చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర


Wed,December 10, 2014 11:33 PM

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఒక సమష్టి పోరాటంచేస్తే అడ్డం తిరిగి న కథను మళ్లీ దారిలోకి తీసుకరావడానికి అవకాశం ఉన్నది.

తెలంగాణలో విద్యా పోరాట యాత్ర దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ స్ఫూర్తితో జరిగింది. దీనికి భిన్న కారణాలున్నాయి. ఒకటి: రాజకీయంగా చైతన్యవంతమై న ప్రాంతమేకాక పోరాట వారసత్వమున్న ప్రాంతమిది. రెండు:విద్యాహక్కు పోరాటం దాదాపు తెలం గాణ రాష్ట్ర పోరాటానికి కొనసాగింపుగా జరిగింది. మూడు: తెలంగాణలో కామన్‌స్కూల్ గురించి రెం డు మూడు దశాబ్దాలుగా లోతైన చర్చ జరుగుతు న్నది. నాలుగు: ఇక్కడ కొన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నాయకులకు స్పష్టమైన ప్రాపంచిక దృక్పథమున్నది.

gopal


ఐదు: ఇక్కడ సజీవమైన పౌర సమాజమే కాక ప్రజాస్వామ్యభావాలు గల జర్నలిస్టులు, పత్రికా ఎడిటర్లు ఉన్నారు. ఆరు: ఏ రాష్ట్రం లో లేనివిధంగా లేదా భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య అనే విధాన ప్రకటన చేసింది. ఇవన్నీ ఉద్యమ నిర్మాణానికి కొనసాగింపుకు ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడ్డాయి.
2014 నవంబర్ 2న హైదరాబాద్‌లో జరిగిన ఉద్యమ ప్రారంభ సభకు మూడు నాలుగు వామపక్ష రాజకీయపార్టీల నాయకులు రావడమే కాక, వాళ్ళు సభనుద్దేశించి మాట్లాడుతూ.. విద్యా పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు.

వీరే కాక ట్రేడ్ యూనియన్, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ అధికారిగా పనిచేసిన తెలంగాణ ప్రజల గౌరవాన్ని పొందిన ఐఏఎస్ అధికారి కె.ఆర్ వేణుగోపాల్ ఊరేగింపు సాంతం నడిచారు. నిజాం కాలేజీ ఆవరణలోని ప్రజా సదస్సులో దాదాపు ఇరవైమంది నేతలు చాలా ఉత్సాహంతో మాట్లాడారు. తెలంగాణలో ఇంత భిన్నమైన రాజకీయ సమీకరణలు, సంఘాలు ప్రజాస్వామ్యవాదులు ఒకే వేదిక నుంచి మాట్లాడడం అరుదైన సంఘటనే. బహుశా అది ఒక చారిత్రక అవసరం కూడానేమో!

నవంబర్ రెండు నుంచి నవంబర్ 27దాకా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో నిరాఘాటం గా వందల సభలు, సమావేశాలు జరిగాయి. ఈ మొత్తం పోరాటంలో నాలుగు ఉపాధ్యాయ సంఘా లు, ఐదు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఈ సం ఘాల మధ్య తేడాలున్నా, అభిప్రాయబేధాలున్నా, కొంచెం అహం సమస్య ఉన్నా ఇవేవీ ఉద్యమ నిర్వహణకు అడ్డుకాలేదు.

అందరూ 25 రోజులు కలిసి పనిచేయడం, విద్యార్థి సంఘాల నాయకులు ఒకే వాహనంలో రాత్రింబవళ్లు కలిసి ప్రయాణం చేయ డం వల్ల పరస్పర స్నేహం బలపడిందని నేను భావిస్తున్నాను. అంగీకారం ఉన్న లక్ష్యాల, పోరాటాల కోసం, భవిష్యత్‌లోనూ ఈ స్నేహం ఉపయోగపడుతుందని భావించవచ్చు. అలాగే నాలుగు ఉపాధ్యా య సంఘాలు కలిసి పనిచేశాయి. ఈ సంస్థల నాయకులు కలిసి పనిచేసిన పద్ధతి, పనిని తమ మధ్య పంచుకున్న విధానం మాలాంటి వాళ్ళకు సంతృప్తిగా అనిపించింది. విద్యాపోరాటం దీర్ఘ కాలంలో ఏం సాధిస్తుందో కచ్చితంగా చెప్పలేమేమో కానీ ఈ కలిసి పనిచేసే సంస్కృతి సంస్కారం తెలంగాణ ప్రజాస్వా మ్య సామాజిక పునాదులను బలీయం చేస్తుందని చేయాలని ఆశించడంలో తప్పేమిలేదు.

తెలంగాణలో జాతీయస్థాయి పోరాటం 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రవేశించింది. విజయవాడలో కర్ణాటక వాళ్ళు అం దించిన కాగడాను ఆంధ్రప్రదేశ్‌లో ఐదురోజుల ఉద్య మం తర్వాత తెలంగాణ బాధ్యులకు అందజేశారు. నవంబర్ 20-27 వరకు ఈ కాగడా వెలుగులో తెలంగాణ విద్యా పోరాటం సాగింది. ఒక్క మెదక్ జిల్లా తప్ప నేను తొమ్మిది జిల్లాల్లో జరిగిన సమావేశాల్లో, ఊరేగింపుల్లో పాల్గొన్నాను. అన్ని జిల్లాలలో సదస్సులు విజయవంతంగా, ఉత్సాహభరితంగా జరిగాయి. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, నల్గొం డ, ఆదిలాబాద్‌లలో జరిగిన సదస్సులలో ప్రజలు పెద్ద సంఖ్యలో రాత్రి తొమ్మిది పదిగంటల దాకా కూర్చొని తమ మద్దతు తెలిపారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో చాలా పెద్ద ఊరేగింపు, అలాగే బహిరంగసభ జరిగింది.

ఖమ్మం జిల్లా మధిరలో కూడా జనం చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇక తెలంగాణలోని కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సభలను నిర్వహించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో సభ జరగకున్నా చాలా మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులు సాయంత్రం జరిగిన సభకు హాజరయ్యారు. ఈ వివరాలు రాయడంలో ఉద్దేశ్యం అన్ని జిల్లాల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యపోరాట చైతన్యం వెల్లివిరిస్తే తప్ప విద్య ను కాపాడుకోవడం సాధ్యంకాదని చెప్పడానికే.

మొత్తం పోరాటంలో విద్యార్థి సంఘాల నాయకు లు చేసిన ప్రసంగాలు ప్రజలను చాలా ఆకట్టుకున్నాయి. నాకు కూడా వాళ్ళు మాట్లాడిన అంశాలు, మాట్లాడిన పద్ధతి భాష, హాస్యం బాగా అనిపించిం ది. ఈ సదస్సులో వాళ్ళు కనబరిచిన పరస్పర సహకారం, క్రమశిక్షణ ఉద్యమానికి చాలా తోడ్పడ్డాయి. ప్రతిచోట సమయాభావం వల్ల వాళ్లను ఒక నిమి షం, రెండు, మూడు నిమిషాలు అని సభాధ్యక్షులు నియమం పెడితే ఎక్కడా దాన్ని ఉల్లంఘించలేదు. ఇచ్చిన సమయంలో చాలా తాత్విక విషయాలు, రాజకీయార్థిక విశ్లేషణను జోడిస్తూ కొద్ది సమయం లో కీలకమైన అంశాల గురించి మాట్లాడారు. ఉద్య మం వల్ల విద్యార్థి నాయకులకు, లేదా విద్యార్థి నాయకుల వల్ల ఉద్యమానికి ఒక పరిణితి వచ్చింది.

ఉద్యమ క్రమంలో కార్పొరేట్ విద్య, అలాగే కాషాయీకరణ పట్ల ప్రజల్లో విస్తృత వ్యతిరేకత కనిపించింది. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో తీసుకునే ఫీజులు తాము భరించలేక పోతున్నామన్నది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫీలింగ్ చాలా బలంగా ఉన్నది. భువనగిరిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఎస్పీ పిల్లలకు మాకు ఒకే ఫీజు తీసుకోవడం ఏం న్యాయం అని అన్నారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల గురించి ఈ వ్యతిరేకత మరీ ఎక్కువగా ఉన్నది. ఎవరితో మాట్లాడినా కార్పొరేట్ వ్యవస్థకు కరుణ, దయ, సానుభూతి, పేదల పట్ల కన్‌సర్న్ ఏమాత్రం లేవు అనేది ఒక సార్వజనీన అనుభవం.

ప్రధానంగా నా ప్రసంగాలలో కార్పొరేట్ విద్య మనిషిలోని మానవత్వాన్ని మానవీయ విలువలను ఎలా విధ్వంసం చేసిందో ఉదాహరణలతో పాటు ఇవ్వడం, అలాగే విద్యను వ్యాపారంగా మార్చి విద్య నుంచి ప్రత్యక్షంగా లాభాలు చేసుకోవడం అనాగరికమనే అంశాన్ని దాదాపు అన్ని సభల్లో మాట్లాడడం జరిగింది. అలాగే విద్యను అమ్మడం, కొనడం వల్ల చదువుకున్న వ్యక్తికి అతను జీవించే సమాజానికి మధ్య సహజంగా ఉండే మానవీయ సంబంధాన్ని విచ్ఛిన్నం అయ్యింది. వ్యక్తికి సమాజం పట్ల బాధ్య త లేకపోవడం అలాగే సమాజానికి వ్యక్తి సేవలకు డిమాండ్ చేసే నైతిక అధికారం లేకపోవడం వల్ల డాక్టర్-రోగి మధ్య, అధికారి-ప్రజలకు మధ్య, లాయర్-క్లయింట్‌కు మధ్య, ఉపాధ్యాయుడికి- విద్యార్థికి మధ్యన అన్ని సంబంధాలు ఆర్థిక సంబం ధాలై పోయాయి.

వస్తువీకరణ కోసం మనుషులే మర యంత్రాలుగా మారిపోయారు. ఇక కాషాయికరణ గురించి మాట్లాడినప్పుడు మతానికి శాస్త్ర విజ్ఞానానికి మధ్య జరిగిన హోరాహోరీ పోరాటాల గురించి, శాస్త్రవేత్తల సహసాల గురించి చెపుతూ మనదేశంలో ఒకవైపు ప్రధాని అంతర్జాతీయ పెట్టుబడికి ఎర్ర తివాచీ పరస్తూ, శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానంతో అభివృద్ధి చెందిన దేశాలను పొగుడుతూ. .,వేదాలు ఆ స్థాయికి చేరుకున్నాయని పరిణామ క్రమాన్ని విస్మరించడం విస్మయాన్ని కలిగిస్తున్నది.

దీనికితోడు మొత్తం మానవ విజ్ఞానం, ఇంకా భవిష్యత్‌లో జరిగే ఆవిష్కరణలన్నీ మనదేశం ఎప్పుడో సాధించిందని జబ్బలు చరచుకోవడం దేన్ని సూచిస్తున్నదో విశ్లేషించడం అవసరం. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడాన్ని అది సామ్రాజ్యవాదంలో ఎలా ముడిపడి ఉందో అన్న అంశాలపై ప్రతిసభలో, సదస్సులో ఆసక్తిగా చర్చించడం కనిపించింది. తెలంగాణను మతోన్మాదం నుంచి కాపాడగలమా అన్నది ఈ ప్రాంత చైతన్యానికి పెద్ద సవాలు.

అందరికీ న్యాయమైన, నాణ్యమైన, సమాన విద్యావకాశాలు అనేది ఒక నాగరిక సమాజ అవస రం. ప్రతిబిడ్డకు చదువుకోవడానికి అన్నీ అవకాశాలుండాలి. సంపన్నులకొక బడి, పేదలకొకబడి, ఆదాయాలను అంతస్తులను బట్టి పాఠశాలలు ఉండడం అప్రజాస్వామిక వ్యవస్థ లక్షణం. జ్ఞానం మానవాళి సమష్టి కృషి ఫలితం.గత తరాలు అందించిన అనుభవసారం జ్ఞానం. అలాగే మనిషి అన్వేషణలో నుం చి కనుకొన్న కార్యకారణ సంబంధాల సమగ్ర అవగాహన అనేది అందరి సొత్తు. ఇది పెట్టుబడిదారీ సమాజాలు కూడా అంగీకరించి, కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేశాయి. అభివృద్ధి చెం దిన దేశాలన్నింటిలో స్కూలు విద్యను అందరికీ సమానంగా అందించే విధానాలనే అమలు పరచారు. మనదేశంలో కుల వ్యవస్థ అలాగే బహు వర్గ నిర్మాణం వల్ల పాలకులు అంచెలంచెల విద్యను ప్రవేశ పెట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే అసమానతా భావజాలానికి బలిచేశారు.

సమానత్వ భావనను వేళ్ళ నుంచే ధ్వంసం చేసి చదువుకున్న వాళ్ళు న్యాయాన్ని గురించి, పేదల గురించి, మంచి సమాజాన్ని గురించి, మానవత్వా న్ని మంచితనాన్ని గురించి కనీసం ఆలోచించడానికి కూడా అవకాశంలేని ఒక విద్య వ్యవస్థను నిర్మించారు.ఈ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రజాస్వామీకరించవలసిన అగత్యం ఏర్పడింది.

తెలంగాణ సమాజంలో ప్రజా పోరాటాల వల్ల వేలాది మంది యువకుల బలిదానాల వల్ల న్యాయభావన బీజాలు బలంగానే ఉన్నాయి. కానీ తెలంగాణలో విద్యలో జరిగినంత ప్రైవేటీకరణ దేశంలో ఎక్క డా జరగలేదన్నది కూడా ఒక వాస్తవం. నిజానికి తెలంగాణలో 80శాతం విద్యాసంస్థలు ప్రైవేట్ రం గంలో ఉన్నాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్ కాలేజీలను చూస్తే మొత్తం 374 కాలేజీలలో నాలుగు కాలేజీలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఒక సమష్టి పోరాటంచేస్తే అడ్డం తిరిగిన కథను మళ్లీ దారిలోకి తీసుకరావడానికి అవకాశం ఉన్నది.

1377

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం