అట్టడుగువర్గాల ఆత్మీయుడు


Tue,December 8, 2015 12:04 AM

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ నిజాయితీ, నిబద్ధత నిరాడంబరత మనకు స్ఫూర్తి కావాలి.

hara


(అనుక్షణం ఆదివాసీల కోసం పరి తపించే ఓ హృదయం ఆగిపోయింది. ఆదివాసులు, నిమ్న బడుగు వర్గాల గొంతుక మూగబోయింది. అరవై ఏళ్లు గా ఆదివాసీ హక్కుల కోసం అహర్ని షలు పోరాడిన బీడీ శర్మ డిసెంబర్ 6 రాత్రి అస్వస్థ తకు గురై కన్ను మూశారు. తుదిశ్వాస వరకూ ఆది వాసులూ, ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం, వారి సంక్షే మం కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, రక్షణ చట్టాల రూపకల్పనలో బీడీ శర్మ కృషి ఎనలేనిది. పాలనా యంత్రాంగంలో ఉన్న తాధికారిగా ఉంటూ.. అతి సామాన్య, నిరాడంబర జీవితం గడిపిన ఆదర్శజీవి బీడీ శర్మ. ప్రజల ప్రేమికుడిగా.. తుదిశ్వాస వరకూ ప్రజల పక్షాన నిలిచి వారి గొంతుకై నినదించిన ఆయన, విధ్వంసక అభివృద్ధి విధానాల కు వ్యతిరేకంగా జాతీయ పోరాట వేదికను నిర్మించి దాని సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పోరాట యోధుడు. అత్యున్నత పదవులన్నీ పేదల సేవ కోసమేననే అవగాహనతో.. అనుక్షణం పేదల పక్షాన నిలిచిన ఎస్‌ఆర్ శంకరన్‌కు నిజమైన అనుచరుడు, సహచరుడు బీడీ శర్మ. ఆదర్శ ఐఏఎస్ అధికారి, అత్యున్న త మానవతావాదియైన బీడీ శర్మ జీవితం నేటి తరానికి అనుసరణీయం, ఆదర్శం...)

ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కిడ్నాప్ విషయంలో నేను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, మావో యిస్టులకు మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన బాధ్య త మీద పడింది. ఛత్తీస్‌గఢ్ మధ్యవర్తిత్వం నేనింత వరకు పాల్గొన్న అనుభవాలతో పోలిస్తే బహుశా ఇది మిగతా వాటి కంటే కఠినమైన సమస్య. అంత కష్టంగా ఉంటుంద ని నేను భావించలేదు. అయితే ఇలాంటి అనుభవా న్ని జ్ఞానంగా చూడాలని ఆర్.ఎస్.రావు అనేవారు. గతంలో 1993 కొయ్యూర్ కిడ్నాప్ ఘటనలో కన్నబీరన్‌తో, 1996 నుంచి 2004 వరకు శాంతి చర్చల ప్రయత్నంలో శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు ఇతర మిత్రులతో, గత సంవత్సరం ఆర్.ఎస్. రావు, దండపాణి మొహంతితో.. ఈ ఛత్తీస్‌గఢ్‌లో డాక్టర్ బ్రహ్మదేవ శర్మ (బీడీ శర్మ)తో కలిసి కృషి చేసే అవకాశం కలిగింది. వీళ్లందరిలో దండపాణి, బీడీ శర్మలు తప్పించి, మిగతా వాళ్లంతా తెలుగు సమాజానికి పరిచితులే. ఆత్మీయులే.ఛత్తీస్‌గఢ్ అనుభవాలను పంచు కోవలసిన అవసరం, బాధ్యత నా మీద ఉన్నది. అది తప్పక చేయాలి. బీడీ శర్మ గురించి తెలుగు సమాజానికి, ముఖ్యంగా ఒక ఉద్యమంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెప్పడం ప్రయోజనకరంగా ఉంటుందని అనిపించింది.

బీడీ శర్మ మధ్యప్రదేశ్‌లో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన బాలగోపాల్ లాగే ఎంఎస్సీ గణితశాస్త్రం చేసి, అందులో డాక్టరేట్ కూడా పూర్తి చేశారు. సివిల్ సర్వీస్‌తో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఐఏఎస్‌లో చేరారు. సివిల్ సర్వెంట్‌గా బహుశా స్వాతంత్య్రం తర్వాత శంకరన్‌తో సరిసమానం తూగేలాగా ప్రజలకు అద్భుతమైన సేవలు అందించారు బీడీ శర్మగారు. కొన్ని ఆయన చేసిన ప్రయోగాలు, ముఖ్యంగా ఆచరణ నా లాంటి వాడికి ఊహకు అందని విధంగా ఉన్నది. నాకు ఆయన గురించి శంకరన్ చెప్పేవారు. అయితే రాడికల్ రాజకీయాల పట్ల ఆయనకు అభిమానం ఉంది. కానీ ఆ రాజకీయ ప్రక్రియలో ఉండే మెలికలు, అంతర్గత అంశాలు కొన్ని సున్నితమైన సమస్యల పట్ల ఆయన కు సమగ్రమైన అవగాహన తక్కువ. లేదా దాని గురించి ఆయన ఎక్కువగా పట్టించుకోడని శంకరన్ అనేవారు.

అయితే శర్మ ఎప్పుడు హైదరాబాద్ వచ్చి నా శంకరన్ దగ్గరే ఉండేవారు. ఇద్దరి మధ్యన సాన్నిహిత్యమే కాక సున్నితమైన హాస్యముండేది. శంకరన్ అప్పుడప్పుడూ నీవు ఎవ్వరి మీటింగ్‌కు వచ్చావు, మీటింగ్ ఎక్కడ? ఆ పార్టీ ఏ పార్టీ? ఇలా అడిగేవా రు. శర్మ.. ఎవరైతే ఏం, ప్రజల కోసం పనిచేస్తున్న వాడిగా నా అభిప్రాయాలు నావి, వాటిని స్వేచ్ఛగా చెబుతాను అని అనేవారు. శర్మ వెళ్లిపోయిన తర్వా త చూశావా ఆయనకు ఏ వివరా లు తెలియవు. ఈ పార్టీల మధ్యన తగువులున్నాయి, దృక్పథాలలో తేడాలున్నవి. వాటి గురించి కొంచెమైనా తెలిసి ఉండటం అవసరం అని శంకరన్ అనేవారు. అలా బీడీ శర్మ నాకు పరిచ యం అయ్యారు.

ఛత్తీస్‌గఢ్ సంఘటన సందర్భంగా ఆయనతో కలి సి దాదాపు తొమ్మిది రోజులు పనిచేయవలసి వచ్చింది. ఈక్రమంలోనే బీడీ శర్మ అపూ ర్వ వ్యక్తిత్వం చూసే గొప్ప అవకాశం వచ్చింది. ఆయ న ఇప్పుడు ఆరు, ఏడు జిల్లాలుగా ఏర్పడిన అప్పటి అతిపెద్ద బస్తర్ జిల్లాకు నలభై సంవత్సరాల కిందట కలెక్టర్‌గా పనిచేశారు. బస్తర్‌ను తన సొంత ప్రాంతం గా, బస్తర్ ఆదివాసీలను తన మనుషులుగా చూసి, నిష్కల్మషంగా ప్రేమించిన మనిషి ఆయన. నిజానికి బస్తర్ ఆదివాసీల నిష్కల్మష జీవితం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి ఉంటుంది. అక్కడి ఆదివాసీలను నేను పొరపాటున పేద ఆదివాసీలు అంటే.. పేద ఆదివాసులు ఉండరుఅన్నాడు. మేం ఆదివాసీలతో మాట్లా డుతున్న సందర్భంలో మీ భాషలో పేదరికాన్ని ఏం అంటారు అని అడిగి ఆ పదం వాళ్ల భాషలో లేదు అని చెప్పారు. వాళ్ల భాషలో భవిష్యత్తు అనే పదం కూడా లేదు అంటూ..జీవితాన్ని నిరంతరం పారుతున్న నిష్కల్మష నదీ ప్రవాహంగా జీవిస్తారని వివరించాడు. నిజానికి వాళ్ల మీద ఆయ న ప్రేమ అనిర్వచనీయమైనది. వాళ్ల మధ్య చిన్న పిల్లవాడిలా, ఒక వేడి రక్తం కలిగిన యువకుడిగా మారిపోయాడు. వాళ్లచేత నినాదాలు అనిపించాడు. ప్రమాణాలు చేయించాడు. వాళ్ల మహువా తప్పించి, బయటి నుంచి వచ్చే మద్యాన్ని కూడా తాగవద్దని ప్రమాణాలు చేయించాడు.

మావోయిస్టు కార్యకర్తలు బిస్కట్లు ఇస్తే.. బస్తర్ కు బిస్కట్లు ఎలా రానిచ్చారుఅని నేను బస్తర్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు బిస్కట్లను తినవద్దని వారించాను. ఆదివాసీ ప్రాంతాల వనరులను దోచి బిస్కట్లు తయారుచేసి, వాటిని ఆదివాసులకు తినిపించి దోపిడీని స్థిరపరుచుకుంటున్నారని ఆయన అన్నారు. అలాగే..ప్రకృతి ఇచ్చిన ఇన్ని రకాల పండ్లు, ఫలాలు ఉన్నప్పుడు బిస్కట్లు తినవలసిన దుర్గతి వీళ్లకెందుకుఅని అన్నాడు. బీడీ శర్మకు సుఖం, సౌకర్యాలు ఏవీ పట్టవు. ఇవి నిజానికి బాలగోపాల్ తో పోల్చదగిన గుణాలే. కారులో ఏసీ వేస్తే, డ్రైవర్‌పై కోప్పడ్డా డు. నీవు ఇక్కడ ఏసీ వేస్తే.. ఒక ఆదివాసీకి మంచినీళ్లు దొరకవు నీకు తెలుసా అని అన్నా డు. అడవిలో మేం కొంత దూరం నడవవలసి వచ్చింది. ఎనభై ఏళ్లు దాటిన ఆయన నాకంటే వేగంగా నడవడం ప్రారంభించాడు. నాకు బైపాస్ అయ్యింది. మీ అం త వేగంగా నడవకూడదేమో అంటే.., తనకు 17 ఏళ్ల కిందటే బైపాస్ అయ్యిందన్నప్పుడు నాకు కొంచెం సిగ్గు కూడా వేసింది. అడవిలో మేం ఒక రాత్రి ఆదివాసీల మధ్య గడపవలసి వచ్చింది. వాళ్ల దగ్గర చిన్న చిన్న మంచాలున్నాయి. ఈయన చాలా పొడవు, కొంత సేపు నేలమీద గురకపెట్టి నిద్రపోయాడు. ఆ తర్వాత మంచం మీద ముడుచుకుని నిద్రపోయాడు.

రెండవసారి మేం కలెక్టర్‌తో తిరిగి వచ్చాక సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో ఒక రాత్రి ఉండవలసి వచ్చింది. మాకిద్దరికి ఒక చిన్నగది ఇచ్చారు. గదంతా చాలా వేడిగా ఉంది. వాళ్ల ఫ్యాన్లు సోలార్ ఎనర్జీతో మెల్ల గా నడుస్తాయి. నాకు చాలా ఉక్కగా ఉంది అని అం టే, వేడి అంటే ఏమిటి? పడుకోవడానికి అది ఎం దుకు అడ్డమొస్తుంది అన్నాడు. రూంలోని ఫ్యాన్‌ను పూర్తిగా నావైపు తిప్పి నిద్రపోయాడు. ఉదయం నాలుగున్నరకు లేచి మేం పత్రికలలో ప్రకటించడానికి తయారుచేసిన రెండు పేజీల ఇంగ్లీష్ ప్రకటనను ఉదయం ఆరు గంటల వరకు హిందీలోకి ముత్యాల్లాంటి అక్షరాలతో రాసి చాలా సంతృప్తిగా నాకు చూపించాడు.

బీడీ శర్మ ఏ సౌకర్యాలను ఆశించలేదు కాబట్టే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి ప్రధాన మం త్రులతో నిస్సంకోచంగా మాట్లాడారు. ఆదివాసీ సమస్యల గురించి వాళ్లను ఎడ్యుకేట్ చేయడానికి వెనకాడలేదు. ఇందిరాగాంధీకి శర్మ గారంటే ప్రత్యేక గౌరవం కూడా. ఈశాన్య భారతంలోని నెహ్రూ విశ్వవిద్యాలయంలో వీసీని చంపేయడం వలన, విశ్వవిద్యాలయ వీసీగా వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేనప్పు డు బీడీ శర్మ గారిని వీసీ పదవికి ఇందిరాగాంధీ పం పించారు. ఆయన ఐదు సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడి విశ్వవిద్యాలయాన్ని దారిలోకి తెచ్చారు. ఆ తర్వాత ఆయనను ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించారు. ఇందిరా గాంధీ అకస్మాత్తుగా మరణించడంతో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.

బీడీ శర్మ రాజీవ్‌గాంధీని కలిసినప్పుడు.. రాజ్యాంగంలో మీ హోదా ఏమిటి? అని అడిగితే.. మీ ప్రపంచంలో, మీ విలువల ఛట్రంలో మనిషి హోదాను డబ్బులతో కొలుస్తారు. నేను కేవ లం నెలకు ఒక రూపాయి తీసుకుంటున్నాను. అలా చూస్తే నాకు ఏ హోదా లేదు. అయితే నేను ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదు అని అన్నప్పుడు.. రాజీవ్‌గాంధీ లేచి నిలబడి.. బీడీ శర్మ గారిని డోర్ దాక వచ్చి సాగనంపాడు. ఇది బీడీ శర్మ విశిష్ట వ్యక్తిత్వం.నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ నిజాయితీ, నిబద్ధత నిరాడంబరత మనకు స్ఫూర్తి కావాలి. బీడీ శర్మ ఆచరణ ఒక ప్రమాణం కావాలి.

1665

HARA GOPAL

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం