చిదంబరం ఎక్కడ?


Thu,April 17, 2014 02:00 AM


కొన్ని సంవత్సరాల కిందట (సంవత్సరం సరిగ్గా గుర్తులేదు) దేశవ్యాప్తంగా పార్ట్ టైం, టెంపరరీగా పనిచేస్తున్న మూడు లక్షలమంది పోస్ట్‌మెన్ ల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక వేయిమంది పోస్ట్‌మెన్‌ల తో ధర్నా నిర్వహించాం. వీళ్లు జీవిత కాలం పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ పెన్షన్‌కు అర్హులు కారు.అలాగే ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు కాబట్టి వద్ధాప్య పెన్షన్‌కు కూడా అర్హులు కారు. టెం పరరీ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, దాన్ని కేంద్ర ప్రభుత్వ దష్టికి తీసుకురావడానికి ప్రధానిని కలుద్దామని ప్రయత్నం చేస్తే, రెండుసార్లు అపాయింట్‌మెంట్ దొరికి చివరి క్షణంలో రద్దు అయ్యింది. చివరికి ప్రధానితో పనిచేస్తున్న ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవమన్నారు. ఆయన మమ్మల్ని తన ఇంటి దగ్గరే కలిశాడు. నిజానికి చాలా మర్యాదగా, ఓపికగా సమస్య విన్నాడు. అయితే ప్రభుత్వానికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ వల్ల చాలా నష్టా లు భరించవలసి వస్తున్నదని అన్నప్పుడు, ప్రభుత్వ సేవల ద్వారా లాభాలు ఆశించడమేమిటి అని వాది స్తూ, రక్షణ మీద పెడుతున్న ఖర్చుకు ఏం లాభాలు వస్తాయని అడిగాం.అలాగే ఒక పోస్ట్‌మ్యాన్ సుదూర ప్రాంతంలో ఉండే ఒక సైనికుడి ఉత్తరాన్ని అతని ముసలితల్లికి చేరవేసినప్పుడు, తన కొడుకు బాగానే ఉన్నాడని తెలిసి సంతోషంతో కళ్ల నీళ్లు పెట్టుకుంటే, ఆ కన్నీటిని మీ లాభ నష్టాల కొలమానంలో ఎలా కొలుస్తారని అడిగాం. ఈ వాదన వింటూనే ఈ సమస్యను తాను తప్పక ప్రధానికి నివేదిస్తానని వాగ్దానం చేస్తూ.. ఒకసారి ఎందుకైనా మంచిదని చిదంబరం గారిని కలవండి అని సలహా ఇచ్చాడు. ప్రభుత్వంలో అత్యున్నతమైన ప్రధాని దగ్గరికే సమస్య తెచ్చాక, మళ్లీ చిదంబరాన్ని కలవడం ఎందుకు అని అంటే, ఇలాంటి కేసులు విన్నప్పుడు ఆయన ఫైళ్లను విసిరి వేస్తున్నాడని, ప్రధాని మాటను కూడా ఖాతరు చేయ డం లేదని అంటే మేం విస్తుపోయాం. మూడవ తరగతి, నాల్గవ తరగతి ఉద్యోగాలను పూర్తిగా రద్దు చేయాలని ఆయనకు కార్పొరేట్ వ్యవస్థల ఆదేశం. పేద కుటుంబాల నుంచి కొద్దిగా చదువుకొని ప్రభు త్వ ఉద్యోగాలలో చేరి పిల్లలను చదివించి సమాజం లో తమకంటూ కొంత స్థానాన్ని చాలామంది పొం దారు. ఈ వర్గాలను ద్వేషించిన వారిలో చిదంబరం ఒకరు.

మేం మా వాదనను కొనసాగిస్తూ మూడు లక్షల గ్రామాలలో పనిచేస్తున్న పోస్ట్‌మెన్‌లు మీ కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష ప్రతినిధులని, వీళ్లకు ప్రజల్లో చాలా ఆదరణ ఉందని ఇంత గుడ్‌విల్ ప్రభుత్వానికి ఉం డడం రాజకీయంగా కూడా ప్రయోజనమే కదా అని అంటే, చిదంబరం ఆ విషయాలను పట్టించుకోడు అని అన్నాడు. గత దశాబ్ద కాలంగా యూపీఏ ప్రభుత్వంలో ప్రశ్నించలేని అధికారాన్ని చిదంబరం చెలాయించాడు. ఆర్థికశాఖ నుంచి సమర్థవంతుడని హోంమంత్రిగా నియమించారు. అక్కడ శాంతి చర్చ ల పేర ఆజాద్‌ను ఎన్‌కౌంటర్ చేశాడాయన. తిరిగి ఆయనే ఆర్థికమంత్రి అయ్యాడు. చిదంబరం, అహ్లువాలియా, కమల్‌నాథ్, కపిల్ సిబల్ లాంటి వాళ్లకు ఇంత అధికారం ఎవరిచ్చారు? వీళ్ల అధికారం ప్రజల నుంచే వచ్చిందా? లేదా దీని మూలాలు మరెక్కడైనా ఉన్నాయా? ఆలోచించాలి. చిదంబరం లాంటి వాళ్లు ప్రజాప్రతినిధులుగా అధికారాన్ని ప్రజ ల తరఫున ప్రజల పక్షాన ఉపయోగించి ఉంటే, ఈ రోజు పార్లమెంటుకు అత్యధిక మెజారిటీతో ప్రజామోదంతో గెలిచేవారు. కానీ ఆయన పార్లమెంటుకు పోటీ కూడా చేయడం లేదు. దేశాన్ని సూపర్ పవర్ చేస్తామని, వద్ధి తప్ప మరేం లేదని, వద్ధి రేటును పెంచడానికి నానా విధాన నిర్ణయాలు తీసుకున్న వా ళ్లు, ఎన్నికలు దగ్గరకు వచ్చేవరకు తలదాచుకోవడం దేనికి? సామ్రాజ్యవాద అభివద్ధి నమూనాని నెత్తికి ఎత్తుకొని, ప్రపంచ బ్యాంకు, అమెరికా శబాష్ అం మురిసిపోయి, అతి ఉత్సాహంతో వాళ్లు ఏది ఆదేశిస్తే అది చేసినవాళ్లు అడ్రస్ లేకుండాపోవడమం ఇదే!ఈరోజు మోడీ హవా ఏమిటో తెలియదు. కానీ కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ధరలు పెరిగినా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, కోట్లాదిమందికి పనిలేకున్నా, నిరుద్యోగ యువత ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఆశగా ఉన్నా, అసమానతలు విపరీతంగా పెరిగినా వీటికి దేనికి స్పం దించకుండా అభివద్ధి గురించి మాట్లాడిన నాయకులు, ఆర్థిక శాస్త్రజ్ఞులకు ఎన్నికలలో ఓటరు ఉంటాడనే కనీస స్పహ లేకపోవడం రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ట. తాము కుంభకోణాల ద్వారా పెంచిపోషించిన కార్పొరేటు సంస్థలకు వీళ్లతో అవస రం తీరిపోయి, వాళ్లు మోడీ పంచన చేరారు. ఒక సందర్భంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి టీడీపీ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నతన్ని కలిసినప్పుడు, వాళ్ల అభివద్ధి నమూనా భారతదేశం లాంటి దేశాల కు పనికిరాదని, ఆనమూనాను అమలు చేసిన ఎవ్వరైనా ఎన్నికలలో ఓడిపోతారని అన్నాడు. అంతేకాదు ప్రజాస్వామ్యం తమకు ఒక పెద్ద అడ్డంకిగా మారిందని వాపోయాడు.

మోడీ ప్రభంజనం అని ప్రచారం చేస్తున్న బీజేపీకి అర్థం కాని అంశం ఈ హవా ఒక అభివద్ధి నమూనా వ్యతిరేక గాలి. విచిత్రమేమంటే మోడీ కూడా గుజరాత్ అభివద్ధి నమూనాను పట్టుకొనే ఎన్నికలలో తిరుగుతున్నాడు! ఓటర్లు ఏం చేయాలనేది వామపక్ష పార్టీలకు ఇంతకంటే మించిన సదవకాశం దొరికేది కాదు. మొత్తం అభివద్ధి నమూనాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ నమూనాల కోసం ప్రజలను సమీకరింపవలసి ఉండింది. కానీ వాళ్ళు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు గెలుస్తామో అని తాపత్రయపడుతున్నారు. ప్రజలను సమీకరింపవలసిన పార్టీలు ఏదో ఒక పార్టీకి సన్నిహితంగా పోవడానికి నానాయాతనలు పడుతున్నారు. ఈ నమూనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారు ప్రత్యామ్నాయ నమూనాను నిర్మిస్తున్నవారు ఎన్నికలను బహిష్కరిస్తున్నా రు. ప్రజలేమో ఎన్నికలను బహిష్కరించలేకపోతున్నారు.అలాగే ఎన్నికల్లో తమకు కావలసిన అభ్యర్థులెవరో ఓటర్లకు కనిపించడంలేదు. అందుకే ఏ రా యి అయితేనేమి తల పగలగొట్టుకోవడానికి అని అనుకుంటున్నారు. తాత్కాలిక వాగ్దానాలకు, డబ్బు కు మోసపోతున్నారు. బీజేపీ కేవలం అభివద్ధి నమూనానే ముందుకు తేవడంలేదు.మతం సాంస్కతిక సమస్యలేకాక ఇం తకాలంగా మతద్వేష రాజకీయాలతో పనిచేస్తున్న సంఘ్ పరివార్ ముందుకు రావడమేకాక రాజకీయా ల్లో ఒక కీలక శక్తిగా ఎదిగింది. వాళ్ళను కాదని బీజేపీ ఏమీచేయలేని పరిస్థితిలో ఉన్నది. మార్క్స్ అన్నట్లు మతం ఒక మత్తు మందు. అందుకే దేవతలు, స్వా ములు, యోగా గురు రాందేవ్‌బాబా మతాధిపతులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. గుళ్లు, యజ్ఞాల పాత్ర మారింది. అసంతప్తితో ఉన్న ప్రజలకు ఇది ఒక ఊరటగా కనిపించవచ్చు. అలాగే తమ ఆగ్రహాన్ని బల ప్రయోగాన్ని తమకంటే బలహీనులపైన ఉపయోగించడానికి సిద్ధపడవచ్చు.కలిసి పోరాడవలసిన పేదలు ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్నంతకాలం రాజకీయాలు క్రియాత్మకంగా,సజనాత్మకంగా మారే అవకాశం లేదు. నిజానికి అందరూ మాట్లాడుతున్న నయా అభివద్ధి నమూనాకు వేళ్ళు లేవు. నోబెల్ బహుమతి గ్రహీత స్టిగ్లిడ్జ్ దీనిని Rootless and ruthless అంటే పునాదులు లేని అమానవీయ నమూనాగా వర్ణించాడు. అందుకే ఈ నమూనాను అతివేగంగా ముందుకు తీసుకెళ్లిన చిదంబరం లాంటి వాళ్ళకు ప్రజలలో అదరణ లేదు, బలం లేదు. ఇది చిదంబ రం బలహీనతకంటే ఆయన నమ్మిన నమూనా దుర్బలత్వం. ఎవరు గెలిచినా వచ్చే ఐదేళ్ళు హిం సాయుత పాలనే ఉంటుంది. ఈ నమూనా కొనసాగితే 2019లో ఎన్నికలుంటాయో లేదో అన్న భయం నా లాంటి వాళ్ళకు కలుగుతున్నది.
ప్రొఫెసర్ జి. హరగోపాల్


482

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles