మనకూ బాలచందర్ కావాలి...


Thu,December 25, 2014 01:57 AM

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ, భారతీయ సినీ వినీలాకాశంలో మెరిసే తారలన్నీ ఒక చంద్రుడి తేజస్సుతో మెరుస్తున్నవే. వారందరి రాతలు రాసిన రచయితా, దర్శకుడూ ఒకరే అని అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రకాశ్‌రాజ్, ఇట్లా ఒక వందమంది తారలు, ఇంకొక వందమంది సాంకేతిక నిపుణులు ఇవ్వాళ ఇంతటి ఉజ్వలస్థాయికి వచ్చారంటే అది ఆ చేయి మహిమే. ఆయన రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన మేలుకొలుపే. ఈ మాటలతో బాలచందర్‌ని గుర్తు చేసుకుంటూ అసలైన కథలోకి -అంతులేని కథలోకి వద్దాం.

నిజానికి ఆయన పేరు తెచ్చింది ఈ తారలకూ, నిపుణులకే కాదు, మధ్యతరగతి పాత్రలకు. నిజమైన జీవితానికి. మారుతున్న జీవన వాహినికి. ఒక జయప్రద, ఒక జయసుధ వీళ్లంతా స్త్రీలు. ఇంటింటి దుఃఖం లేదా ప్రేమాభిమానాలు. మానమర్యాదలు. ఆత్మగౌరవాలు. సాహసమూర్తులు. వాళ్లతో ఆయన పాత్రలు వేయించి జీవితాన్నే ఇతివృత్తంగా సినిమాలు తీసి, ఒక సరికొత్త ఒరవడికి ప్రాణప్రతిష్ట చేశారు. అదే సిసలైన జీవిత రచన.

మన దేశంలోని మెజారిటీ ప్రజల జీవితాల్లో వస్తోన్న మార్పుచేర్పులను, వాళ్ల తలరాతలను వెండితెరపై మహోజ్వలంగా చిత్రించి, మన మనసుపై ప్రభలమైన ప్రభావం వేసిన చేయి మహత్యం అది. ఈ లెక్కన బాలచందర్ THE GOD OF SMALL THINGS. అధో జగత్ సహోదరులనే చూసిన విప్లవం స్థానే, నిదానంగా ఎదిగి వస్తున్న మధ్యతరగతి మందహాసాలను, అంతకన్నా ముఖ్యంగా ఎదురీతను, వాళ్ల వ్యక్తి స్వేచ్ఛనూ కూడా చూపిన క్రాంతిదర్శి ఆయన. అందుకే, ఆయన ఆధునికతలోకి వస్తున్న భారతీయ మార్పు చేర్పులకు వెండితెర ప్రతీక. ఒక్కమాటలో ఆయన మార్పును కోరే మనిషి కథను వెండిమార్గం పట్టించిండు. జీవన్నాటకాన్ని రచించే భగవంతుడి మాదిరి, అతడి చేయి కథను సరికొత్తగా ఆడిచింది. ఆ చేయి మనకు తెలిసిన మన పాత్రలనే రెడీనా అని అడిగింది. యాక్షన్ చెప్పింది. కట్ కూడా చెప్పింది. వెండితెరపై ప్రదర్శించింది. ఇప్పుడు ఆ చేయి లేదు.


తెల్లటి దుస్తులు. నల్లటి ఫ్రేం కళ్లద్దాలు. డిసిప్లిన్‌కు మారు పేరైన కె.బాలచందర్ రూపం అది. ఆయన లేరిప్పుడు. కానీ, ఆయన రూపశిల్పి. జీవిత చలన చిత్రాలను సృష్టికర్త. వెండితెరపై మధ్యతరగతి జీవితాన్ని చూపి ఇది కథ కాదు అని చెప్పినాయన. అంతులేని కథలెన్నిటినో అపూర్వంగా దృశ్యబద్దం చేసిన దార్శనికుడాయన. స్వాతంత్య్రానంతర భారతంలో పైనుంచి కాకుండా దిగువ నుంచి చూపు సారించిన దీర్ఘదర్శి. ఇంటింటా వస్తోన్న మార్పులను సమాజానికి దర్శింపజేసిన యోగి.

మధ్యతరగతి జీవితాల్లో వస్తోన్న మార్పులను అత్యంత వినయంగా దర్శించి, మరెంతో సాహసోపేతంగా కథలుగా మలచి, ఆ పాత్రలకు తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులను వెతుకులాడి నాటకీయమైన జీవన వాస్తవికతను అత్యంత వినయంగా ఆవిష్కరించిన స్రష్ట. అత్యంత సామాన్యమైన వ్యక్తులను సినీ తారలుగా మలిచి భారతీయ సినీ వినీలాకాశంలో వెలిగిపోయేలా చేసిండు. ఆ తారలన్నీ ఇవ్వాళ మెరుస్తున్నాయంటే దానికి ఆయనే కారణం. ఇవాళ ఆ తారలు కన్నీళ్లు వర్షిస్తున్నాయంటే అవి తన ఉలితో చెక్కిన శిల్పాలు కావడమే. మట్టిలో మాణిక్యాలూ అవడమే.

తనకన్నా ఎక్కువ వయసున్న ఆమెను ప్రేమించడం, అదీ తన మతం కాని వ్యక్తిని ప్రేమించడం, తాను ఏడేడు తీరాలు దాటి విదేశాలకు వెళ్లినా ఫర్లేదనుకునే స్థితి. వరుసకు అన్న అయినాగానీ తన స్వార్థాన్నే చూసుకునే వ్యక్తులు, శుభం పలికే కథలో స్థానంలో సశేషంగా ముగించడం, విషాదాన్ని జీవితంలో భాగంగా దర్శింపజేయడం, ముఖ్యంగా స్త్రీకి మనసుందని, తను స్వేచ్ఛ కోరుకుంటుందని వెండితెరపై చూపిన మహా దర్శకుడు. ఉద్యోగ సమస్య తీవ్రతను ఆయన చెప్పిన తీరు సినీ చరిత్రలో ఒక మహాప్రస్థానం.

శ్రీశ్రీ గీతాలతో ఒక సినీకావ్యాన్ని రచించడం అంటే అది ఒక మహాదర్శకుడికి మాత్రమే సాధ్యమయ్యే పని. ఆ పనిలో బాలచందర్ చేసిన కృషి విప్లవాత్మమైన ఒరవడి. అదే ఆకలి రాజ్యం. మన దగ్గర ఒక గద్దర్ పాట, కాళోజీ కవిత్వం, అల్లం రాజయ్య, చెరబండ రాజు రచనలు సినీ కావ్యాలుగా మలచడానికి తగ్గ స్థితి ఉంది. కథా ఉంది. ఉద్యమమూ ఉంది. కానీ ఇంతటి దర్శకులు లేకపోవడమే మన విషాదం. ఆ విషాదాన్ని గుర్తు చేసే దర్శకుడు బాలచందర్.

ఆయన కథ సామాన్యమైంది. అకౌంట్స్ జనరల్ కార్యాలయంలో లెక్కలు చూసే ఒక గుమాస్తా జీవిత కథ అది. నాటకాలంటే అతడికి అభిరుచి. అతడు తొలిసారిగా మాటలు రాస్తాడు. అదీ ఎంజీఆర్ సినిమాకు. అక్కడ నుంచి ఆయన రంగస్థలం మారుతుంది. సినిమా రంగంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత సినిమాలకూ కథలు రాస్తాడు. ఆ కథలకు తానే దర్శకత్వం వహిస్తా డు. తానే సినిమాలను నిర్మిస్తాడు.

మధ్యతరగతి కుటుంబాల్లో మనిషి గుండెల్లో వెండితెరను, తెర తీయగ రాదా అని తీసి చూపిస్తాడు. ఈలోగా సినీ ప్రభావం స్థానే టెలివిజన్ చేరుతుందని తెలిసి టీవీ సీరియళ్లనూ తీశాడు. అటు తర్వాత తన తొలి ఇతివృత్తం అయిన నిజ జీవిత నాటకానికి పట్టం గట్టడమే ప్రధానం అని తెలిసి లక్ష్మీతో రియాలిటీ షోను నిర్మిస్తాడు. ఇట్లా అరవై, డ్బ్భై, ఎనభై, తొంభై దశకాల్లో ప్రేక్షకులకు అంతులేని కథ ను ధారావాహికంగా అందించిన మహా దర్శకుడు బాలచందర్. చివరాఖరికి మళ్లీ ఆయన రంగస్థలానికే చేరుకున్నాడు. పౌర్ణమి పేరుతో ఒక నాటకాన్ని రాసి దర్శకత్వం వహించిండు. ఇట్లా ఆయన తొలినుంచీ చివరిదాకా మౌలికంగా రంగస్థలం ఉంది. అందులో ఆయన జీవితాన్నే రచించి, నిర్మించి చిత్రించడం వారి విశిష్టతకు నిదర్శనం. అందుకే ఒక్కమాటలో ఆయన లైఫ్ రంగస్థలం. ఇతివృత్తం జీవన్నాటకం. మాధ్యమం తెరలు తీయడం.

అయితే, ఆయన సినీ ప్రపంచంలో మార్పుకు పట్టం గట్టిండు. అది మాన వ సంబంధాల్లో వచ్చే మార్పు కావచ్చు, సంస్కరణలతో తెచ్చే మార్పు కావ చ్చు, ఏదైనా మార్పుకు ఆహ్వానం పలికిండు. అంతటి మార్పును తెచ్చే క్రమం లో ఆయన సినీ నిర్మాణ రీతులనూ మార్చిండు. కథలో రెండు పాత్రలతో కథ నడిపిండు. అట్లే నల్లపిల్ల సరితను హీరోయిన్‌ను చేసిండు. లిఫ్ట్‌లోనే ఒక పాటను దృశ్యీకరించిండు. విశాఖ పట్నానికి క్రేజ్ తెచ్చిండు. ఒక రకంగా విశ్లేషిస్తే ఆయన సినిమా ప్రపంచంలో మరో చరిత్రను సృష్టించిండు. చిత్రమేమిటంటే, ఆయన చిరంజీవికి రుద్రవీణ ఇచ్చాడు.

ఉదయ్‌కిరణ్‌కూ అబద్ధం ఇచ్చాడు. అంతకన్నా ముందు ఆయనే ఆది. ఇంకా చెప్పాలంటే ఆయన మట్టి లో మాణిక్యాలను వెతికి పట్టుకున్న పుణ్యమే నగేష్, రజనీకాంత్, కమల్ హాస న్, ప్రకాశ్‌రాజ్, జయసుధ, జయప్రద, సుజాత, సరిత, ఎ.ఆర్.రహమాన్ తదితరులు. ఒకరు కాదు, ఈ దేశంలో తార స్థాయికి చేరిన వాళ్లందరినీ కన్నవాడు ఆయనే. సినీ వినీలాకాశంలో మెరిసే తారలన్నిటికీ వెండివెలుగు బాలచందరే. ఒక్క మాటలో బాలచందర్ లేకపోతే మనకు వీరెవరూ లేరు.

వారం తా బస్సు కండక్టర్లుగా మామూలుగా ప్రయాణీకుల టిక్కెట్లు కొట్టేవారే గానీ మనల్ని సినిమా టికెట్లు కొనుక్కుని మన జీవన్నాటకాన్ని దర్శింపజేసి మన కంట కన్నీరు. ఆనంద భాష్పాలు పెట్టించే తారలుగా ఎదిగేవారు కానే కాదు. ఆ రకంగా భారతీయ చిత్రసీమ నేడు తమ దర్శకుడు మరణించినందుకు కన్నీరు మున్నీరవుతుతోంది. వ్యక్తిగతంగా ఇవ్వాళ సగటు ప్రేక్షకుడు బాలచందర్ కథల్ని తల్చుకుంటూ, ఆయన పాటల్ని మననం చేసుకుంటూ రోదిస్తున్నడు. ఎందుకంటే, ఆయన సామాన్యుల సారస్వతాన్ని వెండితెరపై సృష్టించిండు. దైవం రాసిన రాతల్ని మార్చడానికి ఎదురీదిన మనిషి పాత్రల్ని ఆయన సాహసోపేతంగా రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిండు. అందు కే ఆయన అభిమానులు విలపిస్తున్నరు. మారే జీవితాలను సినిమాలుగా మలిచే దర్శకులు మన దగ్గర లేనందుకూ విచారిస్తున్నరు. మనకూ ఒక బాలచందర్ కావాలని తలపోస్తున్నరు. ఒక లైఫ్. బతుక్కీ, మనిషికీ. కథకూ. మొత్తంగా సినీ పరిశ్రమకూ. అలాంటి లైఫ్ ఇచ్చే దర్శకుల కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది.

830

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె