తెలంగాణ తెగువ


Tue,October 9, 2012 05:46 PM

సిరిసిల్లలో రహీమున్నీసా ప్రదర్శించిన పౌరుషం, పోరాట పటిమ భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో అస్సాం బాలిక కనకలత బారువా ప్రదర్శించిన అనితర సాధ్యమైన స్ఫూర్తిని గుర్తుచేస్తున్నది. రహీమున్నీసా అక్కడున్న రెండువేల మంది పోలీసుల, వందలాది సీమాంధ్ర గూండాల నడుమ ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తి, నేర్పుతో తెలంగాణ పౌరుషాన్ని చాటారు. తనను నిర్బంధించిన పోలీసువ్యాన్ ఎక్కి తన కాలి చెప్పును తీసి ఝుళిపించడం తెలంగాణ ధిక్కార స్వరానికి ప్రతీక. పరపీడన నెదిరించి పోరాడే స్వతంవూతేచ్ఛకు చక్కటి ఉదాహరణ. దీనిని బట్టి తెలంగాణ ఉద్యమం వెనుక ఎంతటి ఆవేదన ఉన్నదో, ఇక్కడి ప్రజలు ఎంతటి వివక్ష, అణచి వేతకు గురి అయినారో తెలుస్తున్నది.రహీమున్నీసా చూపించిన చెప్పు కేవలం అక్కడున్న పోలీసు, గూండాలు, విజయమ్మ, సురేఖ వారి అనుచరులపైన మాత్రమే కాదు. 60 సంవత్సరాల్లో తెలంగాణపై దాష్టీకము సాగించిన వలసవాద వ్యవస్థ మీద. గత దశాబ్దంలో తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలు మరిచి మోసం చేసిన పార్టీలు, ప్రభుత్యాల మీద. అది ఒక సింబాలిక్ చర్య. నాలుగు కోట్ల ప్రజల హృదయాల్లో మండుతున్న న్యాయపూరిత గుణాత్మకమైన నిరసన. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇన్నేండ్ల ఆక్రోశం ఒక్కసారిగా ఉప్పెనలా ఉప్పొంగి రహీమున్నీసా అంతటి సాహస కార్యాన్ని చేయడానికి పురిగొల్పింది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ చేసిన రాజకీయ దండయావూతలో తాండూరులో వీరమణి టీడీపీ గూండాలపై చెప్పు విసిరి తెలంగాణ పౌరుషం చాటిచెప్పింది. రాయనిగూడెంలో ముఖ్యమంత్రి పురుషులను ఎదుర్కోలేక కేవలం మహిళలనే, అది కూడా చెప్పులు లేకుండా‘రచ్చబండ’లో సమావేశ పరిచాడు. అయితే రాయనిగూడెం వనితలు, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థినులు రచ్చబండను రచ్చ రచ్చ చేసి ముఖ్యమంవూతిని అరగంటలోనే సమావేశం వదిలి హెలికాప్టర్ ఎక్కి పలాయనం చిత్తగించేలా చేశారు. అయినా ఈ వలసవాద పాలకులకు బుద్ధి రాలేదు. తెలంగాణపై రాజకీయ దండయావూతకు ప్రధానమంవూతికి తప్ప ఇతరులకు లభ్యం కానీ హెలికాప్టర్‌తో సహా పదివేల మంది పోలీసులు బందోబస్తు చేయడం దేశ చరివూతలోఎక్కడా జరగలేదు. ఇదం తా కేవలం ఒక సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణ యాత్ర చేయగలిగిందని చెప్పుకోవడానికి మాత్రమే.

ఆంధ్రాపాలకుల దుర్మార్గం ఇలా కొనసాగుతుంటే, తెలంగాణ ఎమ్మెల్యేలు ఒక మాట కూడా మాట్లాడటం లేదు. ఇక మన కాంగ్రెస్ ఎంపీలు అయితే సమయాన్ని బట్టి ఆకుకు అందకుండా పోకకు పొందకుండా వంకర టింకర మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. తెలంగాణ ఈనాటి దుస్థితికి కారణమైన కిరణ్‌కుమార్‌డ్డి వాళ్ళ అధినేత కన్నుసన్నల్లో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఆజాద్‌తో అప్పుడప్పుడు మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ఒక మంచి పనీ చెయ్యడం చేతకాని ముఖ్యమంత్రి వీళ్ళ మాటలను ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తుంటాడు. అవసరమైతే వీళ్ళు అడిగిదానికి అడ్డంగా చేస్తుంటాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడం అయన ప్రధాన ఎజెండా. మన ప్రజావూపతినిధులు ఎక్కడో దూరంగా ఉండి సందు దొరికినప్పుడు ఉత్తర కుమార ప్రజ్ఞలు చేస్తుంటారు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు, అధిష్ఠానం అడుగక ముందే అందరికంటే ముందే వాళ్ళ పనులు చేసి పెడుతుంటారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ విషయంలో చేస్తున్న నిరంతర వాయిదా ప్రక్రియకు అలిసి పోకుండా యథాలాపంగా సాయపడుతుంటారు.ఈ మలిదశ ఉద్యమంలో, రాష్ట్ర సాధన కోసం ఉద్యమం, ఎన్నికలు రెండింటినీ ఉపయోగించుకోవాలనే విధానంలో తెలంగాణ ప్రజలు ఇటు ఉద్యమంలో గానీ అటు ఎన్నికల్లో గానీ తమ వంతు కర్తవ్యాన్ని ఎంతో ఉదాత్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రతినిధులు రహీమున్నీసా చూపిన తెగువ, సాహసంలో పదో వంతు ప్రదర్శించినా ఈ పాటికి మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే వాళ్ళం. రహీమున్నిసా తన ప్రాణాల్ని పణంగా పెట్టి సీమాంధ్ర ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న వీరోచిత సంఘటనను చూసైనా మన ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి తెలంగాణ రాష్ట్రం సాధించే ప్రక్రియలో పాల్గొంటారని ఆశిద్దాం. రహీమున్నీసా ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ జనం మరింత ఉధృతంగా పోరాటం చేస్తారు. ఆమెతోపాటు అసంఖ్యాకంగా సిరిసిల్ల ప్రతిఘటనలో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు మన ఉద్యమ అభినందనలు తెలియచేద్దాం. రహీమున్నిసా వీరోచిత గాథ తెలంగాణ రాష్ట్ర పోరాట చరివూతలో మరుపురాని పుట. మహిళలు వీధుల్లోకి వచ్చి ఉద్యమిం చడం, సభల్లో చేరి ధిక్కార స్వరాన్ని వినిపించడం తెలంగాణ ఉద్యమం గొప్పతనం.

-జేఆర్ జనుంపల్లి

35

JANUMPALLI JR

Published: Tue,October 9, 2012 05:47 PM

దగాపడిన పాలమూరు

పాలమూరును ఆ జిల్లా ప్రజలు, బైబిల్‌లో వర్ణించిన పాలు, తేనే కలిసి ప్రవహించే ప్రాంతం పాలస్తీనా అను రీతిగా పాలు జాలువారే ప్రదేశంగా ప్ర

Published: Tue,October 9, 2012 05:49 PM

అవినీతి వ్యతిరేక ఉద్యమం- తెలంగాణ

అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చాలా గొప్పది. జన్‌లోక్ పాల్ బిల్లు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి.దీనిని సమర్థించా

Published: Tue,October 9, 2012 05:51 PM

ఇక తెగించి కొట్లాడుడే..

కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ కలిసి తెలంగాణ ఉద్యమానికి చుట్టూ రాతి గోడ కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ తెలుగుదేశం తదితరులు పూర్

Published: Tue,October 9, 2012 05:47 PM

విధ్వంసకారుల వితండవాదాలు

హైదరాబాద్ నగరాన్ని 5లేదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఆంధ్ర నాయకులు వేలు పెట్టే సందు ఇస్