ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం


Thu,February 12, 2015 03:47 AM

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్య అంతరం కూడా బహిర్గతమైంది. ఈ సందర్భంలో ఎన్నికల
ప్రక్రియను ఏం చేయాలి అనే సందే హం కార్పొరేట్‌శక్తులను, మతోన్మాద రాజకీయాలను వెంటాడుతుండవచ్చు!

ఎన్నికల రాజకీయ విశ్లేషణ చాలా వర కు మీడియాకు కుదించబడింది. మీడియాకు లోతైన విశ్లేషణ చాతకాదు,అవసరం లేదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని భిన్న రకాలుగా చూడడం జరుగుతున్నది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నంత కాలం ఒక వివరణ, ఫలితాలు వస్తూనే మరో భిన్న వివరణ! విశ్లేషణలు వాళ్ల వాళ్ల ప్రయోజనాల కోణం నుంచి చూస్తున్నారు. తమ కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే ఒక వ్యాఖ్య, వ్యతిరేకంగా ఉంటే పనికిరాని చర్చను లేవదీస్తుంటాయి. ఒక ఎలక్ట్రానిక్ ఛాన ల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వస్తూనే ప్రైమ్ టైమ్‌లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని, రాహుల్ గాంధీ ఇంకా నాయకుడుగా కొనసాగే అర్హత ఉందా అన్న ప్రశ్న లేవదీసింది. ఆ ప్రశ్న అడగవలసిందే. కానీ సం దర్భం ఇదేనా అనేది ప్రశ్న. నిజానికి గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానా ల్లో ఓడిపోయింది. గత రెండు నెలలుగా కాంగ్రెస్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మరి చర్చ రాహుల్‌గాంధీ మీద, కాంగ్రెస్ వైఫల్యం మీద ఎందుకు? అం టే.. నరేంద్రమోడీ వైఫల్యం మీద చర్చించడానికి ఆ ఛానల్‌కు వెసులుబాటు లేదు. ఎన్నికల ఫలితాల మీద, మీడియా మీద చాలావరకు ఆధారపడడం వల్ల, రాజకీయాలను ప్రభావితం చేస్తున్న చలన సూత్రాలు పూర్తిగా విస్మరించబడుతున్నాయి.
నిజానికి చర్చ జరగవలసింది రెండు జాతీయ పార్టీ ల మీద. ఒకటి- ఢిల్లీలో దశాబ్దంన్నర కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్; రెండవది- గత ఎన్నికల్లో కేవ లం ఎనిమిది నెలల కిందట ఏడు లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ. ముందుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచిస్తే దానికి ప్రధాన కారణం ఆ పార్టీ అవలంబించిన ఆర్థిక విధా నమని చెప్పక తప్పదు. సామ్రాజ్యవాద పెట్టుబడి, దేశీ య కార్పొరేట్ రంగం కలిసి, తమ ఏజైంట్లెన చిదంబరం, మన్మోహన్‌సింగ్, అహ్లూవాలియాల ద్వారా ప్రజా వ్యతిరేకమైన నయా ఆర్థిక సంస్కరణలను దేశ ప్రజల మీద రుద్దారు. ఆ నమూనాతో పేదలుండరు, వ్యవసాయరంగం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత ఉండదు. పట్టణ ప్రాంత పేద ప్రజలుండరు. అంతేకాదు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పాపులిస్ట్ అని పేరు పెట్టి అది అభివృద్ధి వ్యతిరేకమనే ఒక భావజాలన్ని తమ కార్పొరేట్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం వాళ్ల వ్యూహంలో భాగం.
ఒకవైపు పెరుగుతున్న ప్రజల ఆకాంక్షలకు, కార్పొరేట్ లూటీకి మధ్య తీవ్రమౌతున్న వైరుధ్యం, ఈ శక్తులు రాజ్య పాత్రను కుందించి ప్రజావ్యతిరేకంగా మలుచుకోగలిగారు. కానీ ఎన్నికల రాజకీయాల్లో రాజకీయ పార్టీలు అనివార్యంగా ప్రజల దగ్గరకు వెళ్లక తప్పడంలేదు. ఢిల్లీని పదిహేను ఏళ్లు, దేశాన్ని పదేళ్లు నిరాఘాటంగా పాలించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకునే దాకా పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష పార్టీ హోదాను కోల్పోయింది. ఒకవైపు ప్రజలు అసహ్యించుకుంటుంటే, అంతర్జాతీయ పెట్టుబడి, కార్పొరేట్ శక్తులు ఈ అసహ్యానికి కారణం. ఆర్థిక సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ ఎంత వేగంగా ముందుకు తీసుకపోవాలో అంత వేగంతో తీసుకపోలేకపోవడం అనే ఒక విచిత్రమైన, వికృతమైన కార్యాకారణ సంబంధాన్ని ముందుకు తీసుకవచ్చారు. సంస్కరణలను కాంగ్రెస్ కంటే వేగంగా ముందుకు తీసుకుపోగలడన్న నరేంద్రమోడీని తెరమీదికి తీసుకొచ్చారు. మోడీని గుజరాత్‌లో అభివృద్ధి అనే పేర పాపులర్ చేశారు. అక్కడ పేద ప్రజలందరు స్వర్గంలో నివసిస్తున్నట్టుగా ఆ రాష్ట్రంలో పాలు, తేనె ప్రవహిస్తున్నట్టుగా ఒక భ్రమ కల్పించారు. ఆయన అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో విదేశాల్లోని మొత్తం నల్లధనం దేశానికి తీసుకరావడంతో ప్రతి మనిషికి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా పంచవచ్చనీ.., అది ఏటీఎం నుంచి డబ్బు తీసుకున్నట్టుగా తీసుకోవచ్చనే భ్రాంతిని కల్పించారు. కాంగ్రెస్‌తో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఏ కారణమైనా.. మోడీ గెలవనే గెలిచాడు. మంచి మెజారిటీతో గెలిచాడు. గెలిచి వంద కాదు, రెండు వందల రోజులు పూర్తయ్యాయి. నల్లధనం ఏది? అల్లాఉద్దీన్ అద్భుత దీపం ఏది? ఎంత వేగంగా ఆయన ఇమేజ్‌ని పెంచారో, అంతే వేగంగా ఆ చిహ్నం కూలిపోతున్నది.
ఈ రెండు వందల రోజులు ఆడిన సినిమాలో స్వర్గమేది కనిపించలేదు. కానీ హిందూ మతోన్మాద శక్తులు పెట్రేగి ప్రజల నిత్య జీవితంతో సంబంధంలేని వికృత చర్యలు చేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకు ఘర్ వాపసీలో పేద ముస్లింలను, క్రిస్టియన్లను స్వంత ఇంటికి చేర్చే కార్యక్రమం చేపట్టారు. కానీ రాజేందర్‌సింగ్ అనే పాకీ పని చేస్తున్న ఒక పేద దళితుడు మతం మార్చారు కానీ నా పాకీ పని మారలేదు కదాఅని అన్నప్పుడు మనుషులు ఏ మతంలో ఉన్నారని కాదు, ఎలా జీవిస్తున్నారు అన్న స్పృహ వాళ్లకుంది. మార్క్స్ మతం ఒక మత్తు మందు లాంటిది అని అంటూ.. హృదయం లేని వాళ్లకు హృదయం లాంటిదని, ఆత్మలేని వాడికి ఆత్మ లాంటిదని కూడా వ్యాఖ్యానించాడు. ఇది పందొమ్మిదవ శతాబ్దంలో మార్క్స్ చేసిన సూత్రీకరణ. ఈ మతం అనే మత్తు నుంచి మనుషులు విముక్తి కోసం గుణాత్మకమైన సంతోషాన్ని, సంపూర్ణ జీవితాన్ని సాధించుకుంటారన్నది మార్క్స్ విశ్వాసం. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అరవై ఏళ్లుగా కనీసం ఐదేళ్లకొకసారి ఎన్నికల ప్రహసనం నుంచి ప్రయాణిస్తున్నాం. ప్రతి ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు పేదలకు ఏవో వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయి. మనుషులు ఒకవైపు మతం మీద ఆధారపడుతూ జీవితంలో మార్పు కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ గుజరాత్ అభివృద్ధి అని కాక, తాము అధికారంలోకి వస్తే మతమార్పిడులు చేస్తామని, గాడ్సేకు గుడి కట్టిస్తామని, యువతీ యువకుల స్నేహాలకు అడ్డుకట్ట వేస్తామని, చర్చిల మీద దాడి చేస్తామని చెబితే ఎన్నికల్లో ఏం ఫలితాలు వచ్చేవో ఎవరైనా ఊహించవచ్చు. కార్పొరేట్ పెట్టుబడికి ఈ వ్యవహారం తెలుసు.
బీజేపిని గెలిపిస్తే పేదలను మత ద్వేషాల్లోకి లాగి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసి, మొత్తం సంపదను తమకే అప్పచెపుతారనేది వాళ్ల స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి గత ఎనిమిది నెలలుగా మోడీ, అరుణ్‌జైట్లీలు మన్మోహన్‌సింగ్, చిదంబరంల కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. రాజకీయ పార్టీలు వేరే కావచ్చు. కార్పొరేట్ శక్తుల సేవకు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. కానీ అభివృద్ధి విషఫలాల రుచి ప్రజలకు అంతకాకున్నా కొంతై నా తెలిసింది. ప్రజలు నిరంతరంగా ఎడ్యుకేట్ అవుతూనే ఉన్నారు. అందుకే విష ఫలాలకు కారణమౌతున్న రెండు జాతీయ పార్టీలను ఊడ్చిపారేశారు. అంటే ఢిల్లీ ధోరణులే దేశమంతా ఉంటాయి అని చెప్పడం కష్టం. కానీ ఇవ్వాళ్లో రేపో దేశమంతా ఢిల్లీ లాంటి గాలులే వీస్తాయని మాత్రం భావించవచ్చు. మొత్తంగా ఎన్నికల ద్వారా మౌలికమైన సమూల మార్పులు సాధ్యం కాకపోవచ్చు, కావు కూడా. రాజకీయాలకు వ్యవస్థాగత పరిమితులు చాలా ఉంటా యి. అందుకే ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు, అస్తిత్వ ఆధారిత పార్టీలు ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టినా అవి అన్ని పార్టీలలాగే ప్రవర్తించక తప్పలేదు. ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా ఈ పరిమితులకు మినహాయిం పు కాదు. నిజానికి మిగతా రాష్ర్టాల లాగా కాకుండా ఢిల్లీ శాంతి భద్రతలతో సహా చాలా అంశాల్లో కేంద్రం మీద ఆధారపడి ఉన్నది. అది ఒక కేంద్ర పాలిత ప్రాం తం. ఢిల్లీ ప్రభుత్వం స్వతంత్రంగా తీసుకోగలిగిన నిర్ణయాలు కూడా చాలా తక్కువ. ఈ ప్రభుత్వం విద్యు త్తు, విద్య, రవాణా, మంచినీళ్ల లాంటి సంక్షేమ విధానాలను చేపడతాం అని వాగ్దానం చేశారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంక్షేమ కార్యక్రమాలకు పూర్తిగా వ్యతిరేకం. ఈ వైరుధ్యాన్ని ఆప్ త్వరలోనే ఎదుర్కొంటుంది.
ఢిల్లీ ఎన్నికలకు స్పందిస్తూ 20 మంది పారిశ్రామికవేత్తలు బీజేపీ చేపట్టిన విధాన ఛట్రం నుంచి భయపడి వెనుకంజ వేయకూడదని, కాంగ్రెస్ పార్టీ పాపులిస్ట్ పాలసీల వల్లే ఓడిపోయిందని, ఆ గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. కార్పొరేట్ శక్తులు ఎంత అప్రమత్తంగా ఉన్నాయో మనం గమనించవచ్చు. ఈ శక్తుల వితండ వాదం వింతగా ఉంది. ఒకవైపు బీజేపీ చిత్తుగా ఓడిపోయి, ఢిల్లీ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంతో నూతనంగా ఆవిర్భవించిన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి కొత్త విశ్వాసాన్ని కలిగిస్తున్న సందర్భంలో.. ఎన్నికలతో సంబంధం లేకుండా తమ ప్రయోజనాలను నీరుకార్చవద్దంటున్న కార్పొరేట్ శక్తుల వాదన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎన్నికల రాజకీయాలు వాటికి ఒక సమస్య అయి కూచున్నాయి. నిజానికి కేజ్రీవాల్ నయా ఆర్థిక విధానానికి వ్యతిరేకి కాదు. ఆయన కేవలం ఢిల్లీ సామాన్య ప్రజలకు కావలసిన కొన్ని సౌకర్యాలను మాత్రమే అందిస్తానన్నాడు. ఆ సంక్షేమ ఖర్చు కూడా కార్పొరేట్ శక్తులకు ఇష్టం లేకపోవడం వాళ్ల అమానుష, అమానవీయ అత్యాశకు నిదర్శనం.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు సామాజిక పరిణామంలోని కొన్ని వైరుధ్యాలను చాలా వాడిగా ముందుకు తీసుకువచ్చాయి. ఈ ఎన్నికల్లో అభివృద్ధి నమూనాను అతి తీవ్రంగా అమలుచేసిన, చేస్తున్న జాతీయపార్టీలకు, సంపదలో కొంత వాటా పారదర్శకంగా ప్రజలకు అందించాలన్న ఒక సామాజిక రాజకీయ శక్తికి మధ్యన ఉండే ఘర్షణను ముందుకు తెచ్చింది. దానికి కొనసాగింపుగా సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనా నుంచి సంపదను కూడబెట్టుకుంటున్న సం పన్నులకు, ఆ సంపదలో ప్రజల వాటా ఏమిటి అన్న ప్రజలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా ముందుకు తెచ్చింది. ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీకరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్య అంతరం కూడా బహిర్గతమైంది. ఈ సందర్భంలో ఎన్నికల ప్రక్రియను ఏం చేయాలి అనే సందేహం కార్పొరేట్‌శక్తులను, మతోన్మాద రాజకీయాలను వెంటాడుతుండవచ్చు! సామ్రాజ్యవాదం నుంచి విముక్తి కోసం ప్రజలు ప్రపంచమంతటా ఎన్నికల ద్వారా విముక్తి చెందుతామని భావించి ఎన్నికల ద్వారా ఎన్నుకున్నదానికి అలెండిఉదాహరణగా నిలి చాడు. సామ్రాజ్యవాదం ప్రజానాయకులను బతికి బట్టకట్టనివ్వలేదు. ఒకరకంగా ఢిల్లీ ఎన్నికలు కూడా అలాంటి భయాన్ని కలిగిస్తున్నాయి.

1287

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం