విషపూరిత రాజకీయాలు


Thu,February 6, 2014 12:17 AM

ఈ మధ్య రాజకీయ పరిభాషలో విషం చాలా ప్రాధాన్యం సంతరించుకున్నది. సోనియాగాంధీ బీజేపీని విమర్శిస్తూ దేశంలో విష బీజాలు నాటారు అని అంటే, మోడీ తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక సంబంధాలను విషమయం చేసింది అని (ఎన్నికల ప్రచారంలో భాగంగా) తన ప్రసంగాలలో గొంతు చించుకుని అరుస్తున్నాడు. ఎవరు ప్రజల మధ్య విషం పెంచుతున్నది పక్కనపెడితే.., ప్రజా జీవనంలో విషం చాలానే ప్రవహిస్తున్నది. మోడీ మీద చిన్న ఈగ వాలినా బీజేపీ గయ్యిమంటున్నది. ఇక జాతీయ ఇంగ్లిషు మీడియా తన విష ప్రచారాన్ని చేస్తూనే ఉన్నది. సోనియా వ్యాఖ్యల మీద మోడీ దాడిచేస్తూ.. కాంగ్రెస్ తెలుగు ప్రజల మధ్య విషాన్ని నింపింది అంటున్నాడు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. దేశంలో రామ జన్మభూమి దగ్గరి నుంచి మొన్నటి ముజఫర్‌నగర్ దాకా జరిగిన మత ఘర్షణల్లో ఎవరి పాత్ర ఏమిటో చర్చించవలసిందే. ఎవరు ఏది చెప్పినా దేశ ప్రజలు సులభంగా నమ్ముతారని అనుకోవడం, ప్రజలు రాజకీయ అజ్ఞానులు అని తప్పు అంచనా వేయడమే. తెలుగు ప్రజల మధ్య విషం గురించి చర్చించాల్సిన అంశమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విషమయ మయ్యాయి.

ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడావిలువలకు నిలబడలేదు. విభజన మీద స్పష్టమైన వైఖరి తీసుకున్న సీపీఎం, బీజేపీ అమతం పంచడానికి ఏ ప్రయత్నం చేయలేదు. బీజేపీ తెలంగాణకు, తనకుండే రాజకీయ ప్రయోజనాల మేరకు స్పష్టమైన మద్దతు ఇస్తున్నట్టుగా నటిస్తున్నదాన్ని ఎంత వరకు నమ్మాలో తెలియదు. తెలంగాణ ప్రజ ల్లో బీజేపీ పట్ల కొంచెం ఆసక్తి పెరిగింది. బీజేపీ తమ మాటకు కట్టుబడి ఉంటుంది అంటూ..రాత్రికి రాత్రి కొంచెం భాష మార్చారు. చంద్రబాబు నాయుడు వల్లిస్తున్న సమన్యాయం, చాలామంది నోటినుంచి వినవస్తున్నది. బీజేపీ అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ షరతులు లేని మద్దతు ఉం టుందని ప్రకటించి, తీరా పార్లమెంటు నిర్ణయం తీసుకోవడానికి సంసిద్ధం అవుతున్న సమయంలో, మరి ఆ ప్రాంతానికి న్యాయం వద్దా, వాళ్లకు న్యాయమంటే తెలంగాణకు మద్దతు ఇవ్వనట్లే అని విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆ ప్రాంతానికి న్యాయం చేయవలసిందే. కానీ అదేదో స్పష్టంగా చెప్పవలసిందే కదా.

తెలంగాణ ప్రాంతం విశాలాంధ్ర ఏర్పాటు దగ్గరి నుంచి అనుమానాలతో, భయాలతో ఉంది. ఈ ఐదు, ఆరు దశాబ్దాల్లో పాలకులు అన్ని వాగ్దానాలను ఉల్లంఘించి తెలంగాణ ప్రజల భయాలను పెంచుతూ వచ్చారు. భయాలు పెరుగుతున్న కొద్దీ వాటిని రాజకీయ చదరంగంలో వాడుకోవడం మొదలైంది. ఈ ఎత్తులు, పై ఎత్తులు ప్రజల మధ్య స్లో పాయిజన్‌గా పనిచేసింది. విష రాజకీయాల ఆచరణ వల్ల ఇది 1969లో తెలంగాణ ఉద్యమంగా, 1972లో ఆంధ్ర ఉద్యమంగా రూపాంతరం చెందా యి. ఈ ఆంధ్ర ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన నేతలలో వెంకయ్యనాయుడు ఒకరు.

తెలంగాణ ఉద్యమంలో నుంచి ఏ నాయకుడు జాతీయస్థాయికి ఎదగలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది యువకులు ఇప్పుడు మావోయిస్టు పార్టీ అగ్రనాయకులలో ఉన్నారు. అయితే మావోయిస్టు పార్టీ కొందరు తమ పార్టీ నాయకులకు విషాన్ని ఇచ్చి చంపేశారని అంటూనే ఉన్నది. సోక్రటీస్‌కు విషం ఇచ్చి చంపినప్పటి నుంచి ఇప్పటి దాకా విషం తన ప్రాధాన్యాన్ని కోల్పోలేదు. ఇప్పుడు.. విషం భారీ ఎత్తున విదేశాల నుంచి బహుళజాతి కంపెనీల నుంచి, అమెరికా నుంచి సరాసరి దిగుమతి అవుతున్నది. దేశ ప్రజలకు అనేక రూపాల్లో విషాన్నే పంచుతున్నది.

అమెరికావాడు, బహుళజాతి కంపెనీలు మేం కూడా విషం పంచడంలో భాగమౌవుతామని అం వీరికి వారికి గాఢమైన దోస్తానా కుదిరింది. కాంగ్రెస్ పార్టీ, మోడీ అంటున్న విషాన్ని పంచారో లేదో కానీ, నయా ఆర్థిక విధానం ద్వారా మొత్తం ఆర్థిక విష వక్షాన్ని పెంచింది. బీజేపీ తాము పరిపాలించిన కాలంలో ఈ విషవక్షాన్ని మత విద్వేషం ద్వారా మరింత విస్తరించడానికి చాలా కష్టపడ్డది. మార్క్స్ మతం మత్తు మందు అన్నాడు. కానీ మత్తు మందులో విషం కూడా కలిపితే అది తాగే ప్రజల పీడ పోతుందని పాలకులు బాగానే పసిగట్టారు. జాతీయ, అంతర్జాతీయ విషం బాగానే పనిచేస్తున్నది. ఈ విషం చాలా విచిత్రమైంది. ఇది తీసుకున్నవాడు తాను చస్తూ ఎదుటి మనిషిని చంపుతున్నాడు. ఈ విష వక్షానికి పండే పండ్లను అభివద్ధి పేర అమ్ముతున్నారు. ఈ పండ్లు అమ్మే క్రమంలో చంద్రబాబు లాంటి వాళ్లు దివాలా తీశారు.

సాధారణ ప్రజలకు ముఖ్యంగా ఆదివాసీలకు ఇది బాగా అవగాహనకొచ్చింది. వాళ్లు వక్షాన్నే నరకాలని శ్రమ పడుతున్నారు. అమాయకులు అనుకున్న ఆదివాసులకు ప్రకతితో సన్నిహిత సంబం ధం వల్ల అమత ఫలాలు ఏవో విష ఫలాలు ఏవో బాగా తెలుసు. పాపం పట్టణాల్లో నివసిస్తూ, బాగా చదువుకున్నవారు అని అనుకునేవారు బోల్తా పడి నా.., పళ్లు చాలా బాగా ఉన్నాయి అని భావిస్తూ.. ఎవరూ ఎక్కువ విష ఫలాలు పంచగలరో వారిపట్ల చాలా ఆసక్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో విషమే.. విషం. అందుకే ఒకరి మీద ఒకరు విషం కక్కుతున్నారు.

ఎందుకో పాలకులు తమకు తెలియకుండానే ఒకరి గురించి ఒకరు నిజాలు చెబుతున్నారు. ఇద్ద రు చెప్పేదీ నిజమని తెలుసుకోవడానికే ఇంకా కొం చెం కాలం పడుతుంది.1984,2002 విషం స్థాయి పెరిగిన సంవత్సరాలు. అందుకే మీరు సిక్కులను చంపారు అంటే మీరు ముస్లింలను చంపారు అని వాదోపవాదాలు చేస్తున్నారు. సిక్కులు కానీ, ముస్లింలు కానీ మానవ మాత్రులే అని మరిచిపోవడం ఈ విషం లక్షణం. మీడియాలో 200గైపస్తావనకు రాగానే మరుగున పడిపోయిన 1984ను గుర్తు చేస్తున్నారు. అప్పటి అమానుష చర్యలకు గరై న వారికి ఇప్పుడు మీడియాలో చాలా ప్రాచుర్యం ఇస్తున్నారు. ఎందుకో 2002 బాధితుల గురించి మరిచిపోమ్మంటున్నారు. మీడియా మాయలో ఇదొక భాగం. ఇదే స్వేచ్ఛ కొనసాగితే 2032లో గుజరాత్‌లోని అమరుల కుటుంబ సభ్యులను చాలా పెద్ద ఎత్తున చూపిస్తారేమో!
ఇక 2032 తర్వాత వీళ్లు వాళ్లనే కాక, ఇంకా లక్షల మంది హత్యలకు, మారణకాండకు గురి అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

అప్పుడు మీడి యాకు ఈ స్వేచ్ఛ ఉంటుందో ఉండదో తెలియదు. ఒకరి దుర్మార్గాన్ని గురించి మాట్లాడితే మరో దుర్మార్గుడి మద్దతు ఉంటుంది. ఇద్దరు దుర్మార్గుల గురిం చి మాట్లాడామంటే వాళ్లిద్దరూ ఒక్కటే తీరు అనేది ఇప్పుడు గొంతుచించుకుని హూంకరించి, కళ్లు పెద్ద వి చేసి మాట్లాడుతున్న వారికి తెలుస్తలేదు. దానికి చారిత్రక స్పహ కావాలి కదా. 1984, 2002 కలిసినప్పుడు విష వక్షాన్ని కూల్చి వేయడానికి ఇప్పు డు పోరాడుతున్న ఆదివాసే అప్పటి హీరో.

394

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles