అపర గజనీల రాజ్యం


Sun,February 16, 2014 12:11 AM

‘ఒ క్క దెబ్బతో రెండు పిట్టలు’ అన్న సామెత తప్పు. ఒక్క దెబ్బతో ఎన్ని పిట్టలనైనా కొట్టొచ్చన్నది మన కళ్లముందు కనిపిస్తున్న సత్యం. అంటే ఒక్కసారి దెబ్బకొడితే.. ఆ దెబ్బ అంటే భయమున్న పిట్టలన్నీ భయ విహ్వలతతో మతులు పోగొట్టుకుంటాయి. ఏం చేస్తున్నాయో తెలియకుండా ప్రవర్తిస్తాయన్నమాట!
సరిగ్గా ఇప్పుడు సీమాంధ్ర నాయకుల పరిస్థితి అలానే ఉంది. తమ మేధ, ప్రజ్ఞ అంతా ఉపయోగించి చేసిన, చేస్తున్న కుట్రలు ప్రళయకాలం వరకూ, ఈ యుగాంతం వరకూ అలాగే ఫలిస్తాయని ఆశించిన వారికి ఎంత భంగపాటు! ఎంత అవమానం! నెహ్రూ కాలం నుంచీ తమ లాబీయింగ్‌తో, తెలంగాణను ఆసాంతం దోచుకున్న ధనంతో కలిగిన ధనమదంతో, అహంకారంతో, యాభై ఏడేళ్ల పాటు తమ బానిసలనుకున్న వారికి స్వాతంత్య్రం వస్తుందన్న భీతితో పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు. ఆ తర్వాత ఇన్నే ళ్ల తమ దోపిడీ, వనరుల కబ్జాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో సం యమనం కోల్పోయి గజనీ సినామాలో మానసికరోగిలా సీమాంధ్ర నేతలు ప్రవర్తిస్తున్నారు.

వాళ్లకు ఇంగితం ఉన్నదా అన్న అనుమానం కలుగుతున్నది. కానీ వారికి డబ్బా కొట్టే టీవీ ఛానళ్ల వారికి వారందరూ భగత్‌సింగ్‌ల్లా కనిపిస్తున్నారు!
తెల్లగడ్డం గజనీ తన దండయావూతలను అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేశాడు. నరేంవూదమోడీని తిట్టిన నాలుకతోనే పొగిడి పొత్తు అస్త్రం వేశాడు. ఉత్తరంలో ములాయం, ఆయన కొడుకుని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తూర్పున బెంగాల్ లేడీ మమతను కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎగదోశాడు. ఇక దక్షిణంలో.. ప్రపంచానికి తన ఆలోచనలు తెలియకూడదని నల్లకళ్లజోడు పెట్టుకుని కుర్చిలో కూర్చున్న కరుణానిధిని కలిశాడు. పనిలో పనిగా జయలలిత నూ కలిశాడు. ఆయన సంచారం ఎందుకో ప్రపంచానికంతా తెలుసు. ఒక్క తెలంగాణ టీడీపీ నాయకులకు తప్ప! వారు పాపం.. అమాయకంగా ఇంకా సమన్యాయం కోసమే తమ నాయకుడు తిరుగుతున్నాడని చెప్తున్నారు. పాపం ప్రజల కోసం ఇది వరకు పాదయావూతలు, ఇప్పుడు రాష్ట్ర యాత్రలు! ఆకాశంలో చంద్రుడిలా పదేళ్ల నుంచి కృష్ణపక్షంలో ఉన్న వారి నాయకుడు శుక్లపక్ష చంద్రుడిలాగ వెలిగిపోతాడని వాళ్లు నమ్ముతున్నారు. మరి ఆయన గజనీ యాత్రలు ఫలిస్తాయో లేదో..

26జీవోలతో అంబానీ ఎత్తుకు ఎదిగిన కడప గజనీ తన ఓదార్పు యాత్రలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే జైల్లో, లేకపోతే విగ్రహాల ఆవిష్కరణలతో ప్రజల మధ్య! ఇదే ఈ గజన్ దైనందిన కార్యక్షికమం. పాపం మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చి ఇంకో 30 మంత్రులను, 20 మంది ఐఏఎస్ అఫీసర్లను అడ్డంపెట్టి మిగిలిన ఆంధ్రవూపదేశ్‌ను కూడా దోచుకుందామని ఈయనగారి ప్రయత్నం. ముఖ్యమంత్రి అయి మిగిలిన 74 జీవోలె తెచ్చి రాష్ట్రాన్నంతా గుప్పిట్లో పెట్టుకోవాలని ఈ గజనీ తాపవూతయం! మరీ సీమాంవూధనే ఉంటే శత జీవోలు ఎక్కువవుతాయి. కనుక సమైక్య రాష్ట్రం కావాలి ఈ గజనీకి! ఇంకొక గజనీ కూర్చున్న కొమ్మ నరుక్కోవడం, పాలు తాగి రొమ్ము గుద్దడం వంటి సామెతలు ఈయన చదివినప్పుడు సిలబస్‌లో లేవు. బహుశా ఔరంగజేబు చరిత్ర ఒక్కటే చదివి ఉంటాడు.

కానీ ఆ మొగల్‌కు ఉన్న తెలివీ, తంత్రం లేక మాటిమాటికీ బయటపడిపోతుంటాడు. ఒక ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర ఎడారి అవుతుందనీ, నీటి యుద్ధాలు వస్తాయనీ అంటాడు. మళ్లీ వెంటనే అది మర్చిపోయి విడిపోతే తెలంగాణకే ఎక్కువ నష్టమంటాడు. గజినీ సినిమా చూశారు కదా! అందులో హీరో లాగా ఒకసారి తనేమన్నాడో చిట్టీ రాసిపెట్టుకుంటే బాగుండు. ప్రజలకు కూడా అయోమయం కలిగించే ఈ మాటలు ఉండవు. ఇంతకీ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రకా, తెలంగాణకా ఎవరికి నష్టం అని అడిగితే.. అది విననట్టు నన్ను సోనియాగాంధీయే ముఖ్యమంత్రి చేసింది అంటాడు. పాపం ఈయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సోనియాగాంధీ విధేయుడిగా ఉంటే కనీసం రాష్ట్రం విడిపోయేదాకా ముఖ్యమంవూతిగా, తరువాత ఏ పనీలేని శాఖకు కేంద్రం లో మంత్రిగా ఉండేవాడు ఈ గజినీ!

ఇక ఈ గజనీలందరికీ నాయకుడు పెద్ద గజనీ మన ఆంధ్ర ‘భగత్‌సింగ్’ లగడపాటి. రాష్ట్ర విభజనతో చంద్రబాబుకు ఎంత నష్టమో ఈయనకీ అంతే నష్టం. విడిపోతే సీమాంధ్ర వారు చంద్రబాబును అంగీకరించరు. ఎందు కంటే రాయ లసీమకు చెందిన చంద్రబాబు ఆ ప్రాంతానికేం ఒరగబెట్టలేదు. అలా అని ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వాడిగా కోస్తావారు ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోరు. పైగా అన్యాయంగా సంపాదించినదంతా హైదరాబాద్‌లో ఉంది. అందుకే ఈ గజనీ చంద్రుడికి విభజన అంటే కాళ్లు వణికి ఒకచోట ఉండలేకపోతున్నాడు. నాయుడు గజనీకి అంతర్జాతీయ చిక్కులు కూడా ఉన్నాయి.

కొంచెం పెరిగిన జుట్టు, పిచ్చి చూపులు, అర్థంలేని మాటలతో అచ్చంగా గజనీలో సూర్య లాగా కనిపిస్తున్న లగడపాటివి చెప్పుకోలేని కష్టాలు. ల్యాంకోహిల్స్ అంతా ముస్లింల వక్ఫ్ భూమి. దానిలో ఇప్పటికే నష్టాలు చవిచూస్తున్న ఈ గజనీకి సింగరేణి బొగ్గు తెలంగాణ వారికే అంటే మాత్రం మొహం ఆ బొగ్గు కంటే నల్లగా అయిపోతుంది. పాపం! ఇరవై ఏళ్లు స్పెషల్ ట్రెయిన్ వేసుకొని కొత్తగూడెం నుంచి ఎవరికీ తెలియకుండా బొగ్గు బందర్‌కు తరలించి, ఆస్ట్రేలియా సప్లై చేస్తున్న వ్యాపారం ఆగిపోవడం అంటేమాటలా? భవిష్యత్తులో నష్టమే కాక ప్రభుత్వం దగ్గరి నుంచి తీసుకున్న వేల కోట్ల ధనం తిరిగి ఇవ్వాల్సి వస్తుంది.

అందుకే అం దరి కంటే మతి తప్పింది ఈ గజనీకి. ఎవరో తనను ఎటాక్ చేస్తారని, కొడతార ని, తను ఆత్మరక్షణ చేసుకోవాలనీ ఆరా టం పెరిగింది. పాపం ఇవన్నీ తెలియని మిగతా రాష్ట్రాల వారు ఉగ్రవాద చర్య అనీ, పార్లమెంటు సభ్యులకు ఇది తగదనీ హెచ్చరిస్తున్నారు. లగడపాటి మానసికస్థితిని అర్థం చేసుకున్న వారికి మాత్రం ఆయన ఇంత చర్యకు ఎందుకు తెగబడ్డారో తెలిసి జాలి వేస్తుంది. పాపం ఆంధ్రా భగత్‌సింగ్‌లు అయిన ఈ నలుగురు గజనీలకు తోడు ఇంకో కొత్తాయన చేరాడు. నిజానికి ఈయన పేరు అందరికీ అంత తెలియదు. అయితే కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి తనే భగత్‌సింగ్ అవ్వాలనే తాపవూతయంలో దేశానికి స్వాతం త్య్రం వచ్చిందని మరిచిపోయాడు. భగత్‌సింగ్‌లా ఒక పెద్ద కత్తి తీసుకుని ఢిల్లీలో ఉన్న తెలుగువాళ్లను నరకడానికి బయలుదేరాడు. పాపం పార్లమెంటులోకి వెళ్లాక అక్కడ ఇంగ్లిషు వాళ్లు కనపడలేదు. అంతా భారతీయులే. అందుకే తన చేతిలోని కత్తి మైక్ లాగ కనిపించింది. పైగా ఆ మైక్ ఫాబ్రికేటెడ్ అయిందన్నా డు. ఎవరైనా హర్డ్‌వేర్ వాళ్లు ఈ ఐడియా తీసుకుని పరిశోధన సాగిస్తే నోబెల్ ప్రైజ్ కొట్టొచ్చు!

అయితే ఇప్పుడు ఏర్పడబోయే తెలంగాణ ప్రభుత్వానికి ఒక మానవీయ వినతి.. ఈ నాయకులందరికీ తెలంగాణ ఉద్యమం ద్వారా జరగబోతున్న విభజన వల్ల ఇలా మతి తప్పింది. కాబట్టి వారందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సీమాంవూధలోని విశాఖపట్నం పిచ్చాస్పవూతిలో చికిత్స చేయించాలని తెలంగాణ ప్రజల విజ్ఞప్తి. ఇక్కడి ఎర్రగడ్డలో మాత్రం చికిత్స వద్దు. తెలంగాణ గురించి వారితో మాట్లాడవద్దు. హైదరాబాద్ పేరు ఎత్తవద్దు. ఇక్కడికి దూరంగా ఉంచి చికిత్స చేయిస్తేనే ఒక ఐదు పదేళ్లలో ఈ గజనీలందరూ మామూలు స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది.
-కనకదుర్గ దంటు

251

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Featured Articles