మావోయిస్టులపై అంతటా అదే ‘మమత’


Fri,November 25, 2011 11:41 PM

మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ ఎన్‌కౌంటర్‌కు స్పందిస్తూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాన్ని ఫాసిస్టు చర్యగా అభివర్ణించింది. మొన్న ఎన్నికల్లో గెలిచిన మమతా బెనర్జీ తన విజయసభలో మహాశ్వేతాదేవిని ఆహ్వానించి, అతి గౌరవంగా ఆమె పట్ల నటించిన నేత. ఒక ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మావోయిస్టుల మీద విరుచుకుపడడమే కాక, మావోయిస్టు సానుభూతిపరులను కూడా వదిలేది లేదు అని దాదాపు మహాశ్వేతాదేవిని ఉద్దేశించి ఆ మాటలు అన్నట్టు ధ్వనించింది. ఇంత తక్కు వ సమయంలో ఎంత మార్పు! తాను కేంద్ర క్యాబినెట్‌లో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు కూడా మావోయిస్టు రాజకీయాలను ఒకవైపు సమర్థిస్తూ, అది ఒక సామాజిక, ఆర్థిక సమస్య అంటూ, తాను గెలిస్తే ఆ పార్టీతో శాంతి చర్చలు జరిపి పశ్చిమబెంగాల్‌లోని గిరిజనుల, అట్టడుగు ప్రజల సమస్యలకు పరిష్కారం వెతుకుతామని వాగ్దానం చేశారు. ఆరు నెలలు దాటక ముందే వాళ్లని తన బద్ధ శత్రువులుగా పరిగణించడమే కాక, వాళ్ల రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్లను ఒక కంట కనిపెడుతూనే ఉన్నామనడం ఎంత విచిత్రం! ఐదారు ఏళ్లుగా తాను ఇచ్చిన మద్దతు, తన మాటల గురించి ప్రజలు ఏమనాలి? రాజకీయ నాయకులు, పార్టీలు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వస్తూనే ఒక నూతన అవలోకాన్ని ఎత్తడం గురించే కాక, మొత్తంగా మన దేశంలోని రాజకీయ సంస్కృతినే విశ్లేషించవలసిన అగత్యం ఏర్పడింది.

బెంగాల్‌లో మమతాబెనర్జీ చేసిన రాజకీయ ఫీట్ దేశంలోని అన్ని రాజకీ య పార్టీలు (ఒక్క బీజేపీ మినహా) చేశా యి. మన రాష్ట్రంలోనే 1983లో ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులు అని పొగుడుతూ అధికారంలోకి వచ్చారు. ఆయన ముఖ్యమంవూతిగా ఉన్న ఐదేళ్లలో నక్సలైట్లనే కాక పౌరహక్కుల నాయకులనూ చంపించిన ‘ఘన కీర్తి’ దక్కించుకొని మరు ఎన్నికల్లోనే ఘోరంగా ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నక్సలైట్ల సమస్య సామాజిక, ఆర్థిక సమస్య అని పేర్కొంది. మంత్రి సుధాకరరావు అధ్యక్షతన వేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఎన్. జనార్ధన్‌డ్డి ఒక సభ్యుడు. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి రాగానే పీపుల్స్‌వార్ పార్టీ మీద నిషేధం విధించి, విపరీతమైన అణచివేత అమలు చేశాడు. చంద్రబాబు కాలంలో ముగ్గురు అగ్ర నాయకుల తో సహా లెక్కలేనన్ని ఎన్‌కౌంటర్లు చేయడంతో ప్రజా గౌరవాన్ని, విశ్వసనీయతను కోల్పోయాడు. రాజశేఖర్‌డ్డి 2004 ఎన్నికల్లో శాంతి చర్చలు జరుపుతామని వాగ్దా నం చేసి, ఆ ప్రహసనాన్ని జరిపి, తిరిగి ఎన్‌కౌంటర్లు ప్రారంభించాడు. చర్చల పట్ల వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడూ సుముఖంగా లేకున్నా, జానాడ్డి చొరవ వల్ల కొంతైనా ఈ ప్రయోగం జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లో ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రే స్వయాన అవినీతి కేసులలో ఇరుక్కొని పదవిని కోల్పోవడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మావోయిస్టుల అణచివేతలో బీజేపీ రాజకీయాలను తప్పుపట్టలేము. ఆ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అణచివేతలో సంపూర్ణ నమ్మకమున్న పార్టీ. అయితే ముఖ్యమంవూతిది బీజేపీ.

ప్రతిపక్ష కాంగ్రెస్ నేత చట్టవ్యతిరేక సాయుధ ముఠా సల్వాజుడుంకు నాయకుడు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీ కి వ్యతిరేకంగా ఇరువురు సన్నిహితులై అణచివేతను అమలు చేస్తున్నారు. ఇక ఒరిస్సాకు వస్తే, నవీన్ పట్నాయక్ జాతీయ పార్టీలను కాదని ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ‘జెంటిల్ మెన్’ అనే పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి. కలెక్టర్ ‘కిడ్నాప్’ సందర్భంలో మధ్యవర్తులు (ముఖ్యంగా ఆర్.ఎస్. రావు )ముఖ్యమంవూతిని కలిసినప్పుడు గిరిజనుల సమస్యలకు ప్రాధాన్యమివ్వాలని, అభివృద్ధి నమూనాను పునః పరిశీలించాలని పిల్లవాడికి చెప్పినట్టుగా చెప్పాడు. ఆయన ఒరిస్సాలో అణచివేతను అమలు చేస్తూనే ఉన్నాడు. ఇది మావోయిస్టు పార్టీ పట్ల 16 రాష్ట్రాలలో పరిస్థితి. ఇది మావోయిస్టు పార్టీ రాజకీయాల వల్లా లేక వాళ్లు ఉపయోగించే పద్ధతుల వల్లా అని ప్రశ్నిస్తే, నిజానికి ‘హింస’ ప్రధానమైన కారణం కాదని ముందు గమనించాలి. అది అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. 2002లో గుజరాత్ హింసాకాండలో చనిపోయిన వారి సంఖ్య, మావోయిస్టుల చర్యల్లో నాలుగు దశాబ్దాలుగా చనిపోయిన సంఖ్య కంటే ఎక్కువ. గుజరాత్‌లో అంత ‘హింస’కు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చిన నరేంవూదమోడీ ప్రధాని రేసులో ఉండడం ఎంత విచిత్రం!

దేశ రాజకీయాలు ఆరు దశాబ్దాలుగా మారుతూనే, 1980వ దశాబ్దానికి ఒక కీలకమైన మార్పుకు గురయ్యాయి. సోషలిజమా? పేదరిక నిర్మూలనా? భూ సంస్కరణలా? లేక పెట్టుబడిదారీ విధానమా అనే తర్జనభర్జనకు గురై, చివరికి సామ్రాజ్యవాద ప్రేరేపిత ప్రపంచీకరణ దశకు చేరుకున్నాం. ఇది రెండు దశాబ్దాలుగా చేసిన విధ్వంసం, దాని పర్యవసానాన్ని మనం ఇంకా పూర్తిగా అనుభవించవలసి ఉంది. మనం 1960,70లలో లాటిన్ అమెరికా దేశాలలో -వికృత అభివృద్ధిని, దానితో వచ్చిన నియంతృత్వాలను, వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు కూలిపోవడాన్ని మొదలైనవన్నీ చూశాం. మన దేశం అటువైపే వెళుతున్నట్టు అగుపడుతూనే ఉన్నది.

ప్రపంచీకరణ దేశ సంపదను, జాతి స్థూల ఆదాయాన్ని పెంచిన మాట వాస్తవం. ఈ సంపద పెరగడానికి జరిగిన విధ్వంసాన్ని మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. వ్యవసాయ రంగం, దాని మీద ఆధారపడిన గ్రామీణ వృత్తులు మొత్తంగా విధ్వంసం అయ్యాయి. లక్షలాది మంది రైతులు, గ్రామీణ చేతివృత్తుల వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది మంది నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. విద్య, వైద్యం ప్రైవేటు పరమయ్యాయి. వీటన్నింటికి మించి ఖనిజ సంపద ఎన్నడూ లేని రీతిలో దోచుకోబడుతున్నది. ఖనిజ సంపద గల ప్రాంతాల్లోని గిరిజనులను తరిమి వేస్తున్నారు. ఇంత విధ్వంసం జరిగితే ఆ విధ్వంసంలో నుంచి సంపద పుట్టుకువచ్చింది. వచ్చిన సంపద ఎవరికి చెందింది, చెందుతున్నది అన్న ప్రశ్న? ఈ సంపద బహుళజాతి కంపెనీల, బడా పెట్టుబడిదారుల, దళారీల, రాజకీయ నాయకుల దగ్గరికి చేరుకుంటున్నది. దాని ఫలితంగానే ప్రపంచంలో అతి సంపన్నులైన పది మంది లో మన దేశం నుంచి నలుగురున్నారు. అలాగే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత సంఖ్యలో జనాభాలో 41 శాతం అతి పేదవారు, అంటే సబ్ సహరన్ ఆఫ్రికా కంటే మించి మన దేశంలో ఉన్నారు. ఈ అసమానతలు సహజంగానే భిన్న ఉద్యమాలకు దారి తీస్తాయి. వాటిలో మావోయిస్టు ఉద్యమం కూడా ఒకటి. విషాద మేమంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆర్థిక నమూనాను సమర్థించడం.

ఈ నమూనా అమలు అంత సులభం కాదు. ప్రజా వ్యతిరేకత దేశవ్యాప్తంగా, గాంధేయ మార్గం ద్వారా, ప్రజాస్వామికంగా వ్యక్తీకరింపబడుతున్నది. అన్ని రకాల ఉద్యమాలను అణచివేయడం తప్పించి, ప్రత్యామ్నాయాల గురించి ప్రజాస్వామిక చర్చ పార్లమెంటులో కాని లేదా రాజకీయ పార్టీల మద్య కాని, ఈ మధ్య తరచుగా ఉపయోగిస్తున్న పౌర సమాజంలో కాని జరగడం లేదు. ఇది పేద ప్రజల ‘దురదృష్టం’! మొత్తంగా మావోయిస్టు పార్టీ తాము నమ్ముకున్న పద్ధతిలో ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నది. పేద ప్రజలను సమీకరిస్తున్నది లేదా వారు ఉద్యమిస్తున్న ప్రాంతాల్లో మద్దతుగా నిలుస్తున్నది. అందుకే ప్రతి రాజకీయ పార్టీ ఇది కేవలం శాంతిభవూదతల సమస్య కాదు, సామాజిక, ఆర్థిక సమస్య అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగీకరిస్తున్నది. అధికారంలోకి రాగానే అణచివేయ చూస్తున్నది. మమతా బెనర్జీ ఈ మొత్తం ప్రక్రియలో ఒక భాగం మాత్రమే.

ఈ మొత్తం నమూనాకి ఆద్యులు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు. దేశం నిండా ఉద్యమాలు జరుగుతుంటే, నిన్నటికి నిన్న చిరు వ్యాపారంలో (రి ట్రేడ్) వీల్ మార్కెట్‌కు అనుమతినిస్తూ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో కూరగాయలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్నవారు, చిన్న దుకాణాలు అన్నీ దెబ్బతింటాయి. వీటి మీద జీవిస్తున్న లక్షలాది మంది రోడ్డు మీద పడతారు. వాళ్లకు ప్రత్యామ్నాయాలు ఏవీ అర్థిక వ్యవస్థలో అందుబాటులో లేవు. ఇంత చిన్న చిన్న వారి పొట్టగొట్టడం ఎందుకు? ఇలాం టి విధాన నిర్ణయాలు సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఆ అలజడిని తట్టుకోవడానికి అణచివేత తప్ప రాజ్యం వేరే మార్గాల గురించి ఆలోచించడం లేదు. ఒక్కసారి రాజ్యం అణచివేత రుచి చూశాక, అది వెనక్కి వెళ్లదు. ఆ అణచివేత కిషన్ జీ ఎన్‌కౌంటర్‌తో ఆగదు. జంగల్ మహల్‌లోని అమాయక గిరిజనుల మీద జరుగుతుంది. ప్రజాస్వామ్య ఉద్యమాల మీద కూడా అదే అణచివేత అమలవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్నే తీసుకుందాం. ఇది శాంతియుత ఉద్యమం. లక్షలాది మంది పాల్గొంటున్న ఉద్యమం. ఈ ఉద్యమకారుల మీద, విద్యార్థుల మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు? ఉస్మానియాలో ఎన్ని బలగాలను దించారు. ఇంకా ముందుకుపోయి నక్సలైట్ రాజకీయాలతో సంబంధాలున్నాయన్న నెపం మీద డాక్టర్ చెరుకు సుధాకర్‌పై ఎక్కడో మారుమూలలో పడి ఉన్న జాతీయ భద్రతా చట్టా న్ని ప్రయోగించారు. ఆయన టీఆర్‌ఎస్‌లో సభ్యుడు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య ఉద్య మం తన నాయకుడిని బయటకు తీసుకురాలేకపోతున్నది. ఇలాంటి ప్రక్రియే ఇంకా బెంగాల్ ప్రజలు చూడబోతున్నారు. రాజకీయ చైతన్యంలో దేశం మొత్తానికి ఒక అడుగు ముందున్న బెంగాలీలు ఫాసిస్టు పాలనను ఎదుర్కోక తప్పేట్టు లేదు. ఇంకా వెనకబడిన ఇతర ప్రజల మాటేమిటి? ఈ రోజు దేశ ప్రజలు తమ వ్యవస్థను మార్చుకునే క్రమంలో ‘ఫాసిజం’ నుంచి తప్పించుకోగలరా లేదా అన్నది ఏ మాత్రం ‘మమ త’ లేని బెనర్జీ మనందరికి విసిరిన సవాలు.

పొఫెసర్ హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల