ప్రపంచీకరణ: ఉన్నత విద్య


Thu,February 16, 2012 12:15 AM

ఫిబ్రవరి 16న (నేడు) దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యలో ప్రవేశపెట్టబోతున్న సంస్కరణలను లేదా చాలా ప్రధానమైన మార్పులను వ్యతిరేకిస్తూ ధర్నాలు నిర్వహించవలసిందిగా అఖిల భారత విద్యాహక్కు ఫోరం పిలుపునిచ్చింది. మన రాష్ట్రంలో కూడా కలెక్టరేట్ల దగ్గర అన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయమైంది. ఉన్నత విద్య మీద చాలా పెద్ద చర్చ జరగవల సి ఉన్నది. భిన్న ఉద్యమాలు చేపట్టవలసి ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం కపిల్‌సిబల్‌కు ఈ ‘సంస్కరణల’ బాధ్యతలు అప్పజెప్పింది. ఆయనకు విద్యారంగంలో అనుభవం లేదు, అవగాహన లేదు, ముందు చూపులేదు. విద్యా విధానాన్ని రూపొందించడానికి బలమైన జాతీయతా భావన అసలే లేదు.

ఆయనకున్నదల్లా విదేశీపెట్టుబడిని, విదేశీ విశ్వవిద్యాలయాలను అతివేగంగా తీసుకురావాలనే తాపవూతయం. అంతేతప్ప అది మన దేశానికి ఎలా ప్రయోజనమో అర్థం కాదు. అఖిల భారత విశ్వవిద్యాలయ వైఎస్ ఛాన్స్‌లర్ల సదస్సును ప్రారంభిస్తూ ఆయన చెప్పిన మాట గమనార్హమైనది. విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన చట్టం ఎప్పుడు తీసుకువస్తున్నారని ఒక అమెరికన్ విశ్వవిద్యాలయ అధిపతి అడిగినప్పుడు తాను సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చిందని ఆయన అన్నారు. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విదేశీ విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధన చేయడానికి సంసిద్ధత చూపడం లేదని తప్పుపట్టారు. ఈ రెండు అంశాలు తప్ప ప్రపంచంలో ఉన్నత విద్యకు సంబంధించి ఏ సమస్యను కూడా ప్రస్తావించకపోవడం నాలాంటి వాళ్లను ఆశ్చర్యపరిచింది.

కపిల్ సిబల్ తర్వాత మాట్లాడిన శాం పిట్రోడా దేశంలో విద్యా సమస్యకు ఒకే ఒక పరిష్కారమున్నదని, అది నూటికి నూరు శాతం కంప్యూటరీకరణ అని అభిప్రాయ పడ్డారు. దాదాపు మూడు వందల మంది వైస్ చాన్సలర్లను ఉద్దేశించి వీళ్ళిద్దరు చేసిన ప్రసంగాల సారాంశమిది. స్థూలంగా ఇది ఉన్నత విద్య పట్ల వాళ్ల ఆలోచనా సరళి. ఏ వైస్‌చాన్స్‌లర్ కూడా ఇది సరైన దృక్పథం కాదని సాహసించి మాట్లాడలేకపోయారు. మాలాంటి వాళ్లం ఇది సరైన విధానం కాద ని, భారత సంవిధాన స్ఫూర్తికి వ్యతిరేకమని అంటే, అంత ‘తీవూవమైన’ అభివూపాయాలకు ఇప్పుడు ఎక్కువ అవకాశం లేదని, పరిస్థితి చాలా ముందుకు వెళ్లిపోయిందని, వస్తున్న మార్పులతో రాజీ పడక తప్పదని కొందరు (యూజీసీ అధికార్లతో సహా )వాదించారు.

విద్యా విధానంలో మార్పులు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఆదేశాలకు అనుగుణంగా తీసుకురాబడుతున్నాయి. దీంట్లో భాగంగా యూజీసీని రద్దుచేసి దాని స్థానంలోనే మరో సంస్థను నెలకొల్పి దాంట్లో ఏడుగురు సభ్యులను నియమించి, అందులో ముగ్గురు పూర్తికాలం సభ్యులు గా, నలుగురు పార్ట్‌టైం సభ్యులుగా ఉంటా రు. వీరిలో వైద్య విద్యకు సంబంధించిన వారిని కొందరిని, కార్పొరేట్ రంగం నుంచి కొందరిని నియమించి వాళ్ల ద్వారా ఉన్నత విద్య ప్రైవేటీకరణను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. దీనికి తోడుగా విద్య నాణ్యతను, విశ్వవిద్యాలయాలను అక్రెడి ట్ చేసే పనిని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలనేది మరొక బిల్లు. మూడవది విద్యా విషయక వివాదాలను పరిష్కరించడానికి న్యాయస్థానాల స్థానంలో విద్యా ట్రిబ్యునల్స్‌ను స్థాపిస్తారు.

అలాగే దూరవిద్యను ప్రైవేటీకరించాలని, ఉన్న త విద్యలో జరిగే అవకతవకలను సరిదిద్దడానికి మరొక బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ కోరిన మార్పులు. వీటన్నిటికి సంతృప్తి చెంది మన దేశం ఆ సంస్థకు పెట్టుకున్న అర్జీని అంగీకరిస్తే ఇతర దేశా లు మన దేశంలో విశ్వవిద్యాలయాలు పెట్టుకోవచ్చు. అలాగే మనం కూడా ఇత ర దేశాల్లో విద్యను అమ్ముకోవచ్చు.
మొత్తం విద్యావిధాన స్వరూప స్వభావాలను మారుస్తున్న తరుణంలో ఈ మార్పుల గురించి ఏ విశ్వవిద్యాలయంలో కూడా సీరియస్ చర్చ జరగడం లేదు. ఇంత అన్యాయమైన మార్పులు వస్తున్నా అధ్యాపక లోకం ధృతరాష్ట్రుడి లా వ్యవహరిస్తున్నది. రెండు, మూడు దశాబ్దాల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. నిజానికి 195-7లో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం మీద దేశ వ్యాప్తంగా వందల సెమినార్లు జరిగాయి.

తీవ్రమైన చర్చ జరిగింది. రెండున్నర దశాబ్దాల కాలంలో అధ్యాపక లోకం ఇంత మొద్దుబారిపోవడం ఎంత విషా దం. కేంద్రీయ విశ్వవిద్యాలయాల అధ్యాపక సంఘం ఈ అంశాల గురించి చర్చించడానికి కపిల్ సిబల్‌ను కలిసినప్పుడు మీరు ఎన్నుకున్న ప్రతినిధులు పార్లమెంటులో ఉన్నప్పుడు, నేను వారితో చర్చిస్తాను కానీ మీతో ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించాడు. నిజమే పార్లమెంటు ప్రజలకు బాధ్యత వహిస్తుంది అని అనుకుంటే, దాదాపు 300 మంది పార్లమెంటు సభ్యులకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేదా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అయినప్పుడు పబ్లిక్ సంస్థల గురించి వాళ్లెందుకు మాట్లాడతారు. అయినా విద్యా రంగంలో ఉండే అధ్యాపకులకే ఆ సోయి లేనప్పుడు, ప్రజాభివూపాయం బయట బలంగా లేనప్పుడు, ఉద్యమాల ప్రసక్తే లేనప్పుడు కపిల్‌సిబల్ తాననుకున్న దానిని లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశాలను అమలు చేయడం ఎంత సులభం.

ఉన్నత విద్యా రంగంలో పనిచేస్తున్న వారు విద్య భవిష్యత్తు గురించి పట్టించుకోకపోవడానికి భిన్న కారణాలున్నాయి. ఆరవ పే కమిషన్ స్కేలు రావడంతో అధ్యాపక లోకపు జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వ్యక్తిగతంగా చీకు చింతలేని జీవితం. తనను గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించడం అనవసరమైన ప్రయాస అనే ఒక దృక్పథం చాలా బలంగా ప్రభావితం చేస్తున్నది. పబ్లిక్ రంగంలో చదవడానికి వస్తున్న వాళ్లు చాలా మంది బలహీన వర్గాలకు చెందినవాళ్లు. వాళ్లకు ఏం చదువు చెబుతాం అనే ప్రొఫెసర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సంపన్నుల పిల్లలు విదేశీ విద్యాలయాలకు, ప్రైవేట్ కళాశాలలో వృత్తి విద్యకు వెళుతున్నారు. స్పష్టంగా విద్యా రంగంలో వచ్చిన వర్గ విభజన అగుపిస్తున్నది.

విషాదమల్లా మన దేశంలోని సమకాలీన సామాజిక ఉద్యమాలు-దళిత, గిరిజన, మహిళా, మైనారిటీ లేదా ఇతర ఉద్యమాలు విద్యా రంగాన్ని తమ ఎజెండాలో చేర్చలేదు. ఈ రంగాన్ని కాపాడుకోవాలనే పట్టుదల కనిపించడం లేదు. అంతేకాక ప్రైవేట్ రంగంలో బలహీన వర్గాలకు అవకాశాలుండాలని వాదిస్తున్నారు. ఈ స్థితిని మనం మన రాష్ట్రంలోనే గమనించవచ్చు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో బలహీనవర్గాల లేదా అణచివేబడిన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టింది. ఇది రెండు నుంచి మూడు వేల కోట్లకు చేరుకుని దాన్ని ప్రభుత్వం భరించడమే కష ్టసాధ్యమయింది. దీంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు మేం సమ్మె చేస్తామని, కాలేజీలను మూసి వేస్తామని ప్రభుత్వాన్ని భయపెట్టడం మొదలుపెట్టాయి.

అసలు ప్రభుత్వం కొత్త కాలేజీలు తెరిచే బదులు ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నట్టు? కానీ ఈ పాలసీ రాజశేఖర్‌డ్డికి ‘సంక్షేమ ముఖ్యమంవూతి’గా పేరు తెచ్చిపెట్టిం ది. సమాజం, ఉద్యమాలు, మౌలికమైన ప్రశ్నలు అడగడం మానివేయడంతో ఇన్ని అపసవ్యాలు విద్యా వ్యవస్థలోకి చాలా సునాయసంగా రాగలిగాయి.

ఈ నేపథ్యంలో ‘అఖిల భారత విద్యా హక్కు ఫోరం’ రెండు మూడు సంవత్సరాలు గా దేశ వ్యాప్తంగా ఈ మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది. ఈ ఉద్యమం లో (ఇంతకు ముందు వ్యాసాల్లో ప్రస్తావించినట్లుగా) సమాజం పట్ల బాధ్యత గా ఆలోచిస్తున్న, భిన్న రాజకీయ అవగాహనతో కూడిన వ్యక్తులను, సంస్థలను సమీకరించి ఒక సమష్టి ఉద్యమ నిర్మాణం చేపట్టింది. ఇలాంటి ఉద్యమాలు ఏం సాధించగలవు అనుకుంటే, మొత్తం సమాజానికి, పేదవర్గాలకు, భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతాము. సమాజం గురించి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వాళ్లందరు ఈ ఉద్యమాల్లో పాల్గొన వలసిన నైతిక బాధ్యత చరిత్ర వాళ్లమీద పెట్టింది.
పొఫెసర్ హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles