కసియేనామం ‘కరుణ శ్రీ’


Sat,October 6, 2012 03:59 PM

నవంబర్ ఒకటి 1956 నుంచి తెలంగాణకు చెందిన సంపద నిర్లజ్జగా ఆంధ్ర ప్రాంతానికి తరలించిన వలసవాద పాలకులకు 196లో ఉవ్వెత్తుగా లేచిన తెలంగాణ ఉద్యమంతో గొంతులో వచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. దీంతో విషం కక్కడం ప్రారంభించారు. మాటల్లో, చేతల్లో, పద్యాల్లో, గద్యాల్లో ఎలా వీలయితే అలా, తమ అక్కసు ఆ రోజు నుంచి ఈ రోజుదాకా- వెళ్ళగక్కుతూనే ఉన్నారు.
కవితేనామం ‘కరుణ శ్రీ’ అని పెట్టుకున్న జంధ్యాల పాపయ్యశాస్త్రి ఆ కవితాకారులకు నాయకత్వం వహించి ఆంధ్రమాత తరుఫున ‘కన్నతల్లి కన్నీటి లేఖ’ అని ఒక పెద్ద పద్యం రాశాడు. ఒక కవికి ఉండవలసిన సున్నితమైన ఆలోచనలుగానీ, పేరులో పెట్టుకున్న కరుణ గానీ ఆయనకు లేవని ఆ పద్యం నిరూపించింది. కవిత్వంలో కవుల భాషాజ్ఞానమేకాకుండా, భావాల్లో కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రతిబించాలి. కానీ కరుణ శ్రీ పద్యంలో అపరితమైన ద్వేషం కనబడుతుంది. ‘ప్రత్యేక తెలంగాణ- దక్షిణ పాకిస్థాన్ అంటూ తన విద్వేషాన్ని కక్కాడు. ఉద్యమకారులను కించపరుస్తూ ‘భస్మాసురులున్నారోయ్- తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త’ అని రాశాడు. ఆ పద్యం నాటి నుంచీ నేటి దాకా తెలంగాణ ఉద్యమం మీద విషం చిమ్ముతున్న ‘ఆంవూధజ్యోతి’ దిన పత్రికలో 196లో ప్రచురితమైంది.

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కరుణ శ్రీ కవితకు బాసిరి సాంబశివరావు అనే తెలంగాణ వాది ‘కన్నతల్లి సందేశం’ అనే కవిత ద్వారా సమాధానం ఇచ్చారు. కానీ వలసవాద ఆంధ్రజ్యోతి అప్పుడు కూడా ఆంధ్రుడి విషాగ్నిని ప్రచురించింది కానీ, దానికి తెలంగాణ వాది సమాధానం ప్రచురించలేదు. కరుణ శ్రీ మాటల తూటాలను సాంబశివరావు ఎలా ఛేదించారో వాటిని పక్క పక్కన పెట్టి చూస్తే తెలుస్తుంది.
‘కన్నతల్లి కన్నీటి లేఖ’ - కరుణ శ్రీ
‘కన్నతల్లి సందేశం’- సాంబశివరావు

క: గుండెపగిలి పోతున్నది-గొంతు సురిగిపోతున్నది.
సా: దుండగాలు చూడలేక గుండెపగిలిపోతున్ననది.
క:చార్‌మినార్ చేతుపూత్తి శాంతి శాంతి అంటున్నది.
సా:చార్‌మినార్ చేతుపూత్తి చోర్‌చోర్ అంటున్నది.

సెగలు పొగలు చెలరేగెను, /పగలు పాములై మూగెను
అమరజీవి హృదయంపై / అగ్ని పర్వతం మ్రోగెను. అని కరుణశ్రీ రాశాడు. కానీ పొట్టి శ్రీరాములు తమిళులనించి విడిపడి కోస్తా, రాయలసీమలోని ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పర్చుకోవాలని మాత్రమే దీక్షచేశాడు. ఆయన మరణాన్ని అరవై ఏళ్ళుగా ఆంధ్రవూపదేశ్ కోసం చేసిన గొప్ప త్యాగంగా పొగిడే సీమాంవూధులకు తెలంగాణలో జరిగిన బలిదానాలు గొప్పగా కనపడవా?
క:ఇది నా కన్నీటి లేఖ/ఇది నాదురదృష్ట రేఖ
మసిలో కన్నీరు కలిపి/మాతృశ్రీ వ్రాయులేఖ

సా:అన్నలు చేసిన మోసం/తమ్ముల మది ఆకోశ్రం
కనినేనోర్వలేకైవాయుచుంటి నిట్టిలేఖ

క:కర్ఫ్యూలకు స్వస్తి చెప్పి/నెయ్యాలకు కేల్‌సాపుడు
అన్నదమ్ములన్యోన్యం/ఆయుధాలు దూయకండి

సా:కలయిక యన మిషమాటున/కలతలతోమున్గితిరి,
ఐక్యత బురఖా చాటున/సఖ్యతనే కోల్పోయిరి.

కటైపత్యేక తెలంగాణ - పగబట్టిన దృక్కోణం
ప్రత్యేక తెలంగాణ- స్వార్థపరుల నిర్మాణం
ప్రత్యేక తెలంగాణ- భరతభూమి కవమానం
ప్రత్యేక తెలంగాణ- దక్షిణ పాకిస్థానం.

సాటైపత్యేక తెలంగాణము- ప్రగతి కూర్చు నిర్మాణం
ప్రత్యేక తెలంగాణము- కలతదీర్చు సోపానం
ప్రత్యేక తెలంగాణ కాదది పాకిస్థానం.
ప్రత్యేక తెలంగాణము పచ్చని బతుక్కి స్థానం’

క:‘దింపుడు ఉష్ణోగత- సాధింపుడు సర్వ సమక్షిగత
భస్మాసురులున్నారోయ్- తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త,

సా:‘స్వార్థమ్మును పొక్కనీక, వేర్పాటును కాదనియెరు.
స్వంతానికి తగినయట్లు ఏర్పాటును చేసికొనెదరు.
వంచన వాగ్దానమ్ములు- పెంచవు సర్వ సమక్షిగత
వంచకులను నమ్మవద్దు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.’

ఈ నలభై ఏళ్ళ అనుభవం సాంబశివరావు మాటలు ఎంత సరైనవో నిరూపించాయి.
కన్నతల్లి కడుపు మీద- కత్తి పెట్టి కోయకండి
అన్నపూర్ణ రొమ్ములపై - హాలాహలం పూయకండి
అటు ఎవ్వరు, ఇటు ఎవ్వరు అంతా నా సంతానమె
నా తెలుగు నా వెలుగులు- నా హృదయం నా ప్రాణం’
‘ఒకే రీతి ఒకే జ్యోతి- ఒక్కొటొకటి ఒకే జాతి’
అచ్చట దురాక్షికమణలా -ఇచట బహిష్కరణలా
అచట తిరస్కారాలా- ఇచట సజీవదహనాలా
ఒక్కతల్లి బిడ్డలలో ఎక్కడి దయ్యా ఈ కసి
చక్కని సౌధం నడిమికి ముక్కలు చేసే రక్కసి’అని కరుణశ్రీ రాశారు. కానీ దురాక్షికమణలు ఎవరు ఎక్కడ చేశారో, హైదరాబా ద్ సౌధాలన్నీ ఎలా ఆక్రమింపపడ్డాయో తెలంగాణ వారికి తెలిసినట్టు ఆంధ్రలో బతికే ఆంధ్రులకు ఎలా తెలుస్తుంది? పైగా తెలంగాణలో సజీవ దహనాలవుతున్నట్టు చెప్పే ఈ కవి ఈ ప్రాంతం వారిని బెదిరించటానికి మాత్రం సందేహించడు.

‘ఎగబడితే ఎదుటివాడు- తెగబడుట యదార్థమురా’
అంటూ తెలంగాణలో తెలంగాణ వారి మీద దండయావూతలు చెయ్యటానికైనా ఆంధ్రులు సిద్ధమేనని హెచ్చరించగలడు. పైగా వారి ప్రియజనని’ తెలంగాణ వారికి కూడా తల్లే నని దబాయించాడు. ఆంధ్రవారు ఆక్రమించి వికృతీకరించిన ‘భాగ్యనగరాన్ని’ కాపాడుకోవాలని ఒక ఉచిత సలహా పారేశాడు. తెలంగాణ వారిని దానవులుగా వర్ణిస్తూ వారి దారులు పెడదారులని నిందించాడు.
‘మసిపట్టిన దానవులను-మానవులు గావింపుడు
ఎరుగని పెడదారులబడి-ఇక్కట్లకు లోనైతిరి’ అంటూ తనకు తెలియకుండానే ఆంధ్ర పెత్తనంలో తెలంగాణ వారు నష్టపోయారని చెప్పేస్తాడు. తెలంగాణ వారే వాగ్దానాలు చేసి ఆంధ్రని ‘కలుపుకొన్నట్లు వక్రీకరించాడు పాపయ్యశాస్త్రి.

పలికిన వాగ్దానాలకు-భంగం రానీయకండి
అన్నదమ్ములొకరి కొకరు-అన్యాయం చేయకండి
జరిగిన పొరపాటు మళ్లీ- జరుగకుండ చూసుకోండి
చేసిన తప్పులు మళ్లీ -చేయకండి చూచుకోండి’ అంటూ తెలంగాణ వారిమీద తప్పు నెట్టేస్తాడు. ఆంధ్రవారు తమ వాటా నీటిని దోపిడీ చేస్తుంటే తెలంగాణ వారికిమాత్రం ‘నిండుగుండె పొలములలో పండింపుడు సానుభూతి’ అని సూక్తులు చెప్తాడు.

అయితే సాంబశివరావు ‘అంతులేని ఆకలితో-ఆక్షికమణలు చేయకురా/నింగిలోని స్వర్గాలకు-నిచ్చెనలు వేయకురా’ అని ఆంధ్ర పాలనలో తెలంగాణ వారి అభివృద్ధి అసాధ్యం అని తేల్చేశాడు.
1969 ఉద్యమం నాటికి ఆంధ్రలో ఉన్న సామాన్య ప్రజలకు ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణకు జరిగిన అన్యాయం కానీ, తమ ప్రాంత నాయకులు చేసిన మోసాలు కానీ తెలియదు. 1956 తర్వాత తెలంగాణకు వచ్చి స్థిరపడిన ఆంధ్రులకు తాము ఎక్కడ వెనక్కు వెళ్లాల్సి వస్తుందో అన్న బాధ తప్ప ఇంకేంలేదు. ఆ సమయంలో సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించి తెలుగు, ఆంధ్రవూపజల మధ్య విద్వేషం రగిలించే విధంగా తన కవిత్వ పటిమను ఉపయోగించాడు జంధ్యాల.
జంధ్యాల కవితకు సాంబశివరావు ఎంత సమన్వయంతో జవాబు రాశారో చూద్దాం.
‘ఐనదేమో ఐపోయెను-అంతా సెగలై తోచెను/ఎవరి ఉదాసీనతయో-చెడు గాలులు వీచెను
అంతానాకాత్మీయులె- పంతాలకు దిగకండి/చింతలలో ముంచినారు-స్వాంతం ఛేదించకండి
కలిసి మెలిసి ఉందామని-కలతల్లో మునగకండి/తెలివిమాని అదేపనిగ-కలహాలను పెంచకండి’
అంటూ సయోద్య సాధించే ప్రయత్నం చేశాడు. ఈ కలిసుండడం వలన ఏమీ మంచి జరగదని వివరించాడు.

‘ఒప్పందం జూదంలో-తప్పటడుగులే పడినవి
ఆ యడుగులు అడవుల బడి-దశాబ్దాలుగా చెడినవి’అంటూ వివరించాడు.
‘కమ్మని కబుర్లు చెబుతూ-కబళించుట స్వార్థమురా
కలసి మీరు పంచుకొనెడు- ద్వేషము దౌర్భాగ్యమురా
చెలిమిగ విడిపించుకొనెడి- స్నేహమె సౌభాగ్యమురా
వంచనపూదురైనయపుడు- విశ్వాసం సడలి నపుడు
మంచితనంతో విడువడి-మమతలు పంచుకొనుడు
అమాయకుల మనసులలో-అనుమానం తొలగనపుడు
పలికిన వాగ్దానాలకు- భంగం వాటిల్లినపుడు
అన్నే తమ్ముని వదలక- అన్యాయం చేసినపుడు
జరిగిన పొరపాట్లు మళ్లీ-జరుగుటయే ఆగనపుడు
చేసినపొరపాట్లు మళ్లీ - చేయుటయే సాగినపుడు
కలిసి మీరు జీవించుట-కలలో మాటన్పించెను
కన్నతల్లి గుండెలు మేము-కనజాలక కంపించెను’
అంటూ జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఆనాడే స్పష్టంగా చెప్పడమే కాకుండా ఈ రెండు ప్రాంతాలు విడిపోవడం అనివార్యమన్న విషయం నిశ్చయంగా చెప్పాడు తెలంగాణ కవి.

‘వంద ఏళ్లు బతికినను- బొందిని వదలుట ఖాయం
వెయ్యి ఏళ్లు కలిసున్నను- వేరుపడుట న్యాయం’
ఒకరి దురాశ వలన విడిపోయిన అన్నదమ్ముల దృష్టాంతాలు కూడా వివరించాడు.
‘కురు పాండవ సహోదరులు-వేరుగ మను వీలున్నను
సుయోధనుని మొండిపట్టు - శోకమ్మున ముంచెత్తెను
కురుక్షేత్ర సంగ్రామం -జరుగకుండ కాపాడుడు’
మహాభారత దృష్టాంతం చెప్తూనే అటువంటి యుద్ధం అంధ్ర , తెలుగు ప్రజల మధ్య జరుగ కూడదని కాంక్షించాడు. విడిపోయి కలిసి బతుకమని సలహా ఇచ్చాడు.
‘వేరై ఒకరికి ఒకరు -తోడై బ్రతుకం జూడుడు
అచట ఇచట వేరున్నను- అంతా నా సంతానమే
అందరు సుఖముల దేలిన -అదియే నా సంతోషము’
అని ఒకవేళ ఈ ప్రాంతాల వారికి అన్నదమ్ముల అనుబంధం ఏమాత్రం ఉన్నా కూడా, విడిపోవడమే శరణ్యమని భావించాడు. ఈ రెండు ప్రాంతాల ప్రజలు కలిసి ఉండడం ఎందుకు అసాధ్య మో వివరించాడు. వారి జాతి, భాష, సంస్కృతి, చరిత్ర, పూర్తి వేరని ఆనాడే .. దాదాపు నాలుగు దశాబ్దాల క్రిందట ఈ మహాకవి చెప్పిన వేదం ఆంధ్ర బుద్ధికి ఎక్కలేదు. ఇంకా దోపిడీ, దురాగతాలు సాగుతూనే ఉన్నాయి.
ఆంధ్రులను సమర్థించిన జంధ్యాల పాపయ్యకు నిజాలను వివరించాలని, 1969 ఉద్యమంలోకి మేధావి వర్గాన్ని దింపి, వారికి నాయకత్వం వహించిన ఆనందరావు తోట తమ మిత్రులు జయశంకర్‌ను తీసుకొని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని కలవటానికి 1970లో ప్రత్యేకంగా విజయవాడ వెళ్లారు. ఆరోజు వారి మధ్య సుమారు నాలుగు గంటల పాటు సంభాషణ సాగింది.

-కనకదుర్గ దంటు

35

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల