ప్రజాస్వామ్య లౌకికస్ఫూర్తి ఖాన్‌సాబ్


Thu,August 21, 2014 01:50 AM

తెలంగాణ సుసంపన్నమైన వారసత్వానికి ఒక దీప స్తంభం లాంటివాడు ఎంటీ ఖాన్. సాయుధ పోరాటం నుంచి, నక్సలైట్ ఉద్యమందాకా ఖాన్‌సాబ్ ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు రాజీ లేకుండా నిలబడ్డాడు. మఖ్దూం, షోయబుల్లాఖాన్, బందగీ వారసుడు ఖాన్‌సాబ్.

ఎంటీ ఖాన్ (ఖాన్ సాబ్) మరణవార్త వింటూనే చాలా జ్ఞాపకాలు తరుముతూ వచ్చాయి. జూన్ రెండు రాత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఘంటా చక్రపాణి జయశంకర్‌తో చేసిన ఇంటర్వ్యూలను సంక్షిప్తంగా ప్రచురించిన పుస్తకాన్ని ఖాన్‌సాబ్ ఆవిష్కరించారు. మేము అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకునే లోప లే పుస్తక ఆవిష్కరణ జరిగిపోయింది. కానీ ఖాన్ సాబ్‌తో మాట్లాడడానికి అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ర్టాన్ని చూసే గొప్ప అవకాశం తనకు వచ్చిందని, ఆ కల కన్న చాలామంది తన సహచరులు మన మధ్య లేరని, తనకు చాలా సంతోషంగా ఉంద ని అన్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి.
ఖాన్‌సాబ్‌తో కలిసి పౌరహక్కుల సంఘంలో పనిచేసే అవకాశం, ఆయన అధ్యక్షుడిగా, బాలగోపాల్ సెక్రటరీగా, నేను ఉపాధ్యక్షుడిగా చాలాకాలం కలిసి పనిచేశాం. బాలగోపాల్‌కు ఖాన్‌సాబ్ అంటే చాలా ఇష్టం. ఖాన్‌సాబ్ చాలా సౌమ్యుడు. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు. మొదటి నుంచి ఆయన పౌరహక్కుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకున్నా కన్నబీరాన్ తాను సంస్థ అధ్యక్షుడిగా కొనసాగనని అన్న తర్వాత సంస్థ అధ్యక్ష బాధ్యతను ఎవరు చేపట్టాలనే సమస్య సంస్థను తీవ్రంగా వెంటాడింది.

అప్పటికే సంస్థ ముగ్గురు నాయకులు (బాలగోపాల్, కన్నబీరాన్, నేను) ఒకే సామాజిక నేపథ్యానికి చెందిన వాళ్లమనే వివాదం బయలుదేరింది. అంతకుముందు ఎన్నడూలేని ఈ వివాదం, నూతనంగా ఎదుగుతున్న అస్తిత్వ ఉద్యమ ప్రభావం, అన్ని ప్రజాస్వామ్య సంస్థలు ఎదుర్కున్నట్లుగానే పౌరహక్కుల సంఘం కూడా ఎదుర్కొన్నది. ఈ సవాలుకు ప్రజాస్వామ్యంగా స్పందిం చే బాధ్యత సంస్థ మీద ఉండడంతో అందరికీ అంగీకారం ఉండే అధ్యక్షుడి కోసం అన్వేషణలో పడినప్పుడు సంస్థకు ఆపద్బాంధవుడులా లభించినవాడు ఎంటీ ఖాన్. ఈ ఛాయిస్‌ని అందరూ అంగీకరించా రు. దాంతో ఖాన్‌సాబ్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. అప్పటినుంచి పౌరహక్కుల సంఘం రెండుగా విడిపోయేదాకా అధ్యక్షుడిగా కొనసాగి, విడిపోయిన తర్వాత కూడా ఏపీసీఎల్‌సీతో కొనసాగాడు. కొనసాగినా హెచ్‌ఆర్‌ఎఫ్ అభిమానాన్ని అంతే పెద్ద ఎత్తున నిలుపుకొన్న వ్యక్తి ఖాన్‌సాబ్.

ఖాన్‌సాబ్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం పౌరహక్కుల ఉద్యమంలో హక్కుల దృక్పథాల పట్ల తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇదొక చారిత్రక ప్రజాస్వామ్య భావ సంఘర్షణ. ఇంత ఘర్షణలో ఖాన్ సాబ్ ఎక్కడా తన సంయమనాన్ని కోల్పోలేదు. తీవ్రమైన వాదోపవాదాల్లో పాల్గొంటూ తన అధ్యక్ష గౌరవాన్ని కాపాడుకున్నాడు. అది ఖాన్‌సాబ్‌కు జీవి తం ఇచ్చిన పరిణతి. విప్లవ రాజకీయాల సానుభూతి పరుడిగా రాజ్యహింసను, దౌర్జన్యాన్ని అనుభవించినవాడుగా ఆయన వ్యక్తిత్వంలో కొన్ని అరుదైన పార్శాలు ఉండేవి. జైలు జీవితాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకునేవాడు. శ్రీశ్రీతో తాను గడిపిన ఆత్మీ య అనుభవాలను పంచుకునేవాడు. శ్రీశ్రీ ప్రవర్తనను, ఆయన బలహీనతలను విమర్శలా కాకుం డా హాస్యపూరితంగా చెప్పేవాడు.

ఖాన్ సాబ్ చాలా అధ్యయనం చేసినవాడు. పైకి అలా కనిపించకపోయినా, మనిషిలో ఒక లోతైన మనిషి ఉండేవాడు. మేమిద్దరం ఒకసారి వైజాగ్‌కు ప్రయాణం చేస్తున్నప్పుడు, నేను అప్పుడే దళిత హక్కుల మీద రాసిన ఒక వ్యాసాన్ని ఇస్తూ ఆయన అభిప్రాయాలు చెప్పాలని అడిగితే, వ్యాసాన్ని మొత్తం సీరియస్‌గా చదివి, దళిత హక్కుల చారిత్రక నేపథ్యాన్ని, రామస్వామి నాయకర్, నారాయణగురు, భక్తి ఉద్యమం, భాగ్యరెడ్డి వర్మ ఆలోచనా వెలుగులో రాస్తే వ్యాసానికి మరింత బలం చేకూరేది అని అన్నాడు. తన కుటుంబ జీవితాన్ని కూడా చాలా ఇమ్‌పర్సనల్ గా చెప్పేవాడు. కొన్ని అనుభవాలు చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను.
ఖాన్ సాబ్ ఎన్నడూ సౌకర్యాలను కోరుకోలేదు. పురానాపూల్ దగ్గర హైదరాబాద్‌కు వచ్చే వారికి పౌరహక్కుల చైతన్య స్వాగతం అన్నట్టు ఒక చిన్న మట్టితో కట్టిన గుడిసె లాంటి ఇంట్లో ఉండేవాడు. పేదరికాన్ని చాలా సుఖంగా అనుభవించాడు.

కన్నబీరాన్‌గారు ఖాన్‌సాబ్ గురించి చాలా మదనపడేవాడు. ఆయన ఆ పాత ఇంటి స్థలాన్ని కొనడానికి ఒక బ్యాంకుతో మాట్లాడి కొంత స్థలంలో తానుం టూ కొంత స్థలాన్ని బ్యాంకుకు ఇస్తే ఆయన జీవి తం సాఫీగా సాగుతుందని భావించేవాడు. ఖాన్‌సాబ్‌కు ఆరోగ్యం బాగా లేక హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆయనను కలవడానికి వెళితే హాస్పటల్ ఖర్చులు ఎలా అనే సమస్య ఎదుర్కొంటున్నాడు. ఆ తర్వాత ఒకసారి ఇంటికి వెళితే తాను హాస్పిటల్ నుంచి డిస్‌చార్జ్ అవుతున్న రోజు ఎవరో అపరిచిత వ్యక్తి సహా యం చేశాడని, అది విప్లవ పార్టీ సహాయమే కావ చ్చు అని భోరున ఏడ్చాడు. ఆ ఏడ్పులో ఒక సంతో షం, ఒక కృతజ్ఞత, ఒక అరుదైన అనుభవం కనిపించాయి.

haraఖాన్‌సాబ్ ముస్లిం మత రాజకీయాల పట్ల చాలా విమర్శనాత్మకంగా ఉండేవాడు. ఓల్డ్ సిటీ రాజకీయాలు ఆయనకు నచ్చేవి కావు. అన్ని మతాల పట్ల ఆయనకు ఒక ధిక్కార భావమే ఉండేది. ముస్లిం సోదరులు లౌకికవాదులను గౌరవించాలని, అంతిమంగా లౌకికత్వమే మైనారిటీలకు రక్షణ కవచమని మనస్ఫూర్తిగా నమ్మేవాడు. మార్క్స్ అన్నట్టు మత స్వేచ్ఛ కాదు మతం నుంచి స్వేచ్ఛ అనుభవించిన అతి అరుదైన వ్యక్తి ఖాన్‌సాబ్.

తెలంగాణ సుసంపన్నమైన వారసత్వానికి ఒక దీప స్తంభం లాంటివాడు ఆయన. సాయుధ పోరా టం నుంచి, నక్సలైట్ ఉద్యమం దాకా ఖాన్‌సాబ్ ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు రాజీ లేకుండా నిలబడ్డాడు. మఖ్దూం, షోయబుల్లాఖాన్, బందగీ వారసుడు ఖాన్‌సాబ్. తన నినాదం ఒక జీవితం ద్వారా, తన పోరాట పటిమ ద్వారా, మానవీయ సమాజం కోసం సమాజం పడుతున్న పురిటినొప్పులు, ఆ నొప్పిని సంతోషంగా స్వీకరించినవాడు ఖాన్‌సాబ్. దేశం, మతోన్మాదం చేతుల్లోకి పోతున్న తరుణంలో కనీసం తెలంగాణ తనను తాను రక్షించుకోవడానికి ఒక సజీవ లౌకిక సంస్కృతికి ప్రతిబింబం అయిన ఖాన్‌సాబ్‌ను చిరకాలం గుర్తుం చుకుంటుంది. ఆయన మార్గంలో ప్రయాణిస్తుంది. ఖాన్ కలలను నిజం చేస్తుంది.

1215

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల