ఫాసిజం దిశగా దేశం


Thu,April 24, 2014 02:00 AM

విశ్వహిందూ పరిషత్ నాయకుడు తొగాడియా ముస్లింలతో ఏ లావాదేవీలు పెట్టుకోవద్దని,వాళ్ళ భూములను కొనాలేకానీ వాళ్ళకు భూములు అమ్మకూడదని అనడంతో, ఇంగ్లిష్ మీడి యా దీన్ని కొంచెం తీవ్రంగా పరిగణించి చర్చ జరిపింది. అర్ణాబ్ గోస్వామి (ఆయన బాషకు కూడా ఫాసిస్టు స్వభావం ఉంది) తొగాడియా లాంటి వాడికి రాజకీయాల్లో స్థానం లేదని, బీజేపీ , వాళ్లు ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించకూడదని, వచ్చే రెండు దశాబ్దాల్లో ఇప్పటి తరం కంటున్న స్వప్నం భిన్నమైనదని చాలా ఆవేశంగా తన చానెల్‌లో వ్యాఖ్యానించాడు. ఇలా విశ్వహిందూ పరిషత్ ఒక్కోసారి చాలా పరుషంగా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నది. కొంతకాలం మౌనంగా ఉంటుంది. అంటే ఎవరో స్విచ్ ఆన్ చేసి, ఆఫ్ చేస్తున్నట్లు తోస్తున్నది.

అలాగే బీజేపీ నాయకుడు గిరిరాజ్‌సింగ్-మోడీకి ఓటు వేయనివారు పాకిస్థాన్ వెళ్ళిపోవాలని ఆదేశించాడు. పాకిస్థాన్ వాళ్ళు హిందూ ఓటర్లకు తమదేశంలో పౌరసత్వం ఎందుకు ఇవ్వాలో తెలియదు? ఇంత పవిత్రమైన ఓటును వెయ్యని వాళ్ళను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని అగ్ర నాయకుడు అద్వానీ అంటున్నాడు. ఇక భారత్ భవిష్యత్ ప్రధానమంత్రిగా మీడియా పేర్కొంటున్న నరేంద్రమోడీ తాను ప్రధానమంత్రి అయితే క్రిమినల్ చరిత్ర ఉన్న పార్లమెంటు సభ్యులను జైళ్ళల్లో పడేస్తా నన్నాడు. ఇందులో తమ పార్టీ వాళ్ళను కూడా మినహాయించేది లేదని అంటున్నాడు.

ప్రధానమంత్రికి ఎంపీలను జైళ్ళకు పంపే అధికారం ఎక్క డి నుంచి వస్తుందో తెలియదు. అంటే తనను, తన అధికారాన్ని ప్రశ్నించిన వాళ్ళంతా ఈ కోవలోకి వస్తారేమో! బీజేపీలో ఉదారవాది అని ప్రచారం చేస్తున్న అటల్ బిహారీ వాజపేయి తాను ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే పత్రికా విలేకరులు 2002 గుజరాత్ మానవ హననం పునరావత్తంకాదని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే.. మళ్ళీ గోద్రా లాంటి సంఘటనలు పునరావత్తం కాకూడదు కదాఅన్నాడు. ఇక మురళీమనోహర్‌జోషి మానవ వనరులశాఖ మంత్రిగా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పెద్ద ఎత్తున దెబ్బకొట్టాడు. యూజీసీ చైర్మన్‌గా ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలు లేని హరిగీతంను నియమించాడు.ఆయన చైర్మన్ పదవికి రాగా నే మానవ హక్కుల అధ్యయనాలు ఆపి, బాధ్యతలకు సంబంధించిన పాఠాలు చెప్పాలని అన్నప్పుడు అది సరియైన దక్పథం కాదని, హక్కులకు బాధ్యతలకు మధ్య ఒక అవినాభావ సంబంధమున్నదని నేను అన్నందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మానవ హక్కుల అధ్యయన కేంద్రానికి గ్రాం ట్సు ఆపేశాడు.

పైన పేర్కొన సంఘటనలన్నీ విడివిడిగా కనిపించినా అవన్నీ ఒక విషవక్షం పూలు కాయలు కొమ్మలు. ఇవి సమాజంలో చాలా వేగంగా దిగజారుతున్న సామాజిక సంబంధాలకు, విలువలకు సూచికలు మాత్రమే. ఈ అప్రజాస్వామిక కల్చర్ పెరగడానికి కేవలం తొగాడియాను నిందించి లాభంలేదు. ఈ విష సంస్కతికి కొందరు కాంగ్రెస్ మంత్రులు కూడా రహదారి వేశారు. చిదంబరం, కపిల్ సిబల్ లాంటి వాళ్ళను బీజేపీ అధికారంలోకి వస్తే పద్మ అవార్డులతో సత్కరించవలసిందే. కపిల్ సిబల్ వెతికి వెతికి ఒక నియంతను ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‌గా నియమించాడు. ఇతనికి ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేయడమొక్కటే లక్ష్యం. దీనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. దేశంలోని అతి ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ విశ్వవిద్యాలయం మనకళ్ళ ముందు కూలిపోతున్నది.ఇక యూజీసీ మానవ వనరుల మంత్రిత్వశాఖకు ఊడిగం చేయడంలో నిమగ్నమై ఉంది. మంత్రిత్వ శాఖలోని ఒక చిరు ఉద్యోగి యూజీసీని బెదిరించే స్థాయికి సంస్థ చేరుకున్నది. దేశంలో ఏ ప్రతిఘటన లేకుండా యూజీసీ నిధుల్లో నుంచి 25 వేలకోట్ల రూపాయలు మంత్రిత్వశాఖ తీసుకొని,తామే రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు గ్రాం ట్సు ఇస్తామని అంటున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైందో ప్రభుత్వం మారిన తర్వాత అర్థమవు తుంది.

ఈ అప్రజాస్వామిక సంస్కతి నుంచే నియంతల లాంటి నాయకులు, ముఖ్యమంత్రులు అవుతున్నా రు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ లాంటి ఉదారవాదులు, అంబేద్కర్ లాంటి అభ్యుదయవాదులు రాజ్యాధికారం ఒకేచోట కేంద్రీకరించక, భిన్నమైన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల భాగస్వామ్యంతో నడపాలని, ఒకేవ్యక్తి కేంద్రంగా పాలన దేశానికి ప్రమాదమని భావించారు. నెహ్రూ తన గురించి తాను విమర్శనాత్మకంగా రాసుకున్న ఒక కరపత్రం లో తనలో నియంతత్వ ధోరణులున్నాయని, తనలాంటి వాళ్ళను చాలా జాగ్రత్తగా కట్టడి చేయాలని రాసి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు పంచేలా చూశాడు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఒక లిబరల్ వ్యవస్థ నిర్మాణం సాధ్యమేనని భావించాడు. దానికి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చాలామంది ఉద్యమకారుల నిజాయితీ దోహదపడింది. కానీ ఈ చట్రానికి కావలసిన పునాదులను నిర్మించలేకపోయాం. ఈ విలువలను కాపాడడానికి కావలసిన ఉద్యమ సంస్కతి ని ప్రోత్సహించలేదు. దాంతో రాజ్యాంగంలోని విలువలు ఒక దాని తర్వాత ఒకటి వాడిపోతున్నవి. ఈ కూలిపోతున్న శిథిలాల నుంచి తొగాడియా, గిరిరాజ్ సింగ్‌లు పుట్టుకొస్తున్నారు.

వీళ్ళిద్దరు కేవలం సాం పిల్స్ మాత్రమే. హిందూ వాహిని, బజరంగ్‌దళ్ లాంటి సంస్థలు చాలా పనిచేస్తున్నాయి. వీళ్ళకు అగ్రభాగాన ఆర్‌ఎస్‌ఎస్ ఉంది. ఇంతకాలం ఇవన్నీ సాం స్కతిక సంస్థలుగా విరాజిల్లాయి.తాము రాజకీయాలకు దూరమని చెప్పుతూ వచ్చాయి. రాజ్యాంగ వ్యవస్థ పతనం అవుతున్న కొద్దీ ఈ సంస్థలన్నీ ప్రత్యక్షంగా రాజకీయాలను నిర్వహిస్తున్నవి. బీజేపీ ఈసంస్థల పరిధి దాటలేదు. అద్వానీ లాంటి నాయకుడిని పక్కకు నెట్టి, 2002 మారణకాండకు కారణమైన నరేంద్ర మోడీ తప్ప దేశానికి ఇక గత్యంతరం లేదని మీడియా, మధ్యతరగతి యావత్ కార్పొరేట్ శక్తులు, సామ్రాజ్యవాదం ఒక్కటే గోల చేస్తున్నవి. (గుజరాత్ మారణకాండకు మోడీ ఎలా కారకుడవు తాడు అని ఒకవైపు వాదిస్తూ..1984 ఢిల్లీ మారణకాండకు సోనియాగాంధీ బాధ్యులు అని అమెరికన్ కోర్టులో కేసు వేశారు.) గుజరాత్ అభివద్ధి అనేది రూపం, మతద్వేషాలు సారం, సామ్రాజ్యవాద దోపిడీ గమ్యం. ఈ సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ ఫాసిజం మీద రాసి న వ్యాసం చాలా ఉపయోగ కరంగా ఉంటుంది.

ఈ వ్యాసంలో హిట్లర్ గురించి విశ్లేషిస్తూ (నేను ఈ మధ్య హిట్లర్ ఆత్మకథ చదువుతున్నాను)..ఆయన తన లక్ష్యాన్ని చేరుకోక పోవడానికి తగిన సలహాదారులు దొరకలేదని, ఆయన ప్రధాన సలహాదారుడు మనువుకు వీరాభిమాని అని పేర్కొంటూ.. హిట్లర్‌కు బ్రాహ్మణిజం నుంచి వచ్చిన నిష్ణాతుడెవరైనా సలహాదారుడిగా లభిస్తే.. హిట్లర్ లక్ష్యాన్ని సాధించేవాడే నని విశ్లేషించాడు. హిందూ మతానికి రెండు పాయలున్నాయి. భావప్రకటనలో స్వేచ్ఛ, ఆచరణలో అమానవీయత. దానికి కులవ్యవస్థ ఒక పెద్ద ఉదాహరణ.(హిందూ మతంలోని భావ ప్రకటనా స్వే చ్ఛ, ఒక దేవుడు, ఒక గ్రంథం, ఒక ప్రాఫెట్ లేక పోవడం వల్ల కావచ్చు.) ఆచరణలో నియంతత్వం క్రమేణా భావ ప్రకటనా స్వేచ్ఛను మింగుతూ ఫాసిజాన్ని నెలకొల్పే దిశగా రాజకీయాలు పరుగెత్తుతున్నాయి.

అయితే భారత సమాజంలో ఉన్న వైరుధ్యాల ఘర్షణ వల్ల దేశం నిండా భిన్న ఉద్యమాలు జరుగుతున్నాయి. భూస్వామ్య వ్యవస్థకు, అలాగే సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలే కాక, సామాజిక సంబంధాలను మానవీకరించి, ప్రజాస్వామ్యీకరించే ఉద్యమాలు చాలా మన చుట్టూ ఉన్నాయి. ఒక రకంగా తెలంగాణ ఉద్యమం అలాంటిదే. తెలంగాణ ప్రజాస్వామ్య, మానవీయ భావజా లం వల్ల 2002లో గుజరాత్ మానవహననం జరిగినప్పుడు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఒక సభలో వందలాది మంది గంటల తరబడి కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. అది నా జ్ఞాపకంలో ఒక అపూర్వ మానవీయ అనుభవంగా నిలిచిపోయింది. ఎందుకో నరేంద్ర మోడీ నాలుగు సభల్లో తెలంగాణ జనాన్ని చూస్తే.. పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా మనం పొందిన మానవత్వాన్ని మనం కోల్పోతున్నామా అనే ప్రశ్న నన్ను వేధిస్తున్నది.

819

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల