రాజకీయాలు-మాఫియా


Wed,March 14, 2012 11:30 PM

వారం రోజులుగా మధ్యవూపదేశ్ మాఫియా దురాగతాలను మీడియా రిపోర్టు చేస్తున్నది.వ్యాపారాలు దారితప్పి చట్టవ్యతిరేక ‘చీకటి లాభాల’ వేట లో పడ్డాయో, అక్కడి నుంచి మాఫియా పెరుగుతూ వచ్చింది. ఇప్పు డు పారిక్షిశామిక రంగంలో మాఫియా, గనుల మాఫియా, ఇసుక మాఫియా, కిరోసిన్ మాఫియా, సినిమా మాఫియా, లిక్కర్ మాఫియా, కేబుల్ ఆపరేటర్ మాఫి యా... ఇలా ఒక్క రంగమని కాదు, ఆర్థిక లావాదేవీలున్న ప్రతి రంగం ఏదో మేరకు మాఫియాను పోషిస్తున్నది. వీళ్లందరికి రాజపోషకులు రాజకీయ నాయకులు. నిజానికి రాజకీయ నాయకులకు, మాఫియాకు మధ్యగీత క్రమక్షికమంగా మారుతూ, వీళ్లే వాళ్లు, వాళ్లే వీరుగా రూపాంతరం చెందుతున్నారు. మన రాష్ట్రం లో కొందరు క్యాబినెట్ మినిస్టర్లు మాట్లాడుతున్న పద్ధతి, వాళ్ల ఆర్థిక సంబురాలు, హైదరాబాద్ నగరంలోని ల్యాండ్ మాఫియాకు హైదరాబాద్‌లోని రాజకీయ నాయకులకున్న సంబంధాలు సులభంగా గుర్తించవచ్చు. దీంట్లో పెద్దగా దాచుకోవడానికి రహస్యమంటూ ఏమీలేదు. బహుశా కొందరు రాజకీయ నాయకులను మనం మాఫియాలో భాగం అని అంటే లోలోపల సంతోషించే వాళ్లుంటారు. జనం భయపడడం వాళ్లకు ఇష్టం. ఇంత విశ్వరూపం దాలుస్తున్న లేదా చూపిస్తు న్న మాఫియా సామాజిక, ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయో కొంత చర్చించవలసిన అవసరం ఏర్పడింది.

మధ్యవూపదేశ్‌లో మాఫియా ఒక యువ ఐపీఎస్ ఆఫీసర్‌ను దారుణంగా చంపిం ది. దాని తర్వాత వరుసగా ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తున్నది. పోలీస్ ఆఫీసర్ హత్యమీద సీబీఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి, తమ రాష్ట్రంలో మాఫియా లేదు అని ప్రకటించాడు. పత్రికల్లో మాఫియా దురాగతాల గురించి కోడై కూస్తుంటే, మాఫి యా లేదు అని ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆలోచించాలి. మధ్యవూపదేశ్‌లో మాఫి యా ‘కార్యక్షికమాల’ మీద విచారణ జరిపిస్తే వాళ్లకుండే ఆర్థిక మూలాలు, రాజకీయ సంబంధాలు మొత్తం బట్టబయలు అవుతాయన్నది భయం. అయితే ఇంత కాలం రాజకీయ ప్రత్యర్థుల్ని, ట్రేడ్ యూనియన్ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, ఉద్యమకారులను బెదిరిస్తూ, హింసిస్తూ ఉన్న మాఫియా నేరుగా రాజ్య యంత్రాంగం మీదే దాడి చేయడంతో పరిస్థితి చేయిదాటుతున్నట్టు పాలక వర్గాలు, పాలనా యంత్రాంగం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఉలికి పడింది. నిజానికి మాఫియాకు కొందరు పోలీసు అధికారులకుండే రహస్య సంబంధాలు ఆంధ్రవూపదేశ్‌లో అందరికి తెలుసు. దీనిమీద కొంత చర్చ కూడా జరిగింది. వాళ్ల సంబంధాలు పూర్తిగా బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియా కూడా ఈ సంబంధాలను పూర్తిగా బట్టబయలు చేయడానికి కొంత జంకుతున్నది. మీడియాలో నిజాయితీగా రాసే వాళ్లకు ఎప్పుడూ కొన్ని భయపెట్టే ఫోన్లు వస్తూనే ఉంటాయి. రాజకీయాలకు, మాఫియాకు, పోలీసు యంత్రాగానికి, కొంత వరకు మీడియాకు ‘సత్సంబంధాలు’ ఉన్నవన్నది కూడా ఒక వాస్తవమే.

మన రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమ అణచివేత పేర ఒక భయంకరమైన మాఫియాను పెంచిపోషించారు. ఈ పద్ధతిని దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో ఒక పద్ధతి ప్రకారం రాజ్యమే ప్రోత్సహించింది. దీనికి పరాకాష్ట ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం రూపంలో దర్శనమిచ్చింది. ఒక చట్టవ్యతిరేక ముఠా ను రాజ్యం పోషించడాన్ని సుప్రీంకోర్టు తప్పుగా పరిగణించడమేకాక ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఈ ముఠాను రద్దుచేయవలసిందిగా ఆజ్ఞాపించింది. దీంతో ఏం చేయాలో తోచక వీళ్లందరిని పోలీసు యంత్రాంగంలోకి రిక్రూట్ చేసుకున్నారు. అంటే సల్వాజుడుంకు, పోలీసులకు తేడా లేదు! ఒక చట్టవ్యతిరేక ముఠాను చట్టబద్ధ పోలీసులోకి తీసుకువచ్చి, అంటే సల్వాజుడుం సంస్కృతి, పోలీసు సంస్కృతి ఒక్కటే అని అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఏమిటి?

ఛత్తీస్‌గఢ్‌లో మాఫియా చాలా కాలంగా పనిచేస్తున్నది. విపరీతమైన ఖనిజ సంపద, కొంత పారిక్షిశామికీకరణ జరిగిన గిరిజన ప్రాంతాలలో, అభివృద్ధితో ప్రయోజనం పొందడం అటుంచి, తమ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడినప్పుడు గిరిజనులు, పారిక్షిశామికరంగంలోని కార్మికుల మధ్య ఒక పోరాట సంబంధం ఏర్పడడంతో ఒకవైపు పారిక్షిశామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు మరొకవైపు రాజకీయనాయకులు, పాలనాయంవూతాంగం ఉద్యమాలను అణిచే క్రమంలో మాఫియా చాలా బలపడింది. శంకర్ గుహ నియోగి లాంటి అద్భుతమైన ఒక శ్రామిక నాయకుడిని మాఫియా చేత చంపించారు. నియోగి మరణించినప్పుడే దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. కానీ ఈ మొత్తం ప్రక్రియను ప్రతిఘటించి, మాఫియాను అరికట్టలేకపోయింది. నిజానికి మాఫియా ఎదుగుదల వాటి రాజకీయ పాత్రకు జాతీయస్థాయిలో సంజయ్‌గాంధీ మొట్టమొదట ప్రాతినిధ్యం వహించాడని ఆ కాలంలోనే చర్చ జరిగింది. సంజయ్‌గాంధీ ప్రమాదంలో మరణించినప్పుడు అరుణ్‌శౌరీ సంజయ్‌గాంధీని సమాజం శిక్షించే ఒక అవకాశాన్ని కోల్పోయింది అని ఒక వ్యాసం రాశాడు.

మాఫియా పాత్ర నూతన ఆర్థిక విధానం ‘అభివృద్ధి’ చెందిన క్రమంలో సమాంతరంగా పెరుగుతూ వచ్చింది. సంపద సృష్టిలో శ్రామికుల పాత్ర గుర్తించకుండా, రాజ్యం తన పాత్ర నుంచి తప్పుకుని మార్కెట్ శక్తులను దేశం మీద వదలడంతో వాళ్ల దురాగతాలకు హద్దులులేని ఒక పరిస్థితి దేశంలో ఉంది. నూతన ఆర్థిక విధా నం ఒక రకంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి, దేశంలోని పారిక్షిశామిక చట్టాలకు, చట్టబద్ధ పాలనకు వ్యతిరేకం. దేశంలోని చాలా చట్టాలు ఈ అభివృద్ధిని అంగీకరించవు. భారత ప్రభుత్వం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు చట్టబద్ధత కాని, కనీసం పార్లమెంటు అనుమతి కాని లేవు. ఈ ఒడంబడికలు పార్లమెంటులో చాలా వరకు చర్చకు రావు. కాని వాటి దుష్ప్రభావం సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాం స్కృతిక రంగాల మీద చూడవచ్చు. ఇది మొత్తం దేశ ‘అభివృద్ధి’ దిశను మార్చేసింది. రాజ్యాంగం దేశ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని విధ్వంసం చేసింది. రాజ్యాంగానికి, దేశ చట్టాలకు అతీతంగా వచ్చిన పెట్టుబడికి చట్టవ్యతిరేక ముఠాల అగత్యం ఏర్పడింది. అందుకే ఎక్కడ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతున్నదని అంటున్నారో, ఎక్కడ దేశ వనరులు ఉన్నాయో ఆ ప్రాంతంలో పెట్టుబడి ఉంది. దానినంటుకొని మాఫియా ఉంది.

మన రాష్ట్రంలో రోశయ్య కొత్తగా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఒక టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నప్పుడు మీరు పాత కాలపు మనుషులు, రాష్ట్రంలో మాఫి యా రాజకీయాలు బాగా పుంజుకున్నాయి, మీరు వాళ్లను ఎలా అదుపు చేస్తారు అని అడిగినపుడు, ఈ మాఫియా రెండు దశాబ్దాలుగా పెరుగుతున్నదని, దాన్ని ఒక్కరోజులో నియంవూతించలేమని, తనకు సరైన సమయంలో అవకాశం వస్తే నియంవూతించడానికి ప్రయత్నిస్తానంటూ, అయినా మన రాష్ట్రం బీహార్ కంటే కొంచెం మెరుగుకదా అని అన్నాడు. హైదరాబాద్ చుట్టూ విపరీతమైన ల్యాండ్ మాఫియా ఉంది. ఉప్పల్ నుంచి భువనగిరి దాకా ఏ భూమి అమ్మకం, కొనడం మాఫియా ప్రమేయం లేకుండా జరగడం లేదు. వాళ్లు ప్రైవేట్ సైన్యాలను ఏర్పరుచుకున్నారు. మర్డర్స్ చాలా సునాయసంగా చేయగలరు. దీనికి పోలీసు యంత్రాంగంలో కొందరి పెద్దల మద్దతున్నది.

తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం మీద కేంద్రీకరించడం వల్ల చాలా సమస్యలను వెనక్కి నెట్టింది. ఉద్యమాలకుండే శక్తి అపరిమితమైంది. సమాజంలో వచ్చిన అన్ని వక్రీకరణలను సరిచేయగల శక్తి ఉంటుంది. ఎందుకో ఉద్యమం వీటి ని విస్మరించింది. అంతేకాదు ఉద్యమం లోపల కొన్ని ఈ ధోరణులున్నాయన్న విమర్శ ఉంది. మాఫియాను నియంవూతించే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ల నామరూపాలు లేకుండా చేయడానికి ఉద్యమం నిరంతరంగా శ్రమించవలసి ఉంది.

పొఫెసర్ హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles