నెహ్రూ ఉదారవాదం ఆది, అంతం


Thu,May 29, 2014 12:09 AM

ప్రొఫెసర్ జి. హరగోపాల్

నిన్నటికి(27-5-2014) నెహ్రూ గారు మరణించి యాభై ఏళ్లు. ఆ సం దర్భంలో కొన్ని పత్రికలలో ఆయన గురించి కొంతచర్చ జరిగింది. యాదచ్ఛికమే అయినా గత వారం రోజులు గా, నెహ్రూ అభివద్ధి నమూనా వేగంగా కూలిపోవ డం కూడా పూర్తవుతున్నది.నెహ్రూ మరణించినప్పు డు నేను గ్రాడ్యుయేషన్‌లో ఉన్నాను. ఆయన మరణవార్త విని అశేష జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. మా అమ్మమ్మ తన సొంత ఇంటి మనిషి చనిపోయినట్టు విలపించింది. ఇప్పుడు అది చరిత్ర. నెహ్రూ, డాక్టర్ అంబేద్కర్, అలాగే చాలామంది స్వాతంత్య్ర సమరయోధులు రెండున్నర సంవత్సరాలు శ్రమించి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు.

రాజ్యాంగంలో ప్రపంచ నాగరికతలు, అలాగే మన దేశ సుదీర్ఘ చరిత్రలో ప్రభవించిన కొన్ని ఉన్నత విలువలను రాజ్యాంగానికి మూల స్తంభంగా గుర్తించి, రాజ్యాంగంలో పొందుపరిచారు. పాశ్చాత్య ఉదారవాద విలువలతో భారతదేశ సాంస్కతిక విలువలను కలిపి వాటి సారాన్ని రాజ్యాంగ పీఠికలో ప్రాథమిక హక్కులు, అలాగే ఆదేశిక సూత్రాలలో వ్యవస్థీకతీకరించడానికి ప్రయత్నించారు. సమాజాలు ముం దుకుపోయే క్రమంలో ఈ విలువలు మరింత విస్తతంగా, లోతుగా సామాజిక జీవనంలో ప్రతిష్టించవలసి ఉండే. కానీ చరిత్ర ప్రతీఘాత దాడికి గురై, విలువలు విస్తరించడం అటుంచి వాటి మనుగడకే ప్రమాదం వచ్చింది.సామాజిక అభ్యుదయం వెనక్కిపోయిందా, పక్కదారి పట్టిందా, ఇలా ఎందుకు జరిగింది అని తప్పక మనం ఆలోచించవలసిన అవశ్యకత ఏర్పడింది. ఆయన పాత్ర గురించి చారిత్రక అం చనా ఇంకా జరగవలసి ఉంది. నెహ్రూ పాశ్చాత్య ఉదార విలువల చేత ప్రభావితమైనవాడు, అలాగే అంబేద్కర్ కూడా పాశ్చాత్య ఉదారవాద విలువల చేత స్ఫూర్తి పొందినవాడే.

ఇద్దరు చరిత్ర విద్యార్థులే. అంబేద్కర్ కులానికి, హిందూమతానికి దాని దుర్మా ర్గానికి మూలాలు వెతికితే, నెహ్రూ భారతదేశ చరిత్ర ను ఆవిష్కరించే క్రమంలో మత సామరస్యం, భావస్వేచ్ఛ, భిన్నత్వంలో ఏకత్వం, ఆధునికత సాంప్రదా య సమ్మిళిత నాగరికతగా అర్థం చేసుకున్నాడు. ఆ అవగాహన మేరకు ఇద్దరూ భారత రాజ్యాంగ రచనను మలచినవారే. నెహ్రూ వ్యక్తిగతంగా అంబేద్కర్‌లా ప్రజాస్వామ్యవాది అయినా, తనలో నియంతత్వ పోకడలున్నాయని తనను తాను తరచి చూసుకొని, తన స్వభావం భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు మంచిది కాదని తనను తాను నిష్కర్షగా చూసుకొని, తన మీదే తాను విమర్శనా దాడి చేసుకుంటూ ఒక వ్యాసం రాశాడు అని నేను ఇదివరలో రాసి ఉన్నాను. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు కూడా తనను తాను తరచి చూసుకొనడానికి సిద్ధం గా లేడు.

జాతీయస్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు తమ అంతర్గత మనిషిని విమర్శనాత్మకంగా చూసుకునే వాడే కరువయ్యాడు. ఆ విధంగా నెహ్రూ తర్వాత పీవీ నర్సింహారావు తన (Insider) ఆత్మకథలో ఒక ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చిన్న విమర్శను కూడా సహించే తత్వం లేదు. తన చుట్టూ భట్రాజులను పెట్టుకొని వాళ్లు పొగుడుతుంటే కాలర్ ఎగరేసి తిరిగే నాయకులే కనిపిస్తున్నారు. తమ పత్రికలైతే తమను విమర్శించకూడదు అని ఆజ్ఞాపిస్తున్నా రు. పత్రికలు కూడా భట్రాజుల పాత్ర వహిస్తే పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అలా చేస్తే పత్రికలకు విశ్వసనీయత ఉండదు. ఆ పత్రిక పొగడ్త లు రాజకీయ నాయకులకు విశ్వసనీయతను కల్పించవు. నెహ్రూ గారి ఈ నిజాయితీ కలిగిన ఆత్మవిమ ర్శ ఉదారవాద రాజ్యవ్యవస్థ నిర్మాణ ప్రయోగానికి దోహదపడింది. ఇప్పుడు ఆ ఉదారవాదానికి ఉద్వాసన పలికే అంతిమ ఘడియలకు చేరుకున్నాం. అం నెహ్రూ అభివద్ధి నమూనా యాభై ఏళ్లు చస్తూ, బతుకుతూ చావు దశకు చేరుకున్నది.

హిందూ మతంలో మన సామరస్యముందని, అది ఇతర మతాల పట్ల సహన భావాన్ని కలిగి ఉంద ని నెహ్రూ నుంచి అమర్త్యసేన్ దాకా వాదించినవారున్నారు. సేన్ తన ఆరుగ్యుమెంటివ్ ఇండియన్ పుస్తకంలో దేశ వైవిధ్యాన్ని భావ సంఘర్షణను, అశోకుడు, అక్బర్ అందించిన విశిష్ట వారసత్వాన్ని గురిం చి చాలా విపులంగా విశ్లేషించాడు. హిందూ మతం అంతర్గతంగా ఎంత అప్రజాస్వామికంగా ఉన్నా, ఆ భావస్వేచ్ఛ ఈ మతాన్ని నిలబెట్టింది. ఈ మతంలో ని పరమత సహనం, వైవిధ్యం, భిన్న దేవతలు దేవు ళ్ళు, మత విశ్వాసాలున్నా లేకున్నా ఇంతవరకు ఫత్వాలు ఇచ్చే సంస్కతి లేదు.

ఇప్పుడు క్రమేణా ఈ విలువల విధ్వంసం, అసహనం, ద్వేషం పాళ్లు పెరుగుతున్నాయి. తీవ్రత పెరుగుతున్నది. ఇతర మతాల వారిని ద్వేషించడం, దాడులు చేయడం పెరుగుతూ వస్తున్నది. చరిత్రకు ద్వేష ఛట్రం అన్వయించడం పెరిగింది. రొమిలా థాపర్ ఈ మధ్యే రాసిన Past As Present (గతమే వర్తమానంగా) అన్న పుస్తకంలో చరిత్ర, వక్రీకరణ ఎంత పెద్ద ఎత్తు న జరుగుతున్నదో చాలా వివరంగా రాసింది. మత సామరస్యం మీద వికసించిన సెక్యులర్ భావజా లం, రాజ్యాంగ విలువగా మలచబడింది. పాకిస్థాన్ మతపర రాజ్యాంగంగా రూపొంది మూడు దశాబ్దాలలోనే రెండు ముక్కలైంది. మతానికి మనుషులను, ప్రాంతాలను కలిపి ఉంచే శక్తి లేదని ప్రపంచవ్యాప్త అనుభవం చెప్తున్నది. సెక్యులరిజాన్ని కాపాడుకోకపోతే దేశానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నది.

భారత రాజ్యాంగంలోని మరో ఉన్నత విలువ సార్వభౌమత్వం. దేశాన్ని రిపబ్లిక్‌గా మలచి అన్ని దేశాల మధ్య స్వతంత్రంగా స్వేచ్ఛగా, సమానస్థాయి లో మాట్లాడే దశనుంచి, ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడి కన్నుసన్నల్లో మసులుకోవలసిన దుర్గతికి చేరుకున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రా పంచిక దక్పథానికి చేసిన అన్యాయం. ప్రపంచ బ్యాంకు అప్పులు ప్రారంభమై, రాజీవ్‌గాంధీ టెక్నో మేనేజీరియల్ విధానాలను అనుకరించి, సామ్రాజ్యవాద దోపిడీకి దారివేస్తే, దాన్ని కాంగ్రెస్, బీజేపీ ఒకరి తర్వాత ఒకరు ముందుకు తీసుకెళ్లి, దేశ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో పణంగా పెట్టారు. కార్పొరేటు మీడియా ఉదార విలువల మాటున పెరిగి అదే మీడియా కాంగ్రెస్ పార్టీని, దానితోబాటు నెహ్రూ, ఉదార విలువలను రాజ్యాంగస్ఫూర్తిని పెద్ద దెబ్బకొట్టింది.

ఇక సోషలిజం గురించి చెప్పవలసిన పనేలేదు. రష్యన్ విప్లవంతో ప్రభావితమైన నెహ్రూ, పాశ్చాత్య ప్రజాస్వామ్యాన్ని సోషలిజంతో కలిపి ఒక ప్రయో గం చేశాడు. రాజ్యం, మార్కెట్‌లో అభివద్ధికి మధ్యే మార్గాన్ని ఎన్నుకున్నాడు. దాన్నే డెమొక్రాటిక్ సోషలిజం అని నామకరణం చేశారు. డెమొక్రాటిక్ సోషలిజం అంటే రాజ్య ప్రమేయమూ, మార్కెట్ పోటీ మిళితం చేయడం. రాజ్యానికి మార్కెట్‌కు మధ్య కొంత ఘర్షణ జరిగినా మార్కెట్ చాలా చాకచక్యం గా రాజ్యాన్ని తన అవసరం మేరకు ఉపయోగించుకొని, అరటితొక్కలా ఇక అవసరం లేదు. అని ఒక మూలకు నెట్టింది. మార్కెట్‌లో ఈ విధ్వంసం వెనక అంతర్జాతీయ మార్కెట్ అహంకారం ఉంది. రాజ్య వ్యవస్థ ద్వారా మార్కెట్‌కు సేవ చేసీ చేసీ అలసిపోయిన తమ బంటులను ఇంటికి పంపి, మార్కెట్ స్వేచ్ఛను అలింగనం చేసుకునే వ్యక్తిని ప్రధానమంత్రిగా తెచ్చుకున్నది. పాపం నెహ్రూ నమూనా అర్థాంతరంగా తనువు చాలించింది.

ఈ పరిణామాలను ఒక్క దేశమే కాదు, చాలా మూడవ ప్రపంచ దేశాలు అనుభవించాయి. అయి తే మూడవ ప్రపంచదేశాలలో వలసవాదంతో పోరా డి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం చాలా కాలం చాలా దేశాల్లో నిలబడలేకపోయింది. కాని మనదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పార్టీలు ఓడిపోవడం గెలవడం వల్ల ఏదో స్థాయిలో ప్రాణంతోనే ఉంది.

ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్మించబడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు కొంతకాలం నిలబడి ఒకదాని తర్వాత ఒకదానిని పాలకులు ఒకవైపు కూలగొడుతుంటే, యూజీసీ లాంటి సంస్థలు ఆత్మహత్య చేసుకున్నాయి. ఒక విశ్వవిద్యాలయాలు ఆత్మహత్య చేసుకోవడానికి వరుసలో నిలబడి ఉన్నాయి.

ఇందిరాగాంధీ తండ్రికి భిన్నంగా నియంతత్వ పోకడలు పోతే ఇదే ప్రజాస్వామ్య ఆయుధంతో ప్రజ లు ఆమెను ఓడించారు. తర్వాత ప్రభుత్వాలు భిన్న ప్రయోగాలు చేసినా ప్రతి ప్రభుత్వం నియంతత్వానికి ఇవ్వలసిన భూమికను తయారు చేసింది. గత పదేళ్లుగా బలహీన ప్రధానమంత్రి అని అన్నాం. ఆయన నేతత్వంలోనే అణచివేత చట్టాలు అమానవీయగా అమలయ్యాయి. ప్రభుత్వాలు ప్రజలతో అమానుషంగా ప్రవర్తించాయి. అణచివేతను ఇంకా సమర్థవంతంగా అమలు చేసే నాయకత్వం కోసం మార్కెట్ వెతికి వెతికి తమకు కావలసిన రాజకీయ వ్యవస్థనూ సష్టించుకోగలిగింది.

మనదేశంలో పరిణామాలు ఒక స్థాయిలో ఆశాజనకంగా మరొక స్థాయిలో అంధకారంగా అగుపిస్తుంటాయి. మార్పు వచ్చినట్టుగానే వచ్చి కనిపించకుం డా పోతుంది. బహుశా మార్పును సాధించే లక్షణం సాధారణ ప్రజలకుంటే ఆ మార్పును నిరోధించే శక్తి పాలకులకుంది. బహుశా ఈ ప్రక్రియనే ప్రతీఘాతక శక్తిగా అంబేద్కర్ సూత్రీకరించడమూ! మొత్తంగా నెహ్రూతన జీవిత కాలంలో చేసిన ప్రయోగం అప్పు డు మొలకెత్తిన సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతం త్ర, సెక్యులర్, సోషలిస్టు విలువలు సమాజాన్ని ముందుకు తీసుకపోవచ్చు అని ఆశించిన మా తరం మా జీవితకాలంలోనే వాటి నిష్కత్తిని చూస్తు న్నాం.

అయితే ఈ దేశ ప్రజల పోరాట సంస్కతి ఈ విలువలను కాపాడుకుంటుందని, ఏ నియంతత్వ పోకడలకైనా ఎదురు నిలబడగలిగిన శక్తి దేశ సాధారణ ప్రజలకున్నదన్న విశ్వాసం ఉన్నవాళ్లల్లో నేను ఒకడిని. అంటే ప్రతీఘాతక విప్లవాన్ని ప్రతిఘటించే శక్తి దేశ ప్రజల చైతన్యంలో ఎక్కడో నిర్మాణమౌతున్నది కూడా. ఒక చారిత్రక సత్యమే. ఆ చైతన్యం వైపు తెలంగాణ ప్రజ లు నిలబడగలరన్న విశ్వాసం నాకు చాలా బలంగా ఉన్నది.

962

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల