బిల్లులో చిల్లులు


Fri,February 28, 2014 12:26 AM

కాంగ్రెస్ పార్టీలోని కొందరు ప్రతినిధులు తెలంగాణ ఉద్యమాన్ని బాహాటంగా వ్యతిరేకించారు. వాళ్ళే ఇప్పుడు తెలంగాణ చాంపియన్స్‌గా పోజు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయ నాయకులను శల్య పరీక్ష చేయాలి. కేవలం డబ్బుల సంపాదనలో ఉండే నాయకుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజా జీవనంలో ఉండి అధికారాన్ని తమ స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకునే వారికి ప్రజల భయంఉండాలి.

తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం ఆహ్వానించదగ్గ చారిత్రకమైన మలుపు. ఒక వెనుకబడిన ప్రాంతం, ఆత్మగౌర వం లేని తెలంగాణ రాజకీయ నాయకత్వం, సంపదలో ఏ విధంగాను పోటీప డలేని ఆర్థిక వర్గం, ఇప్పుడున్న రాజకీయ అధికార నిర్మాణంలో, తమ రాష్ర్టాన్ని సాధించుకోవడం కేవలం ప్రజా ఉద్యమం ద్వారానే సాధ్యమైంది. నిరంతర రాజీలేని ప్రజా ఉద్యమం లేకుంటే, రాజకీయ నాయకత్వం తమ బలంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం ఊహించలేం. తెలంగాణకు అంత పటిష్ఠమైన, నిజాయి తీ కలిగిన, ప్రజల పట్ల నిబద్ధత గల రాజకీయ నాయకత్వం లేదనే చెప్పాలి. గతం లో 1969 ఉద్యమాన్ని చెన్నారెడ్డి సులభంగా నీరుకార్చడానికి ఇప్పుడున్నంత బలమైన ప్రజా ఉద్యమం లేకపోవడమే కారణం. చెన్నారెడ్డి ఉద్యమాన్ని నిండా ముంచినా, ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక రాష్ర్టానికి గవర్నర్ అయ్యాడు. హైదరాబాద్‌లో ఆయన విగ్రహాలున్నా యి. శంకరన్ గారి లాంటి అరుదైన నిజాయితీ గల అధికారిని ఆయన అహంకారంతో అగౌరపరిచినా ప్రజా నిరసన లేకుండాపోయింది. ఈసారి ఎప్పుడు ఏ నాయకుడికైనా తెలంగాణ ఉద్యమాన్ని వదిలివేస్తాడని అనుకుంటే ప్రజాప్రతిఘటన వచ్చింది. నిజానికి కేసీఆర్ ఉద్యమాన్ని నిలబెట్టడం కంటే, ఉద్యమం కేసీఆర్‌ను నిలబెట్టింది. టీఆర్‌ఎస్ నిలదొక్కుకోవడానికి ప్రజాచైతన్యమే తోడ్పడింది. ఇది ఆధునిక రాజకీయాల్లో తెలంగాణ ప్రజలు సాధించుకున్న అతి పెద్ద విజయం.

ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకత్వం చివరిదాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమైక్యవాద నినాదంతో అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. లోక్‌సభలో ఎన్నడూలేని విధంగా అల్లరి సష్టించారు. మైకులు విరగ్గొట్టి, వందల మైకులు విరగొట్టలే ఇంత రభన ఎందుకు అన్నారు. లోక్‌సభ మైకును చూసే పద్ధతి విచిత్రంగా తోచింది. పెప్పర్ స్ప్రే తీసుకెళ్లి ఆత్మరక్షణ కోసం ఆయుధం పట్టుకొన్నట్లు మాట్లాడడం ఒక విపరీత ధోరణి. ఈ ప్రవర్తన రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్ర ప్రాంత ప్రజలు హర్షించారని అనుకోవడానికి వీళ్లేదు. నిజానికి ఇది తమను ఎన్నుకున్న ఓటర్లను అవమానపరచడమే.
లోక్‌సభలో బిల్లును పాస్ చేసిన పద్ధతిని కూడా ఎవ్వరూ హర్షించరు. కానీ కొంతమంది ఎంపీల విపరీత ప్రవర్త న వల్ల బిల్లు పాస్ అయిన పద్ధతిని తప్పుపట్టడం కష్టమైపోయింది. అల్లరి ద్వారా బిల్లును ఆపగలం అన్న ఆలోచనే ఆశ్చర్యం వేస్తుంది. పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ఈ స్థాయికి సభ్యులే దిగజార్చడం పెద్ద విషాదం. ఇక బిల్లు అల్లర్ల మధ్య నుంచి గొడవల మధ్య నుంచి బయటపడి రాజ్యసభకు చేరుకున్నాక ఇంకా ఆశ్చర్యకరమైన అంశాలు; టీడీపీ ఎంపీలు బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం అనే నినాదం రాసి రాజ్యసభ ఛైర్మన్ ముఖానికి అడ్డం పెట్టారు. రాజ్యసభ చర్చల్లో పాల్గొనే బదు లు ఇలా ప్రవర్తించడం ఆ పార్టీ సభ్యులకే చెల్లింది. ఇది విద్యార్థుల సభల కంటే అన్యాయంగా కనిపించింది. దేశ ప్రజలకు, యువతకు ఏం సం దేశం ఇచ్చినట్లు? అధ్యాపకులు విద్యార్థులను ఎలా నియంత్రించగలరు? ఎంపీలే అలా ప్రవర్తిస్తే తమను ఎందుకు తప్పుపడుతున్నారని ఎవరైనా అంటే ఏం జవాబు చెప్పాలి? ఇక సభలోమొత్తం చర్చ వెంకయ్యనాయుడు చుట్టే తిరిగింది. ఆయన దాన,వీర, శూర,కర్ణలా ప్రవర్తించాడు. అయితే కొన్ని న్యాయమైన, కొన్ని అన్యాయమైన డిమాండ్లు పెట్టాడు. ఆయన జాతీ య నాయకుడు అయినప్పుడు అతను ఎక్కడా ఒక్క తెలంగాణ ప్రాంత డిమాండ్‌ను ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి డిమాండ్‌ను ముందే మ్యాచ్ ఫిక్సింగ్‌లా నిర్ణయించుకున్న విధంగా అంగీకరిస్తూ వచ్చింది. వీటన్నింటికి ఎంత చట్టబద్ధత ఉంటుందో తెలియదు. ఇక తెలంగాణ సభ్యులు తెలంగాణ అనే బ్రహ్మపదార్థం వస్తే చాలని, ఏ ఒక్క అంశం మీద పట్టుబట్టకపోవడం వల్ల కొన్ని అప్రజాస్వామిక అంశాలు చట్టంలో చేర్చబడినాయి.

హైదరాబాద్ నగరం ఒక ఒక దశాబ్దం పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇది మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం అంగీకరించిన అంశమే. కానీ శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా గవర్నర్‌కు అప్పజెప్ప డం, తెలంగాణ ప్రజలను అగౌరపరిచినట్లు కాదా? ఇది స్నేహపూరితంగా విడిపోవడం అవుతుందా? రెండు కేబినెట్‌లు, ఇద్దరు ముఖ్యమంత్రులు రాబోయే సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోలేరా? ఇలా ప్రజాప్రతినిధులు అధికారాన్ని ఒక నామినేటెడ్ గవర్నర్ కాళ్ల దగ్గర ఎందుకు పెడుతున్నట్టు? అన్ని రాజకీయ సమస్యలు శాంతిభద్రతల సమస్యలేనా? ప్రజాప్రతినిధులది పోలీస్ మైండ్‌సెట్ కాదా? తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను గవర్నర్ తోసిపుచ్చే అధికారాన్ని ఎలా ఇచ్చారు? ఇదేం విచిత్రం? ఇలాంటి తెలంగాణ కోసమేనా తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేసింది? రాజకీయ వ్యవస్థ ప్రజలను పాలించే అర్హతను క్రమక్రమణా జారవిడుచుకుంటున్నది. దీని ప్రమాదం తర్వాత కాలంలో మనకు అర్థమవుతుంది. ఈ దేశ రాజకీయ నాయకులు అంతిమంగా దేశాన్ని పాలించే బాధ్యతను ఒక నియంతకో లేక సైన్యానికో అప్పజెబుతారా? అనే భయం వేస్తుంది. ఈ ధోరణికి వ్యతిరేకంగా రెండు ప్రాంతాల ప్రజలు పోరాడవలసిన అవసరముంది. ఇలాంటి పరిణామానికి ప్రధానంగా తెలంగాణ ఆకాంక్షను భౌగోళిక తెలంగాణకు కుంచించడమే ప్రధాన కారణం.

పోలవరం మరోక అభ్యంతరకరమైన అంశం. మునిగిపోతున్న గ్రామాలను ఆ ప్రజల అంగీకారం లేకుండా ఆంధ్ర ప్రాంతానికివ్వడం ఏమిటి? నోరులేని ఆదివాసీలను ఇంత వివక్షకు గురిచేయడం స్వాతం త్య్రం వచ్చినప్పటినుంచి జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తెలంగాణ ప్రజలు కాదా? ఆ ప్రాంతాన్ని ఎందుకు అంత సునాయాసంగా బలి చేసినట్లు? నిజానికి వీరు మునిగిపోబోతున్నారని బహాటంగా అంటే, తెలంగాణ ఉద్యమం నుంచి పెద్దఎత్తున నిరసన రావాలి కదా. ఇదే మన వైఖరి అయితే ఆదిలాబాద్ గోం డులు, మహబూబ్‌నగర్ చెంచుల సంగతేమిటి? ఆత్మగౌరవ పోరాటమంటే అట్టడుగు మనిషి గౌరవం. టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదాన్ని ముందుకు తెచ్చినప్పుడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గురించి ప్రశ్నించినప్పుడు, తెలంగాణ ఆత్మగౌరవంలో దళితులు, మహిళలు, ఆదివాసీలు, ముస్లింలు ఉన్నారా లేదా అనే ప్రశ్న మనం అడగవలసిన అవసరం లేదా? పోలవరం కోసం ఆ ప్రాంత రాజకీయ నాయకులు పెద్దఎత్తున ఒత్తిడి పెట్టారు. ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులకు పరిణతి లేకపోవచ్చు, కాని వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు స్పష్టంగా తెలుసు. తెలంగాణ రాజకీయ నాయకత్వానికి స్వంత ప్రయోజనాలు ఉండవచ్చు. కాని ప్రాంత ప్రయోజనాలుపజల ప్రయోజనాల పట్ల అంత స్పష్టత ఉందనే విశ్వాసం కలగడం లేదు.

మొత్తంగా తెలంగాణ రాజకీయ నాయకత్వం ఈ మొత్తం సమస్య పరిష్కారంలో ముందుచూపుతో ప్రవర్తించలేదనడానికి పై రెండు ఉదాహరణలు చాలు. ఇక కాంగ్రెస్ పార్టీలోని కొందరు ప్రతినిధులు తెలంగాణ ఉద్యమాన్ని బాహాటంగా వ్యతిరేకించారు. వాళ్ళే ఇప్పుడు తెలంగాణ చాంపియన్స్‌గా పోజు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయ నాయకులను శల్య పరీక్ష చేయాలి. కేవలం డబ్బుల సంపాదనలో ఉండే నాయకుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజా జీవనంలో ఉండి అధికారాన్ని తమ స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకునే వారికి ప్రజల భయం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వా త ప్రజా ఉద్యమాలు మార్పు కోసం ఉన్నతమైన విలువల కోసం, న్యాయం కోసం, నోరులేని వాళ్ళ కోసం నిరంతరంగా కొనసాగాలి. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకుంటునప్పుడు, ఇంత సంతోష సమయంలో ఇలాంటి వ్యాసాలు రాయడమెందుకని స్నేహితులు అంటున్నారు. శ్రీశ్రీ అన్నట్లు సాధించిన దానికి సంతప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయ్ అనే పాటను గుర్తుంచుకోవాలి.

351

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles