తెలుగు, ఆంధ్రం ఒకటి కాదు


Sun,April 7, 2013 11:38 AM

teluguఐదు దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ ప్రాంత తెలుగువూపజలు ఆంధ్ర ప్రాంతపు ప్రజల మధ్య ఏ రకమైన సఖ్యత ఏర్పడక పోవడానికి కారణం వారి సంస్కృతి, చరి త్ర వేరవటమే కాదు, భాషలు కూడా వేరుకావటమే. తెలుగు, కన్నడం చూడటానికి ఒకలా ఉన్నట్టే, తెలుగు, ఆంధ్రం కొన్ని పదాలు ఒకటే ఉంటాయి. కానీ మొత్తం మీద పదాలు, వాటి అర్థాలు, వాక్య నిర్మాణం పూర్తిగా వేరుగా ఉంటాయి. అంతేకాదు ఏ భాష అయినా అది నిర్దిష్ట ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేటట్టు ఉంటుంది. అలాగే ఆంధ్రం వారి చరిత్ర, సంస్కృతి ఆధారంగా నిష్కర్షగా, కటువుగా ఉంటే, తెలుగు తెలంగాణ వారి లాలిత్యమైన సంస్కృతి లాగే లలితంగా ఉంటుంది. రెండు భాషల సాహిత్యాన్ని గమనించినా ఈ విష యం స్పష్టమవుతుంది.

ఆంధ్ర, తెలుగు అన్న పదాల చరిత్ర చూసినా ఈ రెండు వేరు భాషలని అర్థమవుతుంది.
‘ఆంధ్ర’ పదం ఋగ్వేదంలో ‘ఐతరేయ బ్రాహ్మణం’లో కనిపిస్తుంది. అందులోని ఒక కథ ప్రకారం విశ్వామిత్ర మహర్షికి ఒకసారి తన నూర్గురు కొడుకుల మీద అవిధేయులన్న కోపం వస్తుంది. వారిని కుక్కమాంసం తింటూ బతకమని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. అప్పు డు ఉత్తర భారతం నుంచీ వారిలో కొందరు దక్షిణ దిశకు దండకారణ్యం గుండా వచ్చి గోదావరి నదీ తీరాన స్థిరపడ్డారు. అదే ఈనాటి ఆంధ్ర ప్రాంతం. అక్కడి ద్రవిడ భాషను కొద్దిగా తీసుకుని తాము తీసుకు వచ్చిన సంస్కృతంలో కలిపి ఆంధ్రభాష మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకే భాష పూర్తిగా సంస్కృత పద భూయిష్టమైన, వ్యాకరణ రీతులు కూడా మొత్తం సంస్కృత వ్యాకరణంతో కలవడం ఉంటుంది. అందుకే వారి సంస్కృతి ఆర్య సంస్కృతిగానే ఉండిపోయింది.

ఇక త్రిలింగ దేశానికి (మూడు లింగక్షేవూతాల మధ్య ఉన్న ప్రాంతం) చెందిన ద్రవిడ భాష అచ్చ తెలుగు. అసలు తెలుగు అన్న పదమే ఈప్రాంతమైన తెలంగాణ అన్న పదం నుంచి ముందు ‘తెలంగి’గా తర్వాత తెలుగుగా ప్రసిద్ధి పొందింది. ఇది ఈ మూడు శైవక్షేవూతాల (శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం) మధ్య ఉన్న ప్రాంతంలో (ఇప్పటి తెలంగాణ 95శాతం ఈ మూడు క్షేత్రాల మధ్య ఉంటుంది.) మాట్లాడే ద్రవిడ భాష కనుకనే దీనిమీద సంస్కృత భాష ప్రభావం అసలు కనపడదు.

భరతముని రచించిన నాట్యశాస్త్రం(2 బీసీ)లో కూడా ఆంధ్రుల ప్రసక్తి, వారి భాష ఆంధ్రమని ఉన్నది. వారు దండకారణ్యానికి కొద్దిగా కిందివూపాంతంలో (అంటే ప్రస్తుత ఆంధ్ర ప్రాంతం) నివసించే జాతి అని పేర్కొనబడింది. వీరి గురించి వివరంగా రాసిన భరతముని తెలుగు అన్న పదమే ఎక్కడా వాడలేదు. అలాగే ప్రాకృత భాషా సాహిత్యంలో కూడా ఆంధ్రు లు వాడే భాష ఆంధ్రం అనే ఉందికానీ, అతి ప్రాచీనమైన ఈ సాహిత్యంలో కూడా ‘తెలు గు’ అన్న పదం ఎక్కడాలేదు. ప్రాకృతాన్ని ఎక్కువగా వాడుకున్న బౌద్ధ వాజ్మయంలో కూడా కృష్ణా, గోదావరి నదీతీర ప్రాంతంలో నివసించిన ఆంధ్రుల ప్రసక్తిఉన్నది. వారి భాష ఆంధ్రమని స్పష్టంగా ఉన్నది. అదే బౌద్ధుల ఆరామాలు తెలంగాణలో ఉన్నవాటి దగ్గర ఇక్కడి భాష తెలుగు అని స్పష్టంగా ఆనాడు పేర్కొన్నారు.

రామాయణంలో కూడా ఆంధ్రదేశ ప్రసక్తి ఉన్నది. ఆంధ్రదేశం దండకారణ్యానికి సరిగ్గా కింద ఉందనీ, దానిని దాటితే పౌండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశాలు వస్తాయనీ ఉంది. సుగ్రీవుడు తన సైన్యాన్ని సీతని వెతకడానికి పంపిస్తూ వారితో చెప్పేమాటలివి. వేదవ్యాసుని మహాభారతంలో కూడా ఆంధ్రజాతి గురించి చెప్పబడింది. సహదేవుడు ఆంధ్రులని చిత్తుగా ఓడించాడని వ్యాసుడు రాశాడు. దానికంటే ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే కురుక్షేవూతయుద్ధంలో ఆంధ్రులు దురాశపరులైన, కౌరవులవైపు ఉండి, తమ న్యాయమైన హక్కు కోసం పోరాడిన పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఆంధ్రుల మీద రాసిన సుదీర్ఘ వ్యాసంలో లగడపాటి రాజగోపాల్ ఈ విషయం మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టాడు.

ఆంధ్రులని గురించి వివరించిన వ్యాసుడు ‘తెలుగు’ అన్న పదం ఎక్కడా వాడలేదు. ఈ విధంగా వేదాల్లో, పురాణాల్లో, చరివూతలో, వాంగ్మయంలో అన్నిచోట్ల ఆంధ్రులది ఆంధ్రజాతి అని, ఆంధ్రబాష అనీ ఉందికానీ, వారికి సంబంధించిన విషయాల్లో ‘తెలుగు’ అన్న పదం వాడబడలేదు. క్రీస్తుపూర్వం నుంచీ ఉన్న ఈ త్రిలింగ దేశంకానీ, తెలంగాణ ప్రాంత ప్రసక్తిగానీ ఆ ఆర్యుల రాతలలో అసలేలేదు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం పైన చెప్పిన ఆంధ్ర ప్రాంతంలో ఎప్పుడూ కలిసిలేదు. అంటే రామాయణ కాలంనుంచీ ఆంధ్ర జాతి వారు ప్రస్తుత ఆంధ్ర ప్రాంతంలోనూ, తెలుగువారు తెలంగాణలోనూ వేరుగా జీవించారని, వారి భాషలు వేరని స్పష్టమవుతుంది. ఈమధ్య మెదక్‌లో దొరికిన 1300 ఏళ్లకిందటి శాసనంలో తెలంగాణ పురం పస్తుత తెల్లాపూర్) ఉన్న ఊరు త్రిలింగ దేశం అనే ప్రత్యేక దేశంలో ఉన్నట్టుగా ఉంది. అంటే ఆంధ్రదేశం. త్రిలింగ దేశం వేరువేరు దేశాలనే కదా!

ఆంధ్ర ప్రాంతంలో మాట్లాడే భాషని మొదటి నుంచీ కూడా ‘ఆంవూధము’ అనే అందరు కవులు, రచయితలు, మేధావులు, విశ్లేషకులు వ్యవహరించేవారు. కవివూతయమైన నన్నయ, తిక్కన్న, ఎర్రావూపగడ కూడా ఎప్పుడూ ఆభాష ను ‘ఆంధ్ర’ అనే అన్నారు. అందరూ వేదవ్యాసుని భారతాన్ని వారు ముగ్గురూ ‘ఆంవూధీకరించార’నే అన్నారు కానీ ‘తెలుగీకరించార’ని అనలేదు. వారు రాసినది ‘ఆంధ్ర మహాభారతం’గా వ్యవహరింపబడుతున్నది.

అదే పోతన భాగవతాన్ని మొదటి నుంచీ తెలుగు భాగవతంగానే వ్యవహరించారు. ఈ రెండు పుస్తకాల్ని గమనిస్తే వాటిలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా తెలుగు మాత్రమే తెలిసిన వాళ్ళు ఆంధ్ర, మహాభారతంలో కవివూతయం రాసిన ఏ పద్యాన్ని అర్థం చేసుకోవాలన్నా వివరించడానికి దివాకర్ల వెంకటావధాని దిగిరావల్సిందే! కానీ తెలుగు వచ్చిన ఎవరైనా పోతన భాగవతాన్ని పాల్కురికి సోమన బసవపురాణాన్ని ఎంతో సులభంగా చదివి అర్థం చేసుకోవచ్చు.
నన్నయ ఆంధ్రమహాభారతాన్ని రాయడాన్ని ప్రశంసిస్తూ తిక్కన ఇలా అన్నాడు.

ఆంధ్ర కవితా విశారదుండు విద్యాదాయితుండొనరించె మహితాత్ముడు నన్నయభట్టు దక్షతన్. (‘విరాట పర్వం’ 6 వ పద్యం) అంతేకాదు. తను కూడా ఆంధ్రుల కోసమే ఈ పని చేశానని తిక్కన చెప్పుకున్నాడు. కావున భారతామృతము కర్ణపుటంబుల నారక్షిగోలి ఆంధ్రావళి మోదంబొరయునట్లు రచియించెదన్ కృతుల్. (విరాట పర్వం 30 వ పద్యం). ఎర్రావూపగడ కూడా ‘ఆంవూధ’మనే అన్నాడు కానీ ఎక్కడా ‘తెలుగు’ అని చెప్పలేదు. శేషోన్నయం ఆంధ్ర భాషా సుజనోత్సవ మొప్పుగ నిర్వచించి (నృసింహపురాణం, 17వ పద్యం) అప్పటి కవులందరూ తాము వాడేది ఆంధ్ర బాషే అని నొక్కి వక్కాణించారు;వ్యాస రచిత భారతం నయం ఆంధ్రభాషగ నొనర్చి జగతిబొగుడు గతి నన్నపార్యు, తిక్కనను, క్రితక్షికతు శంభుదాసు నెర్రకవి దలతు భక్తి.

అప్పటి కాలంలో నన్నెచోడుడు కూడా ఆంధ్రం, తెలుగు అనేవి రెండు విభిన్న భాషలను గుర్తించాడు. తను రచించిన కుమార సంభవంలో ఈ భేదాన్ని స్పష్టంగా చెప్పాడు; మును మార్గ కవిత లోకంబున నిల్పి ఆంధ్ర విషయంబన, దేశి కవిత బుట్టించి తెనుగున, జన చాళుక్యరాజు మొదలగ బల్వుర్; అంటే కవిత్వంలో కూడా రెండు రీతులు ఈ రెండు భాషలూ పాటించాయని తెలుస్తున్నది. ఆంధ్ర కవులు పూర్తిగా సంస్కృత పదభూయిష్టమైన మార్గ కవిత నెన్నుకుంటే, తెలుగువారు తేనెలొలుకు ప్రాంత భాషలో కవితలల్లారు.

20వ శతాబ్దంలో కూడా ఈ రెండు భాషలు వేరన్న భావమే స్పష్టంగా ఉంది. ఆంధ్రులు తమ స్వరాష్ట్రం కోసం 1911 నుంచీ నడిపిన సభలను కూడా ‘ఆంవూధమహాసభ’లు అన్నారే కానీ తెలుగు అన్న పదమే ఎక్కడా వాడలేదు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఆనాడు నిర్వహించిన సభని కూడా ‘ఆంవూధమహాసభ’ అనే వ్యవహరించారు. (అప్పుడు ‘ఆంధ్ర అంటే కోస్తాంధ్ర, రాయలసీమ కలిసి అని అర్థం. ఆంధ్రవారితో కాపురంలో చేదు తెలియనంత కాలం సీమ ప్రజలు తాము కూడా ఆంధ్రులమనే చెప్పుకున్నారు.) తెలుగు అనే పదం పూర్తిగా త్రిలింగ దేశానికి సంబంధించినది. మొట్టమొదటి ముస్లిం రాజులు ఈ ప్రాంతాన్ని తెలంగాణ’ అనీ వారు మాట్లాడే భాషని ‘తెలంగి’ అని పిలిచారు. నిజానికి ఆంధ్రులు మధ్య భారతదేశంలో ఉన్నప్పుడే ఈ ద్రవిడ భాషలు ఎదిగాయి.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడే వరకు ఆంధ్రజాతి ప్రజలు మాట్లాడే భాషని అందరూ ‘ఆంవూధ’మనే అనేవారు. 1956 వరకూ వచ్చిన వార్తాపవూతికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కూడా వారు ఆంధ్ర రాష్ట్రం కోసం తపించారు. కానీ ఎక్క డా తెలుగు రాష్ట్రం అన్ని మాటేలేదు.

నిజానికి ఆ భాష తెలుగు అన్న సోయి ఉంటే 1948 నుంచి భారతదేశంలో కలిసిన తెలంగాణ ప్రాంతాన్ని 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడే తమతో కలపాలని ఎందుకు కోరలేదు? తెలంగాణ తెలుగు, తమ ఆంధ్రం ఒకే భాష అని గుర్తించడానికి మూడేళ్ళు పట్టాలా? అది తాము ప్రత్యేక రాష్ట్రంగా మనగలిగే ఆర్థి క వనరులు ఆంధ్రవూపాంతానికి లేక మూడేళ్లలోనే వ్యవస్థ చతికిలపడ్డాక రెండు భాషలూ, ఒకటే అని గుర్తించారా? ఈ విలీనానికి కారణం భాషా సారూప్యంకాదు, భావసమైక్యత అంతకం సహజవనరులతో అలరారుతున్న తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం ఆంధ్రం, తెలుగు ఒకే భాష అన్న అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. అప్పుడే మొదలైన భాషావూపయుక్త రాష్ట్రాల సూత్రాన్ని ఆశ్రయించి ఈ రెండు భాషలు ఒకటనీ, తాము వేల ఏళ్ల నుంచీ కలిసున్న సోదరులమనీ, తెలుగు తెలియని నెహ్రూను నమ్మించారు. ముఖ్యంగా ఫజల్ అలీ కమిషన్ ఈ రెండు ప్రాంతాల కలయిక తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తుందని చెప్పగానే ఖంగుతిన్న ఆంధ్ర రాజకీయ నాయకులు తెలుగు జపం మొదలుపెట్టారు. 1955లో విడుదలయిన మాయబజార్, సినిమాలో కూడా గోంగూరని ఆంధ్రమాత అని చెప్పించిన ఆంధ్రులకి హఠాత్తుగా తెలుగువారు సోదరులైపోయారు. కానీ దురదుష్టమేమిటంటే వారి సహజమైన దోపిడీ గుణం మానుకోలేక తెలంగాణ వారికి పూర్తిగా దూరమయ్యారు.

ద్రవిడ సంస్కృతి ఉన్నత తమిళులు, కన్నడిగులు ఇక్కడి ప్రజలతో మమేకమై వందల ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఈ ప్రాంతంలో బతుకుతూ స్థానికులైపోయారు. కానీ ఒకేభాష అని చెప్పుకుంటున్న ఆంధ్రులు మాత్రం ఇక్కడి ప్రజలతో ఏ ఒక్క విషయంలోనూ స్నేహపూర్వకంగా లేకపోవడానికి కారణం వారి ఆర్య సంస్కృతిలో ఉన్న దోపిడీదారీ, పెత్తందారీ విధానమే. నిజానికి మద్రాసులో తమిళులతో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులు కలిసిలేకపోవడం కూడా ఇదే కారణం. తమిళులది పూర్తిగా ద్రవిడ సంస్కృతి, సంప్రదాయం. ఆంధ్రులది అంతా ఆర్య సంస్కృతి!
అర్థ శతాబ్దం తర్వాత కూడా ఈ రెండు ప్రాంత ప్రజలకి, నాయకులకి కూడా మధ్య పదాల, జాతీయాల విషయంలో మాటల యుద్ధం జరగడం అనేది చూస్తున్నాం. మాటల యుద్ధమంటే ఒకళ్ళనేది ఇంకోక్ళకి అర్థమైకాదు, అర్థంకాక కొట్టుకుంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం;

ఒకసారి అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌డ్డి విపక్షనేత చంద్రబాబుని ‘తాటవలుస్తా’ అన్నాడు (ఆమాట దివాకరడ్డి తరచు వాడుతూనే ఉంటాడు.)ఆంధ్ర, రాయలసీమ నేతలకి, ప్రజలకి ఆమాట తప్పనిపించలేదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అలా అనడం చాలా సహజం కనుక. తెలంగాణ నాయకులకి, ప్రజలకి ఆమాట అర్థం కాదు.

కనుక వాళ్ళు ప్రతిస్పందించలేదు. అదే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు జానాంతికంగా ‘నాలుకకోస్తారు’ అనగానే ఆంధ్ర నాయకులకి విపరీతమైన కోపం వస్తుంది. నిజానికి తెలంగాణలో ప్రతి ఇంట్లో వినబడే పదం అది! నిష్పాక్షికంగా ఆలోచిస్తే ‘తాట వలవడం’ కంటే ‘నాలుకకోయడం’ తక్కువ ప్రమాదకరం. కానీ అర్థంకానీ ఒక్క జాతీయం కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టగలదు. ఎందుకంటే ఆ భాషావూపయోగాలు వేరు కనుక! పూర్తిగా వేరయిన ఈ రెండు ప్రాంతాల చరిత్ర, సంస్కృతి లాగే భాష, జాతి వేరు. ఈ ప్రాంతం వారు ఆడపిల్లని పుట్టింటికి ‘తోలుకు’ వస్తారని అంటారని, ఆంధ్రులు తాము పశువులని తోలుకు వస్తాం గానీ మనుష్యులని కాదు అని ఎక్కిరిస్తారు. పైగా తాము ఆడపిల్లని తీసుకు వస్తామని గొప్పగా చెప్తారు. కానీ తెలంగాణలో ఒక పీనుగునే తీసుకు వెళ్తారు. బతికున్న వాళ్ళని కాదు.

ఒక్క పదం కూడా రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టగలిగినంత వైవిధ్యమున్న రెండు భాషలు ఆంధ్రం, తెలుగు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో ఉన్న సారవంతమైన భూములు ఆంధ్రా పెట్టుబడిదారులకి కబ్జా చేయడం తేలికేకానీ, శ్రీకాకుళం నుంచో, కడప నుంచో వెళ్ళిన ఆంధ్రావారు ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ వారి స్వచ్చమైన తెలుగు భాష అర్థం చేసుకోవడం మాత్రం అసాధ్యం. ఒకే అక్షరమాల ఉన్న ఇంగ్లిషు, ఫ్రెంచ్, జర్మనీ, లాగే ఆంధ్రం తెలుగు కేవలం అక్షర మాల మాత్రం ఒక్కటే. భాషలు పూర్తిగా వేరు. తెలుగు అన్న పదాన్ని మొట్టమొదలు శంకరంబాడి సుందరాచారి తన కవిత్వంలో లాలిత్యం కోసం తస్కరించి ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ సృష్టించాడు. అప్పడు నిజమైన తెలుగు వాళ్ళంతా నిజాం ప్రభుత్వంలో వేరే దేశంలో ఉండటం వల్ల ఈ భాషా కబ్జా వారికి తెలియలేదు.

1956 తర్వాత ఆ మల్లెపుదండ తెలుగువారి మెడలో ఉరితాడై బిగిసింది. సుందరాచారి తన పాట కోసం ‘తెలుగు’ అన్న పదాన్ని తస్కరిస్తే, ఎన్టీ రామారావు రాజకీయ కోసం వాడుకున్నాడు. నిజానికి తెలుగుదేశం వారు పరాయిపదాన్ని ముప్ఫై ఏళ్లు వాడుకుని నిజమైన తెలుగువారైన తెలంగాణ వారికి అన్యాయం తలపెడుతున్నా రు. తెలంగాణ వచ్చేలోపల, వచ్చాక కూడా మనభాష తెలుగని, వారి భాష ఆంధ్రమని మనం ప్రపంచానికి తెలియచెప్పాలి.

ఇప్పుడు మనం వెంటనే చెయ్యవలసినది చాలా ఉన్నది. ఆంధ్రులకు ఎలాగు వారి మాతృభాష మీద గౌరవం లేదు. వచ్చే యాభై ఏళ్ళలో ఆ భాష చచ్చిపోతుందని యునెస్కో వాళ్ళు ఈ మధ్యనే చెప్పారు. మనం మాత్రం ఇప్పటి నుంచి పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు మన భాషలో మనకు సంబంధించిన పాఠ్యాంశాలు పిల్లల కోసం తయారుచేసి బోధించాలి. దీనికి కరీంనగర్ ఉపాధ్యాయుడు ఒకాయన శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఉద్యమం పుణ్యమాని వేల పాటలు వచ్చాయి. ఇంక కథలు, చరివూతకు సంబంధించిన అంశా లు మన భాషలో రాసుకోవాలి. తెలంగాణ సాహిత్య చరి త్ర ప్రచురణకు సిద్ధంగా ఉంది. దాన్ని మనందరం చదివి మన భాషను వృద్ధి చేసుకుందాం. తెలంగాణ తెలుగుని కాపాడుకుని మన సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర గురిం చి అచ్చ తెలుగులో ప్రపంచానికి చెబుదాం.

-దంటు కనకదుర్గ

37

KANAKADURGA DANTU

Featured Articles