వేదం ..ఖురాన్


Sun,November 20, 2016 01:17 AM

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మాణం చేసుకోదగ్గ కందకుర్తి ఆ దిశగా స్వరాష్ట్రంలో మన గ్రామాల పునర్వైభవానికి తొలి బీజం వేసే అవకాశం ఉన్నది.

ramesh
నిజామాబాద్ జిల్లా రెంజెల్ మండలంలోని కందకుర్తిలో తిరుగాడుతుంటే సరికొత్త ఆవరణలోకి వచ్చినట్టు ఉంటుంది. హిందూముస్లింల సమైక్య జీవనంలోని వైవి ధ్యం అచ్చెరువొందిస్తుంది. ఒకవైపు త్రివేణీ సంగమ క్షేత్రంలో పవిత్ర నదీ స్నానాలు చేస్తూ, పితృ దేవతలకు భక్తిశ్రద్ధలతో తెప్పలు విడుస్తూ హిందువులు కనిపిస్తే, ఊర్లోకి వెళ్లగానే సంప్రదాయ వేష భాషలతో నిదానంగా సాగే ముస్లింల జీవన శైలి కనిపిస్తుం ది. ఒకవైపు వేదం వినిపిస్తే మరోవైపు అల్లాహో అక్బర్ అంటూ ఐదుసార్లు అజా వినిపిస్తుంది. ఎంత వైవిధ్యం కందకుర్తి! అనిపిస్తుంది. ఒక్క పరి నిశ్శబ్దంగా మొగలుల పరగణాలోకి వెళ్లామా అనిపిస్తుంది. అది నిజమే మరి. ఇక్కడ నూటికి ఎనభై శాతం ముస్లింలే. పొలాల్లో ముస్లిం మహిళలు రైతు కూలీలుగా కనిపించడమూ ఇక్కడ కనిపించే అరుదైన దృశ్యం.
ఔరంగజేబ్ హయాంలో మొగల్‌పురలోని తన సైనిక పటాలానికి చెందిన ముస్లింలంతా ఆయన ఆజ్ఞానుసారం ఇక్కడే కందకుర్తిలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు ధారాదత్తం చేసిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండిపోయారు. అప్పట్లో యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికుల సమాధులూ ఇక్కడున్నాయి. వారి త్యాగాల చరిత్రతో ముడివడ్డ ఈ గ్రామంలో నేడు యువతరం చిరువృత్తులను ఆశ్రయించగా తొలితరం అంతానూ వ్యవసాయంలోనే నిమగ్నమయ్యారు.

ఒకనాడు ఇక్కడి రైతులంతా మినుములు, పెసర్లు, సొగర్లు తదితర పప్పుధాన్యాలు పండించేవారు. కానీ నేడు పొగాకు (తంబాకు), సోయా వంటి వాణిజ్య పంటలకే పరిమితమయ్యారు. అందుకు ఒక కారణం గత కొన్నేళ్లుగా వచ్చి పడ్డ అడవి పందుల బెడద. అవి తినకుండా ఉండే పంటలు మాత్రమే వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం. ఇట్లాంటి స్థితి మిగతా గ్రామాల్లో కూడా ఉందిగానీ, ఆయా గ్రామాలతో పోలిస్తే కందకుర్తి అత్యధికంగా పొగాకు పంటవైపు మొగ్గిందీ అంటే విపరీతమైన అడవి పందుల బెడద అనే చెప్పాలి.

అన్నిటికన్నా బాధాకరం, ఈ వూరు, ఇక్కడి రైతు గర్భం దాల్చిన స్త్రీలా సతమతమవుతూ ఉండటం. కడుపులో బిడ్డను దాల్చిన తల్లి కాన్పు అయితే ఆ కుటుంబానికీ, వంశానికంతా ఆనందమే. కానీ ఆ పురిటి నొప్పులు పడేదాకా తనకు ఆయాసమే. అట్లా నిండుగా నీళ్లున్నప్పటికీ బిడ్డకు తగినంత బలిమి ఇవ్వలేని వైఫల్యాన్ని భరించే తల్లిలా ఈ వూరుంది. తన కడుపులోని ఈ గ్రామ రైతాంగానికి నీరందించలేక తల వంచుకుని ఆ గోదావరమ్మ బిరబిరా తరలిపోతూ ఉంటుంది. అవును మరి. నది అన్నమాటే గానీ తీరం వెం బడి పొలాల్లోకి నీరు రాదు. దాంతో 16 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఇంకా పూర్తి కాలేదు. స్వరాష్ట్రంలో జలవనరుల పంపిణీని ప్రథమ ప్రాధాన్యంగా చేసుకున్న ప్రభుత్వం కూడాఉన్నందున తక్షణం ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేయగలిగితేనే ఈ నదీ ఒడిలోని గ్రామం జీవకళతో పచ్చగా మారుతుంది.

గత రెండు దశాబ్దాలుగా ఇక్కడి రైతు ఒక ఏడు పంట పండించుకుంటే మరో ఏడు మునిగిపోతున్నాడు. నిర్ణీత సమయంలో వర్షాలు రాక, వచ్చినా వాయుగుండాలతోనే అన్నట్లు తయారవడంతో...పోనీ అలా వచ్చినా... వరద ముంపుతో దుర్భర పరిస్థితులు నెలకొనడంతో...వెరసి కందకుర్తి, దీని చుట్టుముట్టు గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి స్థితిమంతులైన రైతులు లేరంటే అతిశయోక్తి కాదు. వీటికి తోడు రాత్రియితే అలవాటుగా మారిన తెల్లసీసా మామూలే.

తక్షణ, సుదూర ప్రణాళికలతో ఈ వూరు వికాసం ముడివడి ఉంది. ముఖ్యంగా చిరు వృత్తులను ఆశ్రయిం చిన యువతకు సరైన వ్యాపారం లేదు. దగ్గర ఏమీ కర్మాగారాలూ లేవు. ఊర్లో బతుకడం కష్టమైన యువత బతుకు దెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారు తిరిగి రావడానికి తగ్గ ఆశావహ పరిస్థితులూ ఇంకా ఏర్పడ లేదు. ఇలాంటి సమస్యలను లోతుగా విశ్లేషిస్తే గత ప్రభుత్వాల వైఫల్యంగానే చూడాలి. ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో ఉండి, స్వగ్రామాలను మనకు తగ్గ రీతిలో పునర్నిర్మాణం చేసుకోలేని వైఫల్యానికి చిహ్నాలుగానే గ్రామాలన్నీ ఉన్నాయి. అయితే తగిన వనరులుండీ అభివృద్ధికి దూరమైన కందకుర్తి స్వరాష్ట్రంలో కూడా ఇదివరకటి లాగా ఉండకూడదు మరి!
చాలా చేయగలం. నిరుద్యోగ యువత గల్ఫ్ దేశాలకు పోకుండా నిలువరించే ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్యతో యువతరం భవిష్యత్తుకు పునాదులు వేయడం, సవ్యమైన నీటి యాజమాన్యంతో రైతుల కడగండ్లు తీర్చడం- వ్యవసాయ అధికారుల నుంచి రైతులకు తగిన సలహాలు, సూచనలు జరూరుగా అందడం, నీటి ఆవాసాల చెంతకు వచ్చిన పందుల బెడదను తగ్గించే ఉపాయాలు అన్వేషించడం - ఇలాంటి చర్యలతో ఈ వూరు తక్షణ అభివృద్ధి ముడివడి ఉన్నది.

అయితే, దూరదృష్టితో ఆలోచిస్తే-అన్నిటికన్నా మిన్న ఈ ఊరుకున్న ప్రత్యేకతను మనం ప్రాచుర్యంలోకి తేచ్చుకోవడం చాలా అవసరం. అప్పుడే బంగారు తెలంగాణ సాధనలో ఈ గ్రామ అస్తిత్వపు ఘనత వెల్లడవుతుంది. అవును మరి. గోదావరి తెలంగాణలో ప్రవేశించే ఈ వూరిని పర్యాటక క్షేత్రంగా మలుచుకుంటే అనేక సమస్యలు తీరుతాయి. స్థానికులు చెప్పినట్లు ఇక్కడి త్రివేణీ సంగమం ప్రశస్థిని కేవలం గోదావరి పుష్క రాల సమయానికే పరిమితం చేయకుండా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మించుకోవాలి. అప్పుడే ఈ ఈ వూరు గోదావరమ్మకు స్వాగత తోరణంగా మారి, సర్వతోముఖాభివృద్ధికి బీజం పడుతుంది. తెలంగాణలో చక్కటి ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా మారి నవ తెలంగాణలో తనదైన అస్తిత్వ పతాకాన్ని సమున్నతంగా ఎగరవేస్తుంది.

2586

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె