నీలం నుంచి నల్లారి దాకా


Sun,October 27, 2013 12:55 AM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కేంద్రీకరణ అయిన విధానాన్ని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అంతేగాకుండా ప్రజలు నేర్చుకోవలసిన అనేక గుణపాఠాలు కనిపిస్తాయి. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రం, స్వతంత్ర దేశంగా ఉండి, 1948లో దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంతో కలిసి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. ఈ పేరులోనే కుట్ర దాగి ఉంది. ఢిల్లీలో ఈ రాష్ట్రం పేరు ‘తెలంగాణ-ఆంధ్ర’ అని పెట్టాలని నిర్ణయించబడింది. కానీ హైదరాబాద్ వచ్చేసరికి అది తెలంగాణ అన్న పదాన్ని మింగేసి ఆంధ్రప్రదేశ్‌గా అవతారమెత్తింది. ఇక ఈ పేరు మార్పుతో మొదలైన కుట్రలు ఆ రోజు నుంచే ప్రారంభమై అప్రతిహతంగా సాగుతున్నాయి. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే నీలం సంజీవడ్డి నుంచి మొదలై నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి దాకా సాగుతున్నాయి.

సంజీవడ్డి ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి, తాను ముఖ్యమంత్రి కాగానే ఆ పదవిని ఆరోవేలితో పోల్చాడు. తెలంగాణకు రావాల్సిన ఆ పదవి, దానితో ఉండే అధికారానికి గండికొట్టాడు. నిజానికి ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని కలపడానికి ఒప్పుకున్నందుకు అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆంధ్రవూపదేశ్‌కు ముఖ్యమంవూతిగా అవవలసింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అయిన మూడో సంవత్సరంలోనే జీతాలివ్వలేని దీనస్థితికి దిగజారింది. అలాంటి రాష్ట్రంతో నిజాం పాలనలో స్వతంత్ర సంపన్న దేశంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా విలీనం చేశారు. తెలంగాణకు ఉన్న ముఖ్యమంవూతిని కానివ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంవూతిగా ఉన్న వ్యక్తి ఆ పదవి ఎలా పొందాడో ఇప్పటికీ అర్థం కాదు. ఆరోజు నుంచి నేటి దాకా సాగిన ఆంధ్రవూపదేశ్‌లో ప్రాంతాల, కులాల వారీగా సాగిన అధికార కేంద్రీకరణ గమనిస్తే కళ్లు తిరుగుతాయి. ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంవూతుల జాబితా ప్రాంతాల వారీగా ఈ కింది విధంగా ఉన్నది.

1956 నవంబర్ 1 నుంచి ఇప్పటి ఈ రాష్ట్రానికి 21మందిని ముఖ్యమంవూతులుగా ఎన్నుకున్నారు. వీరిలో 11 సార్లు రెడ్లని, ఐదు సార్లు కమ్మవారిని, ఒకసారి బ్రాహ్మణుడిని, ఒకసారి వైశ్యుడిని, ఒకసారి వెలమని, ఒకసారి బీసీని, ఒకసారి ఎస్సీని ఈ పదవిలో కూర్చోబెట్టారు. ఇక ప్రాంతాల వారీగా ఈ విధంగా ఉన్నది.

1. ఈ 21 మందిలో తెలంగాణ వారు ముగ్గురే ముఖ్యమంవూతులుగా ఉన్నారు. ఈ ముగ్గురి పదవీ కాలం 2298 రోజులు మాత్రమే. అంటే 6 ఏళ్ల నాలుగు నెలల కాలం.2. ఆంధ్ర ప్రాంతం నుంచి 9 సార్లు ముఖ్యమంవూతులయ్యారు. వీరి పాలనా కాలం 8424 రోజులు. అంటే 23 సంవత్సరాల నాలుగు నెలలు.3. ఇక రాయలసీమ ప్రాంత వాసులకు అధిక కాలం పాలించే అవకాశం వచ్చింది. వారిని ఎనిమిదిసార్లు ముఖ్యమంత్రి పదవి వరించింది. వీరి పదవీ కాలం మొత్తం 9912 రోజులు. అంటే 27 ఏళ్ల ఆరు నెలలు.

ఇక కులాల వారీగా చూస్తే మూడు ప్రాంతాలూ కలిపి పాలించిన శాతంలో 51.9శాతం రెడ్డీలు ఉన్నారు. తెలంగాణలో 57.8శాతం (2298 రోజులలో 1329 రోజులు), ఆంధ్ర వారు 43 శాతం (8424 రోజులలో 3647 రోజులు), రాయలసీమ రెడ్లు 59.9 శాతం (9912 రోజులలో 5744రోజులు) కాలం ముఖ్యమంవూతులయ్యారు. ఆంధ్రలో కమ్మవారు 33 శాతం (8424 రోజులలో 2782 రోజులు) ఉన్నారు. ఇక ఇతర కులాల శాతం ఎంతో ఈ పాటికే అర్థమవుతుంది. మొత్తం మీద రెడ్లు 51.9 శాతం, కమ్మవారు 33 శాతం కలిపితే 84.9 శాతం. అంటే 85 శాతం ఈ రెండు అగ్రకులాల వారు ఈ రాష్ట్ర పాలన సాగించారు.

పై వివరాలన్నీ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే, ఈ మధ్య జరిగిన కాంగ్రెస్ నాయకుల మీటింగ్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ రాజకీయ నాయకులు ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టారు. అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి పదవి దక్కడం వల్ల తెలంగాణ వారికి అన్యాయం జరిగిందనుకుంటే వచ్చే పదిహేనేళ్లు ముఖ్యమంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవి తెలంగాణ నాయకులకే ఇస్తామన్నారు. దీంతో విభజన ఆపమని ఎర వేయడానికి ప్రయత్నించారు. ఇక రాష్ట్ర విభజన జరిగిపోయింది. కాబట్టి సీమాంధ్ర లో ఈ సిద్ధాంతాన్ని ఇప్పుడు అమలు చేస్తే బాగుంటుంది. రెండు రాష్ట్రాలుగా పునరుద్ధరింపబడే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో రెడ్డి, కమ్మ కులాల నుంచి వారి జనాభా శాతాన్ని బట్టి ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను ఒత్తిడి చేయాలి. ఆ పార్టీలు అంగీకరించని పక్షంలో బడుగు, బలహీనవర్గాల అభ్యర్థులను నిలబెట్టి ప్రజలే వారిని గెలిపించాలి.

ప్రజాస్వామ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వారికి కావలసినవి నెరవేర్చుకునే అవకాశం ఉన్నది. కనుక ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తమకు ఎన్నికల్లో వచ్చే అవకాశాన్ని వృథా కానివ్వవద్దు. అప్రమత్తంగా వ్యవహరించి ఈ రెండు కులాల ఆధిపత్యాన్ని అరికట్టాలి. అధికారంతో డబ్బు, డబ్బుతో అధికారం సంపాదించే వీరి మోసపూరిత విధానాలను సాగనివ్వకుండా అడ్డుపడాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలొకటే ప్రజల చేతిలోని ఆయుధం.

1. యాభై ఆరేళ్లలో తెలంగాణ ప్రాంతం అన్ని విధాలుగా, అన్ని రంగాలలోనూ దోపిడీకి గురైందని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. మరి ఇన్నేళ్ల పాలన అత్యధిక కాలం సీమాంధ్ర వారి చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ఆ దోపిడీ ధనం ఏమైందో వారే చెప్పాలి.
2. యాభై ఆరేళ్లలో యాభై ఏళ్లు పాలించిన నాయకులు వారి వారి ప్రాంతాలు ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు? దీనిపై సీమాంధ్ర ప్రజలు వారి నాయకులను నిలదీయాలి. అంతేగాని దాన్ని పక్కనపెట్టి వారి కుటిల నాటకాలకు బలై, సమైక్యాంధ్ర అంటూ ఆందోళన చేయడం అవివేకం కాదా?
3. ఈ యాభై ఆరేళ్లలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. బడ్జెట్‌లో వారికి కేటాయించిన నిధులు ఏమయ్యాయో పాలించిన వారు లెక్కలు చెప్పాలి.
4. సంస్కృతి, చరిత్ర వేరైన ప్రాంతాలను కలపడం వృథా ప్రయాస అని ఈ యాభై ఆరేళ్ల అనుభవం నేర్పింది. అందుకే రాష్ట్రాన్ని విభజన చేశాక ఆ విషయాల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. రెండు ప్రాంతాల్లో అన్ని రంగాలు, అన్ని కులాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటిదాకా వెనుకబడిన వారి అభివృద్ధి కోసం పాటుపడాలి. దీనికి సామాన్య ప్రజలు ఏం చేయాలో ఆలోచించాలి.
5. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో, చేసే నిబంధనల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. తమ గ్రూపులు, జేఏసీల ద్వారా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇకపై అధికారమంటే ఒక కులం చేతిలోనో, మతం చేతిలోనో ఉండకుండా చూసుకోవాలి.
రాష్ట్ర విభజన తర్వాత సామాన్య ప్రజలు తమ తమ ప్రాంతాల అభివృద్ధి, తమ జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూసుకోవాలి. అప్పుడే ఈవిభజన ఫలవంతమవుతుంది.

-కనకదుర్గ దంటు

183

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Featured Articles