దళిత స్కాలర్ల ప్రతిభ


Thu,July 31, 2014 01:36 AM

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు తగినన్ని వనరులు కల్పించి, వాటి నాణ్యతను పెంచితే తెలంగాణ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలరు. నేను ఉదహరించిన విద్యార్థులందరు ప్రభుత్వ స్కూళ్లల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవారే. ఇంగ్లిష్ భాష అదేం బ్రహ్మపదార్థం కాదు. ఆలోచన, అవగాహన, స్పందన, సమాజం పట్ల సమగ్ర అవగాహన, ప్రజల మీద ప్రేమ ఉన్న విద్యార్థులకు ఆకాశమే హద్దు.

గత వారం కాలమ్‌కు కొనసాగింపుగా మరికొందరు స్కాలర్ల ప్రతిభ గురించి తెలంగాణ విద్యారంగం తెలుసుకోవలసిన అవసరముంది. ముఖ్యంగా కాంట్రాక్టు లెక్చరర్లకు, ఫ్రెష్ స్కాలర్స్‌కు అవకాశాల పంపిణీ విషయంలో స్పర్థ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్లు, కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను ఉన్నపళంగా రెగ్యులరైజ్ చేస్తే ఎక్కువ విద్యా అర్హతలున్న తమ సంగతేమిటని అడుగుతున్నారు. వాళ్ల శిబిరానికి వెళ్లినప్పుడు కొంత ఆవేశం లో ఉన్నారు. అది కొంత సహజమైనదే. ప్రశ్న అవకాశాలకు సంబంధించింది. ఆ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు వాటిని లోతుగా చర్చించడానికి అది సందర్భం కా దని నాకు అర్థమయ్యింది. తెలంగాణ యూనివర్సిటీలో పరిశోధన చేసిన స్కాలర్లు తమ తమ విశ్వవిద్యాలయాల్లో తమ తమ ప్రాంతాల్లో ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు.

కొందరికి ఏళ్ల తరబడి అవకా శం రాక వయసు కూడా దాటిపోతున్నది. పేద వర్గా ల నుంచి ఎక్కువమంది అర్హతలు సంపాదిస్తున్న కాలంలోనే ప్రభుత్వ రంగం కుంచించుకుపోవడం, గత ఇరవై ఏళ్లుగా ప్రపంచబ్యాంకు ఒత్తిడి మేరకు కాలేజీల్లో, విశ్వవిద్యాలయాలలో నియామకాలను ఆపేయడం వల్ల అవకాశాలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీ సర్వీస్ కమిషన్‌ను కూడా రద్దు చేసి ప్రపంచబ్యాంకుతో బేష్ అనిపించుకున్నారు. తెలుగు మాట్లాడే రెండు రాష్ర్టాలలో, అదే మాదిరిగా ఒకరకంగా దేశవ్యాప్తంగా ఒక తరం మేధావి వర్గా న్ని కోల్పోయింది. ఇది తీర్చలేని లోటు. ఈ నేపథ్యంలో తక్కువ అవకాశాలకు ఎక్కువమంది అర్హతకలిగిన వాళ్లుండడం వల్ల సమస్య తీవ్రతరమైంది. అదే కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ అంశం.

ఇది ఒక సమస్యగా ముందుకు వచ్చింది. ఉస్మానియాలో ధర్నాను ఉద్దేశించి నేను చేసిన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల నాణ్యతను, మన పిల్లలను జాతీయస్థాయిలో పోటీ లో పాల్గొనేలా తయారుచేస్తే, అవకాశాల పరిధి పెరుగుతుంది. వాళ్లు మేధోపరంగా కూడా చాలా వికాసం చెందే మార్గాలు ఏర్పడతాయి. దానికి ఉదాహరణగానే నాతో పనిచేసిన దళిత, వెనుకబడిన తరగతుల స్కాలర్లకు ఎలా అవకాశాలొచ్చా యో వివరించాను.

సౌజన్య చాలా పేద కుటుంబానికి చెందిన కర్నాటక అమ్మాయి. ఆమె ఎస్.ఆర్.శంకరన్ గారి నైతిక, అధికారిక ప్రవృత్తి మీద పరిశోధన చేస్తున్నది. ఆమె ఎంఫిల్ కూడా శంకరన్ గారి మీదే. నా దగ్గర పనిచేసిన వాళ్లలో రీసెర్చ్ పట్ల అంకితభావంతో పరిశోధన చేసిన ఈ అమ్మాయి ఒక అరుదైన స్కాలర్. తాను శంకరన్ గారి నిజాయితీతో పోటీపడుతున్న ది. వ్యక్తిగత జీవితంలో అత్యున్నత మానవ విలువలను ఆచరిస్తున్నది. అలాగే తన రీసెర్చ్ కోసం త్రిపురలో మూడు నెలలు శంకరన్ గారు ఛీప్ సెక్రటరీగా పనిచేసినప్పటి డైరీ సహాయంతో ఆయన వెళ్లిన గిరిజన ప్రాంతాలకు తాను కూడా స్వయనా వెళ్లి వాళ్లందరి జ్ఞాపకాలను, అనుభవాలను సేకరించింది. అలాగే నెల్లూరులో ఆయన కలెక్టర్‌గా తీసుకున్న చర్యల విశ్లేషణే కాక, ఇప్పటికీ చాలా గ్రామాలలో ప్రజల సమష్టి జ్ఞాపకాలను సేకరించింది.

అకస్మాత్తుగా కుటుంబసమస్యలు పెరగడంతో తాను ఉద్యోగ్యంలో చేరవలసి వచ్చింది. అప్పుడే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఐప్లె చేస్తే , పీహెచ్‌డీ పూర్తికాక ముందే పర్మినెం ట్ ఉద్యోగం వచ్చింది. ఆమె చేస్తున్న పరిశోధనను సెలక్షన్ కమిటీ చాలా హర్షించింది. తన ఉద్యోగాన్ని చాలా కమిట్‌మెంట్‌తో చేయడం వల్ల పీహెచ్‌డీ సబ్‌మిషన్ ఆలస్యం అయ్యింది. థిసిస్ సబ్మిట్ చెయ్యమంటే శంకరన్ గారు నిర్వహించిన పాత్రకు అన్యాయం చేయకూడదని వాదిస్తుంది.

ఉద్యోగం లో చేరి కుటుంబానికి బాసటగా నిలిచింది. అలాగే జగన్నాథ్ మెదక్ జిల్లాకు చెందిన ఒక అతి పేద కుటుంబానికి చెందినవాడు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో అతి చిన్న ఉద్యోగం చేస్తున్న అక్క సహాయంతో ఉన్నత చదువులకు వచ్చాడు. నాకు ఎంఏ, ఎంఫిల్‌లో విద్యార్థి. తర్వాత పీహెచ్‌డీ తెలంగాణ ఉద్యమం మీద చేశాడు. జయశంకర్ గారు జగన్నాథ్‌కు గంటల తరబడి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన పరిశోధనాంశం భౌగోళిక తెలంగాణా లేక ప్రజాస్వామ్య తెలంగాణాఅనేది. థిసిస్‌లో ప్రజాస్వామ్య సిద్ధాంత పునాదుల చర్చ ఉంది. దేశంలో ఈ అం శం మీద వచ్చిన పరిశోధనా గ్రంథాల సమగ్ర సమీ క్ష ఉంది. ఇప్పుడు అది పుస్తక రూపంలో ఉన్నది. జగన్నాథ్ పరిశోధన చేస్తున్న క్రమంలోనే పాలమూ రు యూనివర్సిటీలో అవకాశమొచ్చింది. అధ్యాపకుడిగా విద్యార్థులకు చాలా సన్నిహితంగా పోయా డు. అక్కడ ఉద్యోగం వదిలి పీహెచ్‌డీ పూర్తి చేసి, పట్టారాక ముందే ఢిల్లీ యూనివర్సిటీ ఇంటర్వ్యూ లో సెలక్షన్ లిస్ట్‌లో వచ్చాడు. పీహెచ్‌డీ లేకపోవడం వల్ల సెలక్ట్ కాలేదు. కానీ పీహెచ్‌డీ సబ్మిట్ చేస్తూనే గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓపెన్ క్యాటగిరీలో సెలక్ట్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ చాలా పాపులర్ టీచర్.

జగన్నాథ్ నా దగ్గర పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు వాళ్ల గ్రామానికి నన్ను తీసుకెళ్లాడు. సాయంత్రం నేను వనమాల గారు వెళితే మమ్మల్ని వందలమం ది గ్రామస్తులు ట్రాక్టర్‌లో ఊరేగింపుగా తీసుకెళ్లి రాత్రి ఒకటి దాకా పెద్ద సభ చేసి జగన్నాథ్‌కు గురు వు అని సన్మానించారు. గ్రామంలో ఆయనకుండే అభిమానులను గుడ్‌విల్‌ను చూస్తే ఆశ్చర్యం వేసిం ది. ఒక విద్యార్థి నాకు చేసిన సన్మానం నాకుండే తీపి జ్ఞాపకాల్లో ఒకటి.

తెలంగాణ స్కాలర్లకు చంద్రయ్య గురించి తప్పక తెలపాలి. ఈ విద్యార్థి కూడా పాలమూరు జిల్లాలోని అతి పేద కుటుంబానికి చెందినవాడు. తండ్రి ఆరోగ్యం ఏ మాత్రం బాగుండేది కాదు. ఆ పరిస్థితిలోనే హైదరాబాద్‌లోని పాలమూరు వలస కూలీల మీద ఎంఫిల్ చేశాడు. ఎందుకో దాన్ని ఆయన ఎం త శ్రద్ధతో చేయాలో అంత శ్రద్ధతో చేయలేదనిపిం చి, ఆ మాటే ఆయనతో అన్నాను. తర్వాత పీహెచ్‌డీకి నా దగ్గరే చేరాడు. వర్గం, కులం మీద చాలా లోతైన పరిశీలన చేస్తున్నాడు. సైద్ధాంతికపరమైన గ్రంథాలను చాలా చదివాడు. ఇప్పుడు ఏ స్థాయి చర్చలోనైనా పాల్గొనగలడు. ఆయన మేధోవికాసం అనుకోనంత వేగంగా జరిగింది. పీహెచ్‌డీ పూర్తి కాకముందే అలహాబాద్ యూనివర్సిటీలోని ఒక పరిశోధనా సంస్థలో పర్మినెంట్ పోస్ట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యాడు. సెలక్షన్ కమిటీలో కూర్చు న్న ఒక ఎక్స్‌పర్ట్ ఫోన్ చేసి చాలా ప్రతిభావంతమైన స్కాలర్‌ను అందించారు అని నన్ను అభినందించాడు.

అలాగే అరుణ్‌కుమార్ మాలిక్ కూడా చాలా పేద కుటుంబానికి చెందిన విద్యార్థి. ఒడిశాలో బాలాసోర్ జిల్లాకు చెందినవాడు. ఒడిశాలో ప్రజారోగ్యం మీద పరిశోధన చేశాడు. ఆయనకు జేఆర్‌ఎస్ వస్తే పొదుపుగా ఖర్చుపెట్టి, ఫెలోషిప్‌లోని సేవింగ్స్‌తో గ్రామంలో రెండు ఎకరాల భూమిని కొని తల్లిదండ్రులకు ఇచ్చాడు. పరిశోధన చేస్తున్న క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బతినడం చాలా ఆందోళన కలిగించింది. తల్లిదండ్రుల దగ్గర రెండు మూడు నెలలు ఉండి స్వస్థత చేకూరిన తర్వాత తిరిగి వచ్చి పీహెచ్‌డీ పూర్తి చేశాడు. పూర్తి చేస్తూనే ఆస్కీలో (ASCI) ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత గుజరాత్ లా యూనివర్సిటీలో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. నేను వాళ్ల గ్రామానికి రెండుసార్లు వెళ్లాను.

మొదట ఆయన తల్లిదండ్రులను చూడడానికి, రెండవసారి ఆయన వివాహానికి. మొదట వెళ్లినప్పుడు వాళ్లది పూరి గుడిసె. నేను వస్తున్నానని రెండు కుర్చీలు కొన్నారు. రెండవసారి వెళ్లేటప్పటికి తన లెక్చరర్ జీతంనుంచి ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు.

చంద్రయ్య, జగన్నాథ్, అరుణ్‌కుమార్ మల్లిక్, సుకుమార్ అందరూ ఇందిర మాదిరిగానే ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేస్తున్నారు. నిజానికి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో 26 పోస్టులు నింపవలసి ఉంది. ఢిల్లీ ప్రభు త్వం స్థాపించిన అంబేద్కర్ సామాజికశాస్ర్తాల విశ్వవిద్యాలయానికి అర్హత గలవారు ఐప్లె చేయడం లేద ని, కేవలం జేఎన్‌యూ, హెచ్‌సీయూ స్కాలర్లే ఐప్లె చేస్తున్నారని వీసీ నాతో అన్నారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు తగినన్ని వనరులు కల్పించి, వాటి నాణ్యతను పెంచితే తెలంగాణ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలరు. నేను ఉదహరించిన విద్యార్థులందరు ప్రభుత్వ స్కూళ్లల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవారే. ఇంగ్లిష్ భాష అదేం బ్రహ్మపదార్థం కాదు. ఆలోచన, అవగాహన, స్పందన, సమాజం పట్ల సమగ్ర అవగాహన, ప్రజల మీద ప్రేమ ఉన్న విద్యార్థులకు ఆకాశమే హద్దు. వచ్చే వారం వెనుకబడిన తరగతుల నుంచి పీహెచ్‌డీ చేసిన స్కాలర్ల గురించి రాయాలనుకుంటున్నాను.

1647

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల