దగాపడిన పాలమూరు


Tue,October 9, 2012 05:47 PM

పాలమూరును ఆ జిల్లా ప్రజలు, బైబిల్‌లో వర్ణించిన పాలు, తేనే కలిసి ప్రవహించే ప్రాంతం పాలస్తీనా అను రీతిగా పాలు జాలువారే ప్రదేశంగా ప్రేమిస్తారు. నిజానికి నేటి పాలస్తీనా లాగే పాలమూరు జిల్లా కూడా గట్లు, గుట్టలు బీడువారిన భూములతో ఈసురోమంటూ ఉన్నది. జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణ, తుంగభద్ర, భీమా నదులను చూసి ఎప్పుడైనా ఈ నదులు తమ జీవితాల్లో పాలు పొంగిస్తాయని వారి ఆశ. అందుకనే తమ ప్రాంతానికి పాలమూరు అని పేరు పెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన ఈ 55 ఏళ్లలో ఆ కల నిజం కాలేదు. పైగా ఉన్న నీరు కూడా సీమాంవూధుల దోపిడీ పాలై ఇక్కడి ప్రజల జీవితాలు దుర్భరమైనాయి. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఇక్కడి శ్రామికులు దేశ ,విదేశాల్లో తమ చెమటతో నిర్మించిన కట్టడాలతో పాలమూరుకు ప్రత్యేక గుర్తింపును తెచ్చారు. కానీ వలసాంవూధుల పాలనలో పాలమూరు అంటే అందరికీ అలుసే. అతి, గతీలేని వలస కూలీలని చిన్నచూపు.
పాలమూరు జిల్లానుంచి ప్రవహిస్తున్న కృష్ణా నది లో పాలమూరు వాటా ఆ జిల్లాకు దక్కుతుందా? ఆ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి. కృష్ణానది మీద మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల . ఇది 17.5 టీఎంసీలనుంచి 11 టీఎంసీలకు కుదించబడింది. అయినా.. దీనినుంచి 5-6 టీంసీల కంటే ఎక్కువ నీరు ఉపయోగంలోకి రావడంలేదు. నిజాం కాలంలో నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు 9 వేల ఎకరాలకు నీరు అందించేది. తర్వాత కాలంలో.. దీనిలోని నీటిని కేసీ కెనాల్‌కు మళ్లించి కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే నీరందే విధంగా తయారు చేశారు. ఇప్పుడు ఇంకింత దోచుకుంటున్నారు. నిజాం కాలంనాటికి ముందే రూపకల్పన జరిగిన నెట్టంపాడు, భీమా లాంటి ప్రాజెక్టులు వలసాంవూధుల పాలన పుణ్యమాని కనిపించకుండా పోయాయి. ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన పాలకులు తెలంగాణ ఎత్తిపోతల పథకాలకు 12వేల మెగా వాట్ల విద్యుత్తు అవసరం అని చెబుతున్నారు.మరి మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు కేవలం వేల మెగావాట్లే. అంటే.. ఆకుకు అందని,పోకకు పొందని పథకాలు చెప్పి, ఆచరణ సాధ్యంకాని ప్రజెక్టులు తయారు చేసి తెలంగాణకు మొండిచేయి చూపించాలని సీమాంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారు. శ్రీశైలం విద్యుత్తు ప్రాజెక్టును బహుళార్ధక ప్రాజెక్టుగా మార్చి ప్రాజెక్టు ‘డ్రాడౌన్ లెవెల్స్’ పెంచి పాలమూరు నికర జలాలను కొల్ల గొడుతున్నారు. కర్నూలు , కడప జిల్లాలకు కూడా పాలమూరుకు దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారు.

150 ఏండ్లకు పైబడిన కృష్ణా , గోదావరి మట్టి బారేజిలకు రెండు మూడు సార్లు మరమ్మత్తులు చేశారు. అదే తెలంగాణలోని చెరువులు,కుంటలు అన్నీ పూడుకుపోయినా దేనినీ మరమ్మత్తు చేయించలేదు. ఫలితంగా కిందికి వరదల రూపంలో వచ్చిన నీటిని నిలువ చేసుకొని అయకట్టును పెంచుకున్నారు. ప్రవహిస్తున్న ప్రతి నదినుంచి సీమాంధ్ర ప్రాంతానికి నీరు తరలించే కార్యక్షికమమే చేస్తున్నారు. తెలంగాణకు దక్కాల్సిన వాటాను మాయమాటలతో కాజేస్తున్నారు. దీంతో.. ఏండ్లకు ఏండ్లుగా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉన్నది. అధీకృత కృష్ణా జలాలను, పిపి రెగ్యులేటర్ ద్వారా వారి దొంగ ప్రాజెక్టులను నింపుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కృష్ణా, గోదావరిలోని తెలంగాణ వాటా జలాలను, సీమకు తరలించుకుపోవడానికి, స్థిరీకరణ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ఎస్‌ఎల్‌బీసీ లాగానే తెలంగాణ ఎత్తిపోతల పథకాలను ఎరలుగా చూపిస్తున్నారు. పాలమూరు రైతుల గతి పాడుబడిన బోరు బావి గుంతలైతే, ఆంధ్రులకు ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్న ఆయకట్టుకు స్థిరీకరణ ప్రాజెక్టులు కావాలి. వారికి బిరాబిరా పరుగుపూత్తే కాలువల ప్రాజెక్టులైతే, తెలంగాణకు ఎన్నటికీ పూర్తికాని సొరంగాలు, పురిట్లోనే సంధి కొట్టే ఎత్తిపోతల పథకాలు ఇస్తారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలు ఈ సీమాంధ్ర ప్రభుత్వంలో ఎన్నటికి పూర్తికావు. వాటికి అయ్యే ఖర్చును తెలంగాణ రైతుల కోసం ఖర్చుపెట్టే ఆలోచన కానీ, నిబద్ధత కానీ ఈ సీమాంవూధపాలకులకు లేదు. సమైక్యాంవూధలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎన్‌ఎస్‌పీ ఎడమ కాలువ, మంజీరా, నిజాంసాగర్ ప్రాజెక్టుల చరిత్ర చూస్తే తెలుస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా చెప్పుకున్న జలయజ్ఞం ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీకి ఆలవాలం. ఇది దేశీయ అం తర్జాతీయ జలవినియోగం సూత్రాలకు విరుద్ధం. 55 ఏళ్ళల్లో సీమాంధ్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి తెలంగాణ జీవితాలు మూడు తరాలు వెనుకబడి పోయాయి. ఈ జల ‘దోపిడీ’ ని పూర్తి కానిస్తే మన బతుకులు మరు భూములు కాక తప్పదు. ఈ విషయం ఆంధ్రులకు బానిసలైన మన ప్రజావూపతినిధులకు ఎలాగు అర్థం కాదు. ప్రజలే అర్థం చేసుకోవాలి.

జలయజ్ఞం పేరుతో దేశంలో కనివినీ ఎరుగని స్థాయిలో నీటి సూత్రాలను ఉల్లఘించి, తెలంగాణ జలాలను శాశ్వతంగా దోచుకొనిపోయే ప్రయత్నం జరుగుతున్నది. ఇటీవల ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో గత ఆరేడు ఏండ్లలో 72 వేల కోట్ల ఖర్చు జరిగిందని కానీ ఆయకట్టు ఏమాత్రం పెరగలేదని కేంద్ర ప్రభు త్వ యంత్రాంగం అభివూపాయపడినట్టు వెల్లడించిం ది. ఈ వేల కోట్ల రూపాయలు నదీ జలాలల్లో కొట్టుకపోయినట్టుగా స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. తేలు కుట్టిన దొంగలా మిన్నక కూర్చొంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతున్నది. తెలంగాణ వనరులన్నీ దోపిడీకి గురైన ప్పటికీ పాలమూరు జిల్లా ఇంకా ఎక్కువగా నీటి దోపిడీకి గురైంది. పాలమూరు సాగు తాగు నీటిని పోగొట్టుకున్నది. ఆనాడు ఫజల్ అలీ ఉహించిన దానికంటే ఎన్నో రెట్లు అన్యాయం జరిగిపోయింది. వలస పాలనలో పాలమూరు జిల్లా ఎండిన చెరువులు, పాడుబడిన బోరు బావులతో ఎడారిగా మారిపోతున్నది. సీమాంవూధులతో కలిసి ఉండడమనేది ఉండమావిలో దప్పిక తీర్చుకోవడం వంటిదని 55 ఏళ్ల పాలనలో తెలుసుకున్న సత్యం.
పాలమూరులో తెలంగాణ ఉద్యమ ప్రభావం అంతగా లేదని సీమాంవూధులు చేస్తున్న ప్రచారాన్ని వమ్ము చేస్తూ ఏకంగా ఒక కాంగ్రెస్ మంత్రి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మరొక టీడీపీ ముఖ్య నాయకుడు తన పార్టీని విడిచిపెట్టి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు ఇక్కడివే. ప్రస్తుతం తెలంగాణకు ప్రధాన అవరోధం సీమాంవూధులకు సహకరిస్తున్న సోనియా, ఆమె కోటరీ. అదేవిధంగా 55 ఏండ్ల అరిగోసకు కాంగ్రెస్సే కారణం. నెహ్రూ, ఇందిరాగాంధీల వల్లనే ఈ అన్యాయం జరిగింది. తెలంగాణకు మరొక బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు. తెలంగాణ అస్తిత్వమన్నా, ప్రజలన్నా అతనికి ఏవగింపు. ఈ రెండు పార్టీలు కలిసి 2004 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షతో దుర్మార్గమైన రాజకీయ నాటకాలు అడుతున్నాయి. ఇంతకాలం జరిగిన అన్యాయాలను సరిదిద్దుకొని మనం అభివృద్ధి సాధించుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలి. సమైక్యాంవూధలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కూడా ఎక్కువగా లాభపడేది పాలమూరు జిల్లాయే. సీమాంధ్ర పార్టీల ప్రలోభాలకు లొంగితే నిరంతరం బానిసత్వం అనుభవించాల్సిందే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికలను తమ ఆకాంక్షల ప్రతీకగా చూడాలి. కీలెరిగి వాతపెట్టాలి. త్యాగధనులకే ఓటెయ్యాలి.

-జె.ఆర్. జనుంపల్లి

35

JANUMPALLI JR

Published: Tue,October 9, 2012 05:46 PM

తెలంగాణ తెగువ

సిరిసిల్లలో రహీమున్నీసా ప్రదర్శించిన పౌరుషం, పోరాట పటిమ భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో అస్సాం బాలిక కనకలత బారువా ప్రదర్శించిన అనితర

Published: Tue,October 9, 2012 05:49 PM

అవినీతి వ్యతిరేక ఉద్యమం- తెలంగాణ

అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చాలా గొప్పది. జన్‌లోక్ పాల్ బిల్లు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి.దీనిని సమర్థించా

Published: Tue,October 9, 2012 05:51 PM

ఇక తెగించి కొట్లాడుడే..

కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ కలిసి తెలంగాణ ఉద్యమానికి చుట్టూ రాతి గోడ కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ తెలుగుదేశం తదితరులు పూర్

Published: Tue,October 9, 2012 05:47 PM

విధ్వంసకారుల వితండవాదాలు

హైదరాబాద్ నగరాన్ని 5లేదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఆంధ్ర నాయకులు వేలు పెట్టే సందు ఇస్