ఐక్యతతోనే ఆశయ సాధన..


Sat,October 6, 2012 03:59 PM

జయశంకర్ స్ఫూర్తి సభలు జిల్లాల్లో, హైదరాబాద్‌లోనూ జరుపుకున్నాం. జయశంకర్ స్ఫూర్తి అంటే ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ ఒక్క విషయం మనం అర్థం చేసుకుని ఆయన మార్గంలో నడిస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమవుతుంది. ఇది వాస్త వం. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ జపం చేస్తున్నాయి. అయి నా తెలంగాణ ఎందుకు రావడం లేదన్నది సామాన్యుడిని పీడిస్తున్న ప్రశ్న. జయశంకర్ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆయన పదేపదే చెప్పిన మాటలను ఇప్పుడు గుర్తుచేసుకోవాలి. ‘తెలంగాణ కోసం తపన పడేవాళ్లు, ప్రత్యేక రాష్ట్రం కావాలనుకునే వాళ్లూ సమైక్యంగా పనిచేయాలి. లేకపోతే సమన్వయంతో పనిచేయాలి. అది కుదరకపోతే సహకారంతో పనిచేయాలి. ఇవేవీ సాధ్యపడవనుకుంటే సమాంతరంగా ఒకరినొకరు నిందించుకోకుండా పనిచేయాలి. ఇది చాలదా మనకు దిశానిర్దేశం చేయడాని కి? ఈ విషయాన్ని ఒక్కసారి కాదు వేలసార్లు చెప్పేవారు. కానీ మనం ఈ మాట అర్థం చేసుకున్నామా? ఆ దిశలో ఆలోచిస్తున్నామా?

సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉద్యమ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ వస్తే వారి ఆటలు సాగవు. అయి తే తెలంగాణ ప్రాంత నేతలు, మేధావులనుకుంటున్నవాళ్లు ఉద్యమ నాయకత్వాన్ని విమర్శించడంలో అర్థముందా? ఏ ఇద్దరి వ్యక్తుల ఆలోచనలు ఒకేలా ఉండవు. అయితే వారి ఆశయాలు ఒక్కటే అయినప్పుడు ఒకరిపై ఒకరికి అంత అక్కసు ఎందుకు? నిజానికి 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు 1969లో చెన్నాడ్డిని, తర్వాత ఇంద్రాడ్డిని, చిన్నాడ్డిని చూసిన వాళ్లకు పెద్ద ఆశలు కలగలేదు. ఎందుకంటే 1969 తర్వాత చిన్నా పెద్దా కలిపి ఒక 32 పార్టీలు, సంఘాలు ‘తెలంగాణ కోసం పనిచేస్తాం’ అని ఏర్పడ్డాయి. కానీ 2009 డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ అంటే టీఆర్‌ఎస్ అన్నంత బలపడింది. ఆ పార్టీలో లోపాలు లేవని కాదు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఆ లోపాలను అధిగమించవచ్చు. అప్పటికి వారు వినకపోతే ఆ ఫలితాలను వారే అనుభవిస్తారు. తప్పుచేసినప్పుడు ఇలాం టి అనుభవాలను ఎన్నో టీఆర్‌ఎస్ చవిచూసింది. ఆ తప్పులను మనం హేళన చేసి సీమాంవూధుల ముందు ఉద్యమపార్టీని పలచన చేద్దామా? జయశంకర్ సారు ఇలా బాధపడిన సందర్భాలు లేకపోలేదు.

నిజామాబా ద్ ఉప ఎన్నికలప్పుడు అక్కడ కాం గ్రెస్ తరఫున పోటీచేస్తున్న పెద్దమనిషి ఫోన్ చేసి ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను సార్, మీ ఆశీర్వచనం కావాలి’ అన్నా రు. అప్పుడు సారు ‘ఏమని ఆశీర్వదించను? నువ్వు గెలవాలనా? ధర్మం గెలవాలనా? అన్నారు. ఫోన్ పెట్టేశాక నేను సారుతో అన్నాను. ‘బాగా తిట్టవలసింది సార్, కాంగ్రెస్ మోసం చేస్తోంది కదా’ అని. అప్పుడు సారు నవ్వి ‘ఫోన్ చేసింది మనోడు కదా! దారితప్పిన తెలంగాణ బిడ్డ. ఎప్పటికైనా దారిలోకి రావలసిం దే’ అన్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్లనే సారు తన వాళ్లనుకుంటే, ఉద్యమ పార్టీని మనం తిట్టడమేమిటి? శత్రువును ఇంట్లో పెట్టుకుని అన్నదమ్ములు కొట్లాడుకుంటే వాళ్లిద్దరూ శత్రువుకు పలుచనకారా? అప్పుడు శత్రువు వాళ్లిద్దరినీ విడివిడిగా ఓడించడా? ఇదే జయశంకర్ సారు మనకు పదేపదే చెప్పింది.

ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే జయశంకర్ సారు స్ఫూర్తిని ఎవరు అర్థం చేసుకున్నారు అనేది! పల్లెటూరి ప్రజలు, చదువుకోనివాళ్లు, తినడానికి రెండుపూటలా తిండిలేని వాళ్లు, భవిష్యత్తు మీద కోటి ఆశలతో కష్టపడి చదువుకుంటున్న యువత, ఉద్యోగంలో వివక్ష ఎదుర్కొంటున్న వాళ్లు... తెలంగాణలోని సామాన్యులందరికీ జయశంకర్ గారి మాటలు అర్థమయ్యాయి. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకుని జేఏసీ ఏ సూచన చేసినా దాన్ని పాటిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వారి బలం, ఐక్యత, నిబద్ధతను చూపుతున్నారు. కానీ మన రాజకీయ నేతలు, మేధావులనుకుంటున్నవాళ్లు, వలసవాదులకు కొమ్ముకాస్తున్న కొందరు నేతలకు జయశంకర్ సారు మాటలు అర్థం కావడం లేదు. లేదా స్వార్థంతో వారి మాటలను తిరస్కరిస్తున్నారు. అందుకే తమ మాటలతో, చేతలతో కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనసులు గాయపరుస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆశయానికి గండికొడుతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలు జేఏసీలో భాగస్వామ్య పార్టీలు కదా, ఏ ఒక్కరికో ఓటు వేయమని చెప్పడం అనైతికమని పాలమూరు ఉప ఎన్నికల సందర్భంలో జేఏసీ భావించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల జేఏసీ పరకాలలో అలాంటి నిర్ణయం తీసుకోకుండా సర్వే ఆధారంగా ఉద్యమ పార్టీకి మద్దతు తెలిపింది. దీనిని మన మేధావులేం చేశారు. జేఏసీ సర్వే చేయలేదు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏ సర్వేలో పాల్గొనలేదని ప్రకటించి, తెలంగాణ జేఏసీ విలువను సీమాంవూధులకు తాకట్టుపెట్టారు. ఆ సర్వే చేసిన ప్రొఫెసర్లు నాకు తెలుసు. ఆ రిపోర్టులు నేను చూశా ను. అభివూపాయభేదాలు ఉంటే వలసవాదులు మనవాడిని కొట్టడానికి మన అస్త్రం అందించాలా? లగడపాటి దొంగదీక్ష చేసినప్పుడు నన్నపనేని ఆయనకు మద్దతు తెలిపారు. తెలంగాణను అడ్డుకోవడానికి వారు పార్టీలకు అతీతంగా ఐక్యతను ప్రదర్శించారు. మన రాష్ట్రం కోసం, మన వనరుల కోసం కొట్లాడుతున్నా మన తెలివితక్కువతనం ఇట్లా ఉంటుంది.

ఒక నిర్ణయాన్ని ఎలా మార్చవచ్చో సీమాంధ్ర పెట్టుబడిదారులు, వారి పాలకులు మనకు పదేపదే చూపుతున్నారు. మనమే బుద్ధి తెచ్చుకోవడం లేదు. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఉద్యమపార్టీ పరకాలలో ఎందుకు అంతగా కష్టపడాల్సి వచ్చింది. అదే బాన్సువాడ ఉప ఎన్నికల్లో సెటిలర్లు సమైక్యపార్టీలకు ఓట్లు వేస్తే, నిజమైన తెలంగాణ వాదులు ఉద్యమపార్టీని భారీ మెజారిటీతో గెలిపించా రు. ఇప్పుడు తెలంగాణలోని కొంద రు నేతలు వైఎస్‌ఆర్‌సీపీ వైపు చూస్తున్నారనే వార్తలు చూస్తున్నాం. ఇది జయశంకర్ సారు చెప్పిన యాచక మనస్తత్వం. వలసవాద పార్టీలలో చేరి, వారి నాయకత్వానికి మద్దతు ఇస్తూ తెలంగాణకు ద్రోహం చేయడం జయశంకర్ సారు స్ఫూర్తి కి విరుద్ధం.

ఇప్పుడు మనముందున్న కర్తవ్యం ఒక్కటే. తెలంగాణ వచ్చేదాకా విభేదాలు, అహంకారాలు పక్కనపెట్టి ఉద్యమాన్ని బలోపేతం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం. శత్రువును వెళ్లగొట్టిన తర్వాత మనస్పర్థల గురించి మాట్లాడుకోవచ్చు. భార్యాభర్తలు ఏదైనా విషయం లో వాదులాడుకుంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు ‘పిల్లలు చూడకుండా తలుపులు వేసుకుని తిట్టుకోండి, కొట్టుకోండి’ అని సలహా ఇస్తారు. అలాగే జయశంకర్ సార్ స్ఫూర్తితో సామాన్యులను గందరగోళ పరచకుండా మన అభివూపాయభేదాల్ని పక్కనపెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం కలిసి పనిచేద్దాం. స్వరాష్ట్రాన్ని సాధిద్దాం.

-కనకదుర్గ దంటు

35

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Published: Sun,February 16, 2014 12:11 AM

అపర గజనీల రాజ్యం

‘ఒ క్క దెబ్బతో రెండు పిట్టలు’ అన్న సామెత తప్పు. ఒక్క దెబ్బతో ఎన్ని పిట్టలనైనా కొట్టొచ్చన్నది మన కళ్లముందు కనిపిస్తున్న సత్యం. అంట

Published: Sun,October 27, 2013 12:55 AM

నీలం నుంచి నల్లారి దాకా

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కేంద్రీకరణ అయిన విధానాన్ని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అంతేగాకుండా ప్రజలు నేర్చుకోవలసిన అనేక

Published: Sat,August 24, 2013 12:26 AM

‘రాయల’ ప్రతిపాదన మరో తప్పు

ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు వ్యతిరేకంగా హైదరాబాద్ (తెలంగాణ), ఆంధ్రరాష్ట్రాల విలీనమే చరిత్ర లో కాంగ్రెస్ చేసిన అతిపెద్ద త

Published: Sat,October 6, 2012 03:59 PM

కసియేనామం ‘కరుణ శ్రీ’

నవంబర్ ఒకటి 1956 నుంచి తెలంగాణకు చెందిన సంపద నిర్లజ్జగా ఆంధ్ర ప్రాంతానికి తరలించిన వలసవాద పాలకులకు 196లో ఉవ్వెత్తుగా లేచిన తెలంగా

Published: Sat,October 6, 2012 03:59 PM

‘ఇల్లరికపుటల్లుడు’

భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెవూహూ దూరదృష్టి లేక చేసిన పనులకు ఫలితాలు ఈ దేశ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఒక నాయకుడికి హ్ర

Published: Sat,October 6, 2012 04:00 PM

తెలంగాణపై బాబు కపట నీతి!

చంద్రబాబు ఏ ప్రాంత ఆకాంక్షల గురించి అయినా మాట్లాడగలగాలి. ధైర్యంగా భావాల్ని వ్యక్తపరచగలగాలి. సోనియాగాంధీ మొహం చాటేసింది కనుక, తాన