భావస్వేచ్ఛ వికసించాలి


Thu,February 5, 2015 01:02 AM

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు సైన్యాన్ని ఉపయోగించి పాలించే ఏ పాలనైనా పరాయి పాలనే. ఆ పాలకులు పరాయి పాలకులే అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నాడు.

Haragopal

జనవరి 29న తెలంగాణ విద్యార్థి వేది క (టీవీవీ) నాల్గవ రాష్ట్ర మహాసభలు నల్లగొండలో నిర్వహించినప్పుడు నల్లగొండ పోలీసులు విద్యార్థుల ఊరేగింపుకు అనుమతి నిరాకరించడమే కాక, హాలు యాజమానిని బెదిరించి హాలును మూయించారు. విద్యార్థులు వేసుకున్న టెంట్‌ను కూలగొట్టారు. ఈ ఘటన చూస్తే దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం కాళోజీ, బాలగోపాల్, నేను మాట్లాడవలసిన ఒక మీటింగ్ పట్ల వరంగల్ పోలీసుల ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఈ సభకు అసాంఘిక శక్తులు వస్తున్నాయ ని, అందుకే సభ జరగనివ్వమని పోలీసులు అన్నా రు. ఇది టీవీవీ రాష్ట్ర నాల్గవ సభ. మరి మూడు సభ లు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. కొట్లాడి తెచ్చుకు న్న తెలంగాణరాష్ట్రంలో అంతకుముందు లేని అసాంఘిక శక్తులు అకస్మాత్తుగా తెలంగాణలో ఎలా తయారయ్యాయి? ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో చాలాఅసాంఘిక శక్తులున్నాయని అన్నప్పుడు దాని అర్థం ఏమిటీ? రాష్ట్రం వచ్చింది కదా అనే ధైర్యంతో చాలా మంది అనుకుంటున్న దశలో ఈ సంఘటన జరగడం నా లాంటి వాళ్ళను చాలా కలచివేసింది.

ఈ సభ ఆహ్వాన కమిటీకి నేను అధ్యక్షుడిని. అధ్యక్షుడిని కాకున్నా ఇది చాలా ఆందోళన కలిగించే సం ఘటనే. మూడు నాల్గు దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న వాడిని. ఉమ్మడి రాష్ట్ర పాలకుల పాలనలో హక్కుల అణచివేత వెంగళ్‌రావ్‌తో ప్రారంభమై రాజశేఖరరెడ్డితో పరాకాష్టకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ను ముందు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరహక్కుల నాయకులను హత్య చేయడం ప్రారంభమైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుమంది హక్కులనాయకులను హత్యచేశారు. బాలగోపాల్ లాంటి అరుదైన మేధా వి, అసాధారణమైన పౌరహక్కుల నాయకుణ్ణి పోలీసులు అపహరించుకుపోయి, నోట్లో బట్టలు కుక్కి హింసించారు. ఈ పని చేసిన పోలీసులను సమాజం గుర్తుంచుకోదు. కానీ బాలగోపాల్‌ను భవిష్యత్ తరా లు గుర్తుంచుకుంటాయనడంలో ఏ సందేహం లేదు. దీనికి తోడు అదే పోలీసులు కొన్ని అసాంఘికశక్తులను రెచ్చగొట్టి వాళ్లతో ఉద్యమాలలో పనిచేస్తున్న కార్యకర్తలను, నాయకులను బెదిరించడం వాళ్లమీద దాడులు చేయించడం కూడా అలవాటుగా మారిం ది. ఈ శక్తులను పోలీసులు ఎప్పుడైనా లేపవచ్చు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన కవిత్వంలో, పాటలలో జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణలోని గాయాలన్నీ ఇవే...

పౌర స్పందన వేదిక నక్సలైట్ పార్టీలతో ప్రభు త్వం చర్చలు జరపాలి అని ప్రయత్నం చేసినప్పుడు వేదిక తెలంగాణ గ్రామాలలో తిరిగినప్పుడు ప్రజలు అనుభవించిన హింస గురించి వివరించారు. అప్పు డు జయశంకర్ అది చూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు తప్ప వేరే మార్గం లేదు ఆయన అనేవాడు. ఈ విషయం గతంలో కూడా నేను ప్రస్తావించినప్పుడు తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు రావడానికి బంగారు తెలంగాణ వస్తుందని ప్రజలు భ్రమించలేదు. కానీ.. ఈ హింస తగ్గుతుందని మాత్రం తెలంగాణ ప్రజలు విశ్వసించారు. పోలీసుల వేధింపు ల నుంచి బయటపడతం అని కొట్లాడి తెలంగాణ సాధించుకున్నరు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రత్యామ్నాయ రాజకీయ ఫోరం సభకు అనుమతి నిరాకరించడమే కాక చాలా మంది నాయకులను, కార్యకర్తలను నిర్బంధించారు. ఈ అనుభవమే చాలా కనువిప్పుగా తోచింది. ప్రజలు పోరాటాలు చేసి తమ పార్టీ అని భావించి తెలంగాణ కోసం రిస్క్ తీసుకుని, ఈ ప్రక్రియను వేగవంతం చేసిన సోనియాగాంధీని కాదని తెరాస పా ర్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడానికి ఒకవైపు వాళ్లు అనుసరించిన సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి, మరోవైపు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు అనుభవించిన అణచివేత. అందుకే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెరాసను గెలిపించా రు.

తెరాసలోని చాలామంది నాయకులను గెలిపించారు. వాళ్లల్లో చాలామంది ఇప్పటి క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. ఇప్పటి హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి చాలా ఉద్యమాలు నడిపినవాడే. ఎమర్జెన్సీలో వరవరరావుతో పాటు జైళ్లో ఉన్నవాడే. టీవీవీ నల్లగొండ సభ అనుమతి గురించి హోంమంత్రితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజులలో ఆయన కాంటాక్ట్‌లోకి రాలేదు. కలెక్టర్, ఎస్పీ కోసం ప్రయత్నం చేసినా కలవలేదు. మరునాడు ఉదయం హోం మత్రికి సంఘటన గురించి చెబితే తనకు ఏమీ తెలియదని అన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక విద్యార్థి సంఘ రాష్ట్ర మహాసభలను అడ్డుకుంటున్నప్పుడు కనీసం హోంమంత్రికి సమాచారమైనా ఉండాలి. సమాచారం ఇవ్వకపోవడం ఉమ్మడి రాష్ట్ర అప్రజాస్వామిక వారసత్వం.

కొత్త రాష్ట్రం ఏర్పడితే పాత వారసత్వం నుంచి కొంచెమైనా మార్పు ఉండా లి కదా! ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి, దేవేందర్‌గౌడ్, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అందరూ తెలంగాణ వాళ్లే. వీళ్లందరు గత రెండు దశాబ్దాలుగా హోంమంత్రులుగా బాధ్యతలు నిర్వహించినవారే. వీళ్లందరు వ్యక్తిగతంగా అహంకారులేమీ కాదు. పౌరహక్కుల నాయకులతో చాలా గౌరవంగా మెదిలినవారే. ఎవ్వరినీ కలిసినా తామూ ఎంత నిస్సహాయులో వివరించే వారు. పోలీసులు తమ మాటను ఖాతరు చెయ్య డం లేదని వాపోయినవారే. దీని గురించి జయశంకర్ లెక్కలేనన్ని సభల్లో చమత్కారంగా చెప్పేవాడు. తెలంగాణ వస్తే పౌరహక్కులు ఎలా ఉంటాయో అని నేనడిగతే.. హోం మినిష్టర్ మనవాడుంటడు గద డాక్టర్‌సాబ్ అనే వాడు. హోంమంత్రి ఎందుకు ముఖ్యమంత్రే మనవాడుంటడు అనేవాడు. చరిత్ర ఇంత తొందరగా పునరావృతమౌతుందని జయశంకర్ అనుకోని ఉండడు. నేను కూడా అనుకోలేదు.

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు, సైన్యాన్ని ఉపయోగించి పాలించే ఏ పాలనైనా పరాయి పాలనే. ఆ పాలకులు పరాయి పాలకులే అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నాడు. తెలంగాణ పాలకుల గురించి మనం కూడా అలాగే అనుకోవాలా! తెలంగాణ రాజకీయ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రిగారు అర్థం చేసుకోవలసింది పోలీసులిచ్చే సమాచారం తీసుకోవలసిందే. కానీ కేవలం వాళ్ల సమాచారం మీద ఆధారపడితే అథోగతిలో పడ్డట్టే. పోలీసు యంత్రాంగానికి విచ్చలవిడి అధికారంచెలాయించే ఒక సంస్కృతి బలంగా ఉమ్మడి రాష్ట్రనాయకత్వం పెంచిపోషించింది. మావోయిస్టు పార్టీతో చర్చలు జరిగినప్పుడు ఎనిమిది, పది నెలలు క్షేత్రస్థాయి పోలీసులు తమ అధికారమంతా పోయిందని చాలా బాధపడ్డారు. తెలంగాణలో సామాన్య మనిషి పోలీసు ఠాణా ముందునుంచి కొంచెం ధైర్యంగా నడిచి పోవడం తెలంగాణకు ఒక గొప్ప ప్రజాస్వామిక అనుభవం.

చర్చలు విఫలమై న పదినెలల తర్వాత మళ్లీ విజృంభించి గ్రామాలను భయంకరమైన పరిస్థితిల్లోకి నెట్టారు. ఇలాంటి ప్రక్రియను సమగ్రంగా అవగాహన చేసుకునే ఆ నిర్ణయాధికారం, తుపాకి పట్టుకున్నవాడి చేతిలో ఏ పరిస్థితు ల్లో పెట్టకూడదనే ఒక ప్రజాస్వామిక భూమిక మీద వలస పాలకులు ఆ అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు కాన్ఫిడెన్షియల్ రిపోర్టు రాసే అధికారాన్నిచ్చారు. పరాయి పాలకులు ఈ జా గ్రత్తలు తీసుకుంటే.., స్వతంత్ర భారతదేశ పాలకులు తమ ప్రజలమీదే పోలీసులచేత దమనకాండ సాగిస్తున్నరు. తెలంగాణ ప్రజలు చైతన్యంతో తమ వలస పాలన ప్రాంతాన్ని తమ స్వంత రాష్ట్రంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో తమ ప్రజాప్రతినిధులు, పాల నా యంత్రాంగాన్ని నియంత్రించి, సివిల్ అడ్మినిస్ట్రేషన్ పోలీసులను నియంత్రిస్తారని, నియంత్రించాలని కాంక్షించడం అత్యాశేమీ కాదు.

ప్రత్యామ్నాయ రాజకీయ సదస్సు అయినా, టీవీ వీ సదస్సు అయినా అవి చేసే పని సామాజిక సమస్యలను చర్చకు పెట్టడం. అందులో మావోయిస్టు రాజకీయాలను కూడా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యంలో అన్ని భావాలను చర్చించే స్వేచ్ఛ ఉండాలి. చర్చ జరిగితే మావోయిస్టులు బలపడతారు అనేది విచిత్ర ఆలోచన. ఒకరు మాట్లాడినంత మాత్రాన ఇతరులు మారుతారు అనేది వినే మనుషుల తెలివితేటల మీద నమ్మకం లేకపోవడం. మనుషులు తమ సమస్యలకు పరిష్కారాలు దొరకనప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారు. ఏ మనిషి కోరి కోరి త్యాగాలతో కూడిన రాజకీయాలలోకి అంత తొందరగా రారు. నిజానికి ఇవ్వాళ.. తెలంగాణ యువత శాంతియుత పద్ధతుల ద్వారా రాష్ర్టాన్ని సాధించుకున్నామనే విశ్వాసంతో ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడే హక్కు, బాధ్యత తెలంగాణ యువతపై ఉన్నది.

ఆ హక్కును నివారిస్తే క్రమ క్రమంగా వ్యవస్థమీద విశ్వాసం పోతుంది. ఆ తర్వా త పరిస్థితి ఎవరి చేతిలోనూ ఉండదు. విప్లవ రాజకీయాలు స్వేచ్ఛాయుత సమాజం నుంచి పుట్టవు. అవి అణచివేతకు వ్యతిరేకంగా ఎదుగుతాయి. మావోయిస్టులను నియంత్రించడం పేరుతో అక్కడ ప్రారంభ మై ఏ రాజకీయాలతో సంబంధంలేని సామాన్యుడి దాకా ఈ అణచివేత సాలెగూడులా అల్లుకుంటుంది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న చిన్న చిన్న పోలీసు అధికారులకు ఏ వివక్ష ఉండదు. ప్రజలు భయపడడమే వాళ్లకు ప్రధానం. వరంగల్‌లో ఒక సీఐ అరవై మంది ఉపాధ్యాయులను నెలల తరబడి నిద్రపోనీయలేదు.

ఆ భయంకర వాతావరణం నుంచి బయటపడడానికి అప్పటి మంత్రి కడియం శ్రీహరిని వరంగల్ సభ కు తీసుకువెళ్తే ఉపాధ్యాయులు వందల సంఖ్యలో సమావేశమై పోలీసు అణచివేతకు జవాబు చెప్పారు. ఈ తెలంగాణ ప్రజాస్వామ్య చైతన్యాన్ని ప్రభుత్వం విస్మరించవద్దు. తెలంగాణ ఉద్యమం రావడానికి ఇలాంటి ఎన్నో సంఘటనలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కేవలం పోలీసులు, పోలీసు అధికారుల సమాచారం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే, దాని పర్యావసానం 2019 ఎన్నికలలో బయట పడుతుంది. సమాచారాన్ని తమ రాజకీయ కార్యకర్తల ద్వారా కలెక్టర్ల ద్వారా తెలుసుకొని నిర్ణయాలను సివిల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఇచ్చి పోలీసులు వా ళ్ల నియంత్రణలో పనిచేసేలా తెలంగాణ పునర్నిర్మా ణం జరగాలి.

1167

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం