వర్గీకరణతోనే దళితుల ఏకీకరణ


Tue,August 9, 2016 01:16 AM

విద్యా-ఉద్యోగాలలో మాలలు అధికంగా ప్రవేశించటంలో వాళ్ల తప్పేం లేదు. మొదట చదువుకున్నారు, మొదట అవకాశాలను అందుకున్నారు. కానీ తమ కింద ఉన్న కులాలకు ఆ అవకాశాలు దక్కనప్పుడు,
ఆ కులాల నుంచి పంపిణీ జరుగాలని డిమాండ్ వచ్చినప్పుడు అంగీకరించకుండా అడ్డుకోవటం మాత్రం తప్పు. సామాజిక న్యాయ సూత్రానికి వ్యతిరేకం. కొంత విద్య, నాలు గు ఉద్యోగాలను జనాభా దామాషా ప్రకారం పంచుకోలేని నిస్సహాయ స్థితిలో దళిత ఉద్యమం ఉండటమే అతి పెద్ద విషాదం. అగ్రకుల పాలకవర్గాల కుట్ర, ఐక్యమత్యం దెబ్బతింటుంది, రాజ్యాధికారానికి ఏకమవుదాం లాంటి మాటల కంటే కలిసి పంచుకుందాం,
కలిసి పోరాడుదాం అనే మాటలే మాల-మాదిగలను ఏకం చేస్తాయి.

kasim
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం మాదిగలు, మాదిగ ఉపకులాలు గత ఇరవై రెండు ఏండ్లుగా విరామమెరుగని పోరా టం చేస్తున్నారు. మాదిగలు తలెత్తి దండోరా వేస్తే భూమి ఆకాశం ఏకమయ్యాయి.జన ప్రభంజనం ఊరు,వాడను ఏకం చేసింది. పల్లె, పట్టణాలను కదిలించింది. అట్టడుగు మట్టిమనిషి చేసిన పోరాటం అందరిని ఆకర్షించింది. రాజకీయ పార్టీ లు మొదలు విప్లవోద్యమం వరకు అందరూ మద్దతునిచ్చారు. కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాసంఘాలు బాసటగా నిలిచాయి. దీంతో ఉత్పత్తి కులాలన్ని తమ గొంతులను సవరించుకొని నినదించాయి. పేరు చివరన కులం పేరు ఉండటం అగ్రకులాలకు సామాజిక హోదా అయితే మాదిగలకు ఆత్మగౌరవ సూచికగా మారింది.

1985లో కారంచేడు గ్రామంలో అగ్రకులా లు మాదిగపల్లె మీద దాడిచేశాయి. ఐదుగురు మాదిగల్ని చంపేశారు. ఈ ఘటన దేశవ్యాపితంగా సంచల నం రేపి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం చేయటానికి మూలమైంది. కారంచేడు నరమేధానికి వ్యతిరేకంగా మాల-మాదిగలే కాదు, బీసీ, అగ్రకులాల ప్రజలు కూడా పోరాటం లో కలిసివచ్చారు. దళితుల ఐక్యత-ఆత్మగౌరవం నినాదాలు ముందుకు వచ్చాయి.రాజకీయ, సామా జిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలను కారంచేడు ఉద్యమం విస్మరించలేనంతగా ప్రభావితం చేసింది. వర్గపోరాట రాజకీయాలు కూడా అనివార్యంగా కుల నిర్మూలన కార్యక్రమాలను రూపొందించుకునేలా చేసింది.

1992 ఆగస్టు 6న చుండూరు(గుంటూరు)లో మాలపల్లె మీద అగ్రకులాలు దాడి చేసి ఎనిమిది మంది మాలలను నరికి చంపి గోతాల్లో కట్టి తుంగభద్ర కాల్వలో పడేశారు. ఈ రక్తసిక్త ఘటనతో దళిత ఉద్యమం మరింత పదునెక్కింది. ఈ సందర్భంలో కూడా మాల-మాదిగలు ఐక్యంగా ఉద్యమించారు. మేధో రంగంలో కూడా కలిసి సాహిత్యాన్ని సృష్టించారు. చుండూరు నిందితులను అరెస్టు చేసి శిక్షపడే వరకు పోరాటాన్ని నడిపారు. దళితుల మీద ఎక్కడ దాడి జరిగినా ఐక్యంగా ఎదుర్కొన్నారు.

కారంచేడు, చుండూరు ఘటనలు కోస్తాంధ్రలో జరిగాయి. ఈ నేపథ్యంలో నాయకత్వం కూడా ఈ ప్రాంతం నుంచే వచ్చింది. రెండు ఉద్యమాల సందర్భంలో మాలలు నాయకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపుకు గురిచేసిన దళి త కవిత్వంలో మాల కవులే అగ్రభాగాన ఉన్నారు. కోస్తా ప్రాంతంలోకి ప్రవేశించిన క్రైస్తవ మిషనరీలు అంటరానితనంతో జీవిస్తున్న దళితుల నాలుక మీద నాలుగు అక్షరాలను రాశాయి. ఈ రాత పరిమితంగానైనా దళితుల తలరాతను మార్చింది. 1950లో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ను ముందుగా చదువులకు దగ్గరైన మాలలు అందుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో నీరటికారులుగా, కావలికారులుగా పనిచేసిన మాలలు దొరలను, అధికారులను దగ్గరగా పరిశీలించే అవకాశం దొరికింది. వారి జీవన విధానం, సంస్కృతి ప్రభావంతో లభించిన చదువులను నేర్చుకున్నారు. కోస్తా, తెలంగాణ ప్రాంతాలలో చెప్పులు కుట్టే వృత్తిని నమ్ముకున్న మాదిగలు వ్యవసాయానికి కావల్సిన తాళ్ల ను, చెర్నాకోలను, వార్లను తయారుచేస్తూ జీవించారు. చదువుల వైపు వెళ్లే వెసులుబాటు మాదిగలకు లేకుండా పోయింది.

విద్యా అవకాశాలు పొందిన దళితులు సహజంగానే ఉద్యోగ అవకాశాలను కూడా పొందుతారు. ఇందులో మాలలు ఎక్కువగా ఉద్యోగాలలోకి వచ్చారని అరవైఏళ్ల ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన మాదిగ పెద్దలు ఎనభయో దశకంలో అరుంధతి బంధుమిత్ర మండలి పేరు తో ఒక కరపత్రాన్ని ముద్రించారు. ఆ కరపత్రంలో విద్యా, ఉద్యోగ రంగంలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అసెంబ్లీ లాంజ్‌లో నుంచి ఎమ్మెల్యేల మీద కరపత్రాలను వెదజల్లారు. ఆ రోజు అదొక సంచలనం. ఇట్లా మాదిగ ఉద్యోగులు తమ నిరసనను వివిధ రూపాలలో వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నిరసన రూపం 1994 జూలై 7 నాటికి దండోరగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్‌పీఎస్)గా నిర్మాణమైంది. నిర్దిష్టంగా విద్యా-ఉద్యోగ రంగాల్లో మాదిగలకు నలభై ఏళ్లుగా జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సమాజం ముందు పెట్టారు.

దీనికి సమాజం కన్వీన్స్ అయింది. దండోర ఉద్యమానికి మద్దతు చెప్పింది. కడుపు మండిన మాదిగలు హైదరాబాద్ నగరాన్ని లక్షలాదిగా చుట్టుముట్టారు. ఎముకలు కొరికే చలిలో పిల్లా-పాపలతో ప్రభుత్వాన్ని వణికించారు. ఫలితం గా 2000 సంవత్సరంలో మొదటిసారి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టరూపం దాల్చింది. 1950-2000 వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిగలు ఎంతమం ది ఉన్నారో 2000నుంచి 2004వరకు కేవలం నాలుగేళ్లలో 23వేలకుపైగా మాదిగలు ఉద్యోగాలు పొందారు. ఎందరో మెడిసిన్, ఇంజినీరింగ్, యూనివర్సిటీ సీట్లను పొందారు.

వర్గీకరణ ఉద్యమం జరుగుతుండిన రోజుల్లో కొం దరు మాలలు పోటీ ఉద్యమాన్ని నడిపారు. వాళ్లూ ప్రభుత్వ అణిచివేతకు గురయ్యారు. కాని ఉద్యమం లో న్యాయం లేకపోవటంతో దానికి సమాజ మద్దతు లభించలేదు. కానీ 2004లో వర్గీకరణ సరైన పద్ధతిలో జరుగలేదని సాంకేతిక కారణాలను చూపి సుప్రీంకోర్టు ఏబీసీడీ అమలును నిలిపివేసింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, ఇదొక అద్భుతమైన తీర్పు అంటూ కొందరు మాలలు ర్యాలీలు చేశారు. ఏ చట్టమైనా నిజంగా అమలైతే దాని వలన నష్టపోతున్నామని భావించే వాళ్లు ఎక్కువగా బాధపడుతారని ఈ సందర్భంలో రుజువైంది. వర్గీకరణ ఫలితాన్ని నాలుగేళ్లు అనుభవించిన మాదిగలు, ఆ చట్టం వలన నష్టపోయామని భావించిన మాలల మధ్య ఎడం పెరుగుతూ వచ్చిం ది. ఇది అన్ని స్థాయిలలో ప్రతిఫలించింది. కారంచేడు, చుండూరు లాం టి ఐక్యత వేంపెంట, కల్వకోలు, లక్షింపేట సందర్భం లో వ్యక్తం కాలేదు. కారణం అపరిష్కృతంగా ఉండిపోయిన వర్గీకరణే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నోసార్లు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని ఏకగ్రీవ తీర్మా నం చేసి కేంద్రానికి పంపించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ, మాదిగల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రం వర్గీకరణపై తీర్మానమే ప్రవేశపెట్టకపోవడం చాలా అన్యాయం. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించి సామాజిక న్యాయం జరిగేలా చూడాలి.
విద్యా-ఉద్యోగాలలో మాలలు అధికంగా ప్రవేశించటంలో వాళ్ల తప్పేం లేదు.

మొదట చదువుకున్నారు, మొదట అవకాశాలను అందుకున్నారు. కానీ తమ కింద ఉన్న కులాలకు ఆ అవకాశాలు దక్కనప్పుడు, ఆ కులాల నుంచి పంపిణీ జరుగాలని డిమాండ్ వచ్చినప్పుడు అంగీకరించకుండా అడ్డుకోవటం మాత్రం తప్పు. సామాజిక న్యాయ సూత్రానికి వ్యతిరేకం. కొంత విద్య, నాలు గు ఉద్యోగాలను జనాభా దామాషా ప్రకారం పంచుకోలేని నిస్సహాయ స్థితిలో దళిత ఉద్యమం ఉండటమే అతి పెద్ద విషాదం. అగ్రకుల పాలకవర్గాల కుట్ర, ఐక్యమత్యం దెబ్బతింటుంది, రాజ్యాధికారానికి ఏకమవుదాం లాంటి మాటల కంటే కలిసి పంచుకుందాం, కలిసి పోరాడుదాం అనే మాటలే మాల-మాదిగలను ఏకం చేస్తాయి.

1131

KASIM Dr

Published: Mon,January 27, 2014 12:38 AM

విప్లవ సాహిత్యంలో వస్తురూప వైవిధ్యం

నలభై రెండు ఏళ్లుగా విరసం విప్లవ రాజకీయాలను ప్రచారం చేయడానికి పనిచేస్తూనే ఉన్నది. నిషేధాలకు, నిర్బంధాలకు గురైనా సాహిత్య సజ

Published: Fri,December 21, 2012 11:43 PM

ధూంధాం పదేళ్ల నడక

తిరుపతి ఏడు కొండలపై ప్రపంచ తెలుగుమహాసభలు. దక్కన్ పీఠభూమి హైద్రాబాద్ నడిబొడ్డున ధూంధాం పదేళ్ల సభ. కాలం కత్తి అంచున రాలుతున్న రక్తపు

Published: Sat,October 6, 2012 04:09 PM

ఒక యోధుడి విషాద నిష్క్రమణ

చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఒక మిత్రుడు కలిశాడు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మా మాటల్లో సాంబశివుని ప్రస్తావన కూడా వచ్చిం ది. ఒకప్పు

Published: Sat,October 6, 2012 04:09 PM

జనహోరు సంద్రమై ఎగిసినపాట

సోమన్న ఈ జాతికి పుట్టిన కడగొట్టు బిడ్డడు. అరుంధతి సుతుండు. ఒకవైపు లంద వాసన. ఇంకోవైపు ఎండు తునకల సహవాసం. మరోవైపు 32 కళలను పలికించ

Published: Sat,October 6, 2012 04:11 PM

ప్రజా పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం

-డా. సి.కాశీం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని యాభై ఎనిమిదేళ్ల చరిత్ర నిరూపించింది. ఈ వాస్తవం ఇంకా వర్తమానంలో స్పష్టంగా

Published: Sat,October 6, 2012 04:10 PM

విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు

పుస్తకంలోని పుటలు తిరగేయాల్సిన చోట రక్తం బొట్లుగా బొట్లుగా కారుతున్నది. కమ్మనికలలు వికసించాల్సిన క్యాంపస్‌లో రబ్బరుబుప్లూట్ తగిలి