పోరాటంతోనే విద్యాహక్కు


Thu,November 20, 2014 01:02 AM

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పోవాలన్న ఆకాంక్ష ప్రజలందరిలో ఏకాభిప్రాయంగా ఉన్నది. ఇక మిగిలింది ప్రజలంతా ఏకతాటిపై నిలిచి విద్యా హక్కును సాధించుకోవటమే.

విద్యాహక్కు ఉద్యమాన్ని నవంబ ర్ 2న ప్రారంభించడానికి ఒక ముఖ్య ఉద్దేశ్యం ఆరోజే 12 సంవత్సరాల క్రితం అదే రోజు ఇరోం షర్మిల ప్రత్యేక సైనిక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా నిరాహారదీక్ష తీసుకున్నది. బహుశా దేశంలో, ప్రపంచ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలంగా ఒక వ్యక్తి నిరాహారదీక్ష చేసిన సంఘటనలు ఉండి ఉండవు. చాలా కాలం జైళ్లలో నిర్బంధంలో ఉన్నవారున్నా రు. కానీ ఇలాంటి ప్రతిఘటనా రూపాన్ని తీసుకున్నవారు చాలా అరుదు.మా ఉద్యమ ప్రారంభం దేశంలోని ఐదు దిశల నుంచి ప్రారంభించినప్పుడు మణిపూర్‌ను ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది. ఆరోజు అనిల్ సద్గోపాల్, ఇతర ఉద్యమ బాధ్యులు షర్మిలను కలిశారు.

Haragopal


ఆమె విద్యాహక్కు పోరాటానికి తన మద్దతు, అభినందనలు తెలిపింది. అలాగే తాను చేస్తున్న పోరాటం అంత అసాధ్యమయ్యిందేమీ కాదని, ఇది ఎవ్వరైనా చేయవచ్చున ని ఇలాం టి ప్రతిఘటన మనుషుల స్పందన మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.సమాజంలో మనచుట్టూ జరి గే అకృత్యాలకు మనం చాలామందిమి స్పందించ డం మానేశామని తన బాధను వ్యక్తపరిచింది. షర్మి ల పోరాటమైనా, విద్యాహక్కు పోరాటమైనా ఇది పౌర, ప్రజాహక్కుల పోరాటాలలో భాగంగా చూడా లని విద్యా పోరాటం భావిస్తున్నది. ఈశాన్య భారతంలో మణిపూర్‌లో ప్రారంభమై అది నాగాలాండ్‌కు చేరుకునే వరకు నేను అక్కడికి చేరుకున్నాను. మొదట నాగాలాండ్ రాజధాని కోహిమాలో నాగా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.

ఇది బహుశా దేశంలోని అతి ప్రభావశీలమైన విద్యా ర్థుల ఐక్యకూటమి. దీంట్లో 16 సభ్య సంఘాలున్నాయి. ఈ సంఘం పిలుపునిస్తే విద్యార్థిలోకం కదిలివస్తుంది. ఈ సదస్సుకు ప్రభుత్వ అధికారులు, నాగాలాండ్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు హాజరయ్యారు. చర్చ చాలా స్ఫూర్తిదాయకంగా జరిగింది. విద్య అందుబాటులో లేకుండా పోయింద ని, ప్రభు త్వ స్కూళ్లు పూర్తిగా నిర్వీర్యమై పోయాయనే దేశ అనుభవమే వాళ్ల అనుభవంగా చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు రావడంతో ఈ ప్రక్రి య ప్రారంభమయ్యిందని చాలామంది అభిప్రాయపడ్డారు.
ఒక కాలంలో నాగాలాండ్‌లో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యం కోహిమా పట్టణంలో స్పష్టంగా చూడవచ్చు. కొన్ని రహదారులకు ప్రభుత్వ హైస్కూ లు రోడ్డు అని, ప్రభుత్వ హైస్కూల్ జంక్షన్ అనే పేర్లు ఇప్పటికీ ఉన్నాయి.

అలాగే ప్రభుత్వ ప్రాథమి క పాఠశాల వీధి అని పెద్ద పెద్ద బోర్డులు అగుపిస్తా యి. దాన్ని బట్టే ప్రభుత్వవిద్య ప్రాధాన్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్రాధాన్యత 1980వ దశకం నుంచి తగ్గుతూ వచ్చిందని, స్కూలు భవనాలు శిథిలావస్థ లో ఉన్నాయని స్థానికులు అన్నారు. అప్పటి రాష్ట్రపతి అబుల్‌కలాం కోహిమా పర్యటనలో ప్రభు త్వ హైస్కూలు బాలబాలికలతో కలుస్తానని అనగా నే ప్రభుత్వ స్కూలు భవనాన్ని రాత్రికిరాత్రి మరమ్మతు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించారని నాగా మిత్రులు అన్నారు. ప్రభుత్వాలు తల్చుకుంటే పను లు ఎంత యుద్ధప్రాతిపదిక మీద చేయగలరో మనం గమనించవచ్చు అని చెప్పుకొచ్చారు. ఈ దుష్టాంతంతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే విద్యాలయాల క్షీణతకు కారణమన్నారు.

ఈశాన్యభారతంలో క్రిష్టియన్ మిషనరీలు విద్యారంగంలో గణనీయమైన పాత్ర నిర్వహించా యి. అక్షరాస్యత శాతం ఈ ప్రాంతంలో దేశ సగటు అభివృద్ధి కంటే చాలా ఎక్కువ. స్వాతంత్య్రం తర్వా త కోహిమాలో ప్రభుత్వ పాఠశాలలను 1950 నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి 1980ల దాకా స్కూళ్లు బాగా నడిచి తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యాయి. విద్యలో మార్కెట్‌శక్తుల ప్రవేశంతో వ్యాపార ధోరణి పెరిగి మిషనరీ స్కూళ్లకు కూడా ఈ వ్యాపార అంటురోగం పాకింది.

కోహిమా తర్వాత సభ దీయాపూర్‌లో దీయాపూర్ నాగా కౌన్సిల్ ఆధ్వర్యాన అధికారికంగా నిర్వహించారు. ఈ ట్రైబల్ కౌన్సిల్స్ మన జిల్లా పరిషత్‌లాగా కాక చాలా అధికారాలు కలిగి ఉంటాయి. సదస్సుకు కౌన్సిల్ అధ్యక్షుడు కార్యదర్శితో బాటు కౌన్సిలర్లందరూ హాజరయ్యారు. దీంతోపాటు చిన్న చిన్న గిరిజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సభకు వచ్చారు. వాళ్లంతా ఉద్యమాన్ని ఆహ్వానించారు. ఒకరకంగా చూస్తే నాగాలాండ్‌లో పౌర సమాజం చాలా బలమైంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కొంచెం తక్కువే. అలాగే నాగా ఉద్యమకారు ల ఆధ్వర్యంలో ఒక సమాంతర ప్రభుత్వం కూడా పని చేస్తుంటుంది.

భారత ప్రభుత్వంతో శాంతి ఒప్పందం తర్వాత నాగాలాండ్‌లో పైకి చూడటా నికి మాత్రం పెద్ద సంక్షోభం కనిపించదు. భారత సైన్యం గ్రామాల్లో ప్రజలకు కావలసిన కొన్ని సేవలను చేయడం, సహాయ సహకారాలు అందించ డం వల్ల సైన్యంపట్ల ప్రజల భావన కొంత మారిం ది. ఈ మార్పు కొంత జరుగుతూనే, మరో వైపు ప్రభుత్వ విద్య మాత్రం నిర్లక్ష్యం చేయబడింది.

దియాపూర్ సభ కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో సమయం సరిపోలేదు. నా ప్రసంగం తర్వాత చాలా ప్రశ్నలు రావడమే కాక ఒక లోతైన చర్చ ప్రారంభమైంది. సమయం తక్కువ ఉందని అంటే.. అయితే మీరు మళ్లీ రావాలి, ప్రసంగంలో చాలా అంశాల మీద సమగ్రమైన చర్చ జరగాలి అని పట్టుబట్టారు. నిజానికి ఆ ఆసక్తి చూస్తే మేము కార్యక్రమాన్ని నిర్వహించడంలో మరింత జాగ్రత్తలు తీసుకోవలసి ఉండెనని అనిపించింది. నాగాలాండ్‌లో ఉన్నత విద్య కూడా విధ్వంసానికి గురైం ది. నాగాలాండ్ విశ్వవిద్యాలయాన్ని పెట్టారు కానీ నియామకాలు లేవు. సరిగా నిధులు లేవు.

విశ్వవిద్యాలయానికి పోవడానికి రోడ్లు లేవు. రవాణా సౌకర్యాలు అసలే లేవు. కాలేజీలు, పీజీ సెంటరు కూడా బాగా నడవడం లేదు. ఈ దశలోనే దీయాపూర్‌కు రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వచ్చాయి. అం దులో కేవలం మార్కెట్ అవసరాలకు సరిపోయే విద్య తప్పించి వేరే ఏ ఇతర అంశాలను బోధించ డం లేదు. విద్య సామాజిక అవసరాలకు స్పందించాలన్న కొఠారీ కమిషన్ భావనను ఈ ప్రైవేట్ సంస్థలు పూర్తిగా దెబ్బతీశాయి.
కాషాయీకరణ అంశంపై కూడా వాళ్ల అనుభ వం భిన్నమైనది. నాగాలాండ్‌లో హిందుత్వ శక్తుల ప్రభావం లేదు. అయితే ముస్లింలకు, క్రిష్టియన్లకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉన్నది.

అలాగే మాతృభాషలో బోధన అంశం కూడా తీవ్రంగా ఉన్నది. నాగాలాండ్‌లో చిన్నా చితకా సమూహాలు మాట్లాడే భాషలు కలిపితే 16 భాషలున్నాయి. ఒక్కొక్క గిరిజన తెగ ఒక్కొక్క భాష మాట్లాడుతుం ది. ఈ 16 భాషలకు కూడా స్క్రిప్ట్ లేదు. ఇలాంటి సందర్భాల్లో మాతృభాషలో బోధన మీద చర్చ మరో కోణం నుంచి జరగవలసి ఉంది. విద్యా హక్కు పోరాటానికి ఈశాన్య భారతం సంసిద్ధంగా ఉన్నదన్నది అక్కడి ప్రజా ప్రతినిధులను కలసినా, విద్యార్థి సంఘాలతో మాట్లాడినా, అలాగే పౌర సమాజంలోని గిరిజనసంఘ నాయకుల పెద్దలు, నాయకుల అభిప్రాయాలు విన్నా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్ల క్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పోవాలన్న ఆకాంక్ష ప్రజలందరిలో ఏకాభిప్రాయంగా ఉన్నది. ఇక మిగిలింది ప్రజలం తా ఏక తాటిపై నిలిచి విద్యా హక్కును సాధించు కోవటమే.

1027

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం