ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్


Sat,June 11, 2016 01:21 AM

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణాత్మ కంగా ఎదుగుతుంది. అందుకే విద్యారంగ ప్రగతి ఒక సమాజానికి అత్యం త ముఖ్యమైనది. ప్రస్తుతం తెలంగాణలో విద్యారంగంలో రావాల్సిన మార్పుల్లో.. దేశ విద్యారంగానికే పెద్ద సమస్యగా మారిన భాషా మాధ్యమ అంశం ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో అనుసరించాల్సిన విధానం గురించి ఇంకా లోతైన విశ్లేషణ అవసరం.

పిల్లల ఎదుగుదలలో మాతృభాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. భావాలు ఏర్పడటానికి, సంపూర్ణంగా ఎదగడానికి మాతృభాషలోనే పాఠశాల చదువు సాగాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు అనివార్యం. కాబట్టి ఏ ఉద్యోగానికైనా, పై చదువుకైనా ఇంగ్లీష్ కావాలి. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలి. విద్య విషయంలో ఇప్పటిదాకా వెనుకబడిన విద్యార్థులకు తప్పనిసరిగా ఇంగ్లీష్ మాధ్యమంలోనే చదువు చెప్పాలి. నిజానికి ఈ రెండు వాదనలూ చాలా బలమైనవే. అయితే ఈ రెండూ నాణానికి ఒకవైపే చూస్తున్నాయి. వాస్తవిక స్థితిని సంపూర్ణంగా ప్రతి ఫలించడం లేదు.

మాతృభాషా మాధ్యమాన్ని కోరే వారికి కొన్ని ప్రశ్నలు: 1) మాతృభాష మాధ్యమమని తెలుగు మాధ్యమంలో బోధించాలంటే బంజారా, కోయ, గోండు వంటి జాతుల వారికి, సరిహద్దు దగ్గరగా ఉన్న జిల్లాలలో కన్నడం, మరాఠీ మాట్లాడేవారికి, హైదరాబాద్‌లోనే ఉన్న మలయాళి, తమిళ, కన్న డ, గుజరాతి, పంజాబీ, మార్వాడీ, బెంగాలీ, ఒరియా మొదలైన భాషలు మాతృభాషలుగా ఉన్న వారికేన్యాయం చేసినట్టు? 2) రాష్ట్ర ప్రభుత్వం గిరి జన, దళిత, బహుజన జాతుల, కులాల విద్యార్థులకు పెద్దపీట వేయాలని భావిస్తున్నది. ముస్లింలకు ఉర్దూ మాధ్యమం పెట్టవచ్చు. మరి ఈ మిగతా వారికి తెలుగు మాతృభాషలో చదువుకోవడం సాధ్యమా?
ఇంగ్లీష్ మాధ్యమంగా ప్రాథమిక దశ నుంచి ప్రారంభించాలనే వారికి ఒక జఠిలమైన ప్రశ్న. 1)విద్యార్థులందరికీ ఒకటవ తరగతి నుంచి ఇంగ్లీష్ ఒక్కటే వచ్చి, ఇతర రెండు భాషలు మొక్కుబడి పాసైతే వారికి భావ సం పూర్ణత, సాంస్కక్షుతిక ప్రగతి ఉంటాయా? అటు మాతృభాషకు దూరమైతే సొంత భాషా సంస్కక్షుతల వారసులుగా ఎదుగుతారా?

కాళోజీ కవితలు చదివేవారు, తెలంగాణ వారసత్వంగా వస్తున్న ఉద్యమ గీతాలు పాడేవా రు, ముఖ్య మంత్రిలా మాతృభాషలో అనర్గళంగా ప్రసంగించేవారు ముం దు తరాలలో ఉంటారా? నెహ్రూ పుణ్యమాని సంస్కక్షుతానికి (ఒకప్పటి ప్రపంచ భాష) పట్టిన గతే తెలుగుకు కూడా పట్టదా? 2) పాఠశాల స్థాయి లో ఇప్పుడున్న ఉపాధ్యాయులలో ఎంతమంది ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించగలరు? రాష్ట్రంలో ఎంతమంది తప్పులు లేకుండా ఇంగ్లీషులో రాయగలరు? మాట్లాడగలరు? ఇప్పుడు ఉద్యోగాలలో ఉన్న ఉపాధ్యా యులందరికీ ఆంగ్ల భాషలో నైపుణ్యాలు నేర్పి, శిక్షణ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఇక ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి ఇంగ్లీషు నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం ఏ పథకాలు రచి స్తు న్నది? ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు కలిగిన ఒక రీసోర్స్ గ్రూప్‌ను ప్రభుత్వం గుర్తించిందా? ఈ సమస్యలకు చాలా తేలిక పరిష్కారాలున్నాయి. అయితే కొత్త పంథాలో ఆలోచిస్తేనే ఆ పరిష్కారాలు ఆచరించడానికి సాధ్యం కాదు.

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటూ, దేశంలో ఇప్పటిదాకా అనుసరించిన పద్ధతులకు పైపై పూతలతో మార్పు తెద్దామంటే సాధ్యం కాదు. పూర్తిగా నూతన విధానాన్ని అమలు చేయాలి. అవి..1) ప్రాథమిక దశలో ఐదవ తరగతి వరకు మాధ్యమం ఏదీ ఉండకూదు. మాతృభాష, ఇంగ్లీషు, హిం దీ, లెక్కలు (ఇంగ్లీషులో) బోధించాలి. విద్యారంగంలో నెంబర్‌వన్‌గా ఉన్న ఫిన్‌లాండ్ ప్రాథమిక దశలో కథలు, పాటలు, పద్యాల ద్వారా భాష బోధి స్తూ, లలిత కళలు కూడా బోధిస్తారు. అదేవిధంగా ఈ నాలుగు సబ్జెక్టులతో పాటు సంగీతం, నృత్యం, చిత్ర లేఖనం వంటివి కూడా ప్రాథమిక దశలో చిన్నపిల్లలకు పరిచయం చేయాలి. ఆరవ తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ఒక లలితకళ, ఆట తప్పనిసరిగా పదవ తరగతి దాకా నేర్పించాలి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రవేశపెడతారని అంటున్నారు. కనుక ఐదు నుంచి ఏడేళ్లు (ఐదవ తరగతి వరకు) ఇంగ్లీషు భాషగా బోధిస్తే సరిపోతుంది.

అంతేకానీ ప్రాథమిక దశలోనే మాధ్యమాన్ని ప్రవేశపెట్టి అటు మాతృభాషకు, ఇటు సంస్కక్షుతికి చిన్నపిల్లలను దూరం చేయడం వాం ఛ నీయం కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు, ముఖ్యంగా వెనుకబడిన జాతుల /కులాల నుంచి వచ్చిన వారు, తమ సంస్కక్షుతిలో ఇమడలేక, తమ వర్గా లకు దూరమవడం ఆదర్శం కాదు. అందుకే ప్రాథమిక దశ నుంచి ఇంగ్లీషు భాషగా ప్రాథమిక దశను ఉంచి బోధించి ఐదవ తరగతి పూర్తయ్యేసరికి ఇంగ్లీషులో మౌలిక భాషా నైపుణ్యాలు విద్యార్థులందరికీ అందించాలి. 2) ఇక రెండవ సమస్య ఉపాధ్యాయులకు సంబంధించింది. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులంతా ఇప్పటిదాకా ఉన్న గందరగోళ వ్యవస్థలో పట్ట భద్రులైన వారే! విద్యావంతులైన తల్లిదండ్రుల పిల్లలు, ప్రాథమిక దశ నుం చే మంచి పాఠశాలలో చదివిన వారు తప్ప, ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు యువతలోనూ, వయసుమీరిన వారిలోనూ కూడా లేవు. అది వారి తప్పు కాదు. ఇంగ్లీష్‌ను భాషగా బోధించడంలో ఘోరంగా విఫలమైన మన దేశ విశ్వవిద్యాలయాలూ, విద్యావ్యవస్థది.

తప్పు ఎవరిదైనా ఆ వ్యవస్థ ఫలితం గా బోధనారంగానికి వచ్చే వారిలో కూడా 99శాతం ఇంగ్లీష్ భాషా నైపు ణ్యాలు లేనివారే! ఇప్పుడు అకస్మాత్తుగా ఒకటవ తరగతి నుంచి అన్ని సబ్జె క్టులు (మూడుభాషలు సైన్స్, సోషల్‌స్టడీస్, లెక్కలు) ఇంగ్లీష్‌లో బోధిం చగలిగే ఉపాధ్యాయులు ఎక్కడ దొరకాలి? కనుకనే సబ్జెక్టులు మూడు ఆరవ తరగతి నుంచి బోధించి, వాటిని చదగలిగే భాషా నైపుణ్యాల మీద ఐదవ తరగతి దాకా దృష్టి, బోధన కేంద్రీకరిస్తే బాగుంటుంది. 3) భవిష్యత్తులో పై సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలి. పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు ఇప్పుడున్న శిక్షణా కోర్సులలో (డీఎడ్, బీఎడ్ లాంటివి) అందరికీ ఇంగ్లీషు నైపుణ్యాలు బోధించే కోర్సు తప్పనిసరిగా ఉం డాలి. ప్రస్తుతం కళాశాలల్లో (ఇంటర్మీడియట్, డిగ్రీ) ఇంగ్లీష్ బోధించే లెక్చ రర్లందరూ ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ చేసిన వారే.

సాహిత్యం చదివి భాష బోధించమంటే బాటనీ చదివి ఫిజిక్స్ లెక్చరర్ అవడం లాంటిది. తెలంగా ణలో అన్ని విశ్వవిద్యాయాలల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడాలజీలో ఒక డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టి ఎంఏ సాహి త్యం చేసినవారందరికీ ఆ డిప్లొ మా తప్పనిసరిగా చదవాలనే నిబంధన పెట్టాలి. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి సంభవించకుండా ఉండాలంటే అన్ని విశ్వవిద్యాల యాల్లో ఎంఏ (ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్) కోర్సును ప్రవేశపెట్టాలి. పైన చెప్పిన డిప్లొమా, డిగ్రీ దూర విద్య ద్వారా అందిస్తే పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులందరికీ అందుబాటులో ఉంటుంది.

ఇంగ్లీష్ భాషా బోధనకు ఒకట తరగతి నుంచి డిగ్రీ దాకా సమగ్రమైన, అంచెల విధానంలో కోర్సులను రూపొందించాలి. దానికి ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు తయారు చేయాలి. ముందు ఈ బాధ్యతను ఎడ్యుకేషన్ రంగం లోని వారికి కాకుండా ఇంగ్లీషు భాషా నిపుణులకు అప్పగించాలి. ఇంగ్లీష్ భాషా నిపుణులంటే భాష నేర్చుకోవడమే కానీ భాష ‘గురించి’ నేర్చు కోవ డం కాదు. అలాగే ఈ రాష్ట్రంలో దేశంలోని అన్ని భాషలు మాట్లాడే వారు న్నారు. గిరిజన, భాషలు వాడే వారున్నారు. ఎవరికి వారి మాతృభాష ఐద వ తరగతి దాకా చదువుకునే వెసులుబాటు కల్పిస్తే అది ఒక ఆదర్శమ వుతుంది.

1036

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Published: Sun,February 16, 2014 12:11 AM

అపర గజనీల రాజ్యం

‘ఒ క్క దెబ్బతో రెండు పిట్టలు’ అన్న సామెత తప్పు. ఒక్క దెబ్బతో ఎన్ని పిట్టలనైనా కొట్టొచ్చన్నది మన కళ్లముందు కనిపిస్తున్న సత్యం. అంట

Published: Sun,October 27, 2013 12:55 AM

నీలం నుంచి నల్లారి దాకా

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కేంద్రీకరణ అయిన విధానాన్ని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అంతేగాకుండా ప్రజలు నేర్చుకోవలసిన అనేక

Published: Sat,August 24, 2013 12:26 AM

‘రాయల’ ప్రతిపాదన మరో తప్పు

ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు వ్యతిరేకంగా హైదరాబాద్ (తెలంగాణ), ఆంధ్రరాష్ట్రాల విలీనమే చరిత్ర లో కాంగ్రెస్ చేసిన అతిపెద్ద త

Published: Sat,October 6, 2012 03:59 PM

ఐక్యతతోనే ఆశయ సాధన..

జయశంకర్ స్ఫూర్తి సభలు జిల్లాల్లో, హైదరాబాద్‌లోనూ జరుపుకున్నాం. జయశంకర్ స్ఫూర్తి అంటే ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ ఒక్క విషయం మనం అర్థం

Published: Sat,October 6, 2012 03:59 PM

కసియేనామం ‘కరుణ శ్రీ’

నవంబర్ ఒకటి 1956 నుంచి తెలంగాణకు చెందిన సంపద నిర్లజ్జగా ఆంధ్ర ప్రాంతానికి తరలించిన వలసవాద పాలకులకు 196లో ఉవ్వెత్తుగా లేచిన తెలంగా

Published: Sat,October 6, 2012 03:59 PM

‘ఇల్లరికపుటల్లుడు’

భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెవూహూ దూరదృష్టి లేక చేసిన పనులకు ఫలితాలు ఈ దేశ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఒక నాయకుడికి హ్ర

Published: Sat,October 6, 2012 04:00 PM

తెలంగాణపై బాబు కపట నీతి!

చంద్రబాబు ఏ ప్రాంత ఆకాంక్షల గురించి అయినా మాట్లాడగలగాలి. ధైర్యంగా భావాల్ని వ్యక్తపరచగలగాలి. సోనియాగాంధీ మొహం చాటేసింది కనుక, తాన