వెనక్కి నడుస్తున్న చరిత్ర


Thu,December 25, 2014 02:01 AM

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్నది. హిందుత్వశక్తులు 90ఏళ్లుగా కంటు న్న కలలు, హిందూ రాష్ట్ర భావన, పర మతాల మీద ఆధిపత్యం ఒక దాని తర్వాత ఒకటి సాకారం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నవి. 21వ శతాబ్దంలో మానవ మేధస్సు, వికాసం, మనిషి హృదయం విశాలంగా మారడం మాని, ఆదిమకాలంలో లేదా మధ్యయుగాలలోకి పోతున్నది.

అప్పటి సమాజ అవసరాల కోసం అమాయకత్వం నుంచి, అజ్ఞానం నుంచి, భయం నుంచి సృష్టించిన మతం, మత విశ్వాసాలు తిరిగి రావడమే గాక, ఆధునిక సమాజంలో మరీ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి మానవాళి ఆత్మ విశ్వాసం పెరిగి, తమ భవిష్యత్తును తాము నిర్మించుకోగలమనుకునే దశలో మనం ఒక విచిత్రమైన అనుభవం లో నుంచి ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు మన దేశంలో హిందూ రాష్ట్రమని ఒకరు, మత మార్పిడి అని ఒకరు, ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత హిందువులు అధికారంలోకి వచ్చారని ఒకరు, రామభక్తులు కాని వారు హరామ్‌జాదెఅని ఒకరు, గాంధీ ని చంపిన గాడ్సే విగ్రహాలు పెట్టాలని ఒకరు, రామమందిరం కడతామని ఒకరు.. ఇలా రాస్తూ పోతే ఇదొ క అంతులేని ట్రాజెడీ టీవీ సీరియల్‌గా మారుతున్నది.

గాంధీ జయంతిని స్వచ్ఛభారత్‌గా, వాజపేయ్ పుట్టిన రోజును సుపరిపాలన దినంగా ప్రకటించి స్కూ లు పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు సుపరిపాలన మీద వక్తృత్వ పోటీ, వ్యాసరచన పోటీల పేర జీసస్ పుట్టిన రోజుకు ఎసరు పెట్టి, ఆరోజు సెలవు తొలగించే కుట్ర కు తెరలేపారు. క్రిస్టియన్ మతం పట్ల, మైనారిటీల పట్ల వారికుండే ద్వేషాన్ని చాటుకున్నారు. ఇవన్నీ గమనిస్తే మనం ఒక పిచ్చి ఆస్పత్రిలో ఉన్నామాని అనిపిస్తున్నది. హిందూ మతం నుంచి వేరే మతాలకు మారి న వారిని ఇంటికి తిరిగిరండిఅనే పేర మతమార్పిడులను బలవంతంగా చేస్తున్నారు.

భారతదేశం అనే ఇంట్లో ఉంటున్న ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మత విశ్వాసాలున్న వాళ్లు ఈ ఇంట్లో ఉన్నవారు కారా? హిందూ మతమొకటే మన ఇల్లా? అసలు ఇల్లు వదిలిన వీళ్లందరూ ఎందుకు బయటకు పోయినట్టు? పోయిన వాళ్లంతా పేదలు, గిరిజనులు, దళితులే. మరి ఆ కులాల నుంచి ఆ వర్గాల నుంచే ఎందుకు వెళ్లిన ట్టు? ఉన్నత కులాల నుంచి ఆ మతాల్లోకి వెళ్లిన వాళ్ల సంగతేమిటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ముగ్గురు బ్రహ్మానందరెడ్డి, ఎన్. జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్రిస్టియన్లే. ఎవరైనా వాళ్లు క్రిస్టియన్‌లా అని కనీసం అన్నా రా? పేదలు ముఖ్యంగా దళితులు ఇల్లు వదిలిపోవడానికి ప్రధాన కారణం హిందూమతంలో అంతర్లీనం గా పాతుకుపోయిన ఆధిపత్యం, అహంకారం. దళితులను మనుషులుగానే పరిగణించలేదు.

ఉన్నత కులా లు ఇంట్లోకి రానివ్వలేదు, కలిసి భోజనం చేయలేదు. వాళ్ల నీడ కూడా పడకూడదన్నారు. చదువును నిరాకరించారు. ఊరు బయట పెట్టారు. ఏ దళిత అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇతర కులాల వ్యక్తులను ప్రేమిస్తే నిలువునా కాల్చి చంపారు. మంచి బట్టలు వేసుకున్నారని, చదువుకున్నారనే అసహనంతో కారంచేడు, చుండూరు లాంటి మారణహోమానికి పాల్పడ్డారు. ఇవన్నీ భరించలేక తమకు ఆత్మగౌరవం కల్పిం చి, చర్చిలోకి రానిచ్చి జీసెస్‌ను పూజించే అవకాశం కల్పించిన ఇంటికి వెళ్లారు.వారు స్కూళ్లు పెట్టి చదువు చెప్పించారు. హస్పిటళ్లు పెట్టి వైద్య సహాయం అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లను మనుషులుగా గుర్తించారు.

ఇంటికి రండి అని తిరిగి మత మార్పిడి చేస్తే మారే వాళ్లని ఏ కులంలోకి చేర్చుకుంటారు? వాళ్లు ఏ కులం ఇంట్లోకి రావాలి? కొత్త ఇళ్లేమన్నా కట్టించారా? ఎందుకు రావాలి? అని అడిగితే సమాధానమేమిటి? తప్పిదారిన హిందూ సనాతనుడు వాళ్లు ఏ కులంలోకైనా రావచ్చుఅని అంటే, వెంటనే అధిపత్య కులాలు అప్పుడే అభ్యంతరం చెప్పడం ప్రారంభించాయి. ఆ మాట అన్న మనిషి కేవలం వాదన కోసమన్నాడు కానీ, ఏ కులంలోకైనా ఆ కులం వాళ్లు రానివ్వాలి కదా? అసలు కుల వ్యవస్థ గురించి ఏమి మాట్లాడకుండా ఘర్ వాపసీ ఏమిటి! హిందూ మతంలోకి మత మార్పిడి లేకపోవడానికి ప్రధాన కారణం కులం.

తప్పిదారి ఏ ముస్లిం, క్రిస్టియిన్ అయినా హిందువునవుతాను అంటే ఆయనను ఏ కులంలోకి చేర్చవచ్చో హిందువులకు తెలియదు. అతన్ని మళ్లీ దళిత కులం లో చేరమంటే ఎందుకు చేరతాడు. ఈ అప్రజాస్వామిక అమానవీయ వ్యవస్థ మారాలని గతంలో చేసిన ప్రతి ప్రయత్నం, ప్రయోగం సంస్కరణోద్యమం విఫలమయ్యాయి.ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కొన్ని మౌలికమైన ప్రశ్నలు లేవదీశారు. ఆ ప్రశ్నలతో గాంధీకి ఊపిరాడలేదు. ఎం త భావపర ఘర్షణ జరిగినా కుల వ్యవస్థలో ఏ గుణాత్మకమైన మార్పు రావడం అటుంచి కుల వ్యవస్థ మరింత బలపడింది. ఇలా బలపడిన కుల వ్యవస్థ గురించి ఒక్క మాట మాట్లాడని హిందుత్వవాదులు మత మార్పిడి కావాలని అనడం హాస్యాస్పదం.

మానవవికాస చరిత్ర సుదీర్ఘ ప్రయాణంలో మత దశను మానవులు దాటడమన్నది ఎప్పుడో ప్రారంభమయ్యింది. మానవాళి వెనక్కి వెళ్లడం చరిత్రలో అనుభవంలోనే లేదు. ముందుకుపోవడంలో ఆలస్యం కావచ్చు, అడ్డంకులుండవచ్చు.. కానీ నాగరికంగా వెనక్కి మరలడం మనుషులకు తెలియదు.

మత మార్పిడితో పాటు, ఏ సామాజిక ప్రయోజనం లేని భిన్న ధోరణులు ఈ ఆరు నెలల్లో పాముల పుట్ట నుంచి బైటికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మతానికి, మత విశ్వాసాలకు సంబంధం లేదు. మత విశ్వాసాలున్న చాలామంది మానవీయంగా, అన్ని మతాల వాళ్లను అమితంగా ప్రేమించేవారిని నేను చూశాను. ఏ మతమైనా భగవంతుడు ఒక్కడే అనే విశాల భావన ఉన్నవాళ్లను చూశాను. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా ఉండే గ్రామాలను చూశాను.

మనిషికి మతాన్ని దాటి నిరంతరం సాగే నిత్య జీవితముంటుంది. మనుషుల మధ్య అల్లుకున్న స్నేహాలుంటాయి. నిజానికి మనిషికి నిర్వచనం మానవత్వం. నా మనవరాలు (ఒకటిన్నర ఏళ్ల వయసు) హిందూ దేవుళ్ల బొమ్మలు చూసి భజన చేస్తుంది. తనను చూసుకుంటున్న (కేర్ టేకర్) లక్షి చేసే క్రిస్టియన్ ఆరాధన భంగిమలను అనుకరిస్తుంది. తాదాత్మయ బుద్ధుడి చేయిని తాకి పులకరించి పోతుం ది. మా ఇంటి ముందు నివసించే ఎం.ఏ ఖాన్ నమాజుకు పోతుంటే చూసి తాతా తాతా అని పిలుస్తుంది.

ఆ చిన్నారిని చూస్తే మానవ జీవిత ప్రారంభం ఎంత విశాలంగా ప్రారంభమౌతుందో ఆలోచిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాంటి మనవీయ మనస్తత్వాన్ని విడగొట్టి, ముక్కలు చేసి, మానవత్వాన్ని మంటలో కలిపి మతద్వేషాన్ని రెచ్చగొట్టి, మరొక మనిషిని ఎంత దుర్మార్గంగా చంపితే అంత గొప్ప, మహిళల మీద ఎన్ని అత్యాచారాలు చేస్తే అంత విజయం అనే అధః పాతాళంలోని మురికికుంటలోకి మనిషిని నెట్టడం ఎంత అటవికం. ఎంత దుర్మార్గం!

మతం చుట్టూ మన దేశంలో జరుగుతున్న ఈ సర్కస్‌అంతా.. పేదవాళ్ల దృష్టిని, ఒక రకంగా దేశ దృష్టిని నిజమైన సమస్యల నుంచి మళ్లించడానికే. అలాగే దేశాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో హోల్‌సేల్‌కు మోదీ ప్రభుత్వం పెట్టింది. కాంగ్రెస్ పార్టీ రిటేల్‌సేల్ దగ్గరనే ఆగింది. అందుకే మోదీ ప్రభుత్వం చేస్తు న్న పనులకు కొందరు కాంగ్రెస్ వాళ్లు తాము చేయ లేని పని మోదీ చేస్తున్నందుకు పులకించిపోతున్నారు. స్వాతంత్య్రోద్యమం తర్వాత విదేశీ పెట్టుబడిని, సామ్రాజ్యవాద విస్తరణను, దాడిని తట్టుకోవడానికి దశాబ్దాలుగా మనం పెట్టుకున్న నిబంధనలను, నియమాలను నియంత్రణలను రాత్రికిరాత్రి మార్చమని మోదీ తన సుపరిపాలనా యంత్రాంగాన్ని స్వయానా ఆదేశించాడు.

Eggnog-Cupcake

ఈ నియమాలన్నింటిని పాతబడిన, పనికిరాని చట్టాలుగా, అభివృద్ధికి అవరోధాలుగా చిత్రించి, వీటన్నింటిని తొలగించి సామ్రాజ్యవాద పెట్టుబడికి రహదారులను సుగమం చేసే దిశగా పాల న సాగుతున్నది. నిజానికి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంతగా తిరస్కరించడానికి, ఆ పార్టీ అవలంబించిన ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. కానీ గెలిచిన పార్టీ ఓడిపోయిన పార్టీ కంటే ఒక్క ఆకు ఎక్కువే చదివింది. అయితే ఈ అభివృద్ధి నమూనామీద తీవ్రమైన చర్చ జరగవలసిన తరుణంలో దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడలసిన దశలో దేశ భవిష్యత్తుకు, ప్రజల నిత్య జీవిత సమస్యలకు ఏ మాత్రం సంబంధం లేని మతతత్వ ధోరణులు పుంజుకుంటున్నాయి.
ప్రతిపక్ష పార్టీలకు మోదీ ఆర్థిక నమూనాతో పెద్ద పేచీ లేదు.

మత ద్వేష రాజకీయాలను దాటేసి దేశ భవిషత్తుకు, పెరుగుతున్న అసమానతలకు, ఆకలికి గౌరవప్రదమైన జీవితానికి, సమభావనకు, సమష్టి జీవనానికి సంబంధించిన మౌలిక సమస్యలకు పరి ష్కారం వెదికే బదులు, మతోన్మాద రాజకీయాల పరిభాషా చట్రంలో పాలకులే ఇరుక్కుపోయారు. ఉదాహరణకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన జీవిత బీమాకు సంబంధించిన దేశద్రోహ చట్టాన్ని వ్యతిరేకించి అర్ధవంతమైన చర్చను ప్రారంభించే బదులు మతోన్మాద రాజకీయ పరిధిలో చర్చ కూరుకుపోయింది. హిందుత్వాన్ని ఇంతలా అభిమానించే వారు క్రిస్మస్ సెలవును రద్దు చేసినవారు, అమెరికన్ క్రిస్టియన్లకు మన ఇన్‌స్యూరెన్స్‌ను మన బ్యాంకులను ఇంత ప్రేమతో ఎందు కు బహుమతిగా ఇస్తున్నట్లు? క్రిస్టియన్ మతం పట్ల ద్వేషం, క్రిస్టియన్ల పెట్టుబడుల మీద వ్యామోహం ఇప్పటి మోదీ ప్రభుత్వపు విషాద భారత వినోదం..!

1480

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం