కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం


Thu,November 27, 2014 01:42 AM

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్పొరేటీకరణను, కాషాయికరణను పట్టించుకోకపోవడం ఒక విషాదం. కర్ణాటకకు గొప్ప సెక్యులర్ చరిత్ర ఉన్నది. టిప్పు సుల్తాన్ లాంటి రాజులు శ్రీరంగం లాంటి దేవాలయానికి ధర్మకర్తలుగా ఉన్నారు. మతోన్మాదం పెరుగుతున్న సందర్భంలో ఈ చరిత్ర పాఠాలు దేశమంతా బోధించవలసిన అవసరం ఉన్నది.

gopal


కన్యాకుమారిలో విద్యాహక్కు పోరాట యాత్ర నవంబర్ 2న ప్రారంభమై కేరళ, తమిళనాడుల ద్వారా నవంబర్ మూడవ వారం కర్ణాటకలోని మైసూరుకు చేరుకున్నది. ఈ యాత్ర ప్రారంభం వందేళ్ల చరిత్ర గల మహారాణి మాధ్యమి క పాఠశాల దగ్గర మొదలై మైసూరు పట్టణంలో ఊరేగింపుగా సాగి మైసూర్ యూనివర్సిటీ చేరుకున్నది. ఈ పాఠశాలను మూసివేయాలని, ఆ భూమిని వివేకానందుడి పేర నడుస్తున్న ఒక సాంస్కృతిక సంస్థ ఆక్రమించ ప్రయత్నించినప్పు డు మైసూరులో నివసిస్తున్న కొందరు సీనియర్ సిటిజన్స్ ప్రజాస్వామ్య సంస్థలు తీవ్రంగా ప్రతిఘటించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేశాడు.

ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన కొందరు పెద్దలు, ఈ స్కూలు భూమిని ఒక ముస్లింసంస్థ పాఠశాల కోసం ఇచ్చిందని గర్వం గా చెప్పారు. ఈ స్థలం చాలా విశాలంగా ఉంది. భవనం కూడా చాలా పెద్దదే. మీటింగ్‌లు పెట్టుకోవడానికి లోపల ఒక సభావేదిక కూడా ఉన్నది. అయితే అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లాగే భవ నం శిథిలావస్థలో ఉన్నది. గొప్ప చరిత్ర ఉన్న పురాతన స్కూళ్లమీద కూడా గౌరవం లేకపోవడమన్నది ఇప్ప టి రాజకీయ సంస్కృతిగా మారింది. చాలా రాష్ర్టాల్లో ప్రభుత్వ స్కూళ్లు మూతబడడానికి స్కూల్ పట్టణం నడిబొడ్డున ఉండడం, స్కూలుకు చాలా పెద్దస్థలం ఉండడంతో భూకామందుల కన్నుపడడం కూడా ఒక కారణం. రాజ్యాధికారం ఎవ్వరు చెలాయిస్తున్నారో, ఎవరి కనుసన్నలలో నడుస్తుందో తెలిస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎందుకు ఇంత అస్తవ్యస్థమైందో అర్థమౌతుంది.

ఆ స్కూలు నుంచి పోరాట ఊరేగింపు మైసూరు నగరంలో చాలా స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఊరే గింపులో నడుస్తున్నప్పుడు ఏఏ కాలేజీలకు ఎంత అద్భుత చరిత్ర, ఉన్నదో ఆ కాలేజీలను చూయిస్తూ మైసూరు వాసులు వివరించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చదివిన కాలేజీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడుగా పనిచేసిన కాలేజీలను చూపించి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అలాంటి స్కూళ్ళు, కాలేజీల దుస్థితి చూస్తే మైసూరు మహారాజుల పాలనే మెరుగు అని చాలామందికి అనిపిస్తుం ది. ఊరేగింపు మైసూరు విశ్వవిద్యాలయంలోని కన్నడ భాషా డిపార్టుమెంట్‌కు చేరుకున్నది. ఈ డిపార్ట్‌మెంట్ ముందు ఉన్న ప్రఖ్యాత రచయిత,కవి కువెంపు విగ్రహానికి పూలదండలు వేశాక ప్రారంభమైయింది.

కర్ణాటక ప్రఖ్యాత దళిత కవి దేవనూరు మహదేవ సభకు హాజరై కామన్ స్కూలు డిమాండ్ కు తన పూర్తి మద్దతు ప్రకటించాడు. మాతృభాషలో బోధన డిమాండ్‌ను సమర్థిస్తూ, మతోన్మాద విద్యను వ్యతిరేకిస్తూ వక్తలు మాట్లాడారు. కర్ణాటకలో నేను పాల్గొన్న సభలు ప్రత్యేకంగా మంధ్యా, రాంపూర్ జిల్లాల్లో జరిగాయి. చరిత్రాత్మకమైన శ్రీరంగం పట్టణంలో కూడా సభ జరిగింది. మాంధ్యా జిల్లాలో దాదాపు ఐదు సభలు జరిగాయి. వీటిలో ప్రధానంగా విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాంధ్యా జిల్లాలోని కృష్ణరాజ్ పేటలోని పి.యు కాలేజీలో దాదాపు మూడువేల మంది విద్యార్థులు, గ్రామస్తులతో సభ జరిగింది. సభ చాలా క్రమశిక్షణతో జరిగింది. కాలేజీ, హైస్కూ లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.

ఒక ప్రభుత్వ స్కూళ్లో ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలుండడానికి ప్రధా న కారణం ఈ ప్రాంతంలో రైతులు వర్షాధారిత పం టలు పండిస్తారు. ఆదాయాలు చాలా తక్కువ, పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పంపే స్థోమత చాలా మందికి లేదని గ్రామస్తులు అన్నారు. ఈ ప్రాంతంలో నం జుండ స్వామి నాయకత్వంలో ఒక మిలిటెంట్ రైతు ఉద్యమం నడించింది. రైతు సంఘాలు గ్రామాల్లో ఇంకా తమ ఉనికిని కాపాడుకుంటూనే ఉన్నాయి. పసుపు పచ్చ శాలువాలు వేసుకుని ఉద్యమంలో రైతు నాయకులు పాల్గొన్నారు.

ఈ ఉద్యమంలోని మహిళా నాయకురాళ్ళు కూడా చాలా ఆసక్తికరంగా సభలనుద్దేశించి మాట్లాడారు. ఇక్కడి ఎమ్మెల్యే ఒక ఇండిపెండెంట్.. విద్యా పోరాటానికి తన పూర్తి మద్దతును, సహాయ సహకారాలు అందించాడు. తాను చదువుకోలేకపోయానని, తన నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు బాగా నడిస్తే చాలా మంది పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయ న అభిప్రాయపడ్డాడు.

ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ కమిషనర్ (మన డిప్యూటీ కలెక్టర్ హోదా) డాక్టర్ నాగరాజ్ రెండు సభల్లో పాల్గొన్నాడు. తానే స్వయాన కాగడా స్వీకరించి దాన్ని పట్టుకొని గ్రామమంతా ఊరేగింపులో తిరిగాడు. ఈయన తహసీల్దార్‌గా పనిచేసినా, తాను సమాజానికి ఏం చేయలేకపోతున్నానని భావించి సన్యాసం పుచ్చుకున్నప్పుడు చాలామంది గ్రామస్తులు రైతులు వెళ్ళి అతన్ని ఒప్పించి తిరిగి బాధ్యతలు స్వీకరించేలా చేశారు. ఎక్కడ చూసి నా ఆయన పట్ల గౌరవం కనిపించింది. చాలామంది నాతో ఆయన చాలామంచి అధికారని పేదల పక్షపాతి అని చెప్పారు. బహుశా ఆ నైతికత వల్ల కావ చ్చు అంత ఓపెన్‌గా ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాక నినాదాలు ఇస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు.

విద్యా పోరాట సభ ఊరేగింపు మాంధ్యా చేరుకునే ముందు మరొక చిన్న గ్రామంలోని గాంధీభవన్‌లో సభ జరిగింది. ఇక్కడ గాంధీగారు 1917 సం వత్సరంలో బస చేశారని కథలు కథలుగా గ్రామస్తు లు చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత అక్కడ గాంధీ విగ్రహాన్ని పెడతామని గ్రామపెద్దలు గాంధీతో స్వయాన చెప్పితే విగ్రహాలు వద్దని, ఒక భవనం కట్టి అక్కడ జనం సమస్యలు చర్చించుకునే సౌకర్యాన్ని కల్పించమని గాంధీ సలహా ఇచ్చాడని, అలా ఆ గాంధీ భవన్ నిర్మాణం జరిగిందని చెప్పారు. అక్కడ గాంధీ విగ్రహం లేదు.
తర్వాత ఉద్యమం రాంపూర్ జిల్లాలోకి ప్రవేశించింది.

రాంపూర్‌లో వందలాది మందితో ఊరేగింపు జరిగింది. ఊరేగింపు సమయంలో పెద్ద వర్షం వచ్చి నా జనం తడుస్తూనే నడిచారు. ఇందులో ప్రైమరీ స్కూలు టీచర్ల యూనియన్, రైతు సంఘాలు, జై కర్ణాటక పేరుతో వెలిసిన సంస్థ పాల్గొంది. ఈ జై కర్ణాటక పార్టీవారు గత సంవత్సరం కామన్ స్కూలు డిమాండ్‌తో ఒక లక్షమందిని సమీకరించి సభ జరపారని, దాన్ని హెలికాప్టర్ పై నుంచి చిత్రీకరించారని స్థానికులు చెప్పారు.

అయితే కర్ణాటక ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న నాయకురాలు మల్లిగె మాత్రం వాళ్ళకు విశ్వసనీయత లేదని, వాళ్ళ దగ్గర తాను చం దాకుండా తీసుకోవడానికి సిద్ధంగా లేనిని చెప్పింది. మల్లిగె చాలా చిన్న వయసులోనే ఒక ప్రజా ఉద్య మం నడిపే స్థాయికి ఎదిగింది. ఆమె జనంతో కలిసి ఉండడం తప్ప తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం ఇష్టంలేదు. కర్ణాటకలో చాలామందికి ఆమె అంటే గౌరవం. అది గ్రామస్థాయిలో కూడా కనిపించింది.
ఉద్యమంలో భాగంగా బెంగళూరులో ఒక సద స్సు జరిగింది.

చాలామంది వక్తలను పిలిచారు. బెంగళూరులో సభ బాగా జరగలేదు. పట్టణ ప్రాం తాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణ వాసులను వేధిస్తున్నది. విద్యా కార్పొరేటీకరణను, కాషాయికరణను పట్టించుకోకపోవడం ఒక విషా దం. కర్ణాటకకు గొప్ప సెక్యులర్ చరిత్ర ఉన్నది. టిప్పు సుల్తాన్ లాంటి రాజులు శ్రీరంగం లాంటి దేవాలయానికి ధర్మకర్తలుగా ఉన్నారు.

మతోన్మా దం పెరుగుతున్న సందర్భంలో ఈచరిత్ర పాఠాలు దేశమంతా బోధించవలసిన అవసరం ఉన్నది. దక్షణ భారతదేశంలో కర్ణాటక ఉద్యమం ఏ ప్రమాణాలతో చూసినా బాగా నడిచింది. విద్య కార్పొరేటీకరణకు, కాషాయికరణకు వ్యతిరేకంగా జనం స్పందిస్తున్నా రు. మత విశ్వాసాలున్నా వారు కూడా మతాన్ని విద్యలో చొప్పించడాన్ని ఆహ్వానించడం లేదు.

1149

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం