పత్రికా స్వేచ్చ


Sun,July 17, 2011 05:48 AM

పొ.జి. హరగోపాల్


పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలని చాలామంది భావిస్తారు. కానీ నా దృష్టిలో అది సాధ్యం కాదు. అది అభిలషణీయం కూడా కాదు. మంచికి- చెడుకు, మార్పుకు- స్తబ్ధతకు, మానవీయతకు -అమానవీయతకు, విలువలకు- విలువల రాహిత్యానికి మధ్య నిష్పక్షపాతంగా ఉండడం సాధ్యం కాదు.

Hara-gopal-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinemaనమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ గారు తమ పత్రికకు ఒక కాలమ్ రాయమని కోరగా అంగీకరించడానికి ఆయన మీద ఉన్న గౌరవంతో.., పత్రిక ఒక ఉద్యమ నేపథ్యంలో రావడం వలన అంగీకరించక తప్పలేదు. అయితే గతంలో నేను ఒక ఆంగ్ల పత్రికకు కాలమ్ రాసినప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని వాగ్ధానం చేసినా, మా నాన్న గారు ఒక హస్పిటల్‌లో వైద్యుడి నిర్లక్ష్యం వల్ల చనిపోయినప్పుడు రాసిన వ్యాసాన్ని వేయకపోగా సాధారణంగా ప్రైవేటు హాస్పిటల్స్ మీద వ్యాసాలు వేయకూడదనే ఒక నిర్ణయం పత్రికకు ఉన్నద’ని అన్నారు. మరొక తెలుగు పత్రిక సినిమాలను విమర్శిస్తూ వ్రాసిన వ్యాసాన్ని వేయడానికి అంగీకరించలేదు. ఈ మధ్య ఒడిసాలో మధ్యవర్తిత్వం అనుభావాన్ని వ్యాసంగా పంపిస్తే, మధ్యవర్తిత్వాన్ని తన ఎడిటోరియల్‌లో హర్షించిన ‘హిందూ’ ఆంగ్ల పత్రిక ఆ వ్యాసాన్ని ప్రచురించలేదు. మరొక తెలుగు దిన పత్రిక కొంత వత్తిడి చేసి రాయమంటే రాజశేఖర్‌డ్డి నియంతృత్వ పోకడలను (ముఖ్యంగా విద్యారంగంలో) ప్రసావిస్తూ వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించలేదు. ఈ నిర్ణయాలు రాజ్య నియంవూతణలో ప్రభుత్వ ‘సెన్సార్‌షిప్’ వల్ల కాదు. పత్రికలో తమ మీద తామే‘ సెన్సార్‌ిషిప్’ పెట్టుకున్నారు.

ఈ ధోరణిని నామ్ చామ్‌స్కీ ‘ మార్కెట్ సెన్సార్‌షిప్’ అని సూత్రీకరించారు. నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఉద్యమ నేపథ్యంలో రావడం వల్ల ఉద్యమాలకుండే స్వేచ్ఛ, ఆకాంక్ష పత్రికకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను.

స్వాతంత్య్రం తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాలు పత్రికా స్వేచ్ఛ బాగానే ఉంది. ఒకటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి , రెండవది నెహ్రూ ప్రభుత్వం అవలంబించిన లిబరల్ విలువలు. నెహ్రూ గురించి ‘మదర్ ఇండియా’ అనే పత్రిక చాలా అన్యాయంగా వ్రాసేది. నెహ్రూ ఆ విమర్శను ఆహ్వానించేవాడు. నిజానికి నెహ్రూ స్వ యాన తన గురించి తాను చాలా నిష్కర్షగా ఒక వ్యాసం రాసి ఉన్నాడు. గాంధీ , అంబేద్కర్ ప్రజలను చైతన్యపరుచుటకు పత్రికలే నడిపేవారు. వ్యాసాలు వ్రాసేవారు. ఆ సాంప్రదాయ ప్రభావం దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగింది. కానీ 1975 వరకు పాలకులు సంక్షోభంలో పడ్డారు. అది అత్యవసర పరిస్థితిలోకి దారితీసింది. దీంతో పత్రికల మీద దుర్మార్గమైన ఆంక్షలు విధించారు. ఆకాలంలో గోయంకా యాజమాన్యంలో ఉన్న ‘ఇండియన్ ఎక్స్‌వూపెస్’ పత్రిక తన ఎడిటోరియల్ కాలంను ఖాళీగా పెట్టి తన నిరసనను , ప్రతిఘటనను వ్యక్తపరిచింది.

నిజానికి గోయంకా భారతదేశ పత్రికారంగానికి , పత్రికా యాజమాన్యాలకు ఒక గొప్ప వారసత్వాన్ని, ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యానికి గోయంకా ప్రమాణాలు ఆదర్శం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ పత్రిక తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య సంస్కృతిని సుసంపన్నం చేయడానికి ఒక కీలక సాధనంగా భావించాలి. మీరు చేయవలసిందల్లా తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రమాణం తప్పించి, ఇతర ఏ ఆంక్షలను కూడా పెట్టుకోకూడదని కాంక్షిస్తున్నాను.

పత్రికా స్వేచ్ఛకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన హామీ లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 క్రింద గుర్తించిన వ్యక్తి స్వేచ్ఛలో భాగంగా మాత్రమే ఈ స్వేచ్ఛ గుర్తించబడింది. కనుక వ్యక్తి స్వేచ్ఛకు భిన్నంగా పత్రికా స్వేచ్ఛ కాపాడడం సాధ్యం కాదు. అయితే.. ప్రాథమిక హక్కులో మనుషులందరినీ చట్టం ముందు సమానమని అంగీకరించినా వాస్తవ జీవితంలో ఇది నిజం కాదు. వాస్తవంలో అసమాన సామాజిక సంబంధాలున్నవి. దీనిని న్యాయాత్మక భ్రమ అని మార్క్స్ విశ్లేషించాడుభమాజనిత న్యాయం సామాజిక వాస్తవంగా మారడానికి సమాజాలు సంఘర్షించవలసి ఉంటుంది.

అది అనివార్యం. నిజానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఈ అసమాన సంబంధాలలోనే వేళ్లు ఉన్నాయి. అంటే.. ప్రాంతీయ అసమానతలకు , అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్యమం నుండి పుట్టిన పత్రిక సమానత్వ, న్యాయభావనల ప్రమాణాలమీద నడవడమే సముచితము.

పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలని చాలామంది భావిస్తారు. కానీ నా దృష్టిలో అది సాధ్యం కాదు. అది అభిలషణీయం కూడా కాదు. మంచికి- చెడుకు, మార్పుకు- స్తబ్ధతకు, మానవీయతకు -అమానవీయతకు, విలువలకు- విలువల రాహిత్యానికి మధ్య నిష్పక్షపాతంగా ఉండడం సాధ్యం కాదు. అలాంటి నిష్పక్షపాత వైఖరి నియంతృత్వానికి, ఆధిపత్యరూపాలకు, యధాతథ పరిస్థితిని కాపాడడంలో మునిగిపోతుంది. అంటే.. నిష్పక్షపాతమనేది అసలే ఉండదా? అన్న ప్రశ్నకు సామాజిక అనుభవాన్ని వ్యక్తీకరించడంలో,వాస్తవాలను సేకరించడంలో సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగానే ఉండాలి.ఉదాహరణకు శ్రీకృష్ణ కమిషన్ సమైక్య ఆంధ్రను బలపరిస్తే అర్ధం చేసుకోవచ్చు. వాళ్లను ఆ విలువల చట్రంలో విశ్లేషించవచ్చు.

విభేదించవచ్చు. వాదించవచ్చు. కానీ.. వాస్తవాలనే వక్రీకరిసే ్తరిపోర్టును తిరస్కరించక వేరే మార్గం లేదు. తెలంగాణలో ఎలక్షిక్టిసిటి ఎక్కువగా ఉపయోగిస్తున్నారేది వాస్తవం. కాబట్టి అది అభివృద్దే అనడం ఎంత అబద్దమో తెలంగాణ వెనుకబాటును అనుభవించిన వాళ్లకు తెలుసు. వర్షాభావం వలన భూగర్భ జలాల విస్తృత వినియోగం వలన, బోరుబావుల వలన విద్యుత్తు వినియోగం ఎక్కువ ఉంది. దీనిని తెలంగాణ ప్రజలు ఏయిర్ కండిషన్ గదుల్లో జీవిస్తున్నారన్నట్లుగా చిత్రీకరించి దాన్ని అభివృద్ధి అని భావించడంలో, ఇది పక్షపాత, నిష్పక్షపాత సమస్యకాదు. ఇది వాస్తవానికి, వక్రీకరణకుండే విభజన రేఖను గౌరవించకపోవడం. అందుకు నమస్తే తెలంగాణ న్యాయం వైపు , ధర్మం వైపు, స్వేచ్ఛవైపు, సార్వజనీన విలువల వైపు, మానవీయ దృక్పథం వైపు స్పష్టమైన పక్షపాత వైఖరి కలిగుండాలి.

అయితే.. విలువల వైపు నిలబడుతున్న పత్రికల మీద ముఖ్యంగా పత్రికా విలేఖరుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్న ఒక సందర్భంలో మనం జీవిస్తున్నాం. ప్రపంచీకరణ శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో సామ్రాజ్యవాద పెట్టుబడి ఏమానవీయ విలువను కూడా బతుక నివ్వదు. మానవీయ విలువల్లో మానవతా దృక్పథానికి అంతర్జాతీయ పెట్టుబడి పరమ శత్రువు. మనిషి స్వార్థం మీద లాభాలు చేసుకొని పెట్టుబడిని పెంచుకోవాలనుకునే దృక్పథం నుంచి మనిషిని చూసి కూడా అది భయపడుతుంది. నియోమి అనే రచయిత తన ‘షాక్ డాక్ట్రిన్’ అనే పుస్తకంలో అమెరికా ఇరాకీ ఖైదీల మీద చేస్తున్న ప్రయోగాలను ప్రస్తావిస్తూ‘ సంక్షేమ రాజ్యం అనే భావనను మానవ జ్ఞాపకం నుంచి తూడ్చి పెట్టడం ఎలా’ అని ఘోరమైన కృషి చేస్తుందన్నారు.

సంక్షేమ భావన ఏరూపంలో ఉన్నా అది కమ్యూనిస్టు బీజ రూపమేనని దాన్ని తొలగిస్తే తప్ప మానవ సమాజాన్ని కమ్యూనిస్టు ప్రత్యామ్నాయం నుండి కాపాడలేమని భావిస్తున్నారట. ఇంత విధ్వంసం జరుగుతున్న కాలంలో ఏ సామాజిక సంబంధాలనైనా, సమిష్టి జీవనం, స్నేహము, ప్రేమ, త్యాగమే గాక ప్రాంతీయ అన్యాయము అనే దాన్ని కూడా సహించరు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు అడ్డుపడుతున్న వాళ్లలో హైదరాబాదులోని ఆంధ్ర పెట్టుబడి దారులే కాక పరోక్షంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మద్దతు కూడా వాళ్లకుంటుంది.

పెట్టుబడి విపరీత వేగంతో అన్ని అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక వైపు రాజ్యం విచ్చలవిడి అధికారాన్ని కట్టబెడుతుంది. దానికి తోడుగా మాఫియా సంస్కృతిని కూడా పెంచి పోషిస్తున్నది. మన రాష్ట్రంలో తెలుగు దేఃశం పాలనలో పెరిగిన విష సంస్కృతిని రాజశేఖర్‌డ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి దోహదపడ్డాడు.ఆ మాఫియా వర్గాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మొదలుకొని అందరూ ఏదో ఒక మేరకు పార్టీల్లో ఉపయోగిస్తున్నారు. అది మనం మానుకోట నుంచి మహబూబ్‌నగర్ దాకా చూశాం. ఈ విపరీత పరిణామం నుండి దేశవ్యాప్తంగా పెరిగిన మాఫియాతో ఇప్పడు పత్రికా స్వేచ్ఛకు పెద్ద ప్రమాదం ఏర్పడింది.వీళ్లే పత్రికా ఆఫీసుల మీద దాడి చేయడం, విలేఖరులను హింసించడం, చంపడం లాంటివి దేశవ్యాప్తంగా.., ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నారు.

మన దగ్గర గులాం రసూల్ మొదలుకొని మొన్న బాంబేలో చంపబడ్డ జ్యోతిర్మయ్‌డే దాకా కొనసాగుతోంది. ఈ సంస్కృతికి వ్యతిరేకంగా పత్రికలన్నీ పోరాడవలసి ఉంది. దానికి తెలంగాణకు షోయబుల్లా ఖాన్ త్యాగ వారసత్వముంది.

నమస్తే తెలంగాణ పత్రికకు నేను రాసే వ్యాసాలన్నీ ఈ నేపథ్యంలోనే ఉంటాయి. పత్రికా స్వేచ్ఛలో భాగంగా వ్యాసకర్తకుండే స్వేచ్ఛలో భాగంగా.. పీడిత ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజల చైతన్యంలోనుంచి వచ్చే వ్యాసాలను నమస్తే తెలంగాణ హర్షిస్తుందని , తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారని ఆశిస్తూ...

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles