‘రాయల’ ప్రతిపాదన మరో తప్పు


Sat,August 24, 2013 12:26 AM


ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు వ్యతిరేకంగా హైదరాబాద్ (తెలంగాణ), ఆంధ్రరాష్ట్రాల విలీనమే చరిత్ర లో కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు. ఇక ఇప్పుడు వస్తు న్న వినాశకర ప్రతిపాదన రాయల తెలంగాణ. ఇది కూడా పెద్ద పొరపాటే. రెండు దశాబ్దాల తరబడి ప్రత్యేక దేశంగా నైజాం రాజులు పాలించిన దక్కన్ దేశంలో ఉంది. దీనిలో వివిధ దేశాల నుంచి, దేశంలోని పలు ప్రాంతాల నుంచి వ్యాపార, ఇంకా ఇతర పనుల, బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి ప్రజల్లో కలిసిపోయారు. దీంతో తెలంగాణ సంస్కృతి విభిన్నమైనదిగా, ప్రత్యేకమైనదిగా ఉన్నది. కుల మతాలకు అతీతంగా ఓ మానవీయ సంస్కృతి వేళ్లూనుకున్నది. సమాజం నిర్మితమైంది. ఉర్దూ రాజ భాష కావడంతో తెలంగాణ భాషా సంస్కృతుల్లో విశిష్టతను సంతరించుకున్నది. దీంతె ఒకే భాష మాట్లాడే ప్రాంతం కన్నా ఓ భిన్నమైన సంస్కృతిని నిర్మించుకున్నది. ఇక రాయలసీమ 1300 సంవత్సరాల నుంచీ ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతినే అలవర్చుకున్నది. కొంత తమిళ భాషా సంస్కృతి తోటి ప్రభావితమైంది. తెలంగాణ సహజ వనరులతో సుసంపన్నమైన ప్రాం తం. అదే రాయల సీమ కరువు కాటకాలతో నీటి వనరులు లేక అల్లాడే ప్రాంతం.

అయితే.. వర్తమాన చరిత్ర విషయానికి వస్తే..ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు చేయడంతోనే రాయలసీమతో తెలంగాణకు సంబంధం ఏర్పడింది. అరవై ఏళ్ల తర్వాత కూడా ఈ రెండు ప్రాంతాలు వేర్వే రు భాషా సంస్కృతులతోనే ఉన్నాయి. రాయలసీమవాసులు వెనకబడి ఉండి కూడా తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు పట్టించుకోలేదు. అర్థం చేసుకోలేదు. మరోవైపు శ్రీబాగ్ ఒడంబడికను ఉల్లంఘించిన కోస్తాంవూధులు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారు. కానీ రాయలసీమ వారు కోస్తాంధ్ర వారినే బలపరుస్తూ తెలంగాణను దోపిడీ చేయడంలో కోస్తావారితో మిలాఖత్ అయ్యా రు. తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రాంత నాయకుల మధ్య సఖ్యత ఉంటే కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లా వాసు ల పెత్తనాన్ని ప్రశ్నించేవారు. ఎదిరించే వారు. ఆంధ్రవూపదేశ్ మొద టి ముఖ్యమంత్రి నీలం సంజీవడ్డి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా తమ ప్రాంత సోయి ఉంటే.. రాయలసీమకు నేటి దుర్గతి పట్టేది కాదు. కరువు కాటకాలు, ఫ్యాక్షన్ రక్తపాతం ఉండేది కాదు. ఇప్పుడు తమ ప్రాంతంలో నీటి వనరులు లేవని నిస్సిగ్గుగా అం టున్నారు కానీ, కనీస స్పృహతో పనిచేసినా నేటి దుస్థితి ఉండేది కాదు. రాజకీయ నాయకులకు దీర్ఘకాలిక దృష్టి లేకపోతే, తమ ప్రాంత ప్రజలపై కనీస ప్రేమ లేకపోతే.. కనీస మౌలిక వసతులు ఎలా ఉంటాయి? నేడు రాయలసీమ జిల్లాలను తెలంగాణతో కలిపితే.. 56 పరిస్థితి పునరావృతమవుతుంది.రాయలసీమ జిల్లాల భారాన్ని తెలంగాణ ప్రజలు మోయాల్సి వస్తుంది. కొందరు సీమ నాయకులు తాము తెలంగాణతో కలుస్తామని అంటున్నారు. కానీ వారు తెలంగాణ ప్రాంతంపై ప్రేమతో కాదు. తమ వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకించాలి. ఇక భవిష్యత్తు గురించి ఆలోచించినా సీమ తీవ్రంగా నష్టపోతుంది. సీమ ప్రాంతంలోని రెండు జిల్లాలను తెలంగాణతో, మరో రెండు జిల్లాలను కోస్తాంవూధలో కలిపితే.. సీమ ప్రాంతం చాలా తీవ్రంగా నష్టపోతుంది. సాంస్కృతికంగా తీరని అన్యాయం జరుగుతుంది. ఒకవేళ నాలు గు సీమ జిల్లాలను తెలంగాణతో కలిపినా సీమ ప్రాంత ప్రజలు తమదైన జీవన సంస్కృతి, అభివృద్ధిని కోల్పోవాల్సి వస్తుంది. ఇది మరింత ద్రోహపూరిత ఆలోచన.

ఈ పరిస్థితుల్లో సీమ ప్రజలకు మిగిలింది ఒకే మార్గం. ప్రకా శం, నెల్లూరు జిల్లాలను భాషా సంస్కృతులు దగ్గరగా ఉండే సీమ జిల్లాలతో కలుపడమే కొంతలో కొంత మెరుగు. ఈ మొత్తం ఆరు జిల్లాలు సమైక్యంగా ముందుకు పోతే అభివృద్ధి బాటలో పయనించవచ్చు.కోస్తాంవూధతో కలిస్తే తమ ప్రాంతంలో రాజధాని ఏర్పా టు చేయించుకున్నా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. కోస్తాంధ్ర వ్యా పార జలగల దోపిడీ పీడనలు, వివక్ష ఎదుర్కోవలసి వస్తుంది. ఇరు ప్రాంతాల ప్రజలకు దీంతో లాభం ఉండక పోగా నష్టమే ఎక్కువ. కాకుంటే.. వ్యాపారస్తులే రాజకీయ అవతారమెత్తిన నేత ల ప్రయోజనాలే నేడు రాజకీయ నినాదాలుగా చెలామణి అవుతున్నాయి. కాబట్టి సీమ నేతలుపజలు తమ అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరమే మేలు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఈ మూడు ప్రాంతాలు విడి విడిగా రాష్ట్రాలుగా ఏర్పడితే.. అయిదేళ్లలోనే మిగతా రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీపడవచ్చు. ఏ విషయంలో తగవులు వచ్చి నా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సంస్థలు ఉండనే ఉన్నాయి. మూడు రాజధానులు ఏర్పాడితే ఉద్యోగావకాశాలే గా క, అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఈ అసలు వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా..తమ వ్యాపార ప్రయోజనాలు, అక్రమ సంపాదనలు, దురాక్షికమణలు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తూ.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉండాలని అంటున్నారు. హైదరాబాద్‌లో అక్రమాస్తులు న్న వారికి తప్ప హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటే ప్రజలకు ఇబ్బందే కానీ, లాభం ఉండదు. సీమాంధ్ర నేతల తమ స్వార్థ ప్ర యోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నా రు. విద్యార్థులను, ఉద్యోగులను తప్పుతోవ పట్టిస్తూ ఉద్యోగాలు దొరకవని తప్పుడు ప్రచారం చేస్తూ అధర్మ ఉద్యమాలను ఎగదోస్తున్నారు.

ఇప్పటికైనా రాయలసీమ నేతలు వాస్తవాలు గ్రహిస్తే మంచి ది. చారివూతకంగా తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఇక నైనా సవరించుకోవాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడి రాష్ట్రా న్ని సాధించుకున్న నాడే రాయలసీమ రతనాల సీమ అవుతుంది.కనుక నేతలు విజ్ఞతతో ఆలోచించి ప్రాంతాల మధ్య విద్వేషాలను పెంచే కుట్రలకు స్వస్తి పలకాలి. రాష్ట్ర విభజనకు సహకరించి తమ తమ ప్రాంతీయ అభివృద్ధి కోసం ఏం కావా లో పోరాడి సాధించుకోవాలి. కానీ ఇవన్నీ నేతలు తమ స్వార్థ రాజకీయాలను వీడి ప్రజల వైపు నుంచి ఆలోచించినప్పుడే సాధ్యమవుతాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే గత దశాబ్ద కాలంగా టీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమాల ఫలితంగా ప్రజలు చైతన్యవంత మయ్యారు.తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నా రు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి సన్నద్ధులయ్యారు. ఇలాగే సీమ, కోస్తా ప్రాంత ప్రజలు కూడా చైతన్యంతో తమ హక్కులు, అభివృద్ధి స్వరాష్ట్రాల సాధనతోనే ముడిపడి ఉన్నదని గ్రహించాలి. ఆ దిశగా పోరాటాలు చేయాలి. అప్పుడే అన్ని ప్రాం తాలు అభివృద్ధి చెంది, అన్ని ప్రాంతాల ప్రజల మధ్య ప్రేమానుబంధాలు పెంపొందుతాయి.

-కనకదుర్గ దంటు

88

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల