గుజరాత్ అభివృద్ధి జాతర!


Thu,January 15, 2015 12:14 AM

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమలులో ఉన్న అభివృద్ధికుండే కార్యాకారణ సంబంధాల అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక విస్తృత దేవులాట జరుగుతున్నది. ప్రపంచ ప్రజలు పరిష్కారాల కొరకే గాక మనిషి మనిషిగా జీవించే స్వప్నాన్ని వదలుకోవడానికి సిద్ధంగాలేరు. గుజరాత్‌లో జరుగుతున్న అభివృద్ధి జాతరలో.. మనిషి మాయమైపోవడమే అసలైన విషాదం.

image

రెండురోజులుగా గుజరాత్‌లో ప్రపంచ దేశాల అధినేతలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, పారిశ్రామికవేత్తలు అభివృద్ధి గురించి తెగ మాట్లాడుతున్నారు. సంపద సృష్టి గురించి, ప్రపంచ వనరుల ఉపయోగం గురించి, వృద్ధిరేట్ల గురించి ఒకరికి మించి మరొకరు మాట్లాడుతున్నారు. భారతదేశం చైనాను అధిగమిస్తుందా, చైనా తన అధిపత్యా న్ని నిలుపుకుంటుందా అనేది ఒక చర్చ. ప్రపంచ పెట్టుబడికి ఏ దేశం ఎంత త్వరగా తలుపులు తెరవగలదో అనేది మరో చర్చ. ప్రతి దేశం పెట్టుబడికి తాము ఏ కష్టం కల్పించబోమని, ఎలాంటి అవరోధాలున్నా వాటన్నింటిని ఆర్డినెన్స్‌ల ద్వారా అయినా సరే తొలగించి పెట్టుబడులకు దారిని సుగమం చేస్తామని వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారు.

ఇక మీడి యా సరే సరి! ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క ఛానలైనా అభివృద్ధి అంటే ఇదేనా? ఇక ప్రత్యామ్నాయాలు ఏం లేవా అన్న చర్చకు అవకాశమే లేకుండా చేశాయి. సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకు కావలసిన ఒక ప్రచారాన్ని కల్పించడానికి పెట్టుబడి, రాజ్యాధికారం, మీడియా విజ్ఞానం కలిసి రూపకల్పన చేస్తున్న నమూ నా ఏ పరిణామాలకు దారితీస్తుంది? ఇది ఒక శాంతియుత, ప్రజాస్వామ్య మానవీయ అభివృద్ధికి దారితీస్తుందా అని ఎవరైనా అడిగితే అతడు లేదా ఆమె దేశద్రోహానికి పాల్పడ్డట్టు లెక్క! ఇంకా ముందుకు వెళ్లి వాళ్లను మానవాళి అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరిం చే ఒక చారిత్రక సందర్భంలో మనం బతుకుతున్నాం.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బహుశా ఒకటి రెండు దశాబ్దాల పాటు అప్పుడే స్వాతంత్య్రం పొం దిన దేశాలు తమ తమ దేశాల్లో ఎలాంటి అభివృద్ధి ఉంటే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఒక చర్చ జరిపి, కొన్ని ప్రయోగాలు తలపెట్టారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ ప్రయోగాన్నీ ముందుకు పోనివ్వలేదు.ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న చైనా, సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల నమూనాలను పెట్టుబడి కూలగొట్టగలిగింది. దాంతో ఇక మానవ చరిత్రలో పెట్టుబడిదారీ వ్యవస్థే అంతిమదశ అని End of History, End of Ideology అనే భావాలు బలంగా ముందుకు వచ్చాయి. మనం అడగవలసిన ప్రశ్న.. ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రపంచం ఇలాగే కొనసాగాలా, భవిష్యత్ తరాలు ఇలాంటి ప్రపంచంలోనే జీవించాలా లేక ఒక మెరుగైన ప్రత్యామ్నాయ ప్రపంచానికి వేరే దారులు ఏమైనా ఉన్నాయా అని.

ప్రపంచ దేశాల్లో (స్కాండేనేవియన్ దేశాలు తప్పించి) ఏ దేశం కూడా శాంతియుతంగా, ప్రజలం తా సుఖంగా, భద్రతతో జీవిస్తున్నట్టు దాఖలాలు లేవు. జాతీయ స్థూల అభివృద్ధి లాగే జాతీయ స్థూల సంతోషాన్ని పరిగణనలోకి తీసుకుంటే అభివృద్ధి వేగంగా జరుగుతున్న చాలా దేశాల్లో సంక్షోభం రోజురోజుకూ పెరుగుతున్నదే తప్ప అది తగ్గుముఖం పట్టే జాడలే లేవు. అమెరికానే ఉదాహరణకు తీసుకుంటే.. బడి పిల్లలు తుపాకులతో తోటి వారిని కాలుస్తున్నా రు. ఒక నల్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపితే నల్లవాళ్లు తెల్ల వాళ్ల ఆస్తుల మీద దాడులు చేశారు.

అభివృద్ధికి సంకేతం అనుకుంటున్న బోలెడన్ని కార్ల కు నిప్పంటించారు. అమెరికాలో చాలామంది అభద్రతలో బతుకుతున్నారు. ఎందుకు అమెరికాలో అం త హింస జరుగుతున్నది? హింసలేని అమెరికా సాధ్యం కాదా? తెల్ల వాళ్లు, నల్ల వాళ్లు సహజీవనం సాగించలేరా? అమెరికాలో మహిళలు గౌరవప్రదం గా జీవించలేరా?
అమెరికా టెర్రరిస్టులుగా ప్రకటిస్తున్న టెర్రరిస్టుల కు అమెరికా మీద ఎందుకు అంతకోపం? ఆ ఆగ్రహానికి బీజాలు ఎక్కడ ఉండి ఉంటాయి? అభివృద్ధి చెందిన యూరప్‌తో సహా 82 దేశాల్లో శ్రామికవర్గం ఎందుకు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నదనే ప్రశ్నలను తప్పక అడగాలి.

గుజరాత్ సమావేశం ఒకవైపు జరుగుతున్న సమయంలో ఫ్రాన్స్‌లో తీవ్రవాదులు ఒక వార్తాపత్రిక కార్యాలయం మీద అంత హింసాత్మకంగా ఎందుకు దాడి చేసినట్టు? ఆ దాడికి ప్రతిగా లక్షలాదిమంది ఫ్రాన్స్‌లో నిరసనలు తెలిపినా ఇలాంటి అమానుష చర్యలు పునరావృతం కాకుం డా ఏం చేయగలమో ఆలోచించాలి కదా. ఇంత హిం సాయుత ప్రపంచంలో జీవిస్తున్నా, గుజరాత్ సమావేశంలో ఏ ఒక్కరు కూడా ఈ భయంకర పరిస్థితి గురించి కనీసం ప్రస్తావిస్తున్నట్టు కానీ, అది వాళ్ల అంతరాల్లో ఎక్కడైనా మెదులుతున్నట్టు కానీ లేదు. ఎవ్వరూ ఈ ప్రశ్నలు అడిగినా.. గుజరాత్‌లో ఏర్పడ్డ భ్రమాజనిత అభివృద్ధి పునాదులు కదులుతాయి.

గుజరాత్‌లో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న సమావేశం జరుగుతున్న సందర్భంలోనే ఆ రాష్ట్రంలోని వేలాదిమంది రైతుల నిరసనలు కానీ, అక్కడ రైతుల మీద జరుగుతున్న నిర్బంధకాండ గురించి కానీ, ఈ ప్రజాప్రతినిధులను జైళ్లలో నెట్టిన సంఘటనలు కానీ బయటకు రావడం లేదు. ఇంకా మతోన్మాదం, మతమార్పిడులు, పీకే లాంటి సినిమా మీద దాడులు, బీహార్‌లో శాంతియుతంగా ప్రార్థనలు జరుపుకుంటు న్న క్రిస్టియన్ల మీద దాడులు, చర్చి విధ్వంసం ఎవరి కి పట్టినట్టు లేదు.

మోదీ ప్రభుత్వం భారత దేశాన్ని అతి వేగంగా ముందుకు తీసకపోతున్నదన్న ప్రచారం ఒకవైపు చేస్తూ, మానవ సంబంధాలు ఎందుకు ఇం త విధ్వంసానికి గురైనట్టో ఎవరికీ తట్టడం లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న తీవ్రవాదానికి, మతోన్మాదానికి,నిరసనలకు, హింసకు గుజరాత్ సమావేశంలో కలలు కంటున్న అభివృద్ధికి ఏం సంబంధం లేదా అనేది కీలక ప్రశ్న.

భారత ప్రధానికి, ఆర్థికమంత్రికి సమావేశం చాలా అభినందనలు తెల్పుతున్నది, పొగుడుతున్నది. దాం తో దేశ ఆర్థిక స్వరూప స్వభావాలే మారిపోతాయని అంటున్నారు. దీంతో దేశ అధినేతలు అభివృద్ధి మం త్రాన్ని మరింత గట్టిగా జపిస్తున్నారు. అరుణ్‌జైట్లీ ఒక నాలుగు ఐదు దశాబద్దాల క్రితం ఇందిరాగాంధీ పేదరికాన్ని రాజకీయ ఎజెండాలోకి తెచ్చినప్పుడు ఫిక్కీ లేవదీసిన సంశయాన్ని చెడిపోయిన గ్రాంఫోను రికార్డులా రిపీట్ చేశాడు. అభివృద్ధిలేకపోతే దేశంలో పేదరికాన్ని పంచాలా అని అడగడం ముమ్మాటికి దుస్సాహసం. ఐదు దశాబ్దాల క్రితం అన్న మాటలే మళ్లీ అంటే, 2050లో కూడా అదే మాట, 3000లలో కూడా అదేమాట. అంటే పేదల జీవితాలలో అభివృద్ధి ఏ స్థాయికి వెళ్తే మారుతాయో జైట్లీ జవాబు చెప్పాలి.

సంపన్నులకే సంపద పంచినంత కాలం పేదలకు పేదరికం పంచడమే మిగులుతుంది. సంపన్నులు ఎంత సంపద తాము కూడబెట్టినాక పేదవాళ్లకు వాటా ఇస్తారో తెలియదు. ప్రపంచంలోని అతి సంపన్నులైన పదిమందిలో భారతదేశంనుంచి నలుగురున్నారు! రిలయెన్స్ అంబానీలు వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రపంచంలోని అతి సంపన్నులుగా ఎదుగుతామని ఈ మధ్యే ఒక ప్రకటన కూడా చేశా రు. ఐదు దశాబ్దాల క్రితం అంత సంపన్నులు మన దేశంలో లేరు. అప్పుడూ అదే మాట! సంపద పెరిగిన తర్వాత అదేమాటా..! నా బోటి వాళ్లం అంటున్నది.. పేదల పేదరికాన్ని సంపన్నులకు, సంపన్నుల సంపదను పేదలకు పంచాలని. అది జరగనంత కాలం జైట్లీ ప్రకటనలకు సంపన్నులు సంతృప్తి పడవచ్చు.వాళ్ల మీడియా జైట్లీని పొగడ్తలతో ముంచవచ్చు. కానీ పేదలలో ఈ మాటలు ఆగ్రహాన్ని కలిగిస్తాయే తప్ప ఆనందాన్ని కాదు.

ఈ మధ్యే పిక్కెట్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా అసమానతలు ఎలా పెరిగాయో క్యాపిటల్ అనే గ్రంథంలో వివరించాడు. ఇప్పటికే ఈ పుస్తకం ప్రతులు 15 లక్షల కాపీలదాకా అమ్ముడు పోయాయనేది ఒక అంచనా. ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమలులో ఉన్న అభివృద్ధికుండే కార్యాకారణ సంబంధాల అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక విస్తృత దేవులాట జరుగుతున్నది. ప్రపంచ ప్రజలు పరిష్కారాల కొరకే గాక మనిషి మనిషిగా జీవించే స్వప్నాన్ని వదలుకోవడానికి సిద్ధంగాలేరు. గుజరాత్‌లో జరుగుతున్న అభివృద్ధి జాతరలో.. మనిషి మాయమై పోవడమే అసలైన విషాదం.

1601

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం