యుద్ధాలులేని ప్రపంచం కావాలె


Thu,September 11, 2014 12:33 AM

భారత దేశంలో అలాగే పాకిస్థాన్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్నికూడగట్టుకోవాలి. యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం చేయవలసిన ఒక చారిత్రక సందర్భం ఏర్పడుతున్నది. శాంతివైపు, మానవత్వం పైపు, విలువైన మనిషి ప్రాణం వైపు, ఒక మానవీయ సమాజ నిర్మాణం వైపు నిలబడే వాళ్లందరూ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.

ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన గత వందరోజులుగా ఇండియా పాకిస్థాన్ లేక ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగే సూచికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు యుద్ధాన్ని కోరుకుంటున్నారో చెప్పడం అంత సులభం కాదు. పాకిస్థాన్ తన అంతర్గత సంక్షోభం నుం చి బయటపడడానికో లేదా ఎన్డీఏ ప్రభుత్వం తన పాలనను సుస్థిరపరచుకోవడానికో యుద్ధాలు చేయొచ్చు. పాకిస్థాన్ భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్నదని,ఆధీనరేఖను అతిక్రమిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. అలాగే భారత సైన్యాలు పాక్ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నాయని పాకిస్థాన్ మీడియా ప్రచారం చేస్తున్నది.

అలాగే చైనా భారత్ ల మధ్య ఒకవైపు టిబెట్ మరొకవైపు అరుణాచల్ ప్రదేశ్ సమస్యాత్మకంగా మారాయని తరచు వార్తలు వస్తున్నాయి. నిజానికి సరిహద్దులో ఏం జరుగుతున్నదో, వాస్తవాలు ఏమిటో బయటికి రావు. కేవలం రెండుదేశాల సైన్యాలు లేదా అధికారులు చెప్పే మాట లు, చేసే ప్రకటనలు తప్ప వాస్తవాలు తెలిసే మార్గం రెండు దేశాల ప్రజలకు లేదు. యుద్ధం ఎవరు ప్రారంభిస్తారని కాక రెండు దేశాల ప్రజలు తమ తమ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ఏ సమస్యనైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పాలి. ఇది ఇప్పటి చారిత్రక అవసరం.
20వ శతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాల బీభత్సా న్ని అనుభవించింది.

లక్షలాది మంది సైనికులు, పౌరులు ఈ యుద్ధాల్లో మరణించారు. కనీవినీ ఎరుగని ప్రాణ నష్టం జరిగింది. ఈమానవ హననం తర్వాత, మానవాళి ఒక పశ్చాత్తాప మానసిక స్థితిలో పడింది.యుద్ధాలు లేని ప్రపంచం కావాలని, యుద్ధా లను నివారించడం కోసంఐక్యరాజ్యసమితి ఆవిష్కరణ జరిగింది. ఈ సంస్థ కొంత కాలం చాలా పనిచేసినా, క్రమేణా అది పూర్తి నిర్వీర్యంగా మారిపోయిం ది. ఈ సంస్థను, సంస్థ ఆదేశాలను పూర్తిగా విస్మరిం చి అమెరికా ఇరాక్‌లోకి ప్రవేశించి సాధారణమైన పౌరులను చంపే దుర్మార్గానికి పాల్పడింది.

అమెరికా పాలకులది కండకావరం. ప్రపంచంలో ఏ మూలకై నా తాను వెళ్తానని, తమను ఆపేవాడే లేడనే ధీమా తో ఉన్నది. ఇది ఎల్లకాలం నడిచే వ్యవహారం కాదు. కానీ ప్రస్తుతం అమెరికా యుద్ధపిపాసను తట్టుకోవ డం ప్రపంచ పాలకులకు సాధ్యమయ్యేట్టు కనిపించ డం లేదు.అందుకే ప్రపంచ ప్రజలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవలసిన ఒక సందర్భం ఆసన్నమైంది.

గత ఆరు, ఏడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతు న్న లేదా వెనకబడిన దేశాలకు యుద్ధ శిబిరం మారిం ది. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతూ, ఆకలితో అలమటిస్తున్న జనం ఉన్న దేశాలు ఏదో ఒక కారణం మీద యుద్ధంలో పాల్గొంటూనే ఉన్నాయి. విలువైన ప్రజా వనరులను నిష్ఫప్రయోజనంగా యుద్ధాల మీద ఖర్చు పెడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశా లు తమ రక్షణ మీద పెడుతున్న ఖర్చు చాలా తక్కు వ.స్కాండేనేవియన్ దేశాలు అసలు సైన్యాన్ని పోషిం చడంలేదు.

కొన్ని దేశాలు మొత్తం బడ్జెట్‌లో రెండు మూడు శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయడం లేదు. కానీ తమ మౌలిక సమస్యలను పరిష్కరించలేని దేశాలు మాత్రం విపరీతంగా ఆయుధాల సేకరణ మీద ఖర్చు పెడుతున్నాయి. ప్రతి దేశం పక్కదేశంతో సమస్యలున్నట్టుగా లేదా ఉండేట్టుగా ప్రవర్తిస్తున్నది. ప్రతి దేశం పక్కదేశం బూచీని చూపి రక్షణ ఖర్చును సమర్థించుకుంటున్నది. ప్రజలు ఎందుకు ఈ యుద్ధ ప్రయత్నాలు అని అడగడం కానీ, పక్క దేశాలతో సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఒత్తిడి పెట్ట డంలేదు. అంటే సమాజంలో మౌలిక ప్రశ్నలు అడిగే సాహసం చేయడం లేదు.

భారతదేశానికి వస్తే స్వాతంత్య్రం తర్వాత ఒక దశాబ్ద కాలం యుద్ధ భయం లేకుండానే గడిచింది. ఈ దశాబ్దంలో వ్యవసాయ రంగం కొంత అభివృద్ధిని సాధించింది. కానీ 1960లలో ఇండియా - చైనా మధ్య యుద్ధం రావడంతో మొత్తం అభివృద్ధి పంథా దెబ్బతిన్నది. ఈ యుద్ధంవల్ల దేశంలో సోషలిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకంగా పాలకులు ప్రజల అభిప్రాయాలను మార్చగలిగారు.చైనా కమ్యూనిస్టు దేశం కావడంతో కమ్యూనిజం భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టడానికి యుద్ధాన్ని ప్రకటించిందని ప్రచారం చేయడంతో.., సోషలిస్టు భావజాలం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దశలో యుద్ధం మొత్తం భావజాలాన్ని దెబ్బతీసింది. కమ్యూనిస్టు పార్టీ రెం డు ముక్కలుగా చీలిపోయింది. అంతవరకు సోవియ ట్ పంథాను అభిమానించినవారు అనుమానాల్లో పడ్డారు. నెహ్రూ ఇమేజ్ చాలా దెబ్బతిన్నది.

అమెరికాను, అమెరికా సామ్రాజ్యవాదాన్ని సాహసంగా వ్యతిరేకించి అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా పాత్రను అడుగడుగునా ప్రశ్నించి ఎండగట్టిన కృష్ణమీనన్ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చిం ది. అన్నింటికి మించి అప్పటి నుంచి రక్షణ మీద, ఆయుధాల మీద ఖర్చు పెరుగుతూ వచ్చింది. అందరికి విద్య, ఆరోగ్యం, చేతినిండ పని కల్పించడానికి బదులు, లక్షల కోట్లు రక్షణశాఖకు కేటాయిస్తూ వచ్చారు.ఇక 1965లో పాకిస్థాన్-ఇండియా మధ్య యుద్ధం జరిగింది. యుద్ధ కాలంలో లాల్‌బహదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ అనే నినాదాన్నిచ్చాడు. అంటే ఇంకా అప్పటికి కిసాన్‌కు ఒక కీలక పాత్ర ఉంది.

మళ్లీ 1971లో యుద్ధం ద్వారా బంగ్లాదేశ్‌ను విముక్తి చేసిన నాయకురాలిగా ఇందిరాగాంధీ పాపులారిటీ చాలా పెరిగింది. ఆమెకు దుర్గా అని కాళీ అనే పొగడ్తలు వచ్చాయి. నిజానికి జరిగింది రక్షణశాఖ మీద ఖర్చు మరింత పెరగడం.ఇప్పుడు మళ్లీ యుద్ధం జరుగుతుందనే సూచనలు కన్పిస్తున్నాయి.రెండు దేశాల మధ్య యుద్ధాలు చాలా కారణాల వల్ల జరగొచ్చు.అది ఆ దేశాలకు సంబంధించిన సమ స్య అయితే పరిష్కరించుకోవచ్చు. కానీ ప్రతి యుద్ధం వెనక సామ్రాజ్యవాద శక్తుల ప్రేరణ ఉం టున్నది. అమెరికా అలాగే బహుళజాతి కంపెనీలు పెద్ద ఎత్తున ఆయుధ వ్యాపారంలో ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆయుధాలు అమ్ముకోవడంపై ఆధారపడి ఉన్నది.

1973 అయిల్ షాక్ తర్వాత అయిల్ ఉత్పత్తి చేసే దేశాల మధ్య ఎంత యుద్ధ వాతావరణం ఏర్పడిందో చెప్పనవసరం లేదు. పెట్రోల్ సహజవనరులు సమృద్ధిగా ఉన్న ప్రతి దేశం ఏదో యుద్ధంలో ఇరికించబడింది. వాళ్లు యుద్ధాలు చేయకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోలే దు. వాళ్ల సహజ వనరులను దోచుకోవడానికి ఆయుధాలు అమ్మడంఒకటే మార్గం.ఆయుధాలకు డిమాం డ్ పెరగాలంటే యుద్ధం ఉండాలి. అమెరికా విజయవంతంగా అరబ్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టగలిగింది. అమెరికా దుర్మార్గాన్ని తట్టుకోలేని దేశాల్లో టెర్రరిజం ఊపిరిపోసుకున్నది. ఇక టెర్రరిజాన్ని అణచివేసే పేర మళ్లీ యుద్ధాలు! యుద్ధం ఒక పద్మవ్యూహం లాంటిది. అందులో పేద దేశాలు విలవిల కొట్టుకుంటున్నాయి.

దక్షిణ ఆసియా యుద్ధంలోకి మరోసారి నెట్టబడి తే, మనదేశం దాంట్లో భాగస్వామి అయితే జరిగే అతి పెద్ద ప్రమాదం వ్యక్తి స్వేచ్ఛ పూర్తిగా హరించుకపోతుంది. పాలకులు ఏది మాట్లాడినా ఏ అణచివేత చర్య తీసుకున్నా, దాన్ని ప్రతిఘటించే వీలుండదు. ఏ ప్రతిఘటననైనా జాతి వ్యతిరేకమని ప్రకటించవచ్చు. ఇంకా ముందుకు వెళ్లి దేశద్రోహం అనవచ్చు. గిరిజన పోరాటాలను, అస్తిత్వ పోరాటాలను, ఆకలి పోరాటాలన్నింటిని దేశ ద్రోహ చర్యలుగా ప్రకటించి నిర్దాక్షిణ్యంగా అణచివేయవచ్చు. అందుకే యుద్ధంఅంటే స్వేచ్ఛను, మానవత్వాన్ని, సమష్టి స్పృహను, ప్రజా పోరాటాలను మింగివేయడమే!

భారతదేశంలో అలాగే పాకిస్థాన్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకోవాలి. యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం చేయవలసిన ఒక చారిత్రక సందర్భం ఏర్పడుతున్నది. శాంతివైపు, మానవత్వం పైపు, విలువైన మనిషి ప్రాణంవైపు, ఒక మానవీయ సమాజ నిర్మాణంవైపు నిలబడే వాళ్లందరూ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. పాలమూరు అధ్యయన వేదిక చారిత్రక దశను పసిగట్టి తమ వంతు పాత్ర నిర్వహించడానికి నిర్ణయించింది.

Warangal-E-paperపాలమూరుకు కరువు తెలుసు, ఆకలి తెలు సు, దప్పి తెలుసు. యుద్ధం వస్తే ఇక ప్రజలు యుద్ధ వార్తలనే తినాలి, తాగాలి. ఆకలి అని అనడానికి వీలుండదు.అందుకే యుద్ధానికి వ్యతిరేకంగా కవి సమ్మేళనం జరుగుతున్నది. అందరం సంతోషించవలసింది ఈ సమ్మేళనంలో పాల్గొనడానికి దాదాపు 150మంది కవులు సంసిద్ధత తెలిపారు. బహుశా కవి రేపటి చరిత్రను గమనిస్తున్నాడు. శాంతివైపు నిలబడడానికి కలంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు.

863

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles