ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?


Thu,October 23, 2014 01:08 AM

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హోరులో పేద తల్లిదండ్రులు కొట్టుకపోతున్నారు. ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్లలోని మంచి స్కూళ్లను, ప్రతిభ గల విద్యార్థుల గురించి ప్రభుత్వం ప్రచారం చేయవచ్చు కదా!

మన దేశం భిన్నమైన వైరుధ్యా ల మధ్య ప్రయాణం చేస్తున్నది. ఒకవైపు మతోన్మాదం, మరోవైపు శీఘ్ర అభివృద్ధి. ఒకవైపు దేశభక్తి పారాయణం, మరోవైపు విదేశీ పెట్టుబడికి ఎర్రతివాచీ. దేశ ప్రధానిది పూర్తి పాశ్చాత్య డ్రెస్సు, కానీ అంతర్జాతీయ సదస్సుల్లో హిందీలో ప్రసంగం! దేశాన్ని వదలిపెట్టి తమ ప్రయోజనాల కోసం అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు మోదీని చూసి పులకరించిపోవడం. కాం గ్రెస్ విధానాలను తప్పుపట్టి గెలిచి ఆ విధానాలను కాంగ్రెస్ ఆశ్చర్యపోయేంత వేగంగా అమలు చేయ డం! ప్రపంచంలో ప్రతిష్ట గల 200 విశ్వవిద్యాలయాల్లో మన పేరు లేదని ఏడుపు, విశ్వవిద్యాలయాలకు గ్రాంట్ల తగ్గింపు. విద్య ప్రాథమిక హక్కుగా ప్రకటించి, కొత్త పాఠశాలలు తెరిచే బదులు ఉన్న వాటి మూసివేత.

hara


ఉద్యమం ద్వారా అధికారానికి వచ్చిన పార్టీ కూడా ఈ వైరుధ్యాలకు అతీతం కాదు. కానీ కొన్ని వైరుధ్యాలనైనా పరిష్కరించే దిశగా విధాన నిర్ణయాలు చేయాలి. అందులో ఈ కాలమ్ లో విద్యా రంగంలో పెరుగుతున్న వైరుధ్యాల గురించి (నవంబర్‌లో తలపెట్టిన ఉద్యమ సందర్భంగా) చర్చించవలసిన అవసరముంది.

దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలను మూసి వేస్తున్నారు. బాంబే నగరంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలను వేలానికి పెట్టారు. ఇలా వేలానికి పెట్టిన కాంగ్రెస్, ఎన్సీపీలు చిత్తుగా ఓడిపోయాయి. మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీ ఆ విధానాన్ని మరిం త ముందుకు తీసుకపోవడం తప్ప పాఠశాలలను తెరిచే ప్రసక్తే లేదు. అందరూ బాలబాలికలు పాఠశాలకు నిర్బంధంగా వెళ్లవలసిన తరుణంలో స్కూళ్ల ను మూసివేయడమమిటి? అనే ప్రశ్న వస్తుంది.

అలా అని స్కూళ్ల అవసరం తగ్గిందని కాదు, సంఘ్‌పరివార్ 25వేల స్కూళ్ల దాకా నడపాలనే దిశగా వెళుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిర్బంధ ఉచితవిద్య అని పార్లమెంటు చట్టం చేసిన తర్వాత మళ్లీ తల్లిదండ్రులు విద్యను కొనుక్కోవడం దేనికి?

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాదా పు మూడువేల స్కూళ్లను రేషనలైజేషన్‌పేర మూసివేయాలని నిర్ణయించారు.పిల్లలు లేకపోతే ఉపాధ్యాయులకు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా అనే మాట సీఎం కేసీఆర్ అన్నారు. అలా ఇవ్వమని ఎవ రూ అనరు. కానీ ఈ మూడువేల బళ్లల్లో అంతకుముందు పిల్లలు చదువుకున్నారు.

ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వం విద్య గురించి ఆశాజనకమైన విధా న ప్రకటన చేసిన తర్వాత, స్కూళ్లల్లో పిల్లలు లేరం టే, పిల్లలుఏమయ్యారు? ఎందుకు రావడం లేదు? అనే అంశం మీద ఎంక్వైరీ చేయాలి కదా! జనాభా లో పిల్లల సంఖ్య అంత గణనీయంగా పడిపోయిం దా? అలా పడిపోతే దానికి కారణాలను అన్వేషించాలి కదా! స్కూళ్లు మూతపడే ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయా? వాటికి పిల్లలు ఎందుకు వస్తున్నారు అని తెలుసుకోవాలి కదా! ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేయడం లేదంటే ఎందుకో కనుక్కోవాలి కదా. స్కూళ్లలో సౌకర్యాలు లేవంటే వాటిని తీర్చాలి కదా.

మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అమరచింత గ్రామంలో అడ్వకేట్ ప్రకాశ్‌రెడ్డి దాదాపు కోటి రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వ స్కూలుకు సౌకర్యాలన్ని కల్పించడం వల్ల పిల్లలు 80 నుంచి దాదాపు 700 మందికి పెరిగారు. ఆ పని తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చేయవచ్చు కదా. ప్రకాశ్‌రెడ్డి ప్రతి శని, ఆదివారాలు గ్రామానికి వెళ్లి స్కూలు ఎలా పనిచేస్తున్నదో చూస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉంటే తానే తాత్కాలికంగానైనా నియమించి వాళ్ల జీతాలు భరిస్తున్నారు. తాను ఆ స్కూళ్లో ఐదవ తరగతి వరకు చదువుకున్నాననే అభిమానమే ఆయనకు స్ఫూర్తి.

ప్రతి గ్రామంలో ఒక ప్రకాశ్‌రెడ్డి లేరు కదా. ప్రభుత్వమే ప్రకాశ్‌రెడ్డి పాత్రను నిర్వహించడానికి ఏం అడ్డువస్తున్నదో తెలుసుకోవాలి. సరూర్‌నగర్ మండలంలోని మొగలిగిద్ద గ్రామంలో ప్రైమరీ స్కూళ్లో రెండువందల మంది, ఆరు నుంచి పదవ తరగతిలో ఎనిమిది వందల మంది విద్యార్థులున్నారు. దీనికి కార ణం గ్రామస్తులు స్కూలు గురించి మొదటి నుంచి శ్రద్ధ తీసుకున్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగంలో చాలా బాగా పనిచేస్తున్న స్కూళ్ల ను అధ్యయనం చేసి అలా నడవడానికి కారణాలు తెలుసుకుంటే, నడవని స్కూళ్లను ఎలా అభివృద్ధి చేయాలో తెలుస్తుంది. ప్రభుత్వాలు నడిపే కేంద్రీయ స్కూళ్లు, నవోదయ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తున్నాయి కదా.

కొందరికి నాణ్యమైన విద్య ఇతరులకు నాసి రకం విద్య అంటే పేద పిల్లల పట్ల మన బాధ్యతను విస్మరించినట్టే. ప్రభుత్వ రంగంలోని హైస్కూళ్లల్లో ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో పేద పిల్లలు చదువుకుంటున్నారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లకు ఎంత కీర్తి ప్రతిష్టలుండేవో తలచుకుంటే మా తరం వాళ్లకు పులకరింపు కలుగుతుంది. నిజాం కాలేజీ ముందు మహబూబియా స్కూలు ఉండేది. ఆ స్కూలు పేరు మా గ్రామం దాకా వినబడేది. అలాగే ధర్మవంతు స్కూలు. తెలంగాణ విద్యామంత్రి ఒక్కసారి మహబూబియా స్కూలుకు వెళ్లి చూస్తే శిథిలమౌతున్న బిల్డింగ్, బూజు పట్టిన గోడలు బూత్ బంగ్లా లాగా కనిపిస్తుంది.

అది ఎప్పుడైనా కూలిన వార్త రావ చ్చు. రాజశేఖర్‌రెడ్డి దృష్టికి ఈ స్కూలు, ఇక్కడి స్థలం రాకపోవడం వల్ల స్కూలు స్థలం రక్షించబడింది. ఆ స్థలం ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేసేది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న స్కూలును మనం ఎందుకు అంత నిర్లక్ష్యం చేసినట్టు? నిన్నటిదాకా ఆంధ్ర పాలకులను నిందిస్తిమి. నిందలో నిజం లేదని అనడం లేదు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టాక రాత్రింబగళ్లు కష్టపడాలి కదా! తెలంగాణ మొదటి విద్యామంత్రి ప్రభుత్వ స్కూళ్ల పునరుద్ధరణకు చేసిన కృషికి చరిత్రలో స్థానముంటుంది కదా! స్కూలుకు సున్నం వేయడానికి వనరులు లేవు అని అంటే ఎవరు నమ్ముతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భా న ప్రభుత్వ స్కూలు బిల్డింగ్‌ల కన్నింటికి మర మ్మత్తు చేసి కొత్త భవనాలుగా కనిపించేలా చేయడం తెలంగాణ సెలబ్రేషన్‌లో ఎందుకు భాగం కాకూడదు? రాజబహదూర్ వెంకట్రామరెడ్డి పేరు విద్యాసంస్థల వల్లనే కదా నిలిచింది.

ఎందుకో తెలంగాణ మొదటి క్యాబినెట్‌కు చారిత్రక స్పృహ ఎంత గాఢం గా ఉండాలో అంత లేదనిపిస్తున్నది. ఈ క్యాబినెట్ తెలంగాణ ప్రజల పోరాటం నుంచి వచ్చింది. ఉమ్మ డి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్‌లో ఉండే 90 శాతం మంది ఎప్పుడు ఎన్నడూ మంత్రు లయ్యేవారు కాదు. ఈ క్రెడిట్ తెలంగాణ ప్రజలకే చెందుతుంది. దానికి కృతజ్ఞతగా మంత్రులు పనిచేయవలసి ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడికైనా చరిత్రలో గుర్తింపు పేదల పట్ల చూపించే కమిట్‌మెంట్ నుంచే వస్తుంది. పేదల జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఎన్నడో చిన్న సాయం చేసిన వాడిని జీవితమంతా గుర్తు పెట్టుకుంటారు. ఈ చిన్న విషయం ప్రజా జీవితంలో ఉన్న చాలామందికి ఎందుకు తట్టదో అర్థంకాదు.

విద్యారంగాన్ని ప్రైవేటు మాఫియాల నుంచి కాషాయీకరణ ప్రమాదం నుంచి తప్పించడానికి అఖిల భారత విద్యాహక్కు ఫోరం నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టపోతున్నది.పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హోరులో పేద తల్లిదండ్రులు కొట్టుకపోతున్నారు. ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్లలోని మంచి స్కూళ్లను, ప్రతిభ గల విద్యార్థుల గురించి ప్రభుత్వం ప్రచారం చేయవచ్చు కదా! నాణ్యమైన విద్య వైద్యం ప్రజలకు అందించగలిగితే 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకే మళ్లీ ప్రజలు పట్టం కట్టవచ్చు.

ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. ఎంత విదేశీ పెట్టుబడి వచ్చింది, ఎంత వృద్ధిరేటు సాధించాం అన్నదిసామాన్య ఓటర్ల ప్రయోజనాలు కావు. ఆ పనిచేసిన టీడీపీ బొర్లాపడింది. ఆ నమూనాని అతి ఉత్సాహంతో అమలు చేసిన కాంగ్రెస్ ప్రతి పక్ష హోదాను కూడా కోల్పోయింది. ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ముందుకు తీసుకపోతున్న సంఘ్‌పరివార్‌కు,బీజేపీకి అప్పుడే ప్రజల నుంచి సంకేతాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రజలేం పట్టం కట్టలేదు. కేంద్రంలో ఉన్న అధికారపార్టీకి 21శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల ఫలితాలుఅందరు నిర్ఘాంత పోయేలా ఉంటాయి. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఏదో రూపంలో వ్యక్తీకరిస్తూనే ఉన్నారు.

పాలకులే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అలాం టి పొరపాట్లు చేస్తే ప్రజలు మరింత ఆగ్రహపడుతారని గుర్తించాలి. ఏం చేసినా చేయకున్నా ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడుకోవాలి. ఈ దేశ ప్రజల తరఫున విద్యను చూడడం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహాయజ్ఞంగా భావించాలి. తెలంగాణ వరకు ప్రభుత్వం విధాన ప్రకటన చేసి ఉన్నది కాబట్టి దాని అమలు కు భూమికను ఈ ప్రజా ఉద్యమం కల్పిస్తున్నది. నా దృష్టిలో తెలంగాణ కుండే పోరాట వారసత్వం వల్ల ఈ రాష్ట్ర ప్రజల చైతన్య స్థాయి చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడున్న అమానవీయ అభివృద్ధి నమూనాకి ప్రత్యామ్నాయం తెలంగాణ అందించాలి.

1485

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం