ఉద్యమాలు-ఉప ఎన్నికలు


Thu,March 29, 2012 01:45 AM

కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. సాధారణంగా ఎన్నికలలో ప్రజలు ఒక పార్టీని ఎన్నుకున్న తర్వాత కొంత కాలం వరకైనా వేచిచూసిన తర్వాత ఉద్యమం చేపడతారు. అలాకాక ఎన్నికలు ఎన్నికల వరకే, ఉద్యమాలు ఉద్యమాలే అన్న ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరు ను తెలుపుతున్నదని అప్పుడు రాసిన ఒక వ్యాసంలో విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు కూడా ఉప ఎన్నికలు జరిగి ఆ ఎన్నికలలో తెలంగాణవాదానికి నిలబడ్డ అందరు అభ్యర్థులు గెలిచిన వారం, రెండు వారాల్లోనే మళ్లీ ప్రాణ త్యాగాలు, బందులు జరుగుతున్నాయి. అంటే ఎన్నికల ఫలితాలు లక్ష్యసాధన పట్ల విశ్వాసాన్ని కలిగించడం లేదు. అనేది స్పష్టం. గెలిచిన అభ్యర్థులు ఆ విశ్వాసాన్ని కలిగించడం లేదు. ఇది మొత్తం ఎన్నికల రాజకీయాల మీద, ఉద్యమాల మీద, ఉద్యమాలకు ఎన్నికలకు గల సంబంధం మీద ఒక ప్రజా అనుభవంగా చూడాలి.

ఉప ఎన్నికలలో పోటీ చేసిన వాళు,్ల రాజకీయ పార్టీలు తెలంగాణ ఆకాంక్షను బలపరస్తూ ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ అంశం కేంద్రం త్వరగా తేల్చాలని అన్నాడు. చంద్రబాబుకూడా తానూ తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రచారం చేశాడు. బీజేపీ సంపూర్ణంగా తెలంగాణ ఆకాంక్షకు కట్టుబడి ఉన్నామని ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి అది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. ప్రజలో ఎవరికి ఓట్లువేస్తే వాళ్ళ ఆకాంక్ష బలంగా వ్యక్తమైనట్టు ఎవరైనా సమైక్య రాష్ట్ర నినాదంతో పోటీ చేసినప్పుడు కదా ప్రజలు తమ స్పష్టమైన అభివూపాయాన్ని వ్యక్తపరిచే అవకాశముంటుంది. మొత్తంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే అంతిమంగా తెలంగాణవాదం గెలిచినట్టు అని స్పష్టంగానో, అస్పష్టంగానో తెలంగాణ సమాజంలో, రాజకీయాలలో ఒక భావన ఉంది. అయితే ఇంతకు ముందు జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఉప ఎన్నికలలో కొన్ని ధోరణులు ముందుకు వచ్చాయి. వాటి గురించి తెలంగాణ ప్రజలు ఆలోచించవలసి ఉంది.

రాజకీయ పార్టీల సంస్కృతి దిగజారిపోయిందనే భావనే జేఏసీ అనే ప్రత్యామ్నాయాని కి తెర తీసింది. రాజకీయ జేఏసీకి అధ్యక్షుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను ఎన్నుకున్నారు. అలాగే భిన్న రంగాలలో వందలాది మంది జేఏసీలు వెలిశాయి. ఈ ఉప ఎన్నికలలో రాజకీయ జేఏసీ తమ సభ్యులైన పార్టీలను నియంవూతించడంలో విఫలమయింది. రాజకీయ సంస్కృతే జేఏసీ పని విధానాన్ని నిర్ణయించే దశ వచ్చింది. జేఏసీలోని ఇద్దరు సభ్యులు మహబూబ్‌నగర్‌లో పోటీకి దిగారు. ఈ విషయంలో జేఏసీ అసహాయంగా ఉండిపోయింది. తమ మద్దతు తెలపకుండా న్యూట్రల్‌గా ఉండిపోయింది. ఇక భవిష్యత్తులో ఇదే ధోరణి కొనసాగుతుంది. జేఏ సీ ప్రయోగం రాజకీయ పార్టీలకు కంటగింపుగానే తయారయ్యింది. తమ అభ్యర్థి ఎన్నికలలో గెలుస్తాడు అని విశ్వాసం కలుగుతూనే బీజేపీ జేఏసీ నియంవూతణ నుంచి బయటికి వచ్చేసింది.

మహబూబ్‌నగర్ ఎన్నికలు మరికొన్ని ధోరణులను ముందుకు తీసుక వచ్చాయి. మహబూబ్‌నగర్ ప్రచారంలో బీజేపీ తెలంగాణ అంశాన్ని, భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలి, మహబూబ్‌నగర్ జిల్లా సమస్యలకు పరిష్కారమేంటనే అంశాలను చేపట్టలేదు. ఎదుటి అభ్యర్థి మైనారిటీ కావడంతో బీజేపీ తన నిజ స్వభావం బయట పెట్టింది. ఆ అభ్యర్ధి టీఆర్‌ఎస్ అభ్యర్థి. ఆ అభ్యర్థిమీద చేసిన అన్ని వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలుగా వాళ్ళకు ఎందుకు అనిపించలేదో అర్థం కావడంలేదు. ఇప్పుడే నాయకుడిగా ఎదుగుతున్న యువకుడు కిషన్‌డ్డి దాదాపు నరేంద్రమోడీ తరహాలో మాట్లాడాడు. ముస్లిం అభ్యర్థి గెలిస్తే రజాకార్లకు అధికారం ఇచ్చినట్టే అనడం, నాలాంటి వాళ్ళకు కొంచెం షాకింగ్ అనిపించింది. రజాకార్ల గురించి ప్రస్తావిస్తే అప్పుడు రజాకార్లకు రక్షణ కల్పించి, ఆశ్రయం ఇచ్చి పూర్తి మద్దతు తెలిపిన అగ్రకుల హిందూ భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల గురించి మాట్లాడవలసి ఉంటుంది. చరిత్ర సగం సగం చెప్పడం రాజకీయాలకు ఆరోగ్యకరం కాదు. ఉత్తరవూపదేశ్‌లో ఒక ఊపు ఊపి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ రాష్ట్రంలో ఎందుకు ఇంత డీలా పడిందో ఆలోచించాలి. కొన్ని నినాదాలు తాత్కాలికంగా పనిచేస్తాయి. కానీ కొన్ని ఉత్తమ విలువలు రాజకీయ పార్టీల ను నాయకులను చాలా కాలం నిలబెడ్తాయి.

ఈ ఉప ఎన్నికలలో గెలిచిన వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేసిన వారే. వీళ్ళందరు పాత నాయకులే. వీళ్ళల్లో చాలామంది అధికార పార్టీలలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను విస్మరించినవాళ్ళే.. మహబూబ్‌నగర్ జిల్లాలో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు మంత్రులుగా పనిచేసిన వాళ్లే. మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌డ్డి ఎస్పీగా విపరీతమైన అణచివేతకు పాల్పడితే, ప్రజాసంఘాల సభ్యుల మీద దాడి చేస్తే, ఇది అన్యాయం అని అన్న పాపానపోలేదు. పోలీసులను మనం ఏం అనేట్టులేదు. వాళ్ళు ఎవ్వరు చెప్పి నా వినరు అన్న చాలా మంది అగ్రకుల నాయకులు తర్వాత వచ్చిన చారుసిన్హా తమ మాట విననందుకు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి ట్రాన్స్‌ఫర్ చేయించా రు. శ్రీనివాస్‌డ్డి విషయంలో అసహాయంగా ఉన్న నాయకులు చారుసిన్హాను ఎలా మార్చగలిగారో చెప్పవలసి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళ స్వభావం, ధోరణి మారుతుందా? లేక అవి కేవలం అధికారం మార్పిడేనా?అన్న ప్రశ్న కూడా అడగవలసి వస్తున్నది.

ఈ ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా తెలంగాణ పార్టీ అభ్యర్థులు కూడా చాలా డబ్బులు ఖర్చుపెట్టారని ప్రజలు అంటున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్‌లో పీసీసీ అభ్యక్షుడు శ్రీనివాస్‌ను ఢీ కొన్నప్పుడు కూడా ఏ మాత్రం డబ్బుల పంపి ణీ లేకుండా తెలంగాణవాది గెలిచాడు అని చాలామంది గర్వంగా చెప్పుకున్నారు. ఇంత తక్కువ కాలంలోనే ఒక ఉద్యమస్ఫూర్తి ఉన్న ప్రాంతంలో డబ్బుల పాత్ర పెరగడం, తెలంగాణ ఉద్యమానికి గౌరవవూపదం కాదు.

తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు అంతకంటే మంచిది కాదు. నిజానికి టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికైనా యువకుల నుంచి ముఖ్యంగా బలహీ న వర్గాల నుంచి కొత్తతరం నాయకులను, నిజాయితీ గలిగిన వారిని, తెలంగాణ ప్రజల పట్ల త్యాగ భావన గలవారిని ప్రోత్సహించాలి. ఇది అత్యాశ అని మిత్రులు అనవచ్చు. గతం లో జరిగిన 1969 తెలంగాణ ఉద్యమం నుంచి కొందరైనా బలహీనవర్గాల నుంచి కొత్త నాయకులు ఎదిగివచ్చారు, వాళ్ళు తర్వాత జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. అది వేరే అంశం.
ఈసారి ఉద్యమంలో ఎదిగిన కొందరు నాయకులున్నారు. వారు కూడా సంప్రదాయ రాజకీయ సంస్కృతిలో భాగంగా ఉన్నారు. విషపు గడ్డలు తింటున్న ఆదిలాబాద్ గోండులను, ఫ్లోరోసిస్ వ్యాధితో బాధితులైన నల్గొండ వాసులను, సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళి కుటుంబ సభ్యులను కోల్పోయిన పాలమూరు లేబర్ కుటుంబాలను, అమాయకులైన అచ్చంపేట చెంచులను కలిసి నూతన నాయకత్వం వాళ్ళతో ఎక్కు వ కాలం గడపాలి. వాళ్ళ సమస్యల మూలాలలోకి వెళ్ళి చూడగలగాలి. మానవత్వం, మంచితనం, నిజాయితీ సెక్యులర్ భావాలు కలిగిన యువ నాయకత్వం ఇప్పటి తెలంగాణ చారివూతక అవసరం. అవి ఎన్నికల రాజకీయాల నుంచి వస్తాయా, నిరంతర ప్రజా ఉద్యమాల నుంచి వస్తాయా అన్న దే ప్రశ్న. అలాంటి నాయకత్వం ఏ మార్గం ద్వారా వచ్చినా తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు.

ప్రొఫెసర్ హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల