యుద్ధ ప్రమాద ఘంటికలు


Wed,August 13, 2014 11:25 PM

భారత ప్రధాని గత రెండు నెలల్లోనే కశ్మీర్‌కు రెండు పర్యాయాలు వెళ్లడమేకాక, సైన్యాన్ని ఉద్దేశించి ప్ర సంగిస్తూ భారత్‌పై పాకిస్థాన్ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నదని, దేశ సరిహద్దులను అతిక్రమిస్తున్నదనీ, భారతదేశంలో టెర్రరిస్టు చర్యలను ప్రోత్సహిస్తున్నదని అన్నాడు.అధికారంలోకి రాగానే దేశంలో పెరుగుతున్న ధరలు, అవినీతి, నల్లధనం లాంటి సమస్యలను పక్కనపెట్టి, కశ్మీర్ సమస్యను అంత తీవ్రమైన సమస్యగా పరిగణించడం చాలా అనుమానాలకు, భయాలకు దారి తీస్తున్నది.

పాకిస్థాన్ ఇస్లామి క్ రాజ్యంగా తనను తాను ప్రకటించుకొన్నది. దేశ విభజన జరిగినప్పటి నుంచి, రెండుదేశాల మధ్య సామరస్య సంబంధాలు లేవు. దీనివెనక చారిత్రక కారణాలతో పాటు అమెరికన్ సామ్రాజ్యవాద హస్తాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నాయి. చిన్న దేశం కావడంవల్ల తమ రక్షణ కోసం సంపూర్ణంగా అమెరికా మీద ఆధారపడ్డది. ఇది పాకిస్థానీ పాలకులు అవసరం కోసం చేసినా, అదొక పెద్ద చారిత్రక తప్పిదం.

దానికి పాకిస్థాన్ చాలా మూల్యాన్ని చెల్లించిం ది. ఆ అనుభవం మనకు తెలిసి కూడా గత రెండు మూడు దశాబ్దాలుగా మన పాలకులు అదే పొరపాటును చేస్తున్నారు. దీనికి మనం ఏం మూల్యం చెల్లించవలసిందో తెలియదు కానీ, ఇప్పు డు మాత్రం వాడు కొనమన్న ఆయుధాలనన్నింటిని కొంటున్నాం. అవి నాణ్యమైనవా కావా అని అడిగే సాహసం కూడా మనం చేయడంలేదు. 2008 నుంచి నేటి వరకు 10 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే ఆయుధాలను కొన్నాం. డాలర్లను రూపాయిలలోకి మారిస్తే పాఠకుడిని గుండెపోటు రావచ్చు. ఈ ధనంతో గ్రామీణ ప్రాం తాల పేద ప్రజల జీవిత రూపురేఖల్ని మార్చగలిగే వాళ్లం. అంతర్గతంగా దేశం చాలా బలపడేది. ఈ సురోమని ప్రజలు ఉంటే దేశమే గతి బాగుపడునో య్ అని గుజరాడ శతాబ్దం క్రితమే హెచ్చరించాడు.

చిదంబరం, మన్మోహన్‌సింగ్ ఎంత ఊడిగం చేసినా అమెరికా సంతృప్తి పడలేదు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ల మోదం కోసమైనా రక్షణ మంత్రిత్వశాఖను, ఆర్థికమంత్రిత్వ శాఖను ఎన్నికల్లో ఓడిపోయిన అరుణ్‌జైట్లీకి అప్పజెప్పారు. ఈ నియామకంలో అమెరికా జోక్యం ఎంత ఉన్నదో మనకు తెలియదు. కానీ ఎకనామిక్ టైమ్స్ మాత్రం ఈ రెం డు మంత్రిత్వ శాఖలు ఒకరికే అప్పజెప్పడానికి అమెరికాతో ఆయుధ బేరసారాలకే అని, రక్షణశాఖ ఆయుధాలకు ఆర్డర్ ఇస్తూనే ఆర్థికశాఖ డబ్బులు రిలీజ్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యా ఖ్యానించింది.

కొత్త ప్రభుత్వానికి ఇంత యుద్ధ ప్రాతిపదికన ఆయుధాలు కొనవలసిన అగత్యం ఏం ఏర్పడిందో అర్థం కావడం లేదు. నిజానికి మనదేశం అణ్వాయుధాలు తయారు చేయవద్దని మనందరం ఉద్యమా లు చేసినప్పుడు, ఒక్కసారి అణ్వాయుధాలను కలిగి ఉంటే రక్షణ మీద ఖర్చు తగ్గిపోతుందని పాలకులు వాదించారు. మనం అణ్వాయుధం తయారు చేస్తూ నే, అమెరికా సహాయంతో పాకిస్థాన్ కూడా అణ్వాయుధం తయారు చేసుకుంది. ఇద్దరి దగ్గర అణ్వాయుధాలున్నవి కనుక రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అణు బాంబులను ప్రయోగించే సాహసం చేయకపోవచ్చు అని మళ్లీ ఆయుధాలు కొనడం ప్రారంభమయ్యింది.

అమెరికా ఆర్థికవ్యవస్థ వాళ్ల అంతర్జాతీయ వ్యాపారం చాలా వరకు ఆయుధాల ఎగుమతి మీద ఆధారపడి ఉంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలకు యుద్ధం మీద ఆసక్తి ఉన్నా లేకున్నా అమెరికా అవసరం కోసం, వాళ్ల ఒత్తి డి మేరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రపంచ దేశాలకు అవగాహన అవుతున్న కొద్దీ అమెరికానే తన సైన్యాలను ప్రత్యక్షంగా పంపడం ప్రారంభించింది. అరబ్‌దేశాల మధ్య యుద్ధాలు దీనికి సజీ వ సాక్ష్యాలు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన తర్వాత,అమెరికా ప్రతినిధి ఒక మీడియా ఇంటర్వ్యూలో ఇక తర్వాత తాము పరిష్కరించవలసిన అంతర్జాతీయ సమస్య కశ్మీర్ అని అన్నప్పుడు నేను షాక్‌కు గురయ్యాను.
ఈ వచ్చే ఐదేళ్లలో యుద్ధం వచ్చే దిశగానే సూచికలన్నీ కనిపిస్తున్నాయి.

గత రెండు నెలలుగా దేశ సరిహద్దులను పాకిస్థాన్ సైన్యాలు అతిక్రమిస్తున్నాయని, మనదేశ సైనికుల నరికిన తలలు పాకిస్థాన్ సైన్యం దగ్గర ఉన్నాయని, తలలు పాకిస్థాన్ సైన్యం దగ్గర ఉన్నాయని, ఆ తలను దేశానికి తీసుకరాండి అని ఒక సభలో కొందరు నినాదాలు ఇచ్చినట్టుగా పత్రిక ల్లో వచ్చింది. ప్రధాని దేశ సరిహద్దులో ఉన్నప్పుడు ఇక మన జాతీయ ఇంగ్లిష్ చానళ్ల ఉత్సాహం చెప్పనలవి కాదు. నిన్న రాత్రి ప్రైం టైంలో పాకిస్థాన్ దురాగతాల గురించి ఒక చానల్‌లో ముగ్గురు దేశభక్తులు ఒకటే అరుపులు.

వాళ్లేమంటున్నారో అర్థం కాలేదు. ఈ చర్చలో పాకిస్థాన్ నుంచి ఒక సైనికాధికారి కూడా పాల్గొన్నాడు.(ఎందుకో ఆయన సతీమణి కూడా ఆయన పక్కకు కార్యక్రమం జరిగే వరకు కూర్చొని ఉంది) ఆ సైనికాధికారి భారత దేశ సైన్యం తమ సరిహద్దులను 31 పర్యాయాలు అతిక్రమించిందని, రా (RAW) తమ దేశంలో అల్లకల్లోలం సృష్టించడాని కి ప్రయత్నిస్తున్నదని అంటూనే, యాంకర్‌తో పాటు మన ముగ్గురు మేధావులు ఆయనను ఒక్క నిమిషం కూడా మాట్లాడనీయలేదు. ఆయన మాట్లాడినంత సేపూ అరుస్తూనే ఉన్నారు. అయితే ఎందుకో చివరిదాకా ఆ సైనికాధికారి ఎక్కడా నిగ్రహం కోల్పోలేదు. ఒక మీడియా చానల్ చర్చ జరిపినప్పుడు పక్కదేశం సైనికాధికారి ఏమంటున్నాడో పూర్తిగా వినే కల్చర్ కావాలి. లేకపోతే చర్చకు వాళ్లను పిలవడమెందుకు. సైనికాధికారి తమ దేశంకోసం అబద్ధాలే మాట్లాడవ చ్చు. అది ఆ దేశ ప్రజల దృష్టిలో దేశభక్తే అవుతుంది. సత్యాన్వేషణకు దేశభక్తికి మధ్య అవరోధాలుంటా యి, అంతరాలుంటాయి.

ఏ దేశం ఏ తప్పు చేసినా ముఖ్యంగా యుద్ధం విషయంలో ఆ దేశ ప్రజలు దాన్ని సంపూర్ణంగా సమర్థించడం దేశభక్తిగా నమ్మినంత కాలం, అది పాకిస్థానే కావచ్చు,ఇజ్రాయిల్ కావచ్చు,అమెరికానే కావచ్చు. ప్రజలు తమ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ ఏ దేశంలోనూ లేదు. అందుకే పాలకులు ఎంత అధర్మ యుద్ధం చేసినా దేశ ప్రజల మద్దతును పొందగలుగుతున్నా రు. తమ అధికారాన్ని కొనసాగించగలుగుతున్నారు.

యుద్ధ సమస్యకు వస్తే మనదేశం మూడు నాలు గు యుద్ధాలు చూసింది. కొన్నింటిలో దెబ్బతిన్నాం, కొన్నింటిలో గెలిచాం.కానీ యుద్ధంలో ఎవ రు గెలిచినా ఎవరు ఓడినా అంతిమంగా నష్టపోయే ది సామాన్య ప్రజలు. ప్రతి యుద్ధంలో ఇరువైపులా ప్రాణ నష్టం ఉంటుంది. యుద్ధాల వల్ల బాగుపడ్డ దేశాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. ఇంత చారిత్రక అనుభవం ఉన్నా,మానవాళి ఏ గుణపాఠం నేర్చుకోకపోవడం,పాలకుల జ్ఞానార్జనశక్తి మీదనే నమ్మకం పోతున్నది.

haragopalప్రపంచమంతా (ఒక్కయూరప్ తప్పించి)యుద్ధోన్మాదం నుంచి ప్రయోగిస్తున్నది. పాలకులకు యుద్ధా లు కావాలి. ప్రజలకు శాంతి కావాలి. శాంతికాముకులైన ప్రజలు తమ పాలకుల స్వభావాన్ని మార్చలేకపోతున్నారు. యుద్ధం లేని ప్రపంచ స్వప్నం మనం వదలకూడదు. పాకిస్థానీ ప్రజలు, భారత ప్రజలు తమ తమ దేశ పాలకుల మీద ఒత్తిడి పెట్టి,అమెరికా వాడి పన్నాగాలను బహిర్గతం చేసి, యుద్ధం నుంచి మనని మనం కాపాడుకోవాలి. నిజానికి పాకిస్థాన్ అంతర్గత టెర్రరిజంతో కోలుకోలేని పరిస్థితిలో ఉన్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత యువత కొన్ని ఆశయాలకు, ఆదర్శాలకు నిలబడతారని ఆశించినా, ఆ సూచికలు ఏం కనిపించడంలేదు. కానీ ప్రపంచం లో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తెలంగాణ స్పందిస్తూనే ఉంది. గుజరాత్ మారణకాండ తర్వాత తెలంగాణ పెట్టిన కన్నీళ్లలోని మానవత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోగలగాలి.ఈ ప్రయత్నంలో భాగంగా సెప్టెం బర్ 13న పాలమూరు అధ్యయన వేదిక యుద్ధ వ్యతిరేక కవిసమ్మేళనం జరపనున్నది. ఇలాంటి ప్రయత్నం పది జిల్లాల్లో జరపాలి. యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమం రాష్ట్రమంతటా, దేశమంతటా జరగాలి. అలాగే పాకిస్థాన్ ప్రజలు కూడా యుద్ధాన్ని వ్యతిరేకించాలి. రెండు దేశాల ప్రధానమంత్రులు తమ మధ్య విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకునే దిశగా ప్రజలు ఒత్తిడి పెట్టాలి.

1546

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల