పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుడు


Thu,July 17, 2014 01:25 AM

తెలంగాణ పునర్నిర్మాణం మీద అన్ని వర్గాలు ఏదో ఒక స్థాయిలో విస్తృతంగా చర్చిస్తున్నాయి. ఈ కృషి లో అందరికి పాత్ర ఉన్నా ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. సమాజ మార్పు ఈ వర్గపు పాత్ర లేకుండా దాదాపు అసాధ్యం. తెలంగాణ ఉపాధ్యాయులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్రను చరిత్ర తప్పక గుర్తు పెట్టుకుంటుంది. ఇందులో స్కూల్ ఉపాధ్యాయుడిగా ప్రారంభమై, అంచెలంచెలుగా ఎదిగి విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ బాధ్యతలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి గా మారి జాతిపిత అని పిలిచే స్థాయికి ఎదిగిన జయశంకర్ ఒక ఉపాధ్యాయుడే. ఆయన ఉపాధ్యాయ లోకానికి రోల్‌మాడల్ కావాలి. జయశంకర్ గారు కేవలం విద్యార్థులకే ఉపాధ్యాయుడు కాదు. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు అలసట లేకుండా పాఠా లు చెప్పిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయులు తమ చుట్టు ఉండే సమాజాన్ని పట్టించుకోవాలని, ప్రజల సమస్యలకు స్పందించాలని, అది ఉపాధ్యాయ వృత్తి లో భాగమని ఆయన బలంగా విశ్వసించేవాడు.

అన్ని రాజకీయ పార్టీలు ఆయనని గౌరవించాయి. ఆ గౌరవం ఉపాధ్యాయ వృత్తికి గౌరవంగా తెలంగాణ గుర్తించాలి. గుర్తుంచుకోవాలి.తెలంగాణ ఉద్యమంలో కోదండరాం నిర్వహించి న పాత్ర కూడా సాధారణమైందేమీకాదు. రాజకీయ పార్టీల జేఏసీకి ఆయన చైర్మన్ కావడం ఉపాధ్యాయ వర్గానికి ఒక అరుదైన గౌరవమే. కోదండరాం తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోగలడనే విశ్వా సం తనకుందని జయశంకర్‌సార్ నాతో పలు సంద ర్భాల్లో చెప్పాడు. అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఘంటాచక్రపాణి, కాశీం, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉద్యమంలో అరుదైన పాత్ర నిర్వహించారు. ఇలా ఉద్యమంలో నిలబడి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఉపాధ్యాయ వృత్తి ప్రతిష్టను పెంచారు. అన్నింటికి మించి ప్రజా ఉద్యమాల్లో ఉపాధ్యాయులు పాల్గొనవచ్చని, పాల్గొనాలనే ఒక ప్రజాస్వామ్య విలువను అందించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముందు కూడా చాలామంది తెలంగాణ ఉపాధ్యాయులు ప్రజలవైపు నిలబడ్డారు. ప్రజా సమస్యలకు స్పందించా రు. ఇందులో తప్పక పేర్కొనవలసిన ఉపాధ్యాయు డు వీవీ.ఆయన ప్రభావం తనమీద ఉందని స్వయా న జయశంకర్ గారే ఘంటా చక్రపాణి చేసిన ఇంటర్వ్యూలో అన్నాడు.

రాజకీయ పరిణామంలో కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. ఒకవైపు విద్యారంగానికి, ఉపాధ్యాయ లోకానికి ఒక గొప్ప అనుభవంతోపాటు, తెలంగాణ ఉపాధ్యాయలోకానికి మరచిపోలేని చేదు అనుభవా లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్,నల్గొండ జిల్లా టీచర్లు ఎదుర్కొన్న అణచివేత గుర్తు చేసుకుంటే ఆ రోజులు మళ్ళీ తెలంగాణలో ఎన్నడూ పునరావృత్తం కాకూడదని తెలంగాణ సమాజాన్ని హెచ్చరించవలసి ఉంది. వరంగల్‌లో 60మంది ఉపాధ్యాయులు రోజూ పోలీ సు స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని నిబంధన పెట్టారు. ఎవరైనా మరుసటి రోజు రాలేదంటే శవమై తేలుతాడేమోనన్నంత భయం. మహబూబ్‌నగర్‌లో చందాలు వసూలు చేశారని విద్యార్థుల చేత ఉపాధ్యాయులను కొట్టించారు. కనకాచారి, మునెప్ప ప్రాణా లే తీశారు. కరీంనగర్‌లో ఉపాధ్యాయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరిగారు. ఈ అణచివేత కు తట్టుకొని నిలబడినారు కాబట్టే తెలంగాణ ఉద్యమానికి ఉపాధ్యాయులు వన్నె తెచ్చారు. అందరి పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది.

నూతన రాష్ట్ర నిర్మాణంలో ఉపాధ్యాయులు మరింత కీలకమైన పాత్ర నిర్వహించవలసి ఉన్నది. ప్రతి ప్రభుత్వపాఠశాల ఒక సజీవమైన విద్యాకేంద్రంగా ఎదగాలి. మన పాలకులు పనికట్టుకొని ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. సంపన్నులు, పలుకుబడి గల వాళ్లు, అగ్రకులాల విద్యార్థులతోపాటు పేద విద్యార్థులు కలిసి చదువుకుంటున్నప్పు డు ఈ స్కూళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేశాయి. ప్రైవేట్ స్కూళ్ళు,ఇంగ్లిషు మీడియం స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు రావడంతో సంపన్నుల పిల్లలు ప్రభు త్వ స్కూళ్ళకు రావడం మానేసిన తర్వాత ఈ స్కూళ్ళు కేవలం పేద విద్యార్థుల స్కూళ్ళుగా మారిపోయాయి. గ్రామంలో పలుకుబడి గల వాళ్ళకు స్కూళ్ల మీద శ్రద్ధ పోయింది. క్రమ క్రమంగా కొంతమంది ఉపాధ్యాలు కూడా మారుతూ వచ్చారు. పేద పిల్లల స్కూళ్ళుగా మారిన తర్వాత నిజానికి ఉపాధ్యాయుడి సామాజిక బాధ్యత పెరిగింది. పేదవాళ్ళంటే మనకు ఒక కన్‌సర్న్ కావాలి. సమాజం మారడమ న్నా, తెలంగాణ పునర్నిర్మాణమన్నా పేదల జీవితా లు మారడమే. పేద పిల్లలు ప్రతిభావంతులుగా సం పూర్ణమైన మనుషులుగా మారడమే.

పేద వర్గాల నుంచి వచ్చే పిల్లలకు సమాజం పట్ల అవగాహన చాలా లోతుగా ఉంటుంది. వాళ్ళకు ఆక లి తెలుసు. వివక్ష తెలుసు. అధిపత్య రూపాలు తెలు సు. రాజ్య అధికారపు క్రూరత్వం తెలుసు. అ అనుభవం వలన సామాజిక చలన సూత్రాలు వాళ్ళకు బాగా అర్థమౌతాయి. అందుకే చెప్పే పద్ధతిలో చదు వు చెప్పగలిగితే ఈ పిల్లలు జీవితంలో చాలా రాణిస్తారు. ఉపాధ్యాయుడిగా నేను పేద వర్గాల, చాలా వరకు దళిత అమ్మాయిలు, అబ్బాయిలకు పీహెచ్‌డీ గ్రైడ్‌గా ఉన్నాను. పీహెచ్‌డీ చేసిన మా విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పనిచేస్తున్నారు. కొందరు ఓపెన్ కేటగిరీలో లెక్చరర్ పోస్టులకు సెలెక్ట్ అయ్యారు. అందుకే నా అనుభవంతో చెప్పుతున్న ది.. దళిత పేద వర్గాల పిల్లల ప్రతిభ ఏ వర్గానికి తీసిపోదు.తెలంగాణ ఉపాధ్యాయులు ఒక నూతన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములుగా భావించి తమ బాధ్యతలను నిర్వహించి పేద పిల్లలకు ఆత్మగౌరవా న్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి.
విద్యారంగం ఒక స్వపరిపాలనా రంగం. ఈ ఒక్క రంగంలోనే క్లాసు రూంలో ఉపాధ్యాయుడు సర్వ స్వతంత్రుడు. చదువు చెప్పడంలోని అనుభూతి అనిర్వచనీయమైంది. ఉపాధ్యాయ వృత్తిలోని ఈ అపూ ర్వ అనుభవాన్ని, అవకాశాన్ని వదిలి పెడితే, అది ఉపాధ్యాయుల జీవిత విషాదం. అలాంటి వాళ్లు ఉపాధ్యాయ వృత్తిలోకి రాకపోవడం మంచిది.

ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడాలంటే ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వం, సమాజం కూడా తమ వంతు బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. మొదటగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళను మూసివేసే దిశగా చర్యలు తీసుకోవాలి. సంపన్నుల కొక విద్య, పేదలకు ఒక విద్య చాలా అనాగరికం. అలాగే ప్రతి స్కూ లుకు కావలసిన అన్ని హంగులను కల్పించాలి. కేం ద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ స్కూళ్ళను, రెసిడెన్షియల్ స్కూళ్లను బాగా నడపగలిగిన ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ స్కూళ్ళను ఎందుకు నడపలేదని ప్రశ్నించాలి. ఇది కాకుండా కేవలం ఉపాధ్యాయులను, నిందించడంలో అర్థంలేదు. ఈమధ్య కాలం లో ఉపాధ్యాయులగురించి చులకనగా మాట్లాడటం సమాజంలో చాలా పెరిగింది. దీనికి ప్రైవేటు స్కూలు యాజమాన్యాల ప్రచారం ఒక వైపు, విద్యారంగానికి ప్రభుత్వం చేసిన హాని మరొక వైపు ఉన్నాయి. మొత్తం విద్యావ్యవస్థను సమగ్రంగా చూడవలసి ఉం టుంది.

నాకు తెలిసి తెలంగాణలో పనిచేస్తున్న వేలా ది ఉపాధ్యాయుల్లో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే వారున్నారు. పేద పిల్లలను అమితంగా ప్రేమించే వాళ్లున్నారు. సమాజం ఏదైనా ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం మీద దాడి చేయకూడదు. ఆత్మగౌర వం దెబ్బతిన్న ఉపాధ్యాయుడు విద్యార్థులను ఇన్‌స్ఫైర్ చేయలేడు. ఉపాధ్యాయులు కూడా తమ ఆర్థిక డిమాండులకు ఎలా పోరాడుతారో, అంతే సమష్టిగా రాజకీయంగా తమ ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జయశంకర్ సార్‌కు పబ్లిక్‌గా పాదాభివందనం చేసేవారు. అది ఆయన ఒక ఉపాధ్యాయునికిచ్చిన గౌరవంగా భావిస్తే.. ఆ గౌరవం ఉపాధ్యాయ వృత్తికని కూడా నేను భావిస్తున్నాను. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను గుర్తించి, ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఉపాధ్యాయ సంఘాలను భాగస్వామ్యం చేయాలి.

1604

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles