హిండాల్కో శ్రామికుల విజయం


Thu,August 28, 2014 12:21 AM

హిండాల్కో పరిశ్రమను కార్మికులు కాపాడుకోగలిగారు. మొత్తం ఉద్యమంలో కార్మికులు ఒక్కతాటి మీద నిలబడ్డారు. కార్మిక నాయకులు కూడా నిజాయితీగానే కార్మికుల వైపు నిలబడ్డారు. దీనికితోడు ప్రభుత్వం కూడా సహకరించడంతో ఒక పరిశ్రమ నిలిచింది.

హైదరాబాద్‌లోని బిర్లా కంపెనీ కి చెందిన హిండాల్కో పరిశ్రమలో మందులను చుట్టే రాపర్‌ను తయారు చేస్తారు. 176 కుటుంబాలు ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అకస్మాత్తుగా బిర్లా కంపెనీ ఈ పరిశ్రమను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.దానికి కంపెనీ చెప్పిన కారణం-వాతావరణాన్ని కాలుష్యం చేసే పరిశ్రమలను హిమాయత్‌సాగర్‌కు పది కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ చేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆ ప్రాంతంలో నడుస్తున్న పరిశ్రమలలో అతి ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తున్న పరిశ్రమలన్నీ ఏదో కారణం చెప్పి అక్కడ కొనసాగుతున్నా, అతి తక్కువ కాలుష్యానికి కారణమయ్యే హిండాల్కో మాత్రం పరిశ్రమను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ కంపెనీ మూయడానికి పీసీబీ ఆదేశాలు కారణం కాదని, ఈ కంపెనీ భూమిని అమ్మితే కంపెనీ నడిపిస్తే వచ్చే లాభాల కంటే ఎక్కువని ఆశపడి కంపెనీని మూసేస్తున్నారని కార్మికులు అంటున్నారు. భూమి అమ్మకపు వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టారని కూడా ఆరోపిస్తున్నారు.

ఈ సమస్యను కార్మికులు జి.విజయ్ దృష్టికి తేచ్చారు.అలాగే అది కోదండరామ్ దృష్టికి కూడా రావడంతో మేం ముగ్గురం కంపెనీ బాధ్యులను కలిసి చాలాసేపు మాట్లాడాం. కార్పొరేట్ బాధ్యతల గురించి, కార్మికులు వారి భవిష్యత్తు గురించి, బిర్లా లాంటి పారిశ్రామికవేత్తలు నడుపుతున్న కంపెనీ ఇలా కార్మికులకు అన్యాయం చేయడం మంచిది కాదని వాదించాం. కంపెనీ బాధ్యులు ఏం వాదించకుండా మేం కంపెనీలో ఉత్పత్తిని ఆపివేస్తున్నాం అని మళ్ళీ మళ్ళీ ఒకే జవాబు చెప్పడం మొదలుపెట్టారు.

అది సరికాదని మేము, మా చేతుల్లో ఏం లేదని వాళ్లు ఈ వాదన కొనసాగుతూ వచ్చింది. మీరు భూమిని అమ్మడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారని, బిర్లాలాంటి పారిశ్రామికవేత్త రియ ల్ ఎస్టేట్ వ్యాపారిగా మారడం దేశానికి మంచిది కాదని కూడా వాదించాం. ఏ పరిస్థితిలో కార్మికుల పొట్టలు కొట్టడం మంచిదికాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో ఇలాంటి నిర్ణయం తప్పుడు సంకేతాలను పంపుతుందని గట్టిగానే హెచ్చరించాం. దీంతో కార్మికులను పని నుంచి తీసివేసే బదులు వాళ్లను దేశంలోని తమ భిన్న కంపెనీలకు జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ లాం టి రాష్ర్టాలకు తలాతోకా లేకుండా బదిలీ చేశారు.

ఈ దశలో సమస్యను లేబర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం.లేబర్ కమిషన్ సమస్యను సీరియస్‌గా తీసుకున్నది. కానీ తమ పాత్ర కేవలం సలహా ఇవ్వ డం వరకే కానీ, పరిశ్రమ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని అంటూ, సమ స్య పరిష్కారం పట్ల సానుభూతిని చూపించారు. లేబర్ కమిషనర్ అధికారి అజయ్‌తో కూడా బిర్లా మేనేజ్‌మెంట్ ఏ వాదన లేకుండా కంపెనీ ఉత్పత్తిని ఆపేశాం అంటూ వచ్చారు. కార్మికుల బదిలీ విషయంలో తమకు సంతృప్తికర సమాధానం కావాలని లేబర్ కమిషన్ పట్టుబట్టడంతో కంపెనీ మూసివేత తాత్కాలికంగా ఆగుతూ వచ్చింది.

ఈ దశలోనే ఎన్నికలు జరగడం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిం ది. కార్మికులకు ఒక కొత్త విశ్వాసం ఏర్పడింది. బిర్లా యాజమాన్యంతో ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలో మీరు కోరితే దానికోసం మేం ప్రయత్నం చేస్తామని, అలాగే పీసీబీతో కూడా మాట్లాడతాం అని విశ్వాసం కలిగించినా యాజమాన్యం తమ మొండితనం వదలలేదు. ఈ దశలో సమస్యను హోం మినిస్టర్ నాయిని నర్సింహారెడ్డి దగ్గరకు తీసుకెళ్లాం.

నాయిని గారికి సమస్యతో ప్రత్యక్షంగా సం బంధం లేకున్నా, చాలాకాలంగా కార్మిక నాయకుడిగా పనిచేయడం వల్ల, అలాగే లోకల్ ప్రజాప్రతినిధులకు ఆయనతో సాన్నిహిత్యం ఉండడం వల్ల, ఆయన సమస్యను అర్థం చేసుకోగలరని భావిం చాం. నాయిని గారు దీన్ని సమర్థవంతంగానే డీల్ చేశారు. బిర్లా లోకల్ యాజమాన్యంతో కాక బాంబే నుంచి బాధ్యులైన వారిని పిలిపించమని కోరడంతో బాంబే నుంచి బాధ్యులు రావడంతో చర్చలు సఫలమై కంపెనీని తెరవడానికి అంగీకరించారు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కార్మికులకు జరిగిన ప్రయోజనం. ప్రాంతీయ స్థాయిలో అధికారానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉం టుంది. అయితే టీఆర్‌ఎస్ పారిశ్రామిక విధానాన్ని పరిశీలిస్తున్న కొద్దీ పెట్టుబడి పట్ల ఉన్న ఆకర్షణ కార్మికుల వైపు లేదని కనిపిస్తున్నది. పారిశ్రామిక హబ్‌లు పెడుతున్నామంటున్నారు. ఇందులో ఫార్మాసిటికల్ హబ్ కూడా ఉందంటున్నారు.

ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫార్మాసిటికల్ కంపెనీలు హైదరాబాద్ చుట్టూ ఉండే గ్రామాలలో చేసిన విధ్వంసాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. బహుళజాతి కంపెనీలు అభివృద్ధి చెందిన దేశాలు నిషేధించిన మందుల ఉత్పత్తిని (వీటిని డర్టీ గూడ్స్ అంటారు) వెనుకబడిన దేశాలకు తరలిస్తున్నారు. ఇవి చేసే హాని అంతా ఇంతాకాదు. ఇవి ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేస్తాయి. పటాన్‌చెరు ప్రాంతంలోని 21గ్రామాల ప్రజల దుర్భర జీవితాలను చూస్తే కాని సమస్య మనకు అర్థం కాదు. పారిశ్రామిక మంత్రి కేటీఆర్‌గారు ఈ ప్రాంత గ్రామ ప్రజలతో మాట్లాడి, ఈ ప్రాంతాన్ని పర్యటించిన తర్వాతే హబ్‌ల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. నిజానికి బం గారు తెలంగాణ (ఈ వర్ణన నాకు ఇష్టంలేదు) నిర్మా ణం కావాలంటే ముందు హైదరాబాద్ చుట్టూ ఉం డే ప్రమాదకరమైన మందుల పరిశ్రమలను నిర్దాక్షిణ్యంగా మూసివేయాలి. దీనికి కావలసిన సుప్రీంకోర్టు నిర్ణయాలు కూడా ఉన్నాయి.

పారిశ్రామిక విధానం కార్మికుల దృక్కోణంలో వారి ప్రయోజనాల దృష్ట్యా చూడాలి. ఈ పరిశ్రమలకు అనుమతిచ్చినా ప్రమాదకరమైన పరిశ్రమలను ఆహ్వానించకూడదు. అలాగే కార్మికులకు భద్రత, గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను కల్పించేలా చూడాలి. దానికితోడు ఎక్కువ ఉద్యోగ అవకాశాల ను కల్పించే పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలామంది యువకులు, విద్యార్థులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కాంట్రాక్టు లెక్చరర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడంలో ఇలాంటి సమస్య, అవకాశాల సమస్య కీలకంగా ఉన్నది.

haragopalహిండాల్కో పరిశ్రమను కార్మికులు కాపాడుకోగలిగారు. మొత్తం ఉద్యమంలో కార్మికులు ఒక్కతాటి మీద నిలబడ్డారు. కార్మిక నాయకులు కూడా నిజాయితీగానే కార్మికుల వైపు నిలబడ్డారు. దీనికితోడు ప్రభుత్వం కూడా సహకరించడంతో ఒక పరిశ్రమ నిలిచింది. కార్మికులు రోడ్డున పడకుండా అయ్యారు. మరోవైపు దేశంలో కార్మికవర్గం నిర్వీ ర్యం కావడం వల్లే, నయా ఆర్థిక విధానాన్ని సామ్రాజ్యవాదం మన దేశం మీద ఇంత దుర్మార్గంగా రుద్ద కలిగింది. దీంట్లో కాంగ్రెస్‌కు బీజేపీకి ఏమాత్రం తేడా లేదు. సామ్రాజ్యవాదం తమకు ఎవరు ఎక్కు వ నమ్మిన బంటుగా ఉంటారో వాళ్లు అధికారంలోకి రావడానికి తమ మీడియాను, ధనాన్ని ఉపయోగిస్తారు. హిండాల్కో అనుభవం చాలా చిన్నది. కానీ దీంట్లో కార్మిక ఉద్యమం నేర్చుకోవలసిన పాఠం కొంత ఉన్నది.

అభివృద్ధిని జీడీపీ, వృద్ధిరేటు కోణం నుంచి కాక మానవ వికాసం కోణం నుంచి చూడాలి. ఆంధ్ర పెట్టుబడిదారులు విధ్వంసక అభివృద్ధిని రుద్దారు అంటే తెలంగాణ నాయకత్వం, తెలంగాణ పారిశ్రామికవేత్తలందరూ మానవీయంగా ఆలోచిస్తారనే నమ్మకమేమీ లేదు. ప్రజా ఉద్యమాలు పాలకుల పారిశ్రామిక విధానాన్ని నిశితంగా పరిశీలించి అడుగడుగునా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉండాలి. అప్పుడే కార్మికుల శ్రేయస్సు పచ్చగా ఉండే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. కార్మికుల హక్కులు, జీవితాలు రక్షించబడతాయి. కార్మికులను మరిచిన పారిశ్రామికాభివృద్ధి ఎంత మాత్రమూ అభివృద్ధి కాదు, విధ్వంసమే.

1551

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల