పతనమవుతున్న వ్యవస్థలు


Thu,February 13, 2014 01:56 AM

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ దేశంలో మనలేదని, భారతీయులకు తమ దేశాన్ని పరిపాలించుకునే శక్తి లేదని, బ్రిటిష్‌వాళ్లు తిరిగి వచ్చి ఈ దేశాన్ని పాలించివలసి ఉంటుందని ఈ దేశాన్ని వది లి వెళ్తున్న సందర్భంలో బ్రిటిష్ వారి ఆలోచనలివి. అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ఇంత నామమావూతంగానైనా బతికి ఉంటుందని అప్పుడు అనుకోలేదు. పాశ్చాత్య సామాజికశాస్త్రవేత్తలు స్వతం త్ర మొదటి దశాబ్దం తర్వాత మిగతా మూడో ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఒకదాని తరువాత ఒకటి కూలిపోతున్నది చూసి, ఈ దేశ ప్రజాస్వామ్యం పని విధానం పట్ల ఆసక్తే కాక కొంత ఆదరణ కూడా చూప సాగారు. కానీ ఈ దేశ వైవిధ్యం, వైరుధ్యాల మధ్య ఈ దేశానికి పార్లమెంటరీ వ్యవస్థ సరిగ్గా సరిపోదు. కానీ అది తప్ప ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. విప్లవ రాజకీయాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని సృష్టించగల రో వేచి చూడవలసిందే.

పార్లమెంటరీ పార్టీలు తమ సృజనాత్మకతను పూర్తిగా కోల్పోయాయి. దానికి తోడు నెహ్రూ ప్రతిపాదించిన సైద్ధాంతిక నమూనాకు కావలసిన భౌతిక పరిస్థితులు లేకపోవడంతో అదొక తాత్కాలిక ప్రయోగంగా మాత్రమే నిలువగలిగింది. అంటే 20వ శతాబ్దంలో వలస పాలకులతో పోరాడి స్వాతంత్య్రం తర్వాత అర్ధ శతాబ్దం పాటు నిర్మించుకున్న సంస్థల్లో 21వ శతాబ్దంలో ఒకటి తర్వాత ఒక టి పూర్తిగా కూలిపోకున్నా అవి అవసాన దశకు చేరుకున్న ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా రాష్ట్ర అసెంబ్లీ పని విధానాన్ని, ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్న ప్రహసనాన్ని చూసినా వ్యవస్థల సంక్షోభం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఒక సంస్థ పనితీరు ఆ సంస్థ సభ్యులకు ఉండే వ్యక్తిగత ప్రమాణాలు విలువల మీద చాలా ఆధారపడి ఉంటుంది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థలోని వ్యక్తులకు ముందు తమ సంస్థలపై గౌరవం ఉండాలి. అంతేగాక సమష్టి ప్రయోజనం కోసం పనిచేసే ఒక అవగాహన కావాలి. ఈ సంస్థలకు ఎన్నికైన తర్వాత తమ సొంత ప్రయోజనాల కంటే సంస్థ ప్రయోజనాలకు లేదా సామూహిక ప్రయోజనాలకు ప్రాధాన్యం కీలకంగా ఉండాలి. అంటే మనుషులు జీవితంలో తమకు తోచిన విధం గా తమ శక్తిమేరకు భిన్న ప్రత్యామ్నాయాలలో ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటారు. ఆ రంగం లో సంతృప్తితోనో అసంతృప్తితోనో జీవితాన్ని ఈడుస్తుంటారు. అలాంటి వారు వ్యవస్థకు ఎక్కువ అపాయాన్ని కలిగించలేరు.

కానీ ప్రజావూపతినిధులు అనబడే వాళ్లు రాజకీయాలలోకి రావడం అలా జరగదు. జరగకూడదు. దీంట్లో కనీసం వాళ్లు తమ వర్గ ప్రయోజనాలనైనా కాపాడుకోవాలి. తమ వర్గ ప్రయోజనాలు అంటే సంపద కూడబెట్టుకోవడం, లాభాలు చేసుకోవడం, అధికారం తమ వర్గం చేతుల్లోంచి జారిపోకుండా కాపాడే బాధ్యత తీసుకుంటారు. తమ వర్గ ప్రయోజనాలకు సంస్థలు చాలా అవసరం. సంస్థలు లేకపోతే వాళ్ల సంపాదన ప్రజల కు ప్రత్యక్ష లూటీగా సునాయసంగా తెలిసిపోతుంది. సంపదకు సంస్థలు ప్రజాస్వామ్యం పేర చాలా మద్ద తు సాధించి పెడతాయి. పార్లమెంటరీ సంస్థలు, ఎన్నికలు, ప్రజావూపతినిధులు, ఓట్లు అన్నీ సంపన్ను ల సంపదకు ఆమోదం సాధించిపెట్టాలి. కానీ పాలకవర్గాల దృష్టి నుంచి చూస్తే కూడా ఇప్పుడు తెలంగాణ ఘర్షణలో సంస్థల, వ్యక్తుల ప్రవర్తన, వాళ్ల నిజరూపం బయటపడడానికి చాలా దోహదపడుతున్నది. రెండు ప్రాంతాల ప్రజలు మునుపెన్నడూ లేనంత రాజకీయ జ్ఞానాన్ని పొందారు. ఈ రెండు ప్రాంతాల ఉద్యమాలు ఏం సాధించినా, సాధించకపోయినా ఈ గొప్ప జ్ఞానాన్ని ప్రజలకు ఇచ్చాయి.
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజల మధ్య ఇది ఘర్షణ కానేకాదు. అట్టడుగున జీవించే ప్రజల సమస్యలు ఈ ఉద్యమాలలో అంత ప్రస్ఫుటంగా ఏమీ లేవు.

అయితే ప్రాంతాల మధ్య అంతరాలు పెరగడ మే కాక, రాజకీయ అధికారంలోకి వచ్చిన ప్రజావూపతినిధులకు కనీస విలువలు లేకపోవడంతో అధికారం ఆస్తులు సంపాదించడానికి, సంపద పోగు చేసుకోవడానికి అనైతిక వ్యక్తిగత జీవనాన్ని అనుభవించడానికి ఉపయోగించుకుంటున్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు మనుషులను నడిపించినప్పుడు మనుషులు ఇతరుల ప్రతినిధులుగా ప్రవర్తించడం సాధ్యం కాదు. మొత్తం రాజకీయ సంస్కృతి, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో పూర్తిగా అవకాశవాదంగా మారిపోయింది. దాంతో విలువల పతనమే కాక, రాజకీయ భాషా ప్రమాణాలు కూడా దిగజారిపోయాయి. లేకపోతే మేం హైదరాబాద్‌ను వదిలిపెడతమా! పెట్టవలసి వస్తే హైదరాబాద్‌ను అంటుపెట్టి పోతామనడం,పార్లమెంటును తగలబెడతామనడం, బిల్లు కాగితాలను చింపివేయడం, అంటుపెట్టడం, రాజ్యసభ ఛైర్మన్ మీద చింపిన కాగితాలు విసరడం జరగవు. ప్రజల శ్రేయస్సు కాంక్షించేవారు ప్రజల దృక్కోణం నుంచి సమస్యలు చూసేవారు ఎప్పుడూ ఇంత వికృతంగా ప్రవర్తించరు.
మొదటి రెండుమూడు పార్లమెంటులో, లోహి యా, కృపలానీ, సుందరయ్య లాంటి వాళ్ళుండే వారు. వాళ్ళకు ప్రజాక్షిశేయస్సే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు.

అసెంబ్లీలోకి ఎన్నికైన తరిమెల నాగిడ్డి ఈ చట్టసభల ద్వారా సమాజానికి మనం ఏం చేయలేమని భావించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలను సమీకరించే విప్లవ రాజకీయాలలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు విప్లవ రాజకీయాల నుంచి బయటికి వచ్చినవారు శాసనసభలోకి వెళ్ళాలనుకుంటున్నారు! పరిస్థితి తారుమారవుతున్నది. రాష్ట్ర శాసనసభ, పార్లమెంటులోని ప్రతినిధులు చాలామంది తాము ప్రజావూపతినిధులమని భావించడం కూడా లేదు. తాము చాలా ధనం ఖర్చుపెట్టి ఎన్నికయ్యాం కాబట్టి, ప్రజల పట్ల బాధ్యత లేదనే అనుకుంటున్నా రు. ప్రజల నైతిక స్థాయి పడిపోయిందని, ప్రజలు ఓట్లను వేసేటప్పుడు అవకాశవాదంతో వేస్తున్నారని వాదిస్తున్నారుపజల స్థాయే పడిపోయినప్పుడు సమాజ స్థాయికంటే ప్రతినిధి స్థాయి ఎక్కువ ఎలా ఉంటుందని‘people get the representati- ves that they deserve’అనే స్థాయికి వచ్చాయి. చట్టసభలు ఇలా దాదాపు కూలిపోవడం వల్ల ఏసమస్యను సామరహస్యంగా పరిష్కరించలేకపోతున్నా రు.
ఇప్పుడు తెలుగు ప్రజల మధ్య ఏర్పడిన అంతరాలకు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించవలసి ఉం టుంది. సామరహస్యంగా పరిష్కరించగలిగిన సమస్యను సంక్లిష్టంగా మార్చారు. ఎవ్వరు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. ఎప్పుడు ఏపార్టీ ఎటువైపు ఉంటుందో తెలియదు.

ఏపార్టీ ఎవ్వరి మీద నెపం మోపుతుందో తెలియదు. స్వంత పార్టీ మీదే అవిశ్వాసం తీర్మానం దాకా పరిస్థితి వెళ్ళిపోయింది. టీవీ చానెల్స్‌లో ఎవ్వరు ఎంత అగ్రహంగా మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఈ జగన్నాటకంలో మీడియా పాత్ర వర్ణించవీలుకాదు. దిన పత్రికల శీర్షికలు పత్రికాధిపతులు ఇష్టా అయిష్టాల చుట్టూ ఉంటాయి. భాషను సర్వ స్వతంవూతంగా ఉపయోగిస్తున్నారు. వాస్తవాలు ఏవో అభివూపాయాలు ఏవో అబద్ధాలు ఏవో వక్రీకరణ ఏదో తెలుసుకోవ డానికి తెలుగు ప్రజలు పడుతున్న పాట్లకు జాలివేస్తుంది. తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ వస్తుంది, తెలంగాణ రాదు, ఒకటికాదు రోజూ ఒక నాటకం. తెలంగాణ ఒక డిటెక్టివ్ నవలలా ఉంది. చివరి దాకా హంతకుడు ఎవరో తెలియదు. ఇదొక విచివూతమైన పరిస్థితి! ప్రజలకు ప్రతినిధులకు మధ్య అలాగే పత్రికలకు ప్రజలకు మధ్య వారధి కూలిపోయిన సందర్భమిది. రెండువూపాంతాల్లో ఆందోళన, భయం, ఏం జరగబోతున్నదో అన్న ఆవేదన, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ప్రతినిధులుగా మారిన వారు తామూ తమ సంస్థలతో సహా పరీక్షలో పూర్తిగా ఫెయిల్‌కావడమేకాకపజలను ఎలా ఫెయిల్ చేయించాలి అని ప్రయాస పడుతున్న ప్రతినిధుల గురించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గురించి పత్రికల గురించి ఏం రాయగలం?

217

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles