తెలుగు వైభవం తెలంగాణలోనే


Thu,August 18, 2016 01:08 AM

-తెలుగు భాష - సంబురాలు-2
ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాటు పర భాషలన్నింటినీ ఈ నేల ఆదరించింది. అందుకే కన్నడిగుడైన పంప మహాకవి గానీ, గుజరాత్‌కు చెందిన సోమదేవ సూరి కానీ ఈ నేలను తల్లిగానే భావించారు. అంతేకాదు ఇక్కడి సాహిత్యంలో అన్యాయానికి ఎదిరింపు కనపడుతుంది.అవినీతి, వివక్ష, దురభిమానం లాంటి లక్షణాలను ఏ రచయితా సహించలేదు.

మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం రాసినది పొన్నకంటి తెలగన్న. అద్భుతమైన వర్ణనలు కలిగిన తన యయాతి కథను అచ్చతెలుగు కావ్యంగా మలిచి అమీన్‌ఖాన్‌కు (ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానంలో ఉద్యోగి) అంకితమిచ్చిన ఘనుడు తెలగన్న.

తెలుగులో మొట్టమొదటి నిరోష్ట్య కావ్యం (దాశరథ రాజ నందన) రాసిన మరింగంటి సింగరాచార్యులు కూడా తెలగన్న లాగా అచ్చ తెలుగునే ఉపయోగించాడు. సహజ కవి అయిన సింగరాచార్యులు తన రచనలన్నీ 9 నుంచి 20 సంవత్సరాల లోపు రచించాడు. ఆయన ద్వ్యర్థి, త్యర్థి కావ్యాలు కూడా రాశా డు. ఏకామ్రనాథుడు రచించిన ప్రతాప చరిత్ర (1550 క్రీ.శ) తెలుగులో మొట్టమొదటి గద్య రచన. కాకతీయ రాజుల వైభవం ఈ రచనలో తెలుస్తుంది. కందుకూరి రుద్రకవిని ఆంధ్ర కవిగా ముద్రవేసి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవిగా చిత్రీకరించారు సీమాంధ్ర ఆధి పత్యవాదులు. కానీ ఆయన ఊరైన కందుకూరు, ఆయనకు ఇబ్రహీం కుతుబ్‌షా బహూకరించిన చింతలపాలెం నల్గొండ జిల్లాలో ఉన్నాయి. 16వ శతాబ్దానికి చెందిన రుద్రకవి (1550-1570) జనార్దన శతకము, సుగ్రీవ విజయము, నిరంకుశోపాఖ్యానము అన్న రచనలే కాక తెలుగులో మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజ యం రచించాడు.

ఇక 20వ శతాబ్దంలో సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) చేసిన సాహిత్యసేవ తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచ పటం మీద నిలిపింది. తెలంగాణలో సాహిత్యం లేదు, కవులు, పండితులు లేరు అన్న వ్యర్థ వాదన ను ప్రతాపరెడ్డి తన గోలకొండ కవు ల సంచికతో తిప్పికొట్టారు. సంస్కృ తం, తెలుగులో రచనలు చేసిన 354 మం ది తెలంగాణ సాహిత్యకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డిదే. నిజానికి కరుణశ్రీ పుష్పవిలాపం కంటే ముందే తెలంగాణ కవి అయిన కోదాటి రామకృష్ణారావు సుమవిలాపం (1934) రాశారు. ఈ నిజాలన్నీ ఉమ్మడి రాష్ట్రం లో నిరంకుశంగా అణిచివేయబడ్డాయి. తెలంగాణ ప్రజలకే వారి సొంతగడ్డ సాహిత్య చరిత్ర తెలియనంతగా మరుగునపడ్డాయి.

సురవరం ప్రతాపరెడ్డి కవుల సంచికతోనే సంతృప్తి పడలేదు. మొట్టమొదటగా ఆంధ్రుల సాంఘిక చరిత్రను కూడా రచించా డు. వారి ఇంకొక రచన హిందువుల పండుగలు వివిధ పండుగల్లోని శాస్త్రీయ అంశాలను బయటకు తెచ్చింది. వివిధ పురాణా ల్లో, చరిత్ర పుస్తకాల్లో శాస్ర్తాల్లో ఉన్న అంశాలను, పండుగల్లో వాటి వైశిష్ట్యాన్ని చాటి చెప్పింది ఈ పుస్తకం. అంతేకాదు, సురవరం వారి పరిశోధనల వల్లనే తెలుగులో మొట్టమొదటి చిన్నకథ 1900 సంవత్సరంలోనే తెలంగాణలో వచ్చిందనీ, ఆంధ్రు లు ప్రచారం చేసిన దిద్దుబాటు (1910) మొదటి కథ కాదనీ తేలింది. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం రచించిన రాజశేఖర చరిత్ర (1872) మొదటి తెలుగు నవలగా ప్రచారం చేశారు. కానీ తడకమళ్ళ వెంకటకృష్ణారావు (1830-1890) రచించిన కంబుకంధర చరిత్ర 1866) తెలుగులో రాయబడిన మొట్ట మొదటి నవల. తడకమళ్ళ కృష్ణా రావు నల్లగొండ జిల్లాకు చెందిన రచయిత.
ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యా లు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది.

మాతృభాషాభిమానంతో పాటు పర భాషలన్నింటినీ ఈ నేల ఆదరించింది. అందుకే కన్నడిగుడైన పంప మహాకవి గానీ, గుజరాత్‌కు చెంది న సోమదేవ సూరి కానీ ఈ నేలను తల్లిగానే భావించారు. అంతేకాదు ఇక్కడి సాహిత్యంలో అన్యాయానికి ఎదిరింపు కనపడుతుంది. అవినీతి, వివక్ష, దురభిమానం లాంటి లక్షణాల ను ఏ రచయితా సహించలేదు.16వ శతాబ్దంలో రుద్ర కవి రాసి న నిరంకుశోపాఖ్యానంలో భర్త చెడు అలవాట్లను భార్య ప్రశ్నించడం కనబడుతుంది. అతనికి బుద్ధి గరపమని ధైర్యంగా కోడలు అత్త మామలను అడుగడం ఆ రచనలోని విశిష్టత. నన్నయకు పూర్వమే ప్రాకృతం, సంస్కృతం, కన్నడం, తెలుగు భాషల్లో సాహిత్యం సృజించింది తెలంగాణ ప్రాంతం. తర్వాతి కాలంలో కూడా విద్యానాథుడు, జాయప సేనాని, సర్వజ్ఞ సింగ భూపాలుడు, ధర్మసూరి వంటి పండితులు నృత్యం, సంగీతం, వివిధ శాస్ర్తా ల మీద రచనలు పండించారు. మల్లినాథసూరి లాంటి వ్యాఖ్యాతలు, గరిక పాటి అన్నంభట్టు వంటి తర్కశాస్త్రజ్ఞులు ఎంతోమంది తమ జ్ఞానం తో ఈ తల్లిని కొలిచారు.

ఆధునిక యుగంలో గుండేరావు హర్కరే, ఖండవల్లి నరసింహశాస్త్రి, శ్రీభాష్యం విజయ సారథి వంటి మహా రచయితలు సంస్కృత భాషా సాహిత్యాలలో వారి రచనలు పూయించారు. అనేకమంది పార్శీ, ఉర్దూ సాహిత్యకారులతో దీటుగా మాడపాటి హనుమంతరావు, బూర్గు ల రామకృష్ణారావు, మందుముల నర్సింగరావు వంటి పండితులు ఉర్దూ, పార్శీ భాషల నుంచి ఎన్నో గ్రంథాలను తీసుకుని తెలుగులోకి అనువదించారు.
ఇంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిన తెలంగాణ సాహిత్యం వివిధ భాషలతో కనిపించడమే కాక తెలుగుకు ప్రాచీన హోదా తెచ్చి పెట్టడంలో ఆశ్చర్యం ఏమీలేదు. అయితే ఇన్నాళ్ళూ మరుగునపడ్డ ఈ సాహిత్యాన్ని వెలికి తీసి పాఠశాల, కళాశాల పుస్తకాల్లోనే కాక డిగ్రీ, పీజీ కోర్సులలో కూడా విద్యార్థులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరాలి. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు యూనివర్సిటీని (పొట్టి శ్రీరాములు పేరు తీసేసి) ప్రక్షాళనచేసి తెలంగాణ సాహిత్య దర్శనానికి బాటలు వేయాలి. సాహిత్యంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఇన్ని ప్రక్రియల్లో మొట్టమొదట రచనలు చేసిన తెలంగాణ కవులు రచయితలకు తగినంత ఖ్యాతి రావాలి.

1872

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Published: Sun,February 16, 2014 12:11 AM

అపర గజనీల రాజ్యం

‘ఒ క్క దెబ్బతో రెండు పిట్టలు’ అన్న సామెత తప్పు. ఒక్క దెబ్బతో ఎన్ని పిట్టలనైనా కొట్టొచ్చన్నది మన కళ్లముందు కనిపిస్తున్న సత్యం. అంట

Published: Sun,October 27, 2013 12:55 AM

నీలం నుంచి నల్లారి దాకా

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కేంద్రీకరణ అయిన విధానాన్ని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అంతేగాకుండా ప్రజలు నేర్చుకోవలసిన అనేక

Published: Sat,August 24, 2013 12:26 AM

‘రాయల’ ప్రతిపాదన మరో తప్పు

ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు వ్యతిరేకంగా హైదరాబాద్ (తెలంగాణ), ఆంధ్రరాష్ట్రాల విలీనమే చరిత్ర లో కాంగ్రెస్ చేసిన అతిపెద్ద త

Published: Sat,October 6, 2012 03:59 PM

ఐక్యతతోనే ఆశయ సాధన..

జయశంకర్ స్ఫూర్తి సభలు జిల్లాల్లో, హైదరాబాద్‌లోనూ జరుపుకున్నాం. జయశంకర్ స్ఫూర్తి అంటే ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ ఒక్క విషయం మనం అర్థం

Published: Sat,October 6, 2012 03:59 PM

కసియేనామం ‘కరుణ శ్రీ’

నవంబర్ ఒకటి 1956 నుంచి తెలంగాణకు చెందిన సంపద నిర్లజ్జగా ఆంధ్ర ప్రాంతానికి తరలించిన వలసవాద పాలకులకు 196లో ఉవ్వెత్తుగా లేచిన తెలంగా

Published: Sat,October 6, 2012 03:59 PM

‘ఇల్లరికపుటల్లుడు’

భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెవూహూ దూరదృష్టి లేక చేసిన పనులకు ఫలితాలు ఈ దేశ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఒక నాయకుడికి హ్ర

Published: Sat,October 6, 2012 04:00 PM

తెలంగాణపై బాబు కపట నీతి!

చంద్రబాబు ఏ ప్రాంత ఆకాంక్షల గురించి అయినా మాట్లాడగలగాలి. ధైర్యంగా భావాల్ని వ్యక్తపరచగలగాలి. సోనియాగాంధీ మొహం చాటేసింది కనుక, తాన