విద్య కోసం ప్రజా ఉద్యమం


Thu,October 30, 2014 12:22 AM

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్యా పోరాట యాత్ర ఈ ప్రతిఘటనా పోరాటంలో ఒక కీలకమైన దశ. అందులో పాల్గొనడం మన నైతిక, ప్రజాస్వామ్య, చారిత్రక బాధ్యత.

నాలుగురోజుల్లో అంటే నవంబర్ 2న దేశంలోని నలుమూలల నుంచి విద్యా పోరాట ఉద్యమం ప్రారంభమౌతుంది. ఉత్తర భారతదేశంలో జమ్మూ నుంచి దక్షిణ భారతదేశంలో కన్యాకుమారి నుంచి, పశ్చిమంలో భువనేశ్వర్ నుంచి ఈశాన్య భారతంలో మణిపూర్ నుంచి మొదలవుతుంది. సంఘర్ష్‌యాత్ర 18రాష్ర్టాల గుండా జరుగుతూ ఒక రాష్ట్రం వారు తమ సరిహద్దుల్లో పక్క రాష్ట్రం వారికి మశాల్ అందిస్తారు.

hara


ఈ యాత్ర డిసెంబర్ 4న భోపాల్‌లో జనసభగా మారుతుంది. అక్కడ ఈ దేశ ప్రజల అనుభవాలేమిటో పంచుకొని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని నేపథ్యంలో ప్రజాప్రకటన జరుగుతుంది. ప్రజలు ఈ ఉద్యమానికి అందించిన స్ఫూర్తితో ఈ దేశంలో విద్యావిధానం ప్రజాస్వామికరింపబడే దాకా నాణ్యమైన విద్య, అదీ సమాన అవకాశాలతో అందరికి అందుబాటులోకి వచ్చేదాక ప్రజల నుంచి ఒత్తిడిని పెంచడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం. అపరిపక్వ ప్రజాస్వామ్యంలో ప్రజాఉద్యమాలు తప్పించి వేరే ఏ మార్గాలు లేవు.

ఈ ఉద్యమ సందర్భంలో మేము వేసిన కరపత్రంలో స్పష్టంగా చెప్పిన నినాదం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కొరకు, కామన్ స్కూలు కొరకు పోరాడండి అలాగే విద్యా రంగంలో వ్యాపారాన్ని, మతతత్వ భావజాలాన్ని వ్యతిరేకించండి అనేది మరో నినాదం. గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన విధానాల వల్ల క్రమక్రమంగా ప్రభుత్వ విద్యారంగం కుంచించుకొనిపోతూ, ప్రైవేట్ విద్య పెరుగుతూ వచ్చింది. 1991 నుంచి ప్రపంచీకరణ విధానాల వల్ల విద్యారంగంలో కార్పొరేట్ పెట్టుబడులు ప్రవేశించి, విద్యను అంగడి సరుకుగా మార్చివేశాయి. తెలుగుదేశం పాలన నుంచి ప్రపంచబ్యాంకు విధానాలు విచ్చలవిడిగా అమలైనందు వల్ల విద్యారంగంలో పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి.

ఇక రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేసి ప్రజా ధనాన్ని ప్రైవేట్ యాజమాన్యాలకు సంతర్పణ చేశారు. ప్రైవేట్ కాలేజీలు పెట్టినవారు ఎలా గూ ఫీజులు వసూలు చేస్తారు, డబ్బులున్నవాళ్లే అక్కడకు వెళ్తారు. కనుక వాళ్ల ఫీజు వాళ్లే కట్టుకొనాలనడం రివాజు. కానీ ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వాలో అర్థం కాదు. వేల కోట్ల రూపాయలు ఈ రూపంలో ప్రైవేట్ యాజమాన్యా ల చేతులోకి మార్చాయి. అలాఅని ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలతో పోటీపడలేకపోయాయి. ఈ సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పటికీ తమ ప్రతిష్టను ఉన్నత విద్య కోల్పోలేదు. అత్యున్నత ప్రతిభ కలిగిన విద్యార్థులు ఈ కాలేజీల్లోనే చేరుతున్నారు.

మన రాష్ట్రంలో 700కు పైబడి ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అందులో ఒక ఐదు పది శాతం కాలేజీలలో కొంత నాణ్యత ఉంటే ఉండవచ్చు అలాగే పదిశాతం మందికి మాత్రమే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో అవకాశాలు వస్తున్నాయి. మరి ప్రైవేట్ కాలేజీల్లోనే నాణ్యత ఉం టుందన్న వాదనకు బలమేమైనా ఉందా? విద్యార్థులకు అర్థవంతమైన జీవిత దృక్పథాన్ని ఏమన్నా ఇచ్చారా? అనేది ప్రశ్న.

బెంగళూరులోని లా విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ మొదటి బ్యాచ్ విద్యార్థులను చూస్తే అంతర్జాతీయ ప్రమాణాలున్నవారు చేరారు. ఇందులో డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, సైంటిస్టులు ఉన్నారు. వీరందరూ పూర్తిచేసిన చదువుతో సంతృప్తి చెందక ఇంకా విజ్ఞాన వేటలో ఉన్నారు. అంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రుల బలవంతం మీద, లేదా ప్రచార హోరుకు ప్రభావితమై భిన్న కోర్సుల్లో చేరాక అది తమ ప్రవృత్తికి సరిపోదని, మరెంత అర్థవంతమైన విజ్ఞానం కోసం, సామాజిక లక్ష్యం కోసం ఆరాటపడుతున్నారు.

అంతర్జాతీయ ప్రతిభా కలిగిన వీరు ఒకవైపు కాషాయీకరణని, మరోవైపు కార్పొరేటీకరణని వ్యతిరేకిస్తున్నారు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. వీళ్లల్లో చాలామంది సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారే, అలా అని విపరీతంగా డబ్బులు చేసుకుందామనో, విదేశాలకు వెళ్దామనో ఆలోచించడం లేదు. ఇది ఈ తరం విద్యార్థుల్లోని ఒక చిన్న సమూహమే అయినా, ఇది ఒక గుణాత్మక మార్పు.

అమెరికా వియత్నాం మీద దాడి చేసినప్పుడు విశ్వవిద్యాలయాలు అట్టుడికిపోయాయి. తమ దేశ పాలకుల దుర్మార్గాన్ని ఎండగట్టారు. ఎక్కడికక్కడ వియత్నాంపై అమెరికా జరుపుతున్న యుద్ధాన్ని ప్రతిఘటించారు. ఆ తర్వాతే విశ్వవిద్యాలయాల పాలనా పద్ధతులను మార్చి, విద్యావిధానాన్ని మార్చి విద్యార్థులకు ఏ ఉద్యమంలో కూడా పాల్గొ న్న దానికి సమయం లేనటువంటి ఊపిరి పీల్చుకోవడానికి సమయం లేని సెమిస్టర్, ట్రైమిస్టర్ విధానం ప్రవేశపెట్టారు. అలాగే దాదాపు చాలామందికి అందుబాటులో ఉండే విద్యను, దూరం చేస్తూ, బ్యాంకుల్లో రుణాలు తీసుకునే దశలోనెట్టారు.

రుణం తీసుకున్న విద్యార్థి వ్యవస్థకు కట్టుబడిన ఒక బాండెడ్ లేబరర్ తయారౌతాడు. అప్పు ఎలా తీర్చాలన్న సమస్య వెంటాడుతుంటే, సామాజిక సమస్యల గురించి ఆలోచించే సమయమే ఉండదు. అందుకే వియత్నాం మీది కంటే ఇంకా దుర్మార్గమైన యుద్ధం ఇరాక్ మీద చేసినప్పుడో అమెరికన్ విశ్వవిద్యాలయాలు నిస్సహాయంగా మూగపోయాయి. దానివల్ల ప్రపంచానికి ఎంత నష్టం జరిగిందో మనం ఊహించవచ్చు. ప్రైవేట్ విద్యారంగం విద్యార్థులకు సహాయంగా ప్రశ్నించే మనస్తత్వాన్ని ఇవ్వదు. తమ చుట్టూ ఎంత అన్యాయం జరిగినా నోరు విప్పని ఒక తరాన్ని తయారు చేస్తుంది.

ఇలాంటి వాతావరణం సృష్టించడం వల్లే విద్య ను కాషాయీకరించడం మరింత సులభమైపోయిం ది. అటల్ బిహారీ వాజపేయ్ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీమనోహర్ జోషి మతతత్వ కోర్సులను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అస్ట్రాలజీ కోర్సు పెట్టాలని ఆదేశించినప్పుడు మేమంతా దాన్ని వ్యతిరేకించాం. అకడమిక్ కౌన్సిల్ యూజీసీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఇప్పుడు పరిస్థితి మారుతున్నది. ఢిల్లీ విశ్వవిద్యాలయాన్నే కూలగొట్టగలిగిన స్థితికి మతశక్తులు, సామ్రాజ్యవాదశక్తులు ఎదిగాయి.

ఎంత ఎదిగాయంటే సుబ్రమణ్యస్వామి అనే ఒక అడ్రస్ లేని వ్యక్తి ఏ ప్రజాబలం లేనివాడు రొమిలా థాపర్ పుస్తకాలను తగులబెట్టాలి అనే దుస్ససాహసానికి ఒడగట్టాడంటే, ఇద్దరు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశాడు. హార్వర్డ్‌తో సంబంధం ఉన్నవాడు ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడంటే ఇతన్ని పనిగట్టుకుని కొన్ని సామ్రాజ్యవాదశక్తులు పాలు పోసి పెంచారు. కాషాయీకరణకు సామ్రాజ్యవాదానికి పుట్టిన ఒక వికృతజీవి సుబ్రమణ్యస్వామి.

ఇప్పుడున్న పరిస్థితిని మనం సహసిస్తూ పోతున్నాం కనుక భారత రాజ్యాంగం మూల విలువలకే ప్రమాదం ఏర్పడింది. శాస్త్రీయ విద్య నినాదం తో ప్రారంభమైన భారతదేశ విద్యా విధానం ఇప్పుడు మతతత్వశక్తుల చేతిలోకి జారుకుంటున్నది. ఎక్కడి రొమిలా థాపర్, ఎక్కడి సుబ్రమణ్యస్వామి. భారతదేశ చరిత్రను అవపోసనం చేసిన రొమిలా థాపర్ పుస్తకాల మీద ఇంత బాధ్యతారహిత ప్రకటన చేసినా దేశవ్యాప్తంగా నిరసన రాకపోవడం చాలా ప్రమాదం. విద్యా రంగంలో ఏదో ఒక స్తబ్దత కూరుకుంది.

ఈ స్తబ్దతను బద్దలుకొట్టాలంటే ప్రజా ఉద్యమమొక్కటే మార్గం. ప్రజాస్వామ్యంలో పాలకులను ఎన్నుకోవడం ఒక్కటే సరిపోదు. సమాంతరంగా నిరంతంగా ప్రజలు చైతన్యపూరిత ఉద్యమాలు చేస్తూనే ఉండాలి. విద్యారంగంలో పనిచేసేవారు ప్రజలేమంటున్నారో కనీసం తెలుసుకోవాలి. ప్రజలకు మించిన శక్తి ప్రజాస్వామ్యంలో ఎవ్వరికీ ఉండదు.
ఈ నేపథ్యంలోనే కార్పొరేటీకరణకు, కాషాయీకరణకు వ్యతిరేకంగా సంఘర్షయాత్ర కొనసాగుతుంది.

అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఇతర ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమించాలి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో ఉన్నత విద్య బోధించే అధ్యాపకుల్లో నిరాసక్తత పెరిగింది. జీతాలు పెరగడం వల్ల కొన్ని సౌకర్యాలు పెరిగాయి. కానీ సామ్రాజ్యవాద చరిత్ర తెలిసిన ఎవ్వరూ నిశ్శబ్దంగా ఉండరు. మనమందరమూ గర్వపడే ప్రభుత్వ రంగ సంస్థలు మన కళ్లముందు కూల్చేయబడ్డాయి. శ్రామికులు జాగరూకతతో లేకపోవడం వల్ల అది అంత సునాయసంగా చేయగలిగారు. మనం ఇలాగే ఉంటే ఒక ఐదు సంవత్సరాల్లో మనందరికి వలంటరీ రిటైర్‌మెంట్ పథకాన్ని అమలుచేస్తారు.

ఇప్పటి తరానికి పెన్షన్ ఎలాగూ రద్దు చేశారు. కాబట్టి ఎవరికైనా ఆ సౌలభ్యం ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తారు. పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుం ది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్యా పోరాట యాత్ర ఈ ప్రతిఘటనా పోరాటంలో ఒక కీలకమైన దశ. అందులో పాల్గొనడం మన నైతిక, ప్రజాస్వామ్య, చారిత్రక బాధ్యత.

1054

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

Featured Articles