సాహిత్య సజ

Published: Fri,December 21, 2012 11:43 PM

ధూంధాం పదేళ్ల నడక

తిరుపతి ఏడు కొండలపై ప్రపంచ తెలుగుమహాసభలు. దక్కన్ పీఠభూమి హైద్రాబాద్ నడిబొడ్డున ధూంధాం పదేళ్ల సభ. కాలం కత్తి అంచున రాలుతున్న రక్తపు

Published: Sat,October 6, 2012 04:09 PM

ఒక యోధుడి విషాద నిష్క్రమణ

చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఒక మిత్రుడు కలిశాడు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మా మాటల్లో సాంబశివుని ప్రస్తావన కూడా వచ్చిం ది. ఒకప్పు

Published: Sat,October 6, 2012 04:11 PM

ప్రజా పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం

-డా. సి.కాశీం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని యాభై ఎనిమిదేళ్ల చరిత్ర నిరూపించింది. ఈ వాస్తవం ఇంకా వర్తమానంలో స్పష్టంగా

Published: Sat,October 6, 2012 04:10 PM

విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు

పుస్తకంలోని పుటలు తిరగేయాల్సిన చోట రక్తం బొట్లుగా బొట్లుగా కారుతున్నది. కమ్మనికలలు వికసించాల్సిన క్యాంపస్‌లో రబ్బరుబుప్లూట్ తగిలి